Tuesday, 4 December 2018

మనసులు కలిసిన శుభ వేళ. కధ...

సమయం 9.30  అవుతోంది.విజయ్ తన ఛాంబర్ లో కి వచ్చేసాడు...
గుడ్ మార్నింగ్ విజయ్ అంటూ విష్ చేసాడు వినోద్.
గుడ్ మార్నింగ్ వినోద్ అన్నట్లు ఇవాళ మన ప్రోగ్రామ్స్ ఏమిటి అంటూ అడిగాడు.
వినోద్ ఎంబీఏ చేసాడు.
విజయ్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్  గా చేరాడు.
చేరిన కొంత కాలాని  కే  తన ప్రతిభ తో విజయ్ కి బాగా దగ్గర అయ్యాడు. ఒకే వయసు వాళ్ళు అవడంతో , ఆఫీస్ వరకె బాస్... బైట ఫ్రెండ్స్ లాగా ఉంటారు.
ఇవాళ కొన్ని ఇంటర్వ్యూ లు ఉన్నాయి .మీరు ఒకసారి చూసి ఒకే
చేసేస్తే, ట్రైనింగ్ కి పంపేస్తాను ,
అన్నాడు వినోద్.
సరే ఆ ఫైల్ ఇదేనా అంటూ టేబుల్ మీద ఉన్న దానిని తీసుకుని అప్లికేషన్స్ స్టడీ చేయడం మొదలు పెట్టాడు విజయ్.
మీరు కాఫి తాగండి , ఈ లోగా అభ్యర్థులు వస్తే ఒక్కొకరిని పంపిస్తా...అంటూ బైటకి వెళ్ళాడు వినోద్.
వరుస గా చూస్తూ ఉంటే సుహాసిని అనే అప్లికేషన్ దగ్గర ఆగాడు. విజయ్.ఆ పేరు చదవగానే చిన్నపుడు...మాస్టారు గారి అమ్మాయి గుర్తుకు వచ్చింది... ఇప్పుడు ఎక్కడ ఉందో...మాస్టారు ఎక్కడ ఉన్నారో ఎంక్విరి చేయించాలి.... చదువు కోవడానికి అమెరికా వెళ్లి పోవడం తో తనకి కుదరలేదు. ఇక్కడికి రావడం... ఇండస్ట్రీ ప్రారంభించడము...ఆ పనులలో బిజీ గా అయిపోయాడు. అలా ఆలోచనలతో ఉండగా వినోద్ లోపలికి వచ్చి వాళ్ళందరూ వచ్చేసారు. మీరు సరే అంటే ఒక్కొక్కళ్ళ నీ పంపిస్తా అన్నాడు.
సరే పంపించు... నువ్వు కూడా వచ్చి చెయ్.నేను ఒకే చేస్తాను.... అన్నాడు.వరుసగా అవుతున్నాయి... సుహాసిని వంతు వచ్చింది... లోపలికి రాగానే కూర్చోండి అన్నాడు. వినోద్.
థాంక్స్ అంది . కొంచెం కంగారు గా ఉంది.. ఎలాగైనా ఈ జాబ్ తనకి రావాలని ...వేయి దేవుళ్ళకి మొక్కుకుంది. ఈ ఉద్యోగం వస్తే ఆర్ధిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బైట పడవచ్చు. తల్లికి వైద్యము కూడా చేయించవచ్చు... అని మనసులో నే భగవంతుడు ని ప్రార్ధించి ..కాన్ఫిడెంట్ గా విజయ్ వైపు చూసింది...
విజయ్ పరిశీలన గా చూసాడు... మధ్య తరగతి సంప్రదాయ కుటుంబం నించి వచ్చి నట్లు ఉంది... ముఖం లో వర్ఛస్సు.... చాలా బాగుంది ఈ అమ్మాయి అనుకున్నాడు...
కానీ ఎక్కడో చూసినట్టు...ఏదో భావన....మనసులో, తనకి పరిచయం ఉన్నట్లు హృదయం చెపుతోంది. ఆమె
కళ్ళలో కంగారు , తనకి ఈ ఉద్యోగం అవసరం అనే భావన ... కనిపిస్తోంది.
సర్ మొదలు పెట్టండి అనగానే తన ఆలోచనాలకి తనకే నవ్వు వచ్చింది.... ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు విజయ్.
మధ్య లో వినోద్ ప్రశ్నలు అడుగుతున్నాడు... ఆమె చక చకా సమాధానాలు చెపుతోంది... విజయ్ కి ఆమె మాట్లాడే విధానం అన్ని నచ్చాయి.. అప్పుడు చూసాడు అప్లికేషన్ లో తండ్రి పేరు  రఘురామ్ ...రిటైర్డ్ మాస్టారు  అని.
ఒక్క సారి ఆశ్చర్యం కి లోనయ్యాడు.
తాను ఎవరి కోసం వెదుకుదామని అనుకుంటున్నాడో ఆయనే....రఘురామ్ మాస్టారు. చిన్నప్పుడు తనను చదివించి డబ్బు లేకపోతే ఆయనే చాలాసార్లు ఫీజులు  కూడా కట్టేవారు... ఒక్కో సారి తనకి భోజనం కూడా పెట్టేవారు...నేనంటే ఎంత ప్రేమ గా చూసుకునే వారో..ఒక్కసారి జ్ఞాపకాల లోకి వెళ్ళాడు....విజయ్
అవును నిజం గా తనే....
మీ నాన్నగారు  రఘురామ్  రిటైర్డ్ మాస్టర్ అని ఉంది... ఎక్కడ పని చేశారు.
అని అడిగాడు ఉత్సాహంగా.
చెప్పింది...
అవును ఆయనే ఇన్నాళ్లు తాను వెదుకుతున్నది... ఆయన గురించే.
మీ నాన్న గారు నాకు బాగా తెలుసు.
నేను ఆయన దగ్గర చదువుకున్నాను... ఆయన చెప్పిన మాటలు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి... ఇంతకీ ఆయన ఎలా ఉన్నారు.... అని అడిగాడు విజయ్.. బాగానే ఉన్నారు అండి... వయసు తో వచ్చే ప్రోబ్లెంస్ అంతే.
సరే  రేవు మీ ఇంటికి నేను వస్తా...నాన్నగారికి కలవడానికి....చూసి చాలా కాలం అయింది...అన్నాడు.
సర్ ఈ జాబ్ నాకు చాలా అవసరం...
నాన్న గారు తెలుసు అంటున్నారు... నా క్వాలిఫికేషన్ నచ్చితే ...సహాయం చేయండి. అని రిక్వెస్ట్ చేసింది...
మీరు అర్హత ఉన్నది అని మేము భావిస్తే తప్పకుండా ఈ పోస్ట్  మీకే వస్తుంది... ఒకవేళ ఇది కాకపోతే వేరే పోస్ట్ అయితే ఇవ్వాగలను....చేస్తారా మరి అని నవ్వుతూ అడిగాడు విజయ్...
తప్పకుండా అండీ...ప్రస్తుతం నాకు ఉద్యోగం చాలా అవసరం....మీరు ఏ పొస్ట్ ఇచ్చినా చేస్తాను... థాంక్స్ అండీ అంది...
ఇంతకీ ఏమి పోస్ట్ అండీ అని అడిగింది .
ఎందుకు కంగారు...మీకు ఉద్యోగం గ్యారంటీ ...కానీ అది ఏమిటో ఇప్పుడు చెప్పలేను... రేపు మీ నన్నగారిని కలిసిన తరువాత , ఆయనతో మాట్లాడినతరువాత తెలుస్తుంది....అంతవరకు ఎదురు చూడ వలసిందే...అన్నాడు  నవ్వుతూ.
ఇది కేవలం మీ నన్నగారి గొప్పతనం, మంచితనం వలన ఆయనని దృష్టి లో పెట్టుకుని ఈ సహాయం చేస్తున్నాను. అన్నాడు విజయ్....
ధన్యవాదాలు అండీ అంది. మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మరిచి పోను అన్నది సుహాసిని...
భలే వారండి మీరు ఎప్పటికీ మరిచి పోలేని సహాయాలు మీ నాన్నగారు మాకు ఎప్పుడో చేసేసారు... ఇప్పుడు మా వంతు వచ్చింది అంతే.....
సరే ఆ విషయాలు తరువాత  ఇప్పుడు... మీరు ఇంటికి ఎలా వెళతారు అని
అడిగాడు.
బస్ లొనే...అంది...
వినోద్ ఇంటర్వ్యూ కి వచ్చిన వారందరికీ ఇక్కడే లంచ్ ఏర్పాటు చెయ్యండి...లంచ్ తరువాత సుహాసిని గారిని ,  డ్రైవర్ ని
వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టేసి రమ్మను
వాళ్ల అడ్రస్ తెలిసి నట్లు ఉంటుంది. అన్నాడు విజయ్.
నేను ఈ ఫైల్స్ అన్ని చూసి సంతకాలు పెట్టేసి వస్తా...
నువ్వు నాతో లంచ్ జాయిన్ అవ్వు... అన్నాడు విజయ్...
ఇంకో ఇద్దరు ఉన్నారుగా సర్ అన్నాడు వినోద్... ఏమి పరవాలేదు వీళ్లు అందరూ ఫైనలిస్ట్ లే కదా ....చూడక్కర లేదు, నువ్వు ప్రో సీడ్ అవ్వు అన్నాడు.
సరే  సర్ అంటూ అమ్మాయిని, అందరి ని తీసుకుని వెళ్లి ఏర్పాట్లు చేసి...
సుహాసిని గారు మిమ్మలిని డ్రైవర్ డ్రాప్ చేస్తాడు... అని చెప్పి...
మిగతా వాళ్ళు నలుగురూ రిసెప్షన్ లో ఎదురు చూడండి  రిజల్ట్స్ కోసం అని చెప్పి...
విజయ్ దగ్గరకి వెళ్ళాడు..
వచ్చింది ఐదు మంది.. క్వాలిసింది నలుగురు...
వాళ్ళందరిని ఉండమని చెప్పి నన్ను వెళ్లిపో మన్నారు.ఇంక ఆశలు పెట్టుకోవడం దండగే...మళ్ళీ ఇంకో టి ప్రయత్నించాలి... అనుకుంది...నిరాశగా ....
అయినా వేరే ఎదైనా ఇస్తామన్నారు కదా ,ఎదురు చూస్తే  సరి... రేపు ఇంటికి వస్తానన్నారు కదా నాన్న గారిచేత ఒకసారి ఆడిగిస్తే ....తప్పక సహాయం చేస్తారు  అనుకుంది.
రా వినోద్...వాళ్ళు వెళ్లిపోయారా...అని అడిగాడు... ఏమిటి బాస్ మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు.. అని అడిగాడు...
చెబుతా.. ముందు భోజనం చెయ్....అందరికి  కి అపోయింట్ మెంట్ ఆర్డర్ రెడీ చెయ్.... అన్నాడు.
ఉన్నది 4....పోస్ట్ లు..పైగా సుహాసిని గారు మీ మాస్టారు గారు అమ్మాయి...అన్నారు... ఆవిడని సెలెక్ట్  చేసేస్తే , ఇంకా  మూడే ఉంటాయి కదా మరి... అని అడిగాడు..
అది రేపు చెపుతా... అందరికీ ఆర్డర్స్ రెడీ చేయించు....అని ఆర్డర్ వేసాడు విజయ్...
అలాగే సర్...అంటూ లంచ్ ముగించి ...అందరి ఆర్డర్ పేపర్స్ టేబుల్ మీద పెట్టాడు...
విజయ్ సంతకాలు చేసి... ఆ నలుగురిని ట్రైనింగ్ కి పంపేయ్... అని చెప్పాడు...
లంచ్ అయ్యాక అందరూ ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. తలుపు తీసుకుని కవర్ తో వచ్చాడు ...ఇదిగో అంటూ ఇద్దరి పేర్లు చదివి వాళ్ళకి కవర్ లు ఇచ్చేసాడు...

మిగతా రెండు ఇంటర్వ్యూ లు  క్యాన్సిల్ అయ్యాయి.... అన్నాడు....
మిగతా ఇద్దరూ డీలా పడిపోయారు... ఇందాక వచ్చిన అమ్మాయి వెళ్లి పోయింది కాబట్టి ఖచ్చితంగా తమ నలుగురికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు...
 కానీ ఇప్పుడు ఇలా అయింది.... మిగతా ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి... బయలుదేరబోయారు...

ఆగండి.. ఇంకా.. .నేను  చెప్పడం పూర్తి అవలేదు , మీరే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఎలా...ఇంటర్వ్యూ లు మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి అన్నాను , మీరు అందరూ సెలెక్ట్ అయ్యారు .ఇదిగో మీ  అపోయింట్ మెంట్ లెటర్  అంటూ మిగతా ఇద్దరి చేతులలో పెట్టాడు... ఒక్కసారి ఎగిరి గంతు వేశారు.... ఆనందం లో షేక్ హ్యాండు ఇచ్చి  థాంక్స్ అండీ... చాలా చాలా థాంక్స్ అన్నారు...
మీ అందరికి అభినందనలు.... ట్రైనింగు ఎప్పటి నుంచో మీకు ఫోన్ చేసి చెపుతాము... ప్రస్తుతానికి మీరు వెళ్లొచ్చు అంటూ తిరిగి విజయ్ దగ్గరకు వెళ్ళాడు వినోద్.
మరునాడు మాష్టారింటికి వెళ్లారు... నమస్తే సర్ ఎలా ఉన్నారు... అని  అంటూ కాళ్ళకి నమస్కారం చేస్తూ అడిగాడు విజయ్.
ఎవరు ....గుర్తు పట్టలేక పోతున్నా...కొంచెం చెప్పు బాబు...అన్నారు మాస్టారు.
నేను అండీ చిన్నప్పుడు మీదగ్గ ర చదువు కున్న విజయ్ ని.  అనాధ ఆశ్రమం లో పెరిగినా మీరు.ఫ్రీ గా ట్యూషన్ చెప్పేవారు . పుస్తకాల కి ,ఫీజులకి  సహాయం చేసే వారు. ..ఎప్పుడూ బాగా చదువుతానని నన్ను మీ ప్రియ శిష్యుడు అని పిలిచే వారు గుర్తు పట్టారా అండీ అని అడిగాడు...
ఆ ఇప్పుడు గుర్తుకు వచ్చింది... ఎలా ఉన్నావ్ , ఏం చేస్తున్నావ్ అని అడిగారు... మీదయ వలన ఇంటర్ లో మంచి మార్కులు, తరువాత ఇంజినీరింగ్ లో ఫ్రీ సీట్ వచ్చింది... ఒక మహాను భావుడి దయ వలన అమెరికా లో చదివే అవకాశం దొరికింది... ఈ మధ్యే,  మన దేశానికి వచ్చాను. ఇక్కడ సొంతం గా ఇండస్ట్రీ
రన్ చేస్తున్నా...నా దేశానికి నా చదువు ఉపయోగ పడాలని వచ్చేసా...
అక్కడ ఆదాయం బాగా ఉంటుంది కదా బాబు మరి ఎందుకు వచ్చేసావ్ అని అడిగారు.
ఆదాయం బాగానే ఉంది... కానీ నా ఒక్కడి దగ్గరే అవసరానికి మించి డబ్బు ఉంటుంది.అదే .. ఇక్కడికి వచ్చి ఇండీస్ట్రీ పెడితే చాలా మంది కి ఉద్యోగాలు ఇవ్వొచ్చు...కదా...ఇలా అయితే నాకు డబ్బూ వస్తుంది... పది మందికి జీవనోపాధి కల్పించి నట్లు ఉంటుంది... కదండీ మరి ...
ఆ పది మంది ....కుటుంబాల ఆశీర్వాదమే మనకి బలం... అనాధ గా పెరగడం నా తప్పు కాదు...ఇప్పుడు చాలా కుటుంబాలు నాకు ఆత్మ బంధువులు గా ఉన్నారు
.... వాళ్ల కళ్లలో వెలుగు చూస్తూ ఉంటే సంతృప్తి గా ఉంటుంది... ఎంత సంపాదించాను అన్నది కాదు ఎంత మంది అభిమానాన్ని సంపాదించాను , ఈ సమాజానికి ఎంతవరకూ ఉపయోగ పడ్డాను అన్నదే నాకు నచ్చిన అంశం అండీ.
అందుకే ఇక్కడికి వచ్చేసా....ఇండస్ట్రీ ప్రారంభించాం.భగవంతుడి దయ వల్ల బాగానే నడుస్తోంది... లాభాలతో....
ఇక్కడికి రాగానే మీ గురించి వాకబు చేసా... మీరు రిటైర్ అయ్యారు... తరువాత ఆ ఊరు నుంచి వెళ్లిపోయారు అని తెలిసింది...
దరిమిలా ఇండస్ట్రీ హడావిడి లో ఈమధ్య కొంచెం బిజీ... అయ్యాను... ఖాళీ చేసుకుని మీ అడ్రస్ పట్టుకోవాలి అని మా వినోద్ కి కూడా చెప్పాను...
అన్నట్టు ఇతను వినోద్ నా పర్సనల్ సెక్రటరీ మరియు మంచి స్నేహితుడు... అంటూ పరిచయం చేశాడు.
నమస్కారం అండీ అన్నాడు వినోద్...రెండు చేతులు జోడించి.
చల్లగా ఉండు నాయనా...అంటూ ఆశీర్వదించారు.

నిన్న ఇంటర్వ్యూ లో మీ అమ్మాయి ని చూసా ...మీ అడ్రెస్ పట్టుకుని ఇదిగో ఇలా వచ్చేసా.... నవ్వుతూ అన్నాడు విజయ్... అన్నట్టు మీకు కొడుకు ఉండాలి కదా  ఎక్కడ ఉన్నాడు. అని అడిగాడు విజయ్.
అమెరికా లో నే .ఇల్లు తాకట్టు పెట్టి చదివించా... అక్కడకి వెళ్లి పోయాడు.
పెళ్లి కూడా చేసుకున్నాడుట.
ఫొటోస్ పంపించాడు... నేనా రిటైర్ అయ్యాను. అదేమిటి అండీ మరి అలా వదిలేస్తే ఎలా అడగలేదా మరి అన్నాడు. ఏమని అడగాలి ...ఏవో సాకులు చెపుతాడు.. వాడి చదువుకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా డబ్బు పంపలేదు... ఇల్లు అమ్మేసి తీర్చేసాను... ఇది అద్దెకి తీసుకుని ఉంటున్నాం.
వాడి మీద బెంగ తో ఆవిడ మంచం పట్టింది.... ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటోంది.పాపం ఆడపిల్ల ఇంటి భారం దీని మీద పడింది. పెళ్లి చేసుకుని హాయి గా అత్తారింట్లో గడపాల్సిన పిల్ల....
 ఇప్పుడు ఇదిగో దీని రెక్కల కష్టం మీద ఇల్లు నడుస్తోంది.... ఎమి చేయాలో అర్థం కావట్లేదు.
మిమ్మలిని అలా మాట్లాడవద్దని ఎన్ని సార్లు చెప్పాను అని
సున్నితంగా మందలించింది..సుహాసిని...
నీ దగ్గర ఉద్యోగం ....
వీలుంటే, మాకు సహాయం చెయ్ బాబు.కొంచెము ఆసరాగా ఉంటుంది.అని అడిగారు...
 అయ్యో ఎంత మాట అన్నారు మాస్టారు..
ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష.... మీరు ఆర్డర్ వేయాలి కానీ ప్రాధేయపడవలసిన అవసరం లేదు.మీరు అలా మాట్లాడ కూడదు.
 మీరు నాకు చేసిన సహాయం ఎలా మరిచిపోతాను.నిజానికి నేనె మీ గురించి వెతుకు తున్నాను. ఇంతలో మీ అమ్మాయి వచ్చింది.ఇంటర్వ్యూ కి.
మీ అమ్మాయి అని  తెలియ గానే నేనొక నిర్ణయం తీసుకున్నాను.
వచ్చిన వాళ్లందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేసాను.
ఒక్క మీ అమ్మాయికి తప్ప... ఎందుకంటే మీతో మాట్లాడిన తరువాత ఒకనిర్ణయనికి వద్దామని... అన్నాడు.
ఏమిటి బాబు అది... అని అడిగారు...
నిజానికి నాకు మీ అమ్మాయి ని చూడగానే నచ్చేసింది... ఆ తరువాత మీ అమ్మాయి అని తెలియగానే ఇంకా గౌరవం పెరిగింది... నేను పెళ్లంటూ చేసుకుంటే తననే చేసు కుందామని అనుకుంటున్నా....అదీ మీకు మీ అమ్మాయి కి అభ్యంతరం లేక పోతేనే..ఇది కృతజ్ఞతతో కాదు ..తన పద్దతి అది బాగా నచ్చి...మీరు సరే నంటే
నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు....
ఒకవేళ  తనకి ఇష్టం లేదు అంటే ...
ఇదిగో నండి తన అపాయింట్ మెంట్ లెటర్ .వెంటనే జాబ్ లో జాయిన్ కావచ్చు... ,
వేరే ఊరిలో ఉన్న మా బ్రాంచ్ కి , మేనేజర్ గా పంపిస్తాను...
మీకు ఏ సమస్య లేకుండా చూసుకుంటా...
ఇదిగో నండి ఈ టేబులు మీద పెడుతున్నాను.
సుహాసిని గారు మీకు ఇష్టమైతే నే సుమండీ...
ఈ లెటర్ చింపేసి... నా లైఫ్ మేనేజర్ గా వచ్చేయండి... ఉంటాను మరి..
పదరా వినోద్ ఇంక బయలుదేరదాం
అంటూ లేచాడు విజయ్. వెళ్ళొస్తామండి మాస్టారు మరి అంటూ కాళ్ళకి నమస్కారం పెట్టాడు....
ఒక్క నిమిషం బాబు , ఇలా కూర్చో ...అమ్మాయితో ఒకసారి మాట్లాడతాను అంటూ....
అమ్మా బాగా ఆలోచించుకు ని ఒక నిర్ణయం తీసుకో...మాగురించి ఆలోచించకు.. ఎలాగో సర్దుకు పోవాలి మరి. మాగురించి నీ జీవితం ఆగి పోకూడదు....ముందుకు సాగాల్సిందే....విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి కుర్రాడు...అతని మాటలలో చూస్తున్నావుగా మంచి ఆదర్శ భావాలు ఉన్నాయి . ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు...ఆ అబ్బాయి నిన్ను బాగా ఇష్ట పడుతున్నాడు....నా ప్రియ శిష్యుడు .
నేను కాదనలేను కానీ నీకు ఇష్టం లేకుండా నేను ఏమి నిర్ణయం తీసుకో లేను అన్నారు మాస్టారు..
నేను పెళ్లి చేసుకు వెళ్ళి పోతే మరి, మీరో... మిమ్మలిని ఎలా వదిలేస్తాను....అనుకున్నారు...
పెళ్ళి వొద్దు ఏమి వద్దు....
నేను జాబ్  కే వెళతాను నాన్నగారు...
ఇంక  ఏమి మాట్లాడ వద్దు...అంటూ ఆ లెటర్ చేతిలోకి తీసుకుంది సుహాసిని...
భలే వారండి మీరు... మా మాష్టారిని అలాగే  వదిలేస్తానా..ఏమిటి..ఆయన మీకు ఎంతో నాకు అంతకన్నా ఎక్కువ...
మీ అమ్మగారు,నాన్నగారు కూడా మనతో నే ఉంటారు... నాకు మాత్రం ఎవరు ఉన్నారు... ఒకవేళ మీరు ఉద్యోగానికి వెళ్లినా , వాళ్ళు నాతోనే ఉంటారు... మీ పెళ్లి బాధ్యత కూడా నాదే...ఎందుకంటే మీ నాన్నగారు నాపై చూపించిన ప్రేమకి ఈ విధం గా కృతజ్ఞత తెలుపుకునే అవకాశం గా భావిస్తా ,...అన్నాడు నవ్వుతూ....
ఇంకా అలోచిస్తా వెందుకు ఒప్పుకో
తల్లి... నీ లాంటి మంచి దానికి అంతా మంచే జరుగుతుంది.  అన్నారు మాస్టారు.
లోపల మంచం మీద ఉన్న అమ్మ వైపు కి చూసింది. కళ్ళతోనే అడిగింది ,ఏమి చెయ్యమంటావు అని... ఆవిడ కళ్ళ నిండా సంతోషం తో చేసుకో మని తల ఆడించారు.
మీ  ఇష్టం నాన్నా. అంటూ తన చేతిలో ఉన్న అపోయింట్ మెంట్ లెటర్ చింపేసింది.సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా తల వంచుకుని చిరు నవ్వుతో , నిలబడింది. లోపల మంచం మీద వాళ్ళమ్మ గారు ఇది అంతా వింటూ ,మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
కళ్ళు లో వెలుగులు నిండగా... విజయ్ వైపు కి  ఓరగా చూసి తన అంగీకారాన్ని  తెలుపుతూ తల ఆడించింది.
ఇద్దరూ ఆయన కాళ్ళకి నమస్కరించారు  , ఇద్దరిని తన రెండు చేతులతో లేపి,
శుభం అంటూ వాళ్ళిద్దరి చేతులు కలిపి,  ఆశీర్వదించారు మాస్టారు... కంటి నిండా ఆనంద బాష్పాలతో...మనసులో నిండుగా....
శుభం....

Wednesday, 24 October 2018

తొలి అడుగు...

తొలి అడుగు...

లీలా మహల్ ముందు అభిమానుల సందోహం తో కళ కళ లాడుతోంది... ఎటు చూసినా జనం తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని అందరి తపన.ఒక ప్రక్క
టికెట్ క్యూ..మరో ప్రక్క అభిమాన సంఘాల హడావుడి.. కటౌట్ లు కట్టారు.. దండలు వేస్తున్నారు... కొందరు పాలతో అభిషేకం చేస్తున్నారు... విజయ్ కూడా పెద్ద దండ తీసుకుని వచ్చి తన అభిమాన హీరో కటౌట్ కి వేసాడు... ఈ లోగా ఫ్రెండ్స్ టికెట్స్ తీసుకుని వచ్చారు... ఫాన్స్ కోసం మేనేజర్ కొన్ని   టిక్కెట్లు కేటాయించారు... అందరూ లోపలికి వెళ్లారు.. సినిమా మొదలు అయింది.. ఈలలు కేకలు తో హాలు దద్దరిల్లుపోతోంది.. ఒక్క డైలాగ్ కూడా వినిపించటలేదు... సినిమా పూర్తి అయింది.. అంతా కబురులు చెప్పుకుని ఇంటికి బయలుదేరాడు విజయ్. ఏరా ఇవాళ
ఇంత ఆలస్యం అయింది.. భోజనం కూడా చేయలేదు... రా కాళ్ళు కడుక్కో వడ్డించేస్తా...అంటూ తల్లి అడిగింది ఆప్యాయం గా...ఇవాళ కాలేజ్ లో ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి... అందుకే అని అబద్ధం చెప్పాడు... భోజనం కానిచ్చి...
సాయంత్ర ము కూడా హాలు దగ్గరకు చేరారు... మళ్ళీ రాత్రి ఫస్ట్ షో చూసి... ఇల్లు చేరాడు విజయ్.. తండ్రి ఇంకా రాలేదు.. అమ్మా  , నాన్న ఇంకా రాలేదా...అని అడిగాడు.. అవును రా బస్ లో రావాలి కదా. బహుశా ఇవాళ బస్ దొరకడం లేటు అయి ఉంటుంది లే ,నువ్వు తినేసి పడుకో మళ్ళీ పొద్దున్నే కాలేజ్ కి వెళ్ళాలి గా...అంది .నాకు కొన్ని పుస్తకాలు కొనాలి. కొంచెం డబ్బు కావాలి. నాన్నని అడుగు అన్నాడు. నిజానికి మరునాడు దండలకు.. ఇంకా సినిమా హిట్ అయినందుకు , పార్టీ లకి , ఫ్రెండ్స్ కి టిక్కెట్లకి... కావాల్సి వచ్చి...
సరే లే అడుగుతాలే అంది ఆవిడ.
రాత్రి లేటు గా వచ్చాడు సుబ్బారావు. ఏమండీ ఇంత ఆలస్యం అయింది...
ఇవాళ కూడా బస్ దొరకలేదా అంది.
అవును ఆఫీసులో ఆలస్యం అయింది.
ఈ లోగా డైరెక్ట్ బస్ వెళ్ళిపోయింది...
సగం దూరం వచ్చి.. మిగతాది నడిచి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది...
సరేలే భోజనం వడ్డించు... నువ్వు అబ్బాయి తినేసారా.. అని అడిగాడు.
వాడు తిని పడుకున్నాడు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను...అంది... సరేలే వడ్డించు...కాళ్ళు కడుక్కుని వస్తాను.అంటూ లోపలికి వెళ్ళాడు...భోజనం చేస్తుంటే విజయ్ కి మెలుకువ వచ్చింది...కానీ అలాగే పడుకొని సెల్ ఫోన్ లోమెసేజ్ లు చూస్తున్నాడు. భోజనాలు అనంతరం
గదిలో కి వెళ్లారు సుబ్బారావు, భార్య.
అమ్మ డబ్బులు గురించి చెపుతుందో లేదో అని ఓ చెవి పారేశాడు విజయ్.
సరోజా ఇవాళ కాళ్ళు లాగుతున్నాయి కాస్త కొబ్బరినూనె రాయి అని అడిగాడు సుబ్బారావు.రోజూ ఇలా కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉంటే లాగవు మరి.బండి అబ్బాయికి ఇచ్చేసి మీరు ఇలా కష్టపడితే ఎలా.వాడు చిన్నవాడు కాలేజ్ కూడా దగ్గిరే.మీరు మోటార్ సైకిల్ మీద వెళ్లొచ్చు కదా అని అడిగింది.మనం మధ్య తరగతి వాళ్ళం.రెండు బళ్ళు ఎక్కడ కొనగలను.వాడు కాలేజ్ కి వెళ్ళేఅప్పుడు సరదాలు ఉంటాయి.నాన్న గా వాడి ముచ్చట్లు తీర్చే బాధ్యత నాదే కదా.కొన్నాళ్ళు కష్ట పడితే వాడి కి మంచి ఉద్యోగం వస్తుంది.నాకు కొంచెం ఆసరాగా ఉంటాడు అన్నాడు.
ఇదిగో ఇప్పుడు మళ్లీ ఏవో పరీక్షలు అంట, పుస్తకాలు  కొనాలి,  డబ్బులు కావాలి అంటున్నాడు అంది. అమ్మో మళ్ళీ డబ్బులా,మొన్ననే ఓవర్ టైం చేసి తీసుకుని వచ్చాను. అస్తమాను నేనే చేస్తాను అని అడిగితే ఇవ్వరుకదా. మిగతా వాళ్ళు కుడా చెయ్యాలి కదా అన్నాడు మా మేనేజర్. ఇంకో నాలుగు రోజులు ఆగితే జీతాలు వస్తాయి.అప్పుడు ఏర్పాటు చేస్తాలే.
మరీ అర్జెంట్ అయితే పక్కింటి విశ్వనాధం గారి దగ్గర అప్పు చేయాలి చూద్దాం. ఇక చాలులే , పడుకో మళ్ళీ పొద్దున్నే బయలు దేరాలి అని నిద్రకి ఉపక్రమించారు.
అపుడు అర్థం అయింది , విజయ్ కి
 తల్లి తండ్రులు అంటే ఏమిటో,
వాళ్ళ ప్రేమకి అంతే లేదని. ఈ ప్రపంచం లో వాళ్ళు చూపించే ప్రేమ కన్నా ఏది గొప్ప కాదని.
మా నాన్న నాకోసం ఇంత కష్ట పడుతున్నాడు.నా ఫీజులు కోసం ఓవర్ టైం చేసున్నాడు. నాకు బైక్ ఇచ్చేసి తాను
రోజూ ఎంతో దూరం నడుస్తున్నాడు.
ఇన్నాళ్లు నాకు తెలియలేదు.
కాదు కాదు వాళ్ళు నాకు తెలియనివ్వలేదు.అది వాళ్ళ గొప్పదనం. నేను మాత్రం సినిమా లు, అభిమానం పేరుతో కటౌట్ లకి దండలకి..పార్టీలకి... డబ్బులు వృధా చేస్తున్నా.
అప్పుడు గుర్తుకు వచ్చింది
తన అభిమాన హీరో అన్న మాటలు.
" మీరు చూపించే అభిమానానికి ధన్యవాదాలు. కానీ అభిమానానికి ఒక హద్దు ఉంటుంది. మా మీద ప్రేమ చూపించండి. సినిమా చూడండి. అంతవరకే. అనవసర ఖర్చులు పెట్టొద్దు. టికెట్ దొరకలేదని,ఏదేదో చేసేసు కోవడం, ఎంత ఖరీదైనా పెట్టి టికెట్ కొనడం లాంటివి చేయొద్దు. మీరు మమ్మల్ని ఎంత గా అభిమానిస్తారో అంతకు వెయ్యి రెట్లు మీ తల్లిదండ్రులు మీ మీద ప్రేమని పంచుతున్నారు.అది అందరూ గుర్తించాలి. మేము సినిమాలు చేస్తున్నాము అంటే ఒకపక్క అవంటే ఇష్టం,  మరియు మా తల్లితండ్రులని ఇంకా బాగా చూసుకోవాలి అన్న తపన.అది మీరు కూడా గ్రహించాలి, అలవర్చుకోవాలి "
అని ఎంత బాగా చెప్పాడు.
ఇప్పుడు అర్థం అవుతోంది ఆయన అన్న మాటలు. అనుకున్నాడు.
పొద్దున్నే తండ్రి ఆఫీస్ కి బయలుదేరే సమయంలో నాన్నా మీరు బండి మీద వెళ్ళండి నా ఫ్రెండ్ వస్తానన్నాడు. వాడితో వెళతాను అన్నాడు. సరే అంటూ ఆయన బయలు దేరారు.
నాన్న ఇంక మీకు కాళ్ళు లాగవు. ఆ అవసరం రానీయకుండా చూసుకుంటా
అని మనసులో అనుకున్నాడు.
అమ్మా నేను కాలేజ్ కి వెడుతున్నా. అని చెప్పాడు. అదేమి రా ఫ్రెండ్ వస్తాడు అన్నావు అని అడిగింది. లేదమ్మా
ఎవరు లేరు. నాన్న నా కోసం అంత దూరం నడుస్తున్నారు అని రాత్రి తెలిసింది. ఇంకా ఆయనని కష్టపెట్టను. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తాను. అంటుంటే ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసాడు.
ఫ్రెండ్ అని చెప్పక పోతే నాన్న బండి తీసుకుని వెళ్ళరు. అందుకని అలా చెప్పా. సరే నేను బయలు దేరతాను. అంటూ గేటు తీసుకుని బైటకి వచ్చాడు. పక్కింటి అంకుల్ ఇదిగో అబ్బాయి విజయ్ మీ నాన్న ఏదో బుక్స్ కొనాలి డబ్బులు కావాలని ఆడిగావుట .ఇదిగో నీకు ఇమ్మన్నాడు. నాకు జీతాలు వచ్చిన తరువాత  తిరిగి ఇస్తానన్నాడు అంటూ అతని కి ఇచ్చాడు. ఒక్కసారి గా విజయ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.నాన్నంటే నే ప్రేమ ప్రేమంటే నే నాన్న, ఇన్నాళ్లు నేను నీడలో ఉన్నానని అనుకుంటున్నాను. కానీ నువ్వు ఎండలో నిలబడి నాకు నీడ నిస్తున్నావాని తెలుసుకోలేక పోయాను.నన్ను క్షమించండి నాన్నా అని మనసులో నే అనుకుంటూ వెంటనే కళ్ళు తుడుచుకుని,
వద్దండి. నేను ఈ వాల్టి నుంచి లైబ్రరీలో చదువు కుంటాను. ఈ డబ్బు లు ఇప్పుడు అవసరం లేదు. సహాయం చేసినందుకు థాంక్స్ అండీ.అంటూ బయలు దేరాడు.
కాలేజ్ గేట్ దగ్గర ఒరేయ్ విజయ్  ఇదిగో రా నువ్వు అడిగిన టికెట్స్ .నాకు కొంచెం పని ఉంది రా , మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు విశాల్.
ఇప్పుడు నాకు కావాల్సింది టికెట్స్ కాదు, పుస్తకాలు అనుకుంటూ... ఆ టికెట్ చింపేసి,  లైబ్రరీ వైపు కి అడుగులు వేసాడు విజయ్.

ఈ తొలి అడుగు ఎన్ని విజయాలకి దారితీస్తుందో...

Wednesday, 10 October 2018

సిరి సిరి సిరిమువ్వల చిరు సవ్వడులే

సిరి సిరి సిరిమువ్వల  చిరు సవ్వడులే
పలికే ను నా హృదయపు  ప్రియ సందడులై
మనసున పలికిన  ప్రియ రాగములే
మధురిమ లొలికించెను ప్రియ భావనలై...

నును సిగ్గులు ..నీ బుగ్గ చేరి ,
అర మోడ్పుల... కళ్ళు చేసి..
నా మదిని .....నీ హృదయం
పలకరించి నాదే..
కర్పూర పరిమళాలు చల్లినాదే...

సిరి సిరి సిరిమువ్వల  చిరు సవ్వడులే
పలికే ను నా హృదయపు  ప్రియ సందడులై
మనసున పలికిన  ప్రియ రాగములే
మధురిమ లొలికించెను ప్రియ భావనలై...

ఏమని వర్ణించను నా
అంతరంగమున ఉన్న ప్రేమ ...
నా హృదయం నీ కోవెలగా
మార్చి కొలిచి నానే...మైమరచి పోయినానే

సిరి సిరి సిరిమువ్వల  చిరు సవ్వడులే
పలికే ను నా హృదయపు  ప్రియ సందడులై
మనసున పలికిన  ప్రియ రాగములే
మధురిమ లొలికించెను ప్రియ భావనలై...



Friday, 5 October 2018

ఎన్నెన్నో ....కలలు కన్నా ,

ఎన్నెన్నో ....కలలు కన్నా ,
ఏవేవో ......కవితలల్లా
ఎదలో నీ రూపం ,
నామనసే నీకోసం
నన్నే ఊరిస్తూ ,
నీ కై తపియిస్తూ...
నీ కోసం .....వేచుంటానులే...

ఇంతలో ...ఈ మాయ ఏమిటో
కొత్తగా ....ఈ వింత ఏమిటో...
నిన్ను చూసినంతనే,
నన్ను నేను మరిచానే..
చెప్పలేని ...వింత ..భావనేదో నన్ను
చేరేనే....

ఎన్నెన్నో ....కలలు కన్నా ,
ఏవేవో ......కవితలల్లా
ఎదలో నీ రూపం ,
నా మనసే నీకోసం
నన్నే ఊరిస్తూ ,
నీ కై తపియిస్తూ...
నీ కోసం .....వేచుంటానులే...

మదిలో ఏదో అలజడి..
ప్రేమై వానై కురిసే ఓజడి...
ఆశలే వో గమ్మత్తుగా.....
నన్ను చుట్టి సాగేనే...
ఆ ఊహలేవో  గాలిలో
ఓల లాడించేనే....

ఎన్నెన్నో ....కలలు కన్నా ,
ఏవేవో ......కవితలల్లా
ఎదలో నీ రూపం ,
నా మనసే నీకోసం
నన్నే ఊరిస్తూ ,
నీ కై తపియిస్తూ...
నీ కోసం .....వేచుంటానులే...

Tuesday, 25 September 2018

అందాల చందమామ


అందాల చందమామ
నా మనసు తెలుసుకో వా
అభిమానమంటూ ఉంటే
నా మనసు తెలుపలేవా...

అలరారు .. నీలి కురులు ,
నగుమోముపైన  ఆడే...
ఆ సొగ చిలిపి కళ్ళు ,
నా మదికి బంధమేసి,
జత కూడి ......ఊసులాడే

అందాల చందమామ
నా మనసు తెలుసుకో వా
అభిమానమంటూ ఉంటే
నా మనసు తెలుపలేవా......

నెలవంక రూపు దాల్చి
నను చూసి నవ్వకోయి ...
ఆ మేఘమాల నంపి
నా  మదిని తెలుపలేవా.... 

అందాల చందమామ
నా మనసు తెలుసుకో వా
అభిమానమంటూ ఉంటే
నా మనసు తెలుపలేవా...







ఫ్రెండ్ కి ఇచ్చిన మాట

ఫ్రెండ్ కి ఇచ్చిన మాట

రారా సుబ్బారావు చాలా కాలం అయింది నిన్ను చూసి... అంటూ ఆహ్వానించారు వెంకటరావు గారు.
సుబ్బారావు వచ్చాడు కాఫీ పంపించు అంటూ చెప్పారు... వాళ్ళవిడకు.
అన్నయ్య గారూ బాగున్నారా ఇదిగో ఇప్పుడే తీసుకుని వస్తా...అంటూ లోపలికి వెళ్ళింది సుజాత.
వెంకటరావు సుబ్బారావు మంచి స్నేహితులు... వెంకటరావు వ్యాపారం లో స్థిరపడితే ,సుబ్బారావు మాస్టారు గా స్థిర పడ్డారు... ఇద్దరికి ఒక కొడుకు ఒక కూతురు...
రారా ఇలా కూర్చో... ఈ మధ్య వ్యాపార లో కొంచెం బిజీ గా ఉండి మనం కలవలేకపోయాం...ఎలా ఉన్నారు చెల్లెమ్మ పిల్లలు... అంటూ అడిగాడు వెంకటరావు.
అంతా బాగానే ఉంది... అబ్బాయి ఇంజినీరింగ్ లో చదువు తున్నాడు... అమ్మాయి ఇంటర్... అన్నాడు సుబ్బారావు.  చాలా సంతోషం.అన్నాడు వెంకట్రావు. ఇదిగో అన్నయ్యా కౌఫీ..అంటూ ఇచ్చింది... తీసుకుని తాగడం మొదలు పెట్టాడు. ఏదో దిగులు గా ఉన్నావ్. ఏమిట్రా సంగతి.. అంటూ అడిగారు.ఆబ్బె అలాంటిది ఏమి లేదు ..ఒకసారి నిన్ను చూసి పోదామని వచ్చాను.. అన్నాడు సుబ్బారావు. ఒరేయ్ నేను బిజినెస్ మాన్ ని ఎంతమంది ని చూసి ఉంటాను... నీ ముఖమే చెపుతోంది... నిజం చెప్పు... అంటూ అడిగాడు.. ఏదైనా డబ్బు సమస్యా అంటూ అడిగాడు... ఆబ్బె అలాంటి ది ఏమి లేదు... మా అబ్బాయి కాలేజ్ లో జేరిన తరువాత మొదట్లో బాగానే చది వే వాడు... ఈమధ్య సావాసాలు...తిరుగుళ్లు ఎక్కువ అయి.. చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు.... ఏమైనా అడిగితే కోపం, పెద్ద లేదు , చిన్న లేదు అరుస్తున్నాడు... వాళ్ళమ్మ గారాబం వాడిని అలా మార్చేసింది.
చెపితే వినదు.దాని అతి ప్రేమ వలన వాడి భవిష్యత్ ఏమి అవుతుందో అని భయం గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
నువ్వే వాడికి ఏదైనా చెప్పి చూడు అంటూ అడిగాడు. సరే లే నేను మీ ఇంటికి వస్తాను ఒకరోజు....చూద్దాం.. ఆ రోజు మీ వాడికి ఉద్యోగం అడుగు
   వాడి ఎదురుగా ...సరేనా మరచిపోకు.. మిగతాది నేను చూసుకుంటా అన్నాడు వెంకట్రావు. చెప్పినట్లు గానే
ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.రండి అన్నయ్య గారు అంటూ సాదరంగా ఆహ్వానించింది సుబ్బారావు భార్య. ఏమి చెల్లెమ్మా బాగున్నవా...ఏరి పిల్లలు...ఉన్నారా ఇంట్లో అని అడిగాడు. ఇదిగో ఇప్పుడే పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళింది.ఒరేయ్ నేను చెప్పింది గుర్తు ఉందిగా.. వాడి ఎదురుగా అడుగు... చాలు అన్నాడు వెంకట్రావ్.. ఇంతలో పిల్లలు వచ్చారు. నమస్తే  అంకుల్ అంది అమ్మాయి. హాయ్ అంకుల్ అన్నాడు అబ్బాయి... ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగాడు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్...అన్నాడు... ఈ ఏడాది తో అయిపోతుంది... నీ దగ్గర ఏదన్నా ఉద్యోగం ఉంటే ఇప్పించరా అని అడిగాడు సుబ్బారావు... ఎలా వచ్చాయి మార్కులు అనిఅడిగాడు వెంకట్రావ్..కొన్ని బాక్ లాగ్స్ ఉన్నాయి... అన్నాడు..ఇలా అయితే ఎలా ఎప్పుడు అవచేస్తావు... అసలు పాస్ అయితే కదా ఉద్యోగం సంగతి వీడి పరిస్థితి చూస్తే అసలు చదువు అబ్బినట్లు లేదు...ఏమి అనుకోకు రా అన్నాడు వెంకటరావు... అలా  అంటా రేమిటి అండి.. అన్ని పూర్తి చేసేస్తాగా...
 అన్నాడు...అదే ఎప్పుడు అని అడుగుతున్నాను.... ఈ కాలం ఎంత స్పీడ్ గా ఉందొ తెలుసా... అందరికి వందకి వంద వచ్చేస్తున్నాయి..నువ్వు చూస్తే ఇలా ..నీకు ఎక్కడా  ఉద్యోగం దొరకదు.. అసలు పాస్ అవుతావో లేదో అని అనుమానం..మా ఆఫీస్ లో గుమాస్తా ఉద్యోగం ఉంది వచ్చి చేరు... నేను ఫోన్ చేసి చెపుతాను. అన్నాడు .
మీరుఅవమానిస్తున్నారు...అన్నాడు ఉక్రోషం గా..
ఈ కోపం చదువు మీద చూపించు... నమ్ముతాను... అన్నాడు. సరే నేను అన్ని పాస్ అయి... మంచి కంపెనీ లో జాబ్ తెచ్చుకుంటే..ఏమి చేస్తారు... అన్నాడు... అలాగే జరిగితే ఇప్పుడు అన్న మాటలు ఉపసంహరించుకుని, అందరిముందు క్షమాపణ చెపుతా..కానీ అలా చేయలేక పోతే ....గుమాస్తా గా చేరతావా మరి అన్నాడు  సరే నండి. చూసుకుందాం..అంటూ విసురు గా బైటకు వెళ్లి పోయాడు... సుబ్బారావు కంగారు పడ్డాడు. అదేమిటి రా అలాగ అనేశావు...ఇప్పుడు ఏమవుతుందో.. అన్నాడు..నువ్వు ఏమి కంగారు పడకు...నా మీద పంతం తో బాగా చదువుతాడు లే ..మరి నేను వస్తాను అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు..ఆ తరువాత శ్రద్ధ గా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూ లో పెద్ద కంపెనీ లో సెలెక్ట్ అయ్యాడు .సంవత్సారానికి 12 లక్షలు జీతం. ఆ అపోయింట్మెంట్ లెటర్ తీసుకుని తండ్రికి చూపించాడు. ఇదిగో నాన్న ,నేను సాధించాను.ఎక్కడ మీ ఫ్రెండ్..ఆయన ఛాలెంజ్ చేశారు గా ...ఇది చూపిస్తాను మీరూ రండి అని తీసుకుని వెళ్ళాడు.రేయ్ వద్దురా ..అయింది ఏదో అయింది. నీకు ఉద్యోగం వచ్చింది గా ఇంక ఈ విషయం వదిలేయ్ అన్నాడు సుబ్బారావు. లేదు నాన్న ఆయన ఎంతలా మాట్లాడారు, నేను పాస్ అవనట, ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వరట...ఎంత అవమానం గా మాట్లాడారో, నువ్వు విన్నావుగా... ఇంకేమి మాట్లాడకు అన్నాడు.
అక్కడ వెంకటరావు ఆఫీస్ లో మీటింగ్ జరుగుతోంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు ఇద్దరు.ఒరేయ్ వద్దు రా ఇంకోసారి కలుద్దాం అని తండ్రి నివారించాడు. కానీ వినలేదు.. నేను సాధిస్తే అందరి ఎదుట నాకు క్షమాపణ చెపుతాను అన్నారు...
అది ఇప్పుడు అడుగుతున్నాను..
అంకుల్ ఇదిగో లెటర్.నేను సాధించాను. మీరు  అన్న మాట నిలబెట్టుకుంటారా
..అంటూ దగ్గరకు వెళ్ళాడు..
మొత్తానికి సాధించావ్ ...నేను కూడా మాట నిలబెట్టుకుంటా అన్నాడునవ్వుతూ.అంతలో సుబ్బారావు వెంకటరావు చెయ్యి పట్టుకుని వాడి పిచ్చి వేషాలు కి మీరు పట్టించుకోవద్దు... దయచేసి ఇంతటితో ఆపేయండి అని బ్రతిమాలా డు సుబ్బారావు...కానీ వెంకటరావు దగ్గరికి వెళ్లిన కిరణ్ ...
ఒక్క సారిగా ఆయన కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించండి అంకుల్ చాలా పెద్ద
తప్పు చేశాను... అన్నాడు.
అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు.... మీరు కనక ఆ ఛాలెంజ్ చేసి ఉండక పోతే నేను ఏమై పోయి ఉండేవాడినో... సమయానికి దేముడి లా వచ్చారు...నాలోని పౌరుషం రెచ్చగొట్టి.. నేను సాధించేలా చేశారు... నేను పాస్ ఐయ్యాక కూడా నాకు మీ మీద పంతం ఉండేది...ఒక్కసారి ఆ అపోయింట్మెంట్  లెటర్ చేతికి వచ్చిన తరువాత అర్థం ఐయింది. ఎంజాయ్ చేయాల్సిన వయసు లో ఎంజాయ్ చెయ్యకపోతే తరువాత చేయలేము గా
 అనే కాన్సెప్ట్ లో ఉండే వాడిని.
కానీ చదవాల్సిన టైం లో చదవకుండా
తిరిగి తే , జీవితం ఏమైపోయి ఉండేదో అని..
ఇంకా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉండేది అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మంచి ఉద్యోగం, మంచి జీతం ..ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం
,దక్కాయి .ఆరోజు మీరు నాకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఇప్పటికీ నేను అలాగనే ఉండేవాడిని.ఇది అంతా మీ ఆశీర్వాదమే ,అని ఆయన చేతిలో లెటర్ పెట్టాడు. ఆయన ఒక సారి హత్తుకుని నాకు తెలుసు రా  నువ్వు సాధించగలవని. నీకు నా అభినందనలు చాలా సంతోషం కిరణ్...
ఏమయ్యా సుబ్బారావు నీ  కొడుకు సాధించాడు...నేను నా ఫ్రెండ్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను...అంటూ నవ్వాడు... సుబ్బారావు కళ్ళలో ఆనంద భాస్ఫాలు తిరుగుతుండ గా కృతజ్ఞతా పూర్వకంగా చూసాడు.
శుభం

Sunday, 22 July 2018

మనసెరిగిన వాడు "

" మనసెరిగిన వాడు "
కొత్త గా కాపురానికి వచ్చిన శైలజ... కి కొద్దిరోజులలో నే భర్త తో సఖ్యత కొరవై ... గొడవ పెద్దది అయ్యి , పుట్టింటికి చేరుతుంది. ఆమె మొదటి నుంచి బాగా చదువుకునేది.కలెక్టర్ అవ్వాలని  తన అభిలాష. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు.... తనని పెళ్లి చేసుకునే లాగా చేసాయి...ఇంక అత్తారింటికి వచ్చాక భర్త ..అత్తారిల్లు ఇదే జీవితం అని సరిపెట్టుకుంది.ఆ సంసార జీవితంలో బిజీ అయిపోయింది.నిజానికి తన భర్త చాలా మంచి వాడు. అయినా ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. కోపం ఎందుకు వస్తోందో తెలియదు... అతనికి ఏదైనా లోటు చేస్తున్నానా...ఏమైందో..  అర్థం కాదు..ఎప్పుడూ ఆలోచిస్తూ, బాధ పడుతూ, గదిలోనే గడప సాగింది...
దాన్ని చూస్తూ ఉంటే మనసుకి బాధ గా ఉంది...ఒకసారి కనుక్కో ఏమి జరిగిందో అని అడిగాడు తండ్రి  వెంకట్రావు.
సరే అంటూ ఆ గదిలోకి వెళ్లి అసలు ఏమి జరిగిందని అడిగింది శైలజ తల్లి వనజ.
నాకు తెలిసి చెప్పుకో తగ్గ గొడవలు ఏమీ లేవు, అమ్మా , తను ఎప్పుడూ బైటకి తీసుకువెళతానని, అంటాడు.... ఇంట్లో ఏదో పని వస్తూ ఉంటుంది... ఇప్పుడు కుదరదు  మరోసారి అంటూ ఉంటాను...
అలాగే ఎప్పుడు సరదాగా మాట్లాడదామన్నా ఉమ్మడి కుటుంబం, జరిగేది కాదు... క్రమ క్రమం గా విసుక్కోవడం మొదలు పెట్టాడు  రామ్ అలాంటి గొడవలే , కానీ పెద్దవి కూడా కాదు.
ఇలాంటి చిన్న చిన్నవే పెద్దవి అయిపోతాయి  తల్లీ, అయినా భర్త అన్నాక అతనికి కొన్ని కోరికలు ఉంటాయి గా , భార్య గా నీ భాద్యత కూడా , ఎన్ని పనులున్నా
అతనితో కూడా సరదా గా కొంత సమయం గడపాలి  కదా మరి అంది తల్లి..
లేదమ్మా....ఈ మధ్య  చిన్న విషయాలకే  కోపం పెరిగిపోయింది. మొదట్లో బాగానే ఉండే వారు, రాను రాను ఆఫీస్ నుండి ఆలస్యంగా రావడం , చీటికీ మాటికి విసుక్కోవడం, ఎక్కువైంది.
మొదట్లో ఆఫీస్ టెన్షన్స్ అనుకునే దాన్ని... కానీ , అర్థం కాదు అంది శైలజ...
 సరేలే  ఇదేమీ పెద్ద విషయం కాదులే ముందు నువ్వు నీ పద్దతి  మార్చుకో...
 మీ నాన్న ని పంపించి అల్లుడి గారితో మాట్లాడిస్తాను... నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి... అన్ని సమస్యలు పరిష్కారము అవుతాయి... నువ్వు రెస్ట్ తీసుకో  అంటూ వంటిట్లోకి వెళ్ళింది.
ఆ రాత్రి... భోజనాల తరువాత
జరిగిన విషయం భర్త తో చెప్పి... మీరు ఒక సారి అల్లుడి గారిని కలిసి మాట్లాడండి..
ఇది రెండు జీవితాలకి సంబంధించిన విషయం...అనవసర రాద్ధాంతం చేసుకుని జీవితాలు పాడు చేసుకోవద్దు, అని నచ్చ చెప్పండి అని అడిగింది...
సరే రేపు నేను వెళ్లి మాట్లాడి వస్తాలే. నువ్వేమి కంగారు పడకు, అన్నిటికి ఆ భగవంతుడు ఉన్నాడు... తెలిసి మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అన్ని ఆయనే చూసుకుంటాడు...
అని నిద్రకి ఉపక్రమించాడు.
మరుసటి రోజు అబ్బాయిని ఒప్పించేందుకు  వాళ్ల ఇంటికి వెళ్ళాడు. రామ్ తో మాట్లాడినటారువాత ,  ఇంటికి వచ్చేసాడు
ఏమండీ ఏమైంది విషయం అని అడిగింది తల్లి  ఇంకా కోపం తగ్గలేదు .
ఇంకా సాగదిస్తే గొడవ పెరుగుతుంది అని వచ్చేసా , అసలే ఆడపిల్ల  వాళ్ళం, సంయమనం ఉండాలి , కొన్నాళ్ళు చూద్దాం మారతాడేమో..
పరిస్థితులకు పోరాడాలి గాని  కుంగి పోకూడదు...
సమస్య లు ఎన్నిఉన్నా....పోరాడి సాధించుకోవాలి.... మూసి ఉన్న తలుపు కొడుతూ కూర్చోకుండా తెరిచి ఉన్న గుమ్మలోనించి ...వెళ్లి గమ్యం.. లేదా విజయం సాధించాలి. అమ్మా  శైలజా
నువ్వు మొదటి  నుంచి ,టాప్ రేంకర్ ...
మన కుటుంబ పరిస్థితుల వలన పెళ్లి చేసేయాల్సి వచ్చింది... అనుకోకుండా
ఇలా జరిగింది... ఇప్పుడు నేనూ కొంచెం స్థిరపడ్డాను ముందు. నువ్వు నీ చదువు ని కొనసాగించు...
 నీ కోరికని సాధించు కోవడానికి నేను నీ ప్రక్కనే ఉంటాను అన్నాడు వెంకట్రావు...ఎలాగూ సివిల్స్ ఇష్టం కదా దానికి ప్రయత్నించి
చూడు.అబ్బాయి ,మారితే సరే లేదంటే ,
నీ కాళ్ళమీద నువ్వు నిలబడవచ్చు , అని వెంకట్రావు అన్నాడు. సరే నాన్నా మీ ఇష్టం.. అలా ఆమె  దరిమిలా ఆమె పంతం పట్టి, కష్టపడి చదివి  కలెక్టర్ అవుతుంది.ఛార్జ్ తీసుకున్నాక డ్రైవర్ తో కార్ తీయమని అన్నప్పుడు ఆమె తండ్రి ఎక్కడికి అని అడిగాడు . ఆయన దగ్గరకే నాన్నా ,
తాను వదిలేసినా, నేను సాధించిన విజయాన్ని అతనికి చూపించి బుద్ధి చెప్పాలని అంది శైలజ. సరే అలాగే వెళదాం ..కానీ .కార్ నేను డ్రైవ్ చేస్తా,
మళ్ళీ డ్రైవర్ ఎందుకు,  నేను కూడా అతనిని కడిగేయాల్సి ఉంది... అన్నాడు వెంకట్రావు.
 సరే నాన్న బయలుదేరండి అంది. ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి రామ్  కిటికీ దగ్గర నిలబడి పుస్తకం చదువుకుంటున్నాడు... ఇద్దరిని చూడగానే నవ్వుతూ దగ్గరకి వచ్చాడు.రండి మామయ్య అంటూ ఆహ్వానించాడు.ఏం శైలు ఎలా ఉన్నావ్
అని  పలక రించాడు రామ్, ప్రేమగా.
ఆమె కోపం తో తిట్టబోయేంతలో నువ్వు ఉండు అమ్మా నేను మాట్లాడతాను అంటూ ఆపాడు.... తండ్రి.
ఇదిగో  అల్లుడు నీ కలెక్టర్ భార్య.... నీ కోరిక ప్రకారం కలెక్టర్ని చేసి నీకు అప్పగిస్తున్నాను....హమ్మయ్య నా బాధ్యత తీరింది... అంటూ నవ్వు తూ అన్నాడు..
శైలజ షాక్ తింది... ఎమి జరుగుతోందో అర్ధం కాలేదు , నాన్నా  మీరు ఏమి  అంటున్నారు....అసలేం జరిగింది...అంటూ అడిగింది...  ఆశ్చర్యం గా..
ముందు నువ్వు ఇలా కూర్చో అంతా  వివరం గా చెపుతాను... అంటూ జరిగినది అంతా వివరంగా చెప్పాడు.ఇంట్లో పనులు అన్నీ చేస్తున్నావు కానీ నీకు దేనిమీదా
 ధ్యాస ఉండదు.
ముఖం లో ఏదో ముభావం కనబడుతూ ఉంటుంది... ఏదో పొగుట్టుకున్న వెలితి.... మొదట్లో పెళ్లి అయిన కొత్త కదా...అయిన వాళ్ళందరిని వదిలేసి వచ్చింది కదా కాపురానికి, కొన్నాళ్ళు అలాగే ఉంటుంది అని సరిపెట్టుకున్నా ను , కానీ ఏదో ఉంది....కానీ చెప్పదు... ఎన్ని సార్లు అడిగినా ఏమీలేదు, ఊరికినే అంటూ
దాట వేస్తూ ఉంటుంది అన్నాడు రామ్.
ఒక సారి అనుకోకుండా నీ డైరీ చదవడం జరిగింది ట , ఎప్పుడూ ఇంటిపని వంట పని అంటూ బిజీ గా తిరిగే నీకు ఒక కల వుందని ,అది  ఆర్ధిక  ఇబ్బదులవలన పక్కన పెట్టి నీ పెళ్లి చేసేశారని...జీవితంలో రాజీ పడి బ్రతుకుతున్నావని  తెలుసుకున్న రామ్,
నేను సర్దిచెప్పేటందుకు ఇక్కడ కు వచ్చినప్పుడు , ఈ విషయం నాకు చెప్పి,  తన ఆశయం నెరవేరేలా  నేను చేస్తాను  కానీ ఇప్పుడు నేను చెపితే  శైలు వినదు....
ఇల్లు కుటుంబం అంటూ ఒప్పుకోదు... పైగా ఆత్మాభిమానం ఎక్కువ.ఎవరి మాట విన దు. నేను చెప్పినట్లు చేయండి ,అంటూ  అతను నిన్ను విసుక్కోవడం, దగ్గర నుంచి  చిన్న గోడవలని పెద్దది చేసి... నిన్ను పుట్టింటికి పంపించేయడం  ,అన్ని రామ్  చెప్పినట్లే జరిగింది .
నీ చదువు కు అయిన ఖర్చు అంతా అతనే పెట్టాడు. ఇంత మంచివాడివి, ఇంత ప్రేమ పెట్టుకుని ఈ ఎడబాటు ఎలా భరిస్తున్నవయ్యా ,మహానుభావా....ఇంక చాలు,  శైలజ తో జరిగినది చెప్పేస్తా అని, చాలా సార్లు , అతనితో అంటే ,
వద్దు మామయ్య గారు,  నా మీద కోపం తో మరింత శ్రద్ధ గా చదివి సాధిస్తుంది.
అని వారించేవాడు....ఇప్పుడు ఇంక చెప్పక తప్పలేదు అల్లుడు అంటూ....నవ్వాడు వెంకట్రావు.
తన భర్త కి తనమీద ఇంత ప్రేమ ఉందా !
తన మనసులో కోరిక తీర్చడానికి ఇంత కష్టపడ్డాడా. ఇంత మంచి భర్త నాకు ఏ జన్మలోను దొరకడు.నా భర్త  నిజంగా
నా " మనసెరిగిన వాడు " అనుకుంటూ,  అపార్ధం చేసుకున్నా నన్ను క్షమించండి అంటూ కాళ్ళమీద పడబోయిన భార్య ని ఆపి , నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ అంటూ హృదయానికి హత్తుకున్నాడు....అలాగే మామయ్యగారి వైపు చూసాడు... ఆ ఆ అర్థమైంది...ఇంక నేను దయచేస్తే....అనేగా ఆ చూపుకి అర్థం ....వెళతాలే మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు ....దుర్మార్గుడా... మామయ్య అని గౌరవం లేకుండా ఎలా పొమ్మంటున్నాడో, అని మనసులో నే  మురిసిపోతూ బయలు దేరాడు వెంకటరావు.... శుభం

Monday, 9 July 2018

కమ్మని కావ్యం పలికింది ,



కమ్మని కావ్యం పలికింది ,
మమతల కోవెలలో
కంటి కి వెలుగు లు నింపినది,
తన జిలిబిలి పలుకులతో.....//
సిరిమల్లె పూవుకు , సింగారం చేసి
మరు మల్లె తీగకు ,ముస్తాబె చేసి
ఆ మేలి మోముని ,
కొంగుతో ముసుగేసి..........
తొలి సిగ్గు దొంతరలే ,
పొంగి పొరలుతుంటుంటే ......
ఎరుపెక్కిన చెక్కిళ్ళు,మనసుని ఎగరేస్తుంటే
కమనీయ కావ్యాలు , మదిలో పాడేస్తుంటే,
కమ్మని కావ్యం పలికింది ,
మమతల కోవెలలో
కంటి కి వెలుగు లు నింపినది,
తన జిలిబిలి పలుకులతో.....//
అడుగులో , అడుగేస్తూ ,
అందాల చందమామ , నడిచొస్తావుంటే,
ఘల్లు ఘల్లు మని , సిరి  సిరి మువ్వలు,
చిరు సందడి చేస్తుంటే,
జిలిబిలి పలుకుల పుత్తడి బొమ్మకు
కల్యాణ వైభోగం
జరిగే శుభ తరుణం లో,
మంగళ వాయిద్యాలు మ్రోగుతుంటే,
వేద మంత్రాలే ,వేల దీవెనలై
అక్షింతల చిరు జల్లులు కురుస్తుంటే..
ఆడి ,పాడి అల్లరి చేద్దాం రారండి,
అన్నుల మిన్నల ,కన్నుల పండగ  చూడండి
మీ చల్లని చేతుల ,మనసులో నిండుగా దీవించండి.......
కమ్మని కావ్యం పలికింది ,
మమతల కోవెలలో
కంటి కి వెలుగు లు నింపినది,
తన జిలిబిలి పలుకులతో.....//

Thursday, 15 March 2018

ఆమని పాడవే హాయిగా


ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో | పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల... | మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా | ఆమని పాడవే హాయిగా

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా యద | స్వరాల సంపద
తరాల నా కథ | క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని

ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలత

శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువి కలా నిజం స్ప్రుసించిన మహోదయం
మరో ప్రపంచమే | మరింత చేరువై
నివాళి కోరిన | ఉగాది వేళలో
గతించిపోని గాధ నేనని

ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో | పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల... | మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా | ఆమని పాడవే హాయిగా

మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన  ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...

Sunday, 11 March 2018

నెమలికి నేర్పిన నడకలివి

నెమలికి నేర్పిన నడకలివి
సప్తపది
Music: K.V.Mahadevan
Lyrics: Veturi
Singer: Janaki


 నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
 నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
 నెమలికి నేర్పిన నడకలివి 

కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
కలిసిమెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన
మల్ప శిల్ప మణి మేఖలను శకుంతలను
 నెమలికి నేర్పిన నడకలివి

చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనా
లేఖ్య సరస సౌందర్యరేఖను శశిరేఖను
  నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల

మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
 అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన  ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...


Friday, 2 March 2018

మా ర (క్ష )ణ హోమం


"మా" " ర (క్ష )ణ"  హోమం

వారని వీరు ,వీరని వారు
చివరకు ఒకరిని ఒకరు
ఎవరికోస మీ పోరాటం
ఎందుకోస మీ  ఆరాటం
ధ్యేయం ఒకటే , (ప్రజాసంక్షేమం )
సౌర్యం ఒకటే,
కానీ ....
గమ్యం వేరై
చేస్తున్న ..... త్యాగాలకి.... అర్థం ?
ప్రజల కోసం పోరాటం,
ప్రజా క్షేమం మా ఆరాటం
అంటూ,
అన్ని మరచి
చేస్తున్న....... నిరర్ధక త్యాగాలు
జనం మనం, మనం జనం
మనం మనం ప్రభంజనం ,
కాదు కాదు
ఎప్పటి కి మీరు, మేము
అంతా మనమే అయి
సాధించాలి విజయం...
ఉండాలి.... ప్రతీ క్షణం
ఒకరికోసం ఒకరు.....
కాదిది కులాల కుమ్ములాట
కాదు కాదు మతాల నరుకులాట
కానే కాదు సీమాంతర ఉగ్రవాదం
మరి ఎందుకీ
మా ర (క్ష )ణ హోమం
అడవుల్లో గర్జనలాగేదెప్పుడు
మువ్వన్నెల జెండా
గర్వంగా తల ఎత్తుకు ని ఎగిరేదెప్పుడు
శాంతి కపోతం రెక్కల రెప రెపలు
వినే దెప్పుడు..... 

AVENGERS

AVENGERS 
ఆకాశం మేఘావృతమై ఉంది.ఉరుములు మెరుపులతో చల్లని ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్ప పీడనం వాయు గుండం గా మరబోతున్నది అని హెచ్చరికలు 
జారీ చేశారు .సముద్రం లో అలలు ఎగిసి పడుతున్నాయి. I.N. S. యుద్ధ నౌక ఠీవిగా ఊగిసలాడుతోంది. ఒకే సారి 20, F18..విమానాలు దిగొచ్చు. సరిహద్దు భద్రతా దళాలు గస్తీ చేయడానికి , ఇంటర్నేషనల్ వాటర్స్ దగ్గరే ఉంటుంది. దాని మీదనుంచి ఫ్లైట్స్ వెళ్లి సరిహద్దు కాపలా కాస్తుంటారు. రోజూ లాగానే ఆరోజు కూడా వెళ్లివచ్చేసాయి. 
అప్పుడు అది చరణ్ వంతు. 
హెల్మెట్ చేతిలో పట్టుకుని బయలుదేరాడు. 
" కెప్టెన్ పిలుస్తున్నారు " అని చెప్పాడు నారాయణ. 
సీనియర్ ఆఫీసర్ మాత్రమే కాదు , బాబాయ్ కూడా.చరణ్ కున్న ఇష్టం చూసి ఆ పరీక్షలు రాయించి తన షిప్ లొనే జాబ్ వేయించుకున్నాడు. 
" MR చరణ్ తుపాను హెచ్చరికలు చేశారు. కొంచెం జగ్రత్త..." అని చెప్పాడు కెప్టెన్.
" అలాగే సర్ "అంటూ బయలు దేరాడు. 
" అతని కోపానికి చిరాకు వస్తుంది గానీ, చాలా sincear... " అని అభినందించారు. " అవును సర్ వాడి కొంచెంమ్ కోపము ఎక్కువే .....
ఆ కోపానికి కూడా అర్థం ఉంటుంది. కానీ కోపం వస్తే పట్టుకోలేం...
అందుకే నాదగ్గర పెట్టుకుని చూసుకుంటున్నా....ఎవరి మాట వినడు.... " 
అంటూ విమానం దగ్గరకు వెళ్ళాడు clearence ఇవ్వడానికి.
చరణ్ విమానం పెద్ద శబ్దం చేసుకుంటూ బయలు దేరి వెళ్ళిపోయింది. 
రొటిన్ చెక్ చేస్తూ ముందుకు వెళ్ళు తున్నాడు.
" హలో చరణ్ అక్కడ ఎలాఉంది." అని అడిగారు కంట్రోల్ రూమ్ నుంచి. 
" అంతా క్లియర్ గానే ఉంది. ఓవర్ " అన్నాడు.
ఇందాక రాడార్ సిగ్నల్ బ్రేక్ ఐయి మళ్ళీ వచ్చాయి. 
ఇంకొంచం ముందుకి వెళ్లి అనుమనస్పదం గా ఉంటే తెలియజేయి. అన్నారు.
అలాగే సర్... అంటూ ఇంకా ముందుకి వెళ్ళాడు...
అక్కడ లీలగా సముద్రం అడుగున ఒక సబ్ మెరైన్ కనిపించింది. 
జాగ్రత్తగా పరిశీలించి చూడగా ఇండియా సింబల్ కనిపించింది. 
మనదే గా అంటూ...వెనక్కి వచ్చేసాడు. 
షిప్ మీద ల్యాండ్ అయ్యింది.
బాబాయ్ వచ్చి డోర్ తీసి...అంతా బాగానే ఉంది గా...వర్షం ఎక్కువగా ఉంది ...
కెప్టెన్ కి రిపోర్ట్ చేసి క్యాబిన్ కు వచ్చేయి... అంటూ....కేబిన్ కి వెళ్ళాడు. 
సర్  అంతా బాగానే ఉంది కాని మన దేశపు సబ్ మెరైన్ కనిపించింది.
సిగ్నల్స్ కాచ్ కావట్లేదు... అందుకె కొంచెం డీప్ గావెళ్లి చూసా... 
ఇండియా ఫ్లాగ్ సింబల్ కనిపించింది. అందు కె వచ్చేసా..అన్నాడు.
ఓకె నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో , రేపు మాట్లాడతాను.గుడ్ నైట్ అన్నాడు.
ఒకె గుడ్ నైట్ సర్ అని బయలుదేరాడు. 
కేబిన్ లో ఏంటి రా అబ్బాయి ఇంత ఆలస్యం...అంటూ అడిగాడు... 
జరిగింది చెప్పాడు... ఇదిగో నీ మందు... ఎక్కువగా తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు...తినడానికి ఏంచేశావ్.... అన్నాడు...
అన్ని టేబుల్ మీద ఉన్నాయి... నేను రెండు రౌండ్స్ వేసి తింటాలే అంటూ మొదలు పెట్టాడు.
మరునాడు ఉదయం కెప్టెన్ పిలిచి , 
చరణ్ తో నేను నేవీ వాళ్ళతో మాట్లాడాను.వాళ్ళు ఎటువంటి వాటిని పంపలేదుట, ఎందుకైనా మంచిది మనం చెక్ చేసుకుంటే మంచిది కదా , 
అందుకే నువ్వు టీం తీసుకుని వెళ్ళు, అసలు ఏం జరుగుతోంది తెలుసుకో.. 
ఏమైనా తేడా వస్తే వెనుకాడకు.. ఏక్షన్ తీసుకో , నేను చూసుకుంటా అన్నాడు. 
అలాగే సర్.... ఒక టీం తో బోట్ లో ఆయుధాలతో వెళ్ళాడు. 
అక్కడ సబ్ మెరినే ఉంది కానీ ఎటువంటి కదలిక లేదు.. 
అందరూ డ్రెస్ వేసుకుని... సముద్రం లోకి దిగారు.లోపలికి వెళ్లారు.
అక్కడ ఎవరు కనబడలేదు.. అంత వెతికారు ఏమయినా క్లూ దొరుకుతుంది ఎమోనని... కానీ లేదు... 
చరణ్ ఇంకా వచేద్దాము అనుకుని బయలు దేరాడు.. 
అప్పుడే ఒక పేపర్ కింద పడి ఉండడం చూసాడు... తీస్తే ,
అందులో దీనిని హైజాక్ చేశారని..ఆయూధాలు carry చేశారని..అందరు మెంబెర్స్ ని ఎక్కడికో బంధించి తీసుకుని వెళుతున్నారు అని మెసేజ్ ఉంది... 
ఆ లెటర్ తీసుకుని వెనక్కి వచ్చేసారు. కెప్టెన్ కి జరిగింది అంతా చెప్పారు. 
ఆయన ప్రధాన కార్యాలయం తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోమని meaaage పంపించారు. 
మిలటరీ కార్యాలయంలో మీటింగ్ జరుగుతోంది.మెసేజ్ పేపర్ పట్టుకుని ఒక ఆఫీసర్ లోపలికి వచ్చాడు.సెల్యూట్ చేసి నుంచున్నాడు. 
ఏమిటి విషయము  అని అడిగారు డిఫెన్స్ చీఫ్. మెసేజ్ కాగితం ఇచ్చాడు. 
అది చదివిన చీఫ్ ఒకె .మీరు ఇంక వెళ్ళవచ్చు అని చెప్పాడు. 
సార్జెంట్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మీటింగ్ కొనసాగిస్తూ ఇప్పుడు మనకు వచ్చిన ఈ సమాచారం, మనం చర్చిస్తున్న విషయం కి సంభందించిన దే. 
అంటూ వివరాలు చెప్పాడు. చూస్తుంటే ఇది పెద్ద విషయమే. 
ఇందులో చాలామంది కి సంభందం ఉండొచ్చు. 
దీనిపై ఇప్పటి కె ఒక ఆఫీసర్ అదే పనిలో ఉన్నాడు. త్వరలో నే వివరాలు తెలుస్తాయి. 
ఒక సారి ఆ వివరాలు రాగానే అది ఏవైరైన సరే , 
దేశద్రోహానికి సహించేది లేదు. అంటూ ముగించాడు. 
ఆ ఏజెంట్ ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు మినిస్టర్. 
లేదు .confidential... ఇందులో నీ ప్రమేయం ఏమి లేదుగా...అలా ఆడిగావు. అన్నాడు. ఆబ్బె లేదు సర్ ఊరికే అడిగా అంతే అన్నాడు కంగారుగా.
లేకపోతే సరే అంటూ తన ఛాంబర్ వైపుకి వెళ్ళాడు. 
తన సీటు లో కూర్చుని షిప్ కి ఫోన్ చేసాడు. 
హలో గుడ్ మార్నింగ్ సర్...అని సెల్యూట్ చేసి చెప్పండి సర్ అన్నాడు కెప్టెన్.
ఎవరు వెళ్లారు అక్కడికి అని అడుగాడు. 
సర్ చరణ్ . సర్ అతన్ని ఇక్కడికి  పంపించండి. 
మాట్లాడాలి.అతన్ని నమ్మి ప్రాజెక్ట్ అప్పగించావచ్చు గా
...ఎందుకంటే ఇది సీక్రెట్ గా ,చేయాల్సిన ఆపరేషన్. 
ఏమి పరవాలేదు అండి... చరణ్ తప్పకుండా ఈ ఆపరేషన్ సక్సెస్ చేస్తాడు.
అతను వెరీ ఆరోగెంట్ అండ్ sincear... చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం..
ధైర్యం గా అతనికి అప్పచెప్పండి మొండివాడు...కోపం ఎక్కువ అది ఒక్కటే సమస్య....చాలా తెలివైనవాడు.. ఉంటాను సర్ అని ఫోన్ పెట్టేసాడు. 
నారాయణ చరణ్ ని ఒకసారి నన్ను కలవమని చెప్పు.అన్నాడు. 
అలాగే సర్ అంటూ వెళ్ళాడు. ఒరేయి అబ్బాయి పెద్దాయన నిన్ను కలవమని అన్నాడు ఒకసారి వెళ్లి రా...అంటూ చెప్పాడు... 
ఏంటి విషయం అని అడుగాడు. 
ఏమో రహస్యం ట...నీతోనే మాట్లాడాలి ట...బహుశా ని సబ్ మెరైన్ విషయం అనుకుంటా...వెళ్లి రా తెలుస్తుంది ...అన్నాడు...
నువ్వు రా నాతో అనగానే నిన్ను మాత్రమే రమ్మన్నాడు...నేనీ ఇక్కడే ఉంటా గాని నువ్వు వెళ్ళిరారా బాబు...అన్నాడు.. 
సరేలే అంటూ కెప్టెన్ కేబిన్ వైపు బయలు దేరాడు.
గుడ్ మార్నింగ్ సర్ అంటూ విష్ చేసాడు. 
వెరీ గుడ్ మార్నింగ్ చరణ్...నీవు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, 
 నీతో మాట్లాడాలని చీఫ్ అనుకుంటున్నారు. 
ఒకసారి మిలటరీ ప్రధాన కార్యాలయం కు వెళ్ళి రా..
ఇదిగో నీకు ఇచ్చిన ఆదేశ పత్రం.ఇది లేకుండా లోపలకి రానియరు... 
అంటూ కవర్ చేతిలో పెట్టారు.
అలాగే సర్... 
అన్నట్టు నారాయణ ని కూడా తీసుకు వెళ్ళు... నీకు తోడుగా ఉంటాడు.
ఏ విషయము నాకు తెలియచేయాలి  సరేనా...అన్నాడు. 
సరే సర్ నేను బయలుదేరాను...అంటూ వెళ్ళాడు.
ఎప్పుడు సిటీ కి వెళ్తా అంటూ ఉంటావు గా మరి వస్తావా మరి...బాబాయ్ అన్నాడు...
నువ్వు జోక్ లు వెయ్యకు...సెలవు ఇవ్వడు మీ శాడిస్ట్ కెప్టెన్. అన్నాడు..
సెలవు అక్కర లేదులే..ఆఫీషియల్ గానే వెళదాం అంటూ లెటర్ చూపించాడు.
మరి ఇంకెందుకు ఆలస్యం...బయలు దేరు మరి... బయట గాలులు పీల్చుకుని ఎంతకాలం అయింది. అంటూ హుషారుగా బయలుదేరారు.
మిలటరీ ప్రధాన కార్యాలయం ఉదయం8 గంటలు, చరణ్ లెటర్ చూపించాడు. 
Id చెక్ చేసి ఇంటర్ కం లో మాట్లాడారు . OK సర్ అంటూ  పెట్టేసి, 
మీరు లోపలికి వెళ్లొచ్చు అంటూ గేట్ తెరిచారు. 
చరణ్ లోపలకి వెళ్ళాడు. చీఫ్ రూమ్ దగ్గరకు వెళ్లి లెటర్ ఇచ్చాడు. 
మీ గురించి ఎదురు చూస్తున్నారు. లోపలికి వెళ్ళండి అంటూ తలుపు తెరిచాడు సార్జెంట్. 
Goodmorning సర్ అంటూ చరణ్ సెల్యూట్ చేసాడు. 
ఆ రా చరణ్ అంటూ కరచాలనం చేశారు చీఫ్. Take your seat అంటూ బెల్ కొట్టాడు. సార్జెంట్ లోపలికి రాగానే ఒక అరగంట వరకు ఎవరిని లోపలికి పంపకు.
ఆది ఎవరైనా సరే అన్నారు.
యెస్ సర్ అంటూ తలుపు వేసి బైట నుంచున్నాడు.
చెప్పండి సర్ ఎందుకు పిలిపించారు నన్ను. అని అడిగాడు. 
అక్కడీకే వస్తున్నా.నువ్వు పంపిన మెసేజ్ ,కన్నా ముందు ,
ఇక్కడ మేము చేస్తున్న ది నీకు చెప్పాలి. 
ఒక ఫేక్టరీ లో ఆయుధాలు తయారు అవుతున్నట్లు మాకు రిపోర్ట్ వచ్చింది. 
కానీ ఆ ఫ్యాక్టరీ మొదటి పది మంది ధనికులు లో ఒకరిది. 
పైకి వేరే తయారు చేస్తున్నారు. కానీ లోపల వేరే..
రైడ్ చేద్దామంటే పొలిటికల్ ప్రెషర్... అతనికి ప్రిస్టేజ్ ఇన్స్యూ. 
ఈ విషయం అతనికి తెలిసి జరుగుతోందో లేక తెలియకుండా జరుగుతోందో తెలియదు.నిరూపించలేక పోతే చాలాప్రోబ్లేమ్స్ ఎదురుకోవలసి వస్తుంది
ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయము. 
మన దేశములో తయారు అవుతుంటే మనమే తయారు చేయుస్తున్నామని ,
మిగతా దేశాలు గొడవలు చేస్తాయి. 
అసలే అణ్వాయుధాలు నిర్వీర్యం చేసే ఒప్పందానికి సంతకాలు చేసాము. 
అవి నిర్వీర్యం చేసే దశలో రెండు మిస్ ఐయ్యాయి. 
కొంతమంది ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
ని మెసేజ్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. 
అవి సబ్ మారెన్ ద్వారా వేరే ఎక్కడికో తరలించారు అని. 
ఈ ఫ్యాక్టరీ లో తయారు చేసేవి అవి ఒకే చోటుకు చేర్చి యుద్ధం సన్నాహాలు  చేస్తున్నారు.. లేదా అన్ని దేశాలలోఅలజడి మొదలు అయితే ,చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అన్నాడు. 
అవును సర్.. మరి ఈ విషయం మీద ఏమైనా ఆలోచించారా అని అడిగాడు చరణ్. అవును అక్కడికే వస్తున్నా...ఫ్యాక్టరీ విషయమై ఒక ఆఫీసర్ ని పెట్టాను.
సీక్రెట్ గా ఎవరికి తెలియదు నాకు తప్ప , 
అతను దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. 
పక్కా సాక్షాలు సేకరించిన గాని మనం ఏమి ఏక్షన్ తీసుకోలేము. 
నిన్ను ఈ ఆపరేషన్ కి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశాను. 
చాలా జాగ్రత్తగా వ్యహరించాలి. సమస్యలు పరిష్కరించాలి. 
నీ మీద పూర్తి నమ్మకం తో ఇది అప్పగిస్తున్నాను. 
థాంక్స్ సర్... తప్పకుండా ఇది నా డ్యూటీ.... ఇది నా దేశ రక్షణకు సంబంధించిన సమస్య ...దోషులను ఎట్టి పరిస్థితి లో క్షమించేది లేదు అన్నాడు.
ఇది గో ఈ ఫైల్ చూడు అతని వివరాలు , ఇంకా ఇప్పటివరకు అతను సేకరించిన వివరాలు ఉన్నాయి. 
నీకు ఏమైనా ఉపయోగిస్తుంది ఏమో... అంటూ ఫైల్ చేతిలో పెట్టాడు. 
తెరవగానే ఫోటో చూసి ఆశ్చర్యానికి గురి అయ్యాడు. 
తాను ఎవరో కాదు తన ఫ్రెండ్, ట్రైనింగ్ బాచ్ మెట్.
చిరు మందహాసం తన పెదవుల పైన విరిసింది... 
మళ్ళీ నిన్ను ఇక్కడ కలుస్తున్నా రెండేళ్ల తరువాత అనుకుంటూ ఫైల్ చదవసాగాడు.
నువ్వు ఈ విషయం లో జాగ్రత్తగా ఉండాలి. 
ఇప్పటికే ఈ మేటర్ లీక్ ఐపోయిఉంటుంది. 
ఆ ఏజెంట్ కు కూడా రిస్క్. జాగ్రత్తగా డీల్ చెయ్.
ఇదిగో ఈ వాచ్ తీసుకో.మోస్ట్ అడ్వాన్స్డ్ techonolagy... 
దీనిలో rays ఈవెన్ pendrive మీద పడినా చాలు డేటా మొత్తం కాపీ చేసేస్తుంది. 
నీకు చాలా ఉపయోగకరమైన ది. అంటూ ఆ వాచ్ ఇచ్చారు. 
థాంక్యూ సర్.. ఇంక బయలుదేరి వెళ్తాను. అంటూ సెల్యూట్ చేసి బయటకు వచ్చాడు.
అక్కడ బాబాయ్ ఎంత సేపురా బాబు ని మీటింగ్ అని ప్రశ్నించారు. 
అదంతా తరువాత చెపుతాను ముందు బయలు దేరు. 
చెల్లి ని చూసి చాలాకాలం అయింది. వాళ్ళింటికి పోదాం. 
అవును రా ఈ మధ్య అండర్ కవర్ ఆపరేషన్ లో దాని పెళ్లి కి కూడా రాలేదు.కనబడగానే చంపేస్తుంది ఏమో.... అంటూ , నవ్వుతూ కారు స్టార్ట్ చేసాడు. ఇంతకీ అబ్బాయి ఎవరు అన్నాడు.
రానా అని softwere ఇంజినీర్. మంచి కుర్రాడు. 
దాన్ని బాగా చూసుకుంటున్నాడు.చాలా నెమ్మదస్తుడు. 
పేరు ఏమిటన్నావ్ ..రానా అన్నావు కదా..ఏ ఊరు..హైదరాబాద్ కదా...అవును నీకెలా తెలుసు... బాబాయ్ మన పని ఏమిటి , మనకి తెలియని ది ఉంటుందా...అంటూ నవ్వుతూ ఉన్నాడు. 
అలా నవ్వకురా బాబు నీకు ఎలా తెలుసు ఈ విషయం... అన్నాడు.వాడు నా క్లాస్మేట్... నువ్వు అనుకుంటున్నట్లు కంప్యూటర్స్ కాదు.ఇంటర్నేషనల్ సీక్రెట్ సీఐడీ...కోడ్ ని డీకోడ్ చెయ్యడం లో ఎక్స్పర్ట్. ట్రైనింగ్ లో టాప్ రాంకేర్... రానా ప్రతాప్.. ఇదిగో ఈ ఫైల్ చూడు నీకె అర్థము అవుతుంది
నిజమే రా అబ్బాయి....ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి... అన్నాడు బాబాయ్ .
ముందు మా చెల్లెలు ఇంటికీ వెళ్ళాలి... మన డ్యూటీ మూలం గా పెళ్లికి కూడా రాలేదు. ముందు దాని కోపము తగ్గించాలి..అన్నాడు.. చరణ్. 
ముందు నువ్వు వెళ్ళు... నాకు చిన్న చిన్న పనులున్నాయి... మా ఇంటికి కూడా వెళ్లి వస్తాను. రాత్రికి వచ్చి కలుస్తాను...మరి అన్నాడు బాబాయ్.
సరే అయితే నేను వెళతాను...నువ్వు బయలుదేరు...అంటూ...తాను వెళ్ళిపోయాడు. టాక్సీ అంటూ పిలిచి అందులో బాబాయ్ వాళ్ళ ఇంటికీ వెళ్ళాడు.
చరణ్ కార్ లో కాలనీ లోకి ప్రవేశించాడు.
G. P. S. ద్వారా వాళ్ళ ఇంటి ముందుకు
వచ్చి ఆగాడు. పళ్ళ బుట్ట తో లోపలికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు.
వాణి ఎవరో బెల్ కోడుతున్నారు చూడు..అన్నాడు రానా.
ఆ ఇదిగో వెళుతున్నా...అంటూ చేస్తున్న వదిలి తలుపు తీసింది... 
ఎదురు గా చిరునవ్వు తో ...చెవులు పట్టుకుని...చరణ్..క్షమించవే....అన్నాడు.
ఒక్క సారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి...వెంటనే వచ్చి వాటేసుకుంది...అన్నయ్యా అంటూ....
ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు....ఎలా ఉన్నావురా బంగారం అన్నాడు..
బాగానే ఉన్నాను....పెళ్లికి రాలేదని చాలా కోపం వచ్చింది...అన్నది...
తప్పే రా కానీ నా వృత్తి నీకు తెలుసు గా ....ఎప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియదు...
సర్లే ముందు నువ్వు లోపలకి రా బావగారిని పరిచయం చేస్తాను..
చిరు నవ్వుతో ..సరే పద అన్నాడు....
ఇంతసేపు బైట ఎవరితో మాట్లాడుతోంది ....అనుకుంటూ ,
వాణి ఎవరు అని పిలిచాడు.... రా అన్నయ్యా ఇదిగో ఈయనే మా ఆయన రానా...
ఏదో కంపెనీ లో మార్కెటింగ్ మేనేజర్ ...ఇతను మా అన్నయ్య...డిఫెన్స్ లో పనిచేస్తాడు...
అన్నది. 
రానా అతనిని చూసాడు...చరణ్...ఓహో అయితే ప్రతి అడ్డమైన వాళ్ళని లోపలికి పిలిచేయడమేనా ....నన్ను ఏమి అడగక్కారలేదా ....నువ్వు ముందు బైటకు పోరా....అన్నాడు...
బిత్తరపోయి.. చూస్తోంది వాణి....తన భర్త కు అంతకోపం ఎప్పుడు చూడలేదు.... 
నువ్వు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి , 
ఇది ని ఇల్లు కాదు మా చెల్లెలి ఇల్లు ...నువ్వు మూసుకుని ...ఉండు అంటూ కౌగలించుకొని... 
ఎన్నాళ్లు అయింది నిన్ను చూసి...అంటూ ఆప్యాయం గా పలకరించాడు.... 
దానికి ఏమి తెలియదు...నువ్వు...అంటూ చెవిలో గోనిగాడు రానా...
నాకు అంతా తెలుసు బావా...అన్నాడు...
ఏమిటి అలా వెర్రిమొహం వేసుకుని చూస్తావ్... వీడు నా క్లాస్ మెట్..కలిసి చదువుకున్నాం....చాలాకాలం అయింది కలిసి...ఇన్నాళ్ళకి ఇలా బావలా దర్శనమిచ్చాడు...అంటూ నవ్వాడు.. 
అప్పటికి తేరుకుంది..హాడీిలి పోయాను.... మీ జోక్ కి...అంటూ ఉండు అన్నయ్య కౌఫీ తీసుకు వస్తాను..అంటూ లోపలికి వెళ్ళింది
ఎరా చరణ్ నేవీ ఎలాఉంది... ఈ మధ్య మనం కలుసుకోలేదు..
ఏంటీ సంగతి సడెన్ గా ఉడిపడ్డావ్...అంటూ అడుగాడు రానా.
నీకు తెలిసినదే... రా...నీ గురించి స్పెషల్ ఫోర్స్ కింద నన్ను పంపారు...
కౌఫీ వచ్చింది...అన్నయ్యా నువ్వు కౌఫీ తాగి తయారవ్వు..
ఈ లోపు నేను వంట చేసేస్తాను. అంటూ లోపలికి వెళ్ళింది. 
సరే తల్లి అన్నాడు చరణ్...
అది అసలు ఏమి జరిగిందంటే.అంటూ జరిగినది చెప్పుకు వచ్చాడు.
ఆ ఫైల్ నాకు ఇచ్చారు... తీరా చూస్తే ని ఫోటో ఉంది..సరిపోయింది...ఇంతకీ అండర్ కవర్ ఏజెంట్ నువ్వే నని తెలిసింది...ఇక ఇలా మీ ఇంటికి వచ్చాను.
చాలా confidential ...ఈ ఆపరేషన్ కాబట్టి ,
నీకు తెలిసిన వివరాలు చెపితే ముందుకు సాగుదాము... అన్నాడు.
అవును డేటా అంటా సేకరించాను.అదిగో ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేసాను..
ఇంకా రేపు సబ్మిట్ చెద్దాంమ నుకుంటున్నాను.అన్నాడు.
ఏది ఇలా ఇయ్యి.అంటూ పట్టుకున్నాడు. లాప్ టాప్ ఓం చెయ్ చూద్దాం....అన్నాడు చరణ్...సరే అంటూ బాగ్ తీయడానికి వెళ్ళాడు రానా.
ఇంతలో తన వాచ్ ఆన్ చేసి రే పెండ్రైవ్ మీద వేసాడు... 
అంటే డేటా అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది headquorter కి..
బాగ్ తో వచ్చాడు...ఇప్పుడు కాదులే భోజనం ఐయ్యాక చూద్దాం.... సరేనా అంటూ పెండ్రైవ్ ఇచ్చేసాడు చరణ్.
భోజనాలు ఐయ్యాయి.. వాణి మేము కొంచెం మాట్లాడుకోవాలి...నువ్వు రెస్ట్ తీసుకో....అన్నాడు రానా...
సరే...అంటూ లోపలికి వెళ్ళింది. 
ఇప్పుసు చెప్పు...అంటూ లాప్ టాప్ తెరిచాడు...
ఫ్యాక్టరీ గురించి..అందులో ఉన్నవాళ్లు గురించి... అన్ని వివరాలు సేకరించాను....
ఈ ఫైల్ రేపు సబ్మిట్ చేయబోతున్నాను...చాలా కష్టపడి సంపాదించాను వివరాలు....అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా...
గన్స్ పట్టుకుని కామెండో లు ఇంటిలోకి ప్రవేశించారు.... డోంట్ మూవ్ అంటూ గన్స్ ఎక్కుపెట్టారు...రానా చరణ్  ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.... మర్యాదగా ఆ పెండ్రైవ్ ఇచ్చేయండి లేదంటే అందరిని చంపి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అని హెచ్చరించారు..... 
ఏమి జరిగింది అంటూ బైటకు వచ్చిన వాణి ని కూడా గన్ పెట్టారు.... 
ఇచ్చేయ్ రానా...తరువాత చూలుకుండము అన్నాడు....
నో నేను ప్రాణాలకి  తెగించి ఈ వివరాలు సేకరించాను ...
ఇచ్చే ప్రసక్తి లేదు అంటూ కదల బోయాడు..... మెషిన్ గన్ ఫైర్ చేసాడు కామాండో..... అనవసరం గా ప్రాణాలు పోగొట్టు కోవద్దు.... మాకు పెన్ డ్రైవ్ కావాలి ,
అది ఇచ్చేస్తే వెళ్లిపోతాము... అన్నాడు.... 
చరణ్ ఇచ్చేయ్ నేను చెపుతున్నానుగా నా మాట విను అంటూ ,
అతని చేతిలో ఉన్న పెండ్రైవ్ ని ఇచ్చేసాడు... 
వాళ్ళు  అది తీసుకుని...ఫోన్ చేశారు... సర్ దొరికింది.... టిఆకుని వస్తున్నాము...అంటూ... వెళ్లిపోయారు...
ఎంత పని చేశావ్ చరణ్....ఆ సాక్ష్యాలతో కానీ మనం ఏ నిర్ణయం తీసుకో లేము ....
చాలా పెస్స వాళ్ళు ఈ సులో ఉన్నారు.... 
అయినా ఆ ఫేక్టరీ లోకి కాలు కూడా పెట్టలేము..ఇప్పుడు...అన్నాడు...
వాణి  ఏడుస్తూ వచ్చి వాటేసుకుంది...ఏంటండి ఇది అంతా...
ఎవరు వాళ్ళు...అని అడిగింది....ఇంక చెప్పక తప్పలేదు....తన జాబ్ గురించి...
అంత చెప్పాడు.... నువ్వు భయపడాల్సిన అవసరం లేదు...
మేము ట్రైనీడ్ ఆఫీసర్లు...సరేనా....అన్నా డు చరణ్.... 
సరే ఇప్పుడు ఏమి చేద్దాము...అని అడిగాడు...రానా....
కంగారుపడకు....నీ డేటా అంతా ప్రధాన కార్యాలయం కి పంపించాను...
అది ఎప్పుడో వెళ్ళిపోయింది....వాళ్ళు పట్టుకుని వెళ్ళింది...పెండ్రైవ్....
అందులో ఉన్నది అంతా కాపీ వెళ్ళిపోయింది.....అన్నాడు చరణ్.... 
అదెలా...అని అడిగాడు రానా....ఇదిగో ఈ వాచ్...
దీని రేస్ పడితే డేటా అంతా కాపీ చేసేస్తుంది.... ఎక్కడికైనా పంపేయచ్చు .....అర్థంఅయ్యిందా... అన్నాడు...హమ్మయ్య. 
సగం టెన్షన్ తగ్గించావు...బావ ...అంటూ కౌగలించుకున్నాడు..... 
ఇంతలో పెద్ద శబ్దం చేసుకుంటూ  F20 విమానాలు రేండు... ఇంటిముందు దిగాయి....గాలి విసిరేస్తుంది...మాటలు వినబడట్లేదు.....స్లో గా ఆగాయి... అందులోంచి ...కామాండోస్ దిగారు...
చరణ్,రానా బైటకీ వచ్చారు....సార్జెంట్ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసి సర్ అన్నాడు.
చరణ్, రానా ఇద్దరు సెల్యూట్ చేశారు.. .
హై కమాండ్ ఆర్డర్స్ సర్ అన్నాడు.  
చిరు నవ్వు నవ్వాడు...ఏంటి అది అని అడిగాడు రానా.....
నేను ఊహించినదే...మన ఇన్ఫర్మేషన్.... వాళ్ళు చదివారు...
కానీ చట్ట పరం గా  వ్యక్తుల మీదా ఏ చర్యలు తీసుకోలేము.... 
కాబట్టి.... మీ ఇన్విస్టిగేషన్ ఆపేయమని ఆర్డర్స్...అన్నాడు...
అయితే నా శ్రమ అంతా వృధా ఏనా అన్నడు రానా....చూద్దాం...
మరి మీ సంగతి ఏమిటి ఆఫీసర్... అన్నాడు... 
further instructions...మీరు ఇస్తారని చెప్పారు సర్,
అంటుండగా చరణ్ వాచ్ కి మెసేజ్ వచ్చింది.."..Report me  immediately " 
Both of you...
చరణ్ పెదవులపై చిరు నవ్వు విరిసింది... 
ఏంటి నవ్వుతావ్.. మండుతోంది ఇక్కడ అన్నాడు... కోపంగా...
ముందు పద చెపుతాను...... అంటూ   ...
రెండో విమానం పైలట్ కి మీరు వెళ్లొచ్చు... 
నేను ,రానా head quorters report cheyaali...అన్నాడు... 
ok సర్ అంటూ వెళ్ళిపోయాడు.
రానా చరణ్ ఒక విమానం లో,మిగతా వాళ్ళు ఇంకో విమానం లో బయలుదేదారు.
ఎంత కష్టపడి సాధించానో తెలుసా..
ఇప్పుడు అక్కడకి పిలిచి ఏదో చెపుతారు... 
ఏదైనా అంటే ట్రాన్స్ఫర్..  అన్నాడు రానా....
ముందు అక్కడకు వేళ్ళని ,తరువాత చూద్దాం ...అంటుండగా... 
చరణ్ కి మెసేజ్ వచ్చింది.... బీప్ బీప్ అంటూ. 
చూసాడు.... చిరునవ్వుతో... రానా ని చూసాడు... 
ఇదిగో ని frustation result.... చదువు... అన్నాడు...ఏంటి అంటూ చదివాడు
..." We received file of evidence.... collected by raana...
Even though  its not enough information to take action against...
so we are instructing both of you to report ... H.Q. immediately...
చెప్పానా....వీళ్ళు ఇంతే...
చట్టాలు... నాయకుల చుట్టాలు.... మనం ఏమి చేయలేము....అన్నాడు రానా....
వాళ్ళది వాళ్ళకుంటే మనది మనకి ఉంటుంది... 
అంటూ...Factory  వైపు బయలుదేరాడు.
అదేమిటి మనం ఇటు వెళుతున్నాం అని అడిగాడు...
మరి... వాళ్లు దేశాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ కూర్చుని ఉంటామా ....
మొత్తం లేపేస్తా...అంటూ. ఫేక్టరీ ముందు ఆగాడు ,
గాలిలో....ఒక్కనిమిషం.. ఆగి ఫైరింగ్ స్టార్ట్ చేసాడు.....
2.. నిమిషాల్లో మొత్తం పేలిపియింది..
కూల్ గా H Q వైపు బయలు దేరాడు..
ఎమ్ చేసావు రా రక్షసుడా....అని అరిచాడు... 
ఇప్పుడు ఎవడు ఏమి... చేయలేడు... ముసుకు కూర్చుంటారు... 
ఫ్యాక్టరీ ఎందుకు పేలింది అని అడిగితే...
లోపల పేలిన బాంబులు కు సమాధానం చెప్పాలి... 
ఈ విషయం ఇంతటి తో వదిలేయ్... అన్నాడు.
చీఫ్ అసలు నువ్వు చేసినది ఏంటో తెలుసా...
దూకుడు వద్దు అంటూనే ఉన్నా ...నువ్వు వినిపించుకోలేదు... 
సర్లే...అది నేను చూసుకుంటా. 
ఆ మిస్ అయిన వెపన్స్.. ఫైల్ ఇదిగో... 
మీరు ఇద్దరు జాగ్రత్తగా చేయండి... అన్నాడు.. 
యెస్ సర్ అని సెల్యూట్ చేశారు... ఆయన 
జాగ్రత్త.. ఈ దుర్మార్గుడి ని కాస్త కంట్రోల్ లో పెట్టు రానా...అంటూ 
చిరునవ్వు తో ఆప్యాయంగా భుజం మీద తట్టారు.... 
ఇద్దరూ నవ్వుకుంటూ బైటకీ వచ్చారు.
End part 1

Monday, 26 February 2018

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమ దేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
లాలించే తల్లి.. పాలించే తండ్రి..
నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ.. నీకంటి చెమ్మ..
నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే.. ఏ ఏ..
నీ కడుపులో పసివాడినే
ఏ నాడు తోడుని నీడను వీడనులే...
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
పేగే కదలగా
సీమంత మాయెలే ప్రేమ దేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ
తాతయ్య తేజం.. పెదనాన్న నైజం..
కలిసున్న పసి రూపం
నీ రాణి తనము.. నా రాచ గుణము..
ఒకటైన చిరు దీపం
పెరిగేనులే నా అంశమూ.. ఊ ఊ...
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములతో
ఎన్నో నోములే.. గత మందు నోచి ఉంట
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా
నడిచే దైవమా..
నీ పాద ధూళూలే పసుపు కుంకమలు నాకు
ఎన్నో నోములే గత మందు నోచి ఉంటా
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా

 పెదరాయుడు (1995)
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీ హర్ష
గానం : ఏసుదాస్, చిత్ర 


Saturday, 24 February 2018

ఆదర్శవంతుడు

ఆదర్శవంతుడు

అరుగు మీద పడక కుర్చీ లో కూర్చున్నారు .అప్పుడే ట్యూషన్ కి వచ్చిన పిల్లలు వెళ్లి పోయారు. కొంచెం కౌఫీ ఇస్తావు అని అడిగారు.... ఇదిగో వాళ్ళు వెళ్లడం చూసి పట్టుకుని వస్తున్నా అంటూ అందించారు. ఆ ఊరి లో మంచి పేరు ఉన్న మాస్టారు. కష్టపడి పాఠాలు చెప్పడముతో పాటు ...కొంతమంది పిల్లలకి సాయంత్రము ఉచితం గా ట్యూషన్ చెపుతూ ఉంటారు.. అందరూ  ఆయనను
గౌరవిస్తూ ఉంటారు. రాము ఆయన కొడుకు. డిగ్రీ పూర్తి చేశాడు.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.. శ్యామ్ రాము స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. శ్యాం బాగా డబ్బున్న వాళ్ళబ్బాయి. అబ్బాయి ఇంకా రాలేదా అని అడిగారు కాఫీ గ్లాసు అందుకుంటూ. ఇంకా రాలేదు వచ్చేస్తాడు... ఎక్కడో ఖాళీలు ఉన్నాయి అంటే శ్యాం తో వెళ్ళాడు..
అది గో మాటలలో నే వచ్చేసారు... అంది నవ్వుతూ.... నమస్తే మాస్టారు అంటూ పలకరించాడు శ్యాం...ఎలా ఉన్నావ్ బాబూ.... మీ నాన్నగారు ఎలా ఉన్నారు... నువ్వు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావా.. అంటూ అడిగారు. లేదండి వీడి కోసం వెళ్ళాను... నాన్నగారు షాప్ చూసుకో మంటున్నారు.. అప్పుడప్పుడు వెళుతున్నాను... కొంత కాలము తరువాత  పూర్తి గా చూసుకుంటాను అని చెప్పాను ...సరే నీ ఇష్టం అన్నారు...నాన్నగారు... అన్నాడు శ్యాం. మంచిది నాయనా ..వీడికి ఏదైనా ఉద్యోగం దొరికితే కాస్త స్థిరపడతాడు... అంతా భగవంతుని దయ....అన్నారు... ఇదిగో రా నువ్వు అడిగి న బుక్స్ అంటూ ఇచ్చాడు రాము....ఏమి పుస్తకాలు అవి అని అడిగారు. అవే నాన్నగారు ,మన ఇంటిలో పాత  పెట్టిలో ఉన్నాయి కదండీ... ఆధ్యాత్మిక పుస్తకాలు.. వీడు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాడు.. అందుకే ఇస్తున్నా అన్నాడు రాము..ఇప్పుడు అవి చదివి ఏంచేస్తావ్...నీకు సంభందించిన వి చడవచ్చు కదా ..ఉపయోగ పడతాయి.. అవి అన్ని రిటైర్ అయ్యాక చదువుదువు
గాని లే అన్నారు..లేదు అండి నేను కొన్ని పుస్తకాలనుండి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా....దానిలో కొన్ని మంత్రాలు నేర్చుకుంటే నాకు కొన్ని శక్తులు వస్తాయి  అప్పుడు నేను దేముడిని అవుతాను...అన్నాడు... అవి అన్ని విచిత్రమైన ఊహలు నాయనా . అవి ఇప్పుడు సాధ్యం కాదు.. పురాణాలలో ఉన్నవి అన్నీ చాలా సంవత్సరాలు శ్రమపడి,నిష్ఠ తో సాధించుకున్న వి ఇప్పుడు ఇంచుమించి అసాధ్యము.సరి ఐనగురువు ద్వారా నేర్చుకోవాలి..అన్నారు.అది కాదు గురువు గారూ....నాకు తెలుసు అని అన్నాడు...నీ ఇష్టం.... అని నవ్వి ఉరుకున్నారు. మరి నేను బయలుదేరి వెళతా... అంటూ వెళ్ళిపోయాడు. నాన్నగారు మీరు ఎందుకు అలా నవ్వి ఉరుకున్నారు అని అడిగాడు... వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది ...లే కొన్నాళ్లకు వాడే తెలుసుకుంటాడులే...ఇంతకి నీ ఇంటర్వ్యూ ఏమైంది అని అడిగారు...అంతాబాగానే చేసాను ...రెండు మూడు రోజుల్లో చెపుతాము అన్నారు... సరే మరి అంటూ లోపలకి వెళ్లారు. రాముకి ఉద్యోగం వచ్చింది...బాగా పని ఉండడంతో బాగా బిజీ అయిపోయాడు.. కొన్నాళ్ల తరువాత శ్యామ్ రాము ని చూడడానికి వచ్చాడు.. హాల్ లో ఉన్న మాష్టారిని చూసి నమస్తే మాస్టారు అంటూ పలకరించాడు... ఏమయ్యా శ్యామ్ బొత్తిగా కనబడడము మానేశావ్..ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం అని అడిగారు...మీరు చెప్పినది నిజమే అండి..దేముడు అవ్వాలంటే చాల కష్టమైన పద్ధతి... అనవసరం గా చాలా సమయం వృధా చేసాను...అంటూ ప్రక్కన కూర్చున్నాడు...ఆయన ఏమోయ్ మన శ్యాం కి కాఫీ పట్టుకుని రా ...అని చెప్పారు.
ఆవిడ కాఫీ కప్ తో వస్తూ... ఏమయ్యా శ్యాం... ఈ మధ్య బొత్తిగా నల్లపూస ఐపోయావ్ ,మమ్మలిని మరిచిపోయావా ...అంటూ పలకరించారు... చిరునవ్వుతో...
..ఆ ఈమధ్య కొంచెం బిజీ గా ఉన్నాడు...ఏవేవో ప్రయోగాలు చేస్తున్నాడు... అన్నారు.... ఉరుకోండి గురువుగారు... మీరు మరీనూ....ఏదో చిన్నతనం ....తెలిసి తెలియని చేష్టలు....ఇంక ఆ విషయం మరచిపోండి.... సుబ్బరంగా వ్యాపారం మీద శ్రద్ధ పెట్టదలిచాను , కాఫీ చాలా బాగుంది  ఆంటి... థాంక్స్ ....అండి.. అన్నాడు....
నువ్వు దేముడు అవ్వాలంటే నేను చెప్పినట్టు చెయ్...అప్పుడు నువ్వు
నిజం గా భగవంతుడివి అవుతావు అన్నారు.చెప్పండి ఏదైనా చేయడానికి నేను సిద్ధం . అన్నాడు. అది కష్టమైన పని కాదులే...ఎలాగూ సంపాదిస్తున్నావు, కొంత డబ్బు  కష్టాలలో ఉన్నవారికి చేతనైన సహాయము చెయ్....అప్పుడు చూడు.అందరూ నీలో దేముడిని చూస్తారు ....అన్నారు..
సరే మీరు చెప్పినట్టే చెస్తా..ఇంక నేను బయలుదేరతా అండి..అంటూ ..ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టి..అన్నట్టు గురువు గారు మిమ్మలిని ఒకటి అడగాలి అని వచ్చాను . అడుగు బాబు ఏమిటి అది అన్నారు... నేను వ్యాపారము చూసుకొంటున్నాను ..నాకు నమ్మకమైన సహాయకుడు కావాలి....చిన్నప్పటి నుంచి వాడు నేను కలిసి చదువుకున్నాము...వాడికి అక్కడ జీతం కన్నా ఎక్కువ వస్తుంది మా కంపెనీ లో....నాకు తోడుగా ఉంటాడు...వాడిని అడిగి తే మిమ్మలని అడగమన్నాడు... మీరు సరే నంటే ...వాడు సరే అంటాడు...అన్నాడు.... దానికేముంది నాకు ఏమి అభ్యంతరం లేదు వాడికి ఏది నచ్చితే అది చేయమంటూ ఉంటాను... వాడికి ఇష్టమైతే నాకు ఏమి అభ్యంతరం లేదు... ఎక్కడ అయినా కష్టపడి పని చేయాలి ...మంచి పేరు  సంపాదించుకోవాలి...అదే నేను కోరుకునేది.... థాంక్స్ అండి నేను వస్తాను మరి అంటూ ...బయలుదేరి వెళ్ళాడు..ఇంటి దగ్గర గుమాస్తా నాన్న గారిని...తన కూతురి పెళ్ళి...విషయంలో కొంత డబ్బు తగ్గింది అని ...సహాయం చెయ్యమని అడుగుతున్నాడు...నాన్న లేదని చెప్పేసారు...ఆయన విచారం గావెనుతిరిగారు...శ్యామ్ ఆయన దగ్గరకి వెళ్ళి ఏమైంది అండి...అని అడిగాడు...డబ్బు సర్దుబాటు కాలేదు బాబు... ఇప్పుడు తన కూతురి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది..
..నా న్నగారిని  అడిగితే ఇప్పటికే లొను తీసుకున్నావుగా ఇంకా లోను అంటే జీతం కట్టింగ్ కె సరిపోతుంది ఇంకా ఏమి తింటావ్ ...కుదరదు అని ...చెప్పారు..ఆయన చెప్పినది సబబే.. కానీ నా పరిస్థితి.. మంచి సంభందం.. బాధ్యత తీరితే... అమ్మాయి గట్టు ఎక్కేస్తుంది...ఆతర్వాత....ఏదో..
ఉన్నదాంట్లో తినవచ్చు...అనుకుంటున్నాను అన్నాడు...శ్యాం కి .అప్పుడు మాష్టారి మాటలు గుర్తుకు వచ్చాయి...సరే నేను మీకు డబ్బు ఏర్పాటు చేస్తాను మీరు బాధపడకండి..రేవు వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అది మరి నాన్నగారు...అంటూ ఆగాడు..అవి అన్ని నేను చూసుకుంటాను... మీరు వచ్చి డబ్బు తీసుకోండి అన్నాడు శ్యాం....చాలా ధన్యవాదాలు బాబు అన్నారు... మీరు మా కంపెనీ లో ఇన్నాళ్లుగా పనిచేస్తున్నారు... మీకు ఈ సహాయం అప్పుగా కాదు మా బాధ్యత గా ఇస్తున్నాను....పెళ్లి బాగా జరిపించండి అన్నాడు శ్యాం..మరునాడు ఆ డబ్బు తీసుకుని వెళ్లారు...శుభలేఖల తో కలిశారు...శ్యామ్ ని ...నమస్తే బాబు సమయానికి దేముడు లా సాయము చేశారు..మీ దయ వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు జరుగు తున్నాయి.. మొదటి శుభలేఖ మీకు ఇవ్వడానికి వచ్చాను...మీరు తప్పకుండా పెళ్లికి వచ్చి బిడ్డల్ని ఆశీర్వదించాలి .అని అడిగారు...అప్పుడు ఆయన కళ్ళలో వెలుగు...ఆద్రత ....కృతజ్ఞతా భావం ...అతనికి కనిపించాయి...మనసంతా ఏదో తెలియని ఆనందం తో నిండిపోయింది...అప్పుడే అర్ధమైంది....తనకి.మాష్టారి మాటల్లో అర్థం..అది అనుభవిస్తే గానీ తెలియదు...సరే అండి.. మీరు వెళ్లి రండి అన్నాడు.ఆయన నమస్కారము పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి  నుండి ఆ ఊరిలో ఎవరికి కష్టము వచ్చినా తనకి తోచిన విధము గా చేయడం మొదలు. పెట్టాడు.ఒకరోజు శ్యాం దగ్గరకి ఒక ఆయన వచ్చి తన పరిస్థితి వివరించి, తన బిడ్డ చదువుకు సహాయం చేయమని అర్ధించాడు. అలాగే చేస్తా ఎంత అవుతుంది అని అడిగాడు శ్యాం..ప్రైవేట్ స్కూలు, ఫీజులు వివరాలు చెప్పాడు. రామ్ ని పిలిచి ఒరేయ్ ఈ విషయం లో ఆయనకు కావలిసింది చెయ్.....కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాస్టర్స్ అందరూ క్వాలిఫైడ్ కదా మరి ఎందుకు,పిల్లలు అందులో చదువట్లేదు అని అడిగాడు.శ్యాం.. ప్రస్తుత పరిస్థితి వివరించాడు రామ్..అంత ఫీజులు స్పాన్సర్ చేసి కొంతమందిని మాత్రమే చదివించే కన్నా ,ప్రభుత్వ పాఠశాల దత్తతకు తీసుకుని బాగు చేస్తే, అందరికి మంచి చదువు అందించవచ్చు కదా అని రామ్ అన్నాడు.ఈ ఆలోచన నచ్చింది...రామ్, మనం  ఇలాగే , ప్రొసీడ్ అవుదాం...మనము చేసే మంచి కొంత మందికే కాకుండా అంతమందికి చేరాలి. అన్నాడు. ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి , వాటిని ప్రైవేట్ స్కూల్స్ తో సమానం గా తీర్చి దిద్ది, ఉన్నత మైన విద్యా ప్రామాణాలు అందించేలా ఏర్పాటు చేసేడు...దానితో ఫీజు లు కట్టలేని ప్రజలు తమపిల్లని కార్పొరేట్ స్కూల్ లెవెల్ లో చదివించే అవకాశం దొరికింది అని కొనియాడారు. అనతి కాలం లొనే ఊర్లో మంచి పేరు సంపాదించాడు....శ్యామ్ గారు దేముడు లాంటి మనిషి అంటూ అందరూ గౌరవించడం మోదలుపెట్టారు.వయసు తో పాటు మానసిక పరిపూర్ణత రావడం తో శ్యామ్ అది తన గొప్పతనం కాదని తనకి తాను పడిన కష్టానికి ఫలితము  భగవంతుడు ఇచ్చాడు...దానితో,ఉన్నదాంట్లో కొంచెం ఇలా పదిమందికి సాయము చేసే అవాకాశం దొరికిందని వినమ్రంగా  చెపుతూఉంటాడు....శక్తులు సంపాదించి అందరి తో దేముడు అనిపించుకునే కన్నా ,అందరి లో ఒకడు గా అందరికి సాయం చేస్తూ దేముడు అనిపించుకోవడమే బెస్ట్ అని తన ఆలోచలని మార్చుకున్నాడు. అలా మార్చిన తన మాష్టారుకి మనసులొనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనలో దేముడు అనిపించుకోవాలని తపన పోయినా ,  ఆ ఊరి ప్రజలు మాత్రం అతనిని కనిపించే దేముడు గానే కొలుస్తున్నారు.... మాస్టారు తన శిష్యుడు ఇంత గొప్పవాడు అయ్యాడని మనసులోనే పొంగిపోయారు.....

Saturday, 17 February 2018

మన్యం లో " పులి " కథ


మన్యం లో " పులి " కథ 
ఈ దారి లో వెడితే తొందరగా అడవి దాటొచ్చు అనుకున్నాను కానీ తప్పు చేశా నెమో అనిపిస్తోంది...ఇప్పుడు ముందుకి వెళ్లాడమే ,తప్పదు ,అనుకుంటూ,
అతడు నెమ్మది గా అడుగు లో అడుగు వేసుకుని నడుస్తున్నాడు.వీరబాబు ..చిమ్మ చీకటి... అసలే అడవి వెన్నెల వెలుగు కూడా పడట్లేదు ....చేతిలో 
లాంతరు వెలుగు తప్ప ఇంకేమి కనిపించట్లేదు. భయం భయం గా  అడుగులు వేస్తున్నాడు. అడుగుల శబ్దం అతనికే వినిపిస్తోంది.కీచు రాళ్లు చప్పుడు భయాంకరం గా ఉంది..ఊ అంటూ...
.నక్క ల ఊళలు , మరింత భయాన్ని పెంచుతున్నాయి ...అతని అడుగుల కుఆకులు నలిగి కిర్ కిర్ మని చప్పుడు చేస్తున్నాయి. ఒక రకమైన  భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం....అడుగుల చప్పుడు తప్ప ఇంకేమి విన్పించట్లేదు .అంతలో ఏదో పరుగెత్తి మీదకి వస్తున్నట్లు నట్లు శబ్దం వినిపించింది..ఒళ్ళంతా ఝల్లుమంది.  అంతే ఆగి పోయాడు.... వచ్చేసింది పులి అని ఇంక అయిపోయింది అంతా అనుకున్నాడు. నెమ్మది గా అడుగుల శబ్దం  తన వైపు కె వస్తోంది....వచ్చేసింది... వచ్చేసింది ...మీద పడిపోతోంది అనుకుని ...భయం భయం గా చూస్తున్నాడు.... లాంతర్ వెలుగు లో కనిపించింది ...ముళ్ల పంది..... పరిగేట్టుకుంటూ..ప్రక్కనించి ..వెళ్లి పోయింది...దాని వెనకే నక్క ...పరిగెత్తింది... హమ్మయ్య ...అనుకుంటూ... ముందుకు వడి వడి. గా నడువసాగాడు....కొంత దూరం ప్రయాణించిన తరువాత....ఇంకో ఐదు నిమిషాలలో అడవి దాటేస్తా ను ఇంక ఏ భయం ఉండదు....ఇంకెప్పుడు ఈ దారిలో రాకూడదు అనుకున్నాడు.....వీరబాబు..
ఇంతలో హఠాత్తుగా , చెట్ల మీద పక్షులు అరుస్తూ ఎగిరాయి... రెక్కల రెపరెపల 
శబ్దం ,కీచు కీచు మని భయంకరంగా 
అరుస్తున్నాయి ...,ఏదో ప్రమాదం రాబోతోంది అని..సంకేతం .....అతనికి తల లోనించి  చెంప మీదుగా ...చెమట చుక్క కారడం మొదలు పెట్టింది...అతనికి తెలిసి పోయింది  ... అక్కడే పులి ఉందని, అడుగుల వేగం పెంచాడు .....హటాత్తుగా , చెట్టు చాటు నుండి మెరిసే కళ్ళని చూసాడు స్థాణువు లా నిలబడి పోయాడు.భారీగా అడుగు వేసుకుంటూ ఠీవీగా అతని ముందుకి వచ్చేసింది....గాండ్రిస్తూ...గుర్రు గుర్రు మని శబ్దం వస్తోంది దాని నొట్లొనించి...
అతని ముందు కూర్చుంది... స్థాణువు లా నిలబడిపోయాడు... అతనిని 
చూస్తోంది. రెప్ప పాటు కాలం లో  పరిగెత్తి చెట్టు ఎక్కాలనుకున్నాడు. 
కదాలగానే... ఒక్క ఉదుటున ఎగిరి ....ఒడిసి పట్టేస్తుంది. 
ఏమి  చేయాలో అర్థం కావట్లేదు....వళ్ళంతా చెమటలు పట్టేశాయి...పులి.... అక్కడే.....అలాగే  కూర్చుంది...తీక్షణంగా చూస్తోంది... చేతిలో లాంతరు ఉంది అని గుర్తుకు వచ్చింది.. కింద ఎండి పోయిన పుల్లలు పడి ఉన్నాయి..అవి వెలిగిస్తే ఆ మంట కి బెదరవచ్చు అనుకుంటూ... ఉండగా ..అంతలో...పులి... లేచింది ..అడుగు వెనక్కి  వేసింది..అంటే ఇంక దూకేస్తుంది అన్నమాట....ఈ లోపు మంట ..వెలిగించాలి.. అనుకుని.. నెమ్మది గా పుల్లలని కాలితో తోసాడు... 
లాంతరు మూత తీసి పుల్లల మీద పడేసాడు..పులి ముందుకి అడుగు ముందుకి వేసింది... మీదకి ఉరకడానికి ఎగిరింది.... కానీ లాంతరు , కిరోసిన్ ఆయిల్ ,వల్ల మంటలు రేగి..ఒక్కసారిగా పైకి ....ఎగిసాయి.త ల మీద రెండు చేతులు అడ్డుగా పెట్టుకుని కింద కూర్చుండి పోయాడు.. పులి  ఆ మంటలను తప్పించుకుని ,అతన్ని దాటుకుని మీదనుంచి వెనకే వస్తున్న దుప్పి మీదకు దూకి,  దాన్ని ఒడిసి 
పట్టుకుని ...అడవి లోకి  లాక్కుని వెళ్ళిపోయింది....ఒక్క క్షణం ఏమి జరిగిందో 
అర్థం కాలేదు.... మళ్ళీ వస్తుంది ఏమో నని
మంట పెద్దది చేసి ...సంచి లో నీళ్లు తీసుకుని గడగడా తాగేసాడు.... అప్పుడు తేరుకున్నాడు.... వెనకాల దుప్పి వచ్చింది కాబట్టి బతికి పోయాను.... లేదంటే... 
ఇంతే సంగతులు అనుకుంటూ... మంటని...ఆర్పేసి.... వేగం గా అడవి దాటేసాడు....    ఇల్లు చేరుకుని....హమ్మయ్య...అనుకున్నాడు.... ఊరి వాళ్ళకి ఈ విషయం  చెప్పాలి....అనుకున్నాడు.... ఇంతలో అతని భార్య వచ్చింది ..ఏమయ్యా ఇంత ఆలస్యం అయింది.... అంటూ పలకరించింది... సంత లో ఆలస్యం ఐయ్యింది లే...అంటూ లోపలికి నడిచాడు....రాజు
‌ పులిని వేటాడడము లో బాగా ప్రావీణ్యము కలిగినవాడు... అందుకే రాజు కు ఈ విషయం చెప్పాలి
అనుకు న్నాడు .మరునాడు పొద్దున్నే రాజు ఇంటికి వెళ్ళాడు. రా రా  వీరబాబు పొద్దున్నే ఇలా వచ్చావు , ఏమిటి సంగతి అని అడిగాడు.రాజు భార్య ఇద్దరే ఉంటారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తల్లి తండ్రులు దగ్గరకి రానివ్వలేదు... 
అందుకే దూరం గా వచ్చి ఆ గ్రామం లో వ్యవసాయం చేస్తూ జీవనం 
సాగిస్తున్నాడు. అది అసలు ఏమి జరిగిందంటే అంటూ ముందు రోజు జరిగినది అంతా చెప్పాడు...వీరబాబు అయితే మళ్ళీ కొత్త పులి మన ఏరియా లోకి వచ్చింది అన్నమాట...మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి... ఊళ్ళో చెప్పాలి... జాగ్రత్తగా 
ఉండాలి అని...చీకటి వేళలో...ఎవరూ అడవి లోకి వెళ్లద్దు అని చెప్పాలి  
అన్నాడు..రాజు... అలాగే ..నేను ఊరి వాళ్ళను తీసుకుని వస్తాను ఈ లోగా నువ్వు రచ్చ బండ దగ్గరకి వచ్చేయి... అంటూ బయలుదేరాడు వీరబాబు... రాజు ఆరోజు ఊరి వాళ్ళందరిని సమావేశ పరిచి...జాగ్రత్తలు చెప్పాడు... భయపడాల్సిన అవసరం లేదని నేను చూసుకుంటాను అని చెప్పాడు... పులి ని తరమడానికి డప్పులు, కాగడాలు... బరిసే  లు సిద్ధం చేసుకున్నారు....రాజు ఇంటికి చేరుకోగానే...ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తే ...లోపల ఏమిటా అని చూసాడు...అక్కడ చిన్న పులి పిల్ల గోడవారగా ఉంది..భయం భయం గా చూస్తోంది... ఆకలి మీద ఉన్నట్టుంది... కొంచెం చిన్నగా మూలుగు తోంది... రాజు కి చాలా ముచ్చట వేసింది... ఇదన్న మాట ..సంగతి... .ఈ పిల్లకోసం అది ఊళ్ళోకి వచ్చినా వచ్చేస్తుంది...ఇది దారి తప్పి ఇలా వచ్చేసింది....ముందు దీనికి పాలు పోసి 
చూస్తా...అనుకుని..పళ్లెంలో పాలు పోసి దాని ముందుకు తోసాడు.....అది 
భయంగా చూసి...ఆకలి తో ఉండడం తో పాలు దగ్గరకు వచ్చి తాగడం మొదలు పెట్టింది...తాగేసి ములకి వెళ్లి పడుకుంది. నవ్వుకుని దానిని అలాగే వదిలేసి...వంట కార్యక్రమం మొదలు పెట్టాడు...భార్య నెల తప్పడం తో  పురి టికీ పుట్టింటికి వెళ్ళింది... మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు...ఇంక నీ తోనే 
కాలక్షేపం...మా బాబు వచ్చే సరికి...నిన్ను బహుమతి గా 
ఇస్తాను..అనుకున్నాడు......రాత్రి కూడా కొంచెం అన్నం పాలలో వేసి పళ్లెం దాని ముందు పెట్టి దా తిను అంటూ పిలిచాడు...అది నెమ్మదిగా వచ్చి తినడం మొదలు పెట్టింది.రాజుకుడా వడ్డించుకుని తినడమ్ మొదలు పెట్టాడు.తినేసి మళ్ళీ మళ్ళీ రాజు ని చూడడం మొదలుపెట్టింది.కొంచెం కొంచెం అన్నం వేసాడు పళ్ళెంలో. అదికూడా తింది..., ములకి వెళ్లికూర్చుంది.. ఒక గిన్నె లో నీళ్లు పోసి ఆ ప్రక్కనే ఉంచి... .రాజు చాప వేసుకుని పక్క  సర్దుకుని....నిద్రకి ఉపక్రమించాడు... ఓ రాత్రి వేళ కాళ్ళకి మెత్తగా తగిలింది ఏమిటని చూస్తే కాళ్ళ దగ్గర ముడుచుకొని పడుకొంది... దానిని పక్కలో పడుకోపెట్టుకున్నాడు దుప్పటి కప్పి .....అలా రోజూ అలవాటు అయిపోయింది....ఎక్కడ ఉన్నా రాజు పక్కలో కి వచ్చేస్తుంది....

...చూసి నవ్వుకుని వదిలేసాడు... మరునాడూ పాలుపోసి బైటకు 
వెళ్ళాడు...అతను వచ్చే సరికి ...తోక ఊపుకుంటూ వచ్చి కాళ్ళ లో కి దూరిి..ఆడడము మొదలు పెట్టింది..అలా అలవాటు అయ్యింది....ఒకరోజు తల్లి తన పిల్ల కోసం ఉరిలోకి వచ్చేసింది... ముందే చెప్పి ఉంచడం వలన ...ఊరి వాళ్ళు దాన్ని తరిమేసారు... రెండు సార్లు ప్రయత్నించి అది అడవిలోకి వెళ్ళిపోయింది....కొన్నాళ్లకు పులి  పిల్ల పెద్దది అవుతుంది.  పెంపుడు జంతువు 
లాగా పెరుగుతుంది...చాలా ప్రేమగా చూసుకుంటాడు రాజు...ఒకరోజు

రాజు స్నేహితుడు అతని ఇంటికి వచ్చాడు .చూడడానికి....బాబు పుట్టాడు అని తెలిసి.....ఎరా రాజు  చెల్లెమ్మ ఇంకా రాలేదా...అని  అడిగాడు...ఈమధ్యనే బాబు పుట్టాడుగా మూడునెలల తరువాత పంపిస్తానన్నారు...మా మావగారు...ఇన్నాళ్లకు కోపాలు పోయి అందరూ కలిశారు ...సరే మీ ఇష్టము అలాగే  మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపండి...మధ్యలో నేను వచ్చి చూసి వెళుతూ ఉంటాను....అన్నాను ...పొలం పనులు కూడా ఉన్నాయి గా..పైగా ఇది కూడా బాగా అలవాటు అయింది.... నేను పెట్టక పోతే తిండి కూడా 
తినదు.....ఒకవేళ వెళ్లినా పొద్దున్నే వెళ్లి రాత్రికి వచేస్తున్న....నువ్వు ఒకపని  చెయ్ ఈ రాత్రి కి ఇక్కడే ఉండు...పొద్దునే వెళ్లుదువు గానిలే.. అసలే అడవి.....చీకటి పడుతోంది , నువ్వు కూరలు...తరుగు తూ ఉండు....నేను ఇప్పుడే వస్తాను....బిరియాని సరుకులు తెస్తాను, బిర్యానీ చేసుకుందాం  అన్నాడు.... సరే... నేను తరుగుతూ ఉంటా నువ్వు త్వరగా వచేయరా బాబు ...అన్నాడు..ఇంకేమి దొరకలేదా దీనిని పెంచుతున్నావు నాకు భయము గా ఉంది అన్నాడు. ఏమి ఫరవాలేదు లే అది నిన్ను ఏమి చేయదు కంగారు పడకు..వెంటనే 
వచేస్తాలే అంటూ పులికేసి తిరిగి ఇక్కడే పడుకో, ఎక్కడికి వెళ్లకు అని దాని 
తలమీద నిమిరి బైటకు వెళ్ళాడు. పులి అక్కడే పడుకుని వుంది.... కూరలు తరుగుతూ ఉండగా, అది అవులిస్తూ ఒకసారి గాండ్రించింది...భయం తో ఉలిక్కి పడ్డాడు...కంగారులో,పొరపాటున చెయ్యి కోసుకు పోఇంది.. ఒక్కసారి అబ్బా అంటూ బాధగా చెయ్యి విదిల్చాడు... ఆ చేతికి కారుతూ ఉన్న రక్తం పులి మొఖం మీద పడింది..గబగబా .. చేతికి తుండు కట్టుకున్నాడు..... పులి ముఖం మీద పడ్డ దానిని నాలిక తో నాకి తుడుచు కుంది.. ఒక్కసారి దానికి రుచి మెదడుకి ఎక్కేసింది. మెల్లగా ..లేచి వచ్చి కిందపడ్డ చుక్క లని నాకింది..... రుచి మరిగింది...
 అతని దగ్గరకి వచ్చి చేతిని వాసన చూసి నోటితో పెట్టేసింది ...అది మాన్ ఈటర్ గా మారిపోయింది.... వాడు అరుస్తూ...కర్రతో ఒక్కటి కొట్టాడు అయినా 
.వదలలేదు....పంజా తో ఒక్కటి వేసింది.. అప్పుడే వస్తున్న రాజు  అతడి అరుపులు విని పరిగెత్తుకు లోపలికి వచ్చాడు..అప్పటికే ... అతని చేతిని సగం తినేసింది. రాజు గన్ తీసి షూట్ చేసాడు.... చేతిని వదిలేసి అడవి లోకి పారిపోయింది..దానిని ఎంతో ప్రేమతో పెంచుకున్నాను... కానీ అది ఇప్పుడు ఇలా మారిపోయింది... అంటూ నిట్టూర్చాడు రాజు... తప్పదు రాజు అది ఇప్పుడు ప్రమాదకరం గా మారిపోయింది... అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం... ఎంతమందిని చంపుతుందో తెలియదు... నువ్వు తక్షణం నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నాను... అన్నాడు గ్రామ పెద్ద.... అతడికి వైద్యం చేయించి ,ఊరి ప్రజలు అందరూసమావేశమై ...అది ప్రమాదకరం గా మారిపోయింది... కనుక చంపేయాలి.. అని నిర్ణయానికి వచ్చారు.దానిని ఎంత ప్రేమ తో పెంచుకున్నా దానివలన సమాజానికి హానికరమని 
..రాజు కి ఇష్టం లేకపోయినా... తప్పనిసరి పరిస్థితులలో మాటు వేసి 
చంపేసాడు..అచేతనము గా పడి  ఉన్న దానిని ,ప్రేమగా దానిని తల మీద ఒకసారి నిమిరి నీళ్లు నిండిన కళ్ళను తుడుచుకుంటూ ఊరి వైపు నడిచాడు.....

Thursday, 15 February 2018

డబ్బు సంపాదించడము ఎలా ? కొన్ని సూచనలు

 డబ్బు సంపాదించడము ఎలా  ? కొన్ని సూచనలు .....

1. అవకాశము ఎందుకు లేదు ?
2. ఉన్న పరిస్థితులను అవకాశము గా మార్చు కోవడానికి ఏమి చేయాలి ?
3. ఒక అవకాశమును సృష్టించు కోవాలి అంటే యెంత ఖర్చు అవుతుంది ?
4. అర్ధిముకము గా , కాలము ,మానసికముగా  అంటే  సరి ఐన మనుష్యు ల సహాయము తీసుకుంటే నో 
    ఆర్ధిక వనరులు సమీకరించుకుంటే నో , ఒక కాలాన్ని మరియు గమ్యాన్ని నిర్దేశించుకుంటేనో 
    ఈ అవకాశము సృష్టించ బడుతుందా  ?
5. కొంతమంది బీద స్థితి నుంచి , అత్యున్నస్థితి  కి వచ్చి ,ధనవంతులు అవగలిగితే , నేను 
   వాళ్లలో ఒకడిగా ఉండడానికి  నన్ను వెనక్కి లాగుతున్న పరిస్థితులు ఏమిటి ?
6. వాళ్లలో ఉన్నది నాలో లేనిది ఏమిటి ?
7. నా జీవితము ఈ క్షణము నుండి , పునః నిర్మించుకోవాలంటే ,
    దానికి నాకు ఎదురు ఐయ్యే అడ్డంకులు  ఏమిటి?
8. ఏమి చేయకుండా  ఉండేకన్నా , ఏదో ఒకటి ప్రారంభిస్తే ఇప్పటినస్థితి కన్నా కొంచెం బాగుపడే 
    అవకాశం    లేదా ?
9. నిర్మాణాత్మకమైన కుతూహలము అంటే ఇదే 
10. ఆ కుతూహలము తో ఇవాళే పని ప్రారంభిస్తే సంవత్సరము తిరిగే సరికల్లా డబ్బుని ఎలా 
     మేనేజ్ చేయాలో తెలియని స్థితి వచ్చేస్తుంది . 

Sunday, 4 February 2018

స్నేహితులని గెలవడము ఎలా...కొన్ని సూచనలు

స్నేహితులని గెలవడము ఎలా...కొన్ని సూచనలు
1 ముఖాముఖి :
ఎదుటివారి వైపు కేవలం ముఖమే కాకుండా మొత్తం శరీరం తిప్పడము వలన
నేను శ్రద్ధగా వింటున్నాను అనే భావన కలుగుతుంది.
2. కుతూహలం :
ముందుకు కూర్చుని వినడము వలన,
శ్రద్ధగా వినడమే కాదు నేను అర్థము చేసుకుంటున్నాను అనే భావనను కలుగ చేస్తుంది.
3. కళ్ళు:
అవతలి వ్యక్తి ముఖ్యమైన విషయం చెపుతున్నప్పుడు కళ్ళలోకి చూస్తూ చెపితే ,అలాగే మనము చెపుతున్నప్పుడు కూడా అలా కళ్ళలోకి చూస్తూ చెపితే విషయం అతని మనసులోకి వెళుతుంది.... దీనినే
" Eye to Eye Contact " అంటారు.
4.ముఖ భంగిమ:
అవతలి వారు మాట్లాడే విషయం లో ఉన్న భావాన్ని బట్టి భంగిమ లను మారుస్తూ ఉండాలి.ముఖము లో ఏ భావము ప్రకటించకుండా ఉంటే అతనితో సంభాషణ ఆసక్తికరం గా ఉండదు.
5. మాట్లాడడము:
మాట్లాడవలిసి నప్పుడు మాట్లాడలేక పోవడం Introversion అంటారు
ఎక్కువగా మాట్లాడే వారిని  Extravert అంటారు
అవసరం అయిన అప్పుడు మాత్రమే మాట్లాడే వారిని Reserved  అంటారు.
అవతలి వారు స్వభావాన్ని బట్టి మన స్వభావాము మార్చుకోవాలి.ఇద్దరి దీ ఒకే టైప్ అయితే సంభాషణ ఆసక్తికరం గా ఉండదు...
6.తల ఊపడము :
అవసరమైనప్పుడు తల ఊపుతూ ఔనా
మీరు చెప్పేది కరెక్ట్ , నాకు అర్థం కావట్లేదు అనే మాటలు ...అవతలి వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి.
7.ప్రతిస్పందన:
ఎప్పటివరకు మౌనం గా ఉండాలి ,ఎప్పుడు మాట్లాడాలి ,ఎంత మాట్లాడాలి అన్నావిషయాల మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి.
8. అవతలి వారి కి ఇష్టమైన విషయం మీద మాట్లాడితే అవగాహన బాగుంటుంది
అలాగే స్వరం ఎప్పుడు పెంచాలి..ఎప్పుడు తగ్గించాలి అన్న విషయం స్పష్టము గా ఉండాలి.
9. అవతలి వారిని ఎంతసేపు మాట్లాడనిచ్చి మనం ప్రారంభించాలి అనేది మనకు తెలియాలి.
10.మీరు సరిగ్గా చెప్పట్లేదు అనే మాటకన్నా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అన్న ప్రయోగం బాగుంటుంది.
11.గొప్పవాళ్ళు వ్యూహాలు గురించి మధ్యములు సంఘటన ల గురించి అధములు వ్యక్తుల గురించి       మాట్లాడతారు. గొప్ప వాళ్ళు సంభాషణ ల వలన వాళ్ళు...నేర్చుకుంటారు... లేదా నేర్పుతారు...
12. దురాశ పరుడైన   వ్యక్తిని... ...  .ధనముతోనూ
మొండి ఘటాలను ... అభినందనాలతోను
అవివేకి ని .......  హాస్యము తోనూ
పండితుని ని..... నిజము తోనూ
జయించవచ్చు...

Thursday, 1 February 2018

విజయం లభిం చాలంటే



విజయం లభిం చాలంటే
                                                       
 విజయం లభిం చాలంటే
గమ్యం తెలియక, నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.
అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో, లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు
విముక్తిని ప్రసాదించి,
విజయ శిఖరాలను అధిరోహింపచేస్తుంది.
మనిషికి విజయం లభిం చాలంటే అనుమానాన్ని దూరం చేసుకోవాలి.
ఒక పనిని ఎలా చేయాలా అని రకరకాలుగా ఆలోచించడం వేరు ,
రకరకాల అనుమానాలతో బాధ పాడడం వేరు .
అనుమానం వలన భయమ కలుగుతుంది .
అనుమానం వలన సందిగ్దత ఏర్పడుతుంది .
విసుగు వేస్తుంది .
ఆందోళన ఏర్పడుతుంది.
తర్ఖం ,ధైర్యము  అనేవిరెండు భయాన్ని ఎదుర్కొనగలిగే ఆయుధాలు.
టెన్షన్ అనే పురుగు ని ,చంపడానికి మందు exposer.
వివిధ వ్యక్తులను , కలుసుకోవడము
రకరకాల ప్రదేశాలు తిరగడం ,
వేదికలు ఎక్కి  మాట్లాడడము మొదలైనవి ....