మౌన రాగాలే పలికినవి,
మౌన రాగాలే పలికినవి,
అనురాగ దీపాలే వెలిగినవి,
ఈ రాగమే అనురాగమై
ఓ ప్రేమా
నా మనసున వెలుగే నింపినవి
సంధ్య పొద్దుల్లో కనిపించే సింధూరం
నీ నుదుటన దిద్దాలని,
వాలుపొద్దుల్లో వెంటచ్చే నీడల్లే,
జన్మంతా నీతో నడవాలని
ఆశ పడుతున్నా అనురాగ దేవతా
కొంగు ముడి వేసే వరమీయవా
ఇన్నాళ్లు అనుకున్నా
నేనంటే నేనే నని
ఈనాడే తెలిసింది నేనంటే నువ్వెనని
నీ నువ్వే నా ఊపిరి అని , నువ్వు లేకుంటే అది ఆడదని
మాటే ఇస్తున్నా మల్లికా,
మనువే ఆడమని.


