Sunday, 11 March 2018

నెమలికి నేర్పిన నడకలివి

నెమలికి నేర్పిన నడకలివి
సప్తపది
Music: K.V.Mahadevan
Lyrics: Veturi
Singer: Janaki

 నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
 నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
 నెమలికి నేర్పిన నడకలివి 

కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
కలిసిమెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన
మల్ప శిల్ప మణి మేఖలను శకుంతలను
 నెమలికి నేర్పిన నడకలివి

చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనా
లేఖ్య సరస సౌందర్యరేఖను శశిరేఖను
  నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల

మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
 అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన  ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...

No comments:

Post a Comment