Monday, 26 February 2018

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమ దేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
లాలించే తల్లి.. పాలించే తండ్రి..
నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ.. నీకంటి చెమ్మ..
నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే.. ఏ ఏ..
నీ కడుపులో పసివాడినే
ఏ నాడు తోడుని నీడను వీడనులే...
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
పేగే కదలగా
సీమంత మాయెలే ప్రేమ దేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ
తాతయ్య తేజం.. పెదనాన్న నైజం..
కలిసున్న పసి రూపం
నీ రాణి తనము.. నా రాచ గుణము..
ఒకటైన చిరు దీపం
పెరిగేనులే నా అంశమూ.. ఊ ఊ...
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములతో
ఎన్నో నోములే.. గత మందు నోచి ఉంట
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా
నడిచే దైవమా..
నీ పాద ధూళూలే పసుపు కుంకమలు నాకు
ఎన్నో నోములే గత మందు నోచి ఉంటా
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా

 పెదరాయుడు (1995)
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీ హర్ష
గానం : ఏసుదాస్, చిత్ర 


Saturday, 24 February 2018

ఆదర్శవంతుడు

ఆదర్శవంతుడు

అరుగు మీద పడక కుర్చీ లో కూర్చున్నారు .అప్పుడే ట్యూషన్ కి వచ్చిన పిల్లలు వెళ్లి పోయారు. కొంచెం కౌఫీ ఇస్తావు అని అడిగారు.... ఇదిగో వాళ్ళు వెళ్లడం చూసి పట్టుకుని వస్తున్నా అంటూ అందించారు. ఆ ఊరి లో మంచి పేరు ఉన్న మాస్టారు. కష్టపడి పాఠాలు చెప్పడముతో పాటు ...కొంతమంది పిల్లలకి సాయంత్రము ఉచితం గా ట్యూషన్ చెపుతూ ఉంటారు.. అందరూ  ఆయనను
గౌరవిస్తూ ఉంటారు. రాము ఆయన కొడుకు. డిగ్రీ పూర్తి చేశాడు.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.. శ్యామ్ రాము స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. శ్యాం బాగా డబ్బున్న వాళ్ళబ్బాయి. అబ్బాయి ఇంకా రాలేదా అని అడిగారు కాఫీ గ్లాసు అందుకుంటూ. ఇంకా రాలేదు వచ్చేస్తాడు... ఎక్కడో ఖాళీలు ఉన్నాయి అంటే శ్యాం తో వెళ్ళాడు..
అది గో మాటలలో నే వచ్చేసారు... అంది నవ్వుతూ.... నమస్తే మాస్టారు అంటూ పలకరించాడు శ్యాం...ఎలా ఉన్నావ్ బాబూ.... మీ నాన్నగారు ఎలా ఉన్నారు... నువ్వు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావా.. అంటూ అడిగారు. లేదండి వీడి కోసం వెళ్ళాను... నాన్నగారు షాప్ చూసుకో మంటున్నారు.. అప్పుడప్పుడు వెళుతున్నాను... కొంత కాలము తరువాత  పూర్తి గా చూసుకుంటాను అని చెప్పాను ...సరే నీ ఇష్టం అన్నారు...నాన్నగారు... అన్నాడు శ్యాం. మంచిది నాయనా ..వీడికి ఏదైనా ఉద్యోగం దొరికితే కాస్త స్థిరపడతాడు... అంతా భగవంతుని దయ....అన్నారు... ఇదిగో రా నువ్వు అడిగి న బుక్స్ అంటూ ఇచ్చాడు రాము....ఏమి పుస్తకాలు అవి అని అడిగారు. అవే నాన్నగారు ,మన ఇంటిలో పాత  పెట్టిలో ఉన్నాయి కదండీ... ఆధ్యాత్మిక పుస్తకాలు.. వీడు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాడు.. అందుకే ఇస్తున్నా అన్నాడు రాము..ఇప్పుడు అవి చదివి ఏంచేస్తావ్...నీకు సంభందించిన వి చడవచ్చు కదా ..ఉపయోగ పడతాయి.. అవి అన్ని రిటైర్ అయ్యాక చదువుదువు
గాని లే అన్నారు..లేదు అండి నేను కొన్ని పుస్తకాలనుండి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా....దానిలో కొన్ని మంత్రాలు నేర్చుకుంటే నాకు కొన్ని శక్తులు వస్తాయి  అప్పుడు నేను దేముడిని అవుతాను...అన్నాడు... అవి అన్ని విచిత్రమైన ఊహలు నాయనా . అవి ఇప్పుడు సాధ్యం కాదు.. పురాణాలలో ఉన్నవి అన్నీ చాలా సంవత్సరాలు శ్రమపడి,నిష్ఠ తో సాధించుకున్న వి ఇప్పుడు ఇంచుమించి అసాధ్యము.సరి ఐనగురువు ద్వారా నేర్చుకోవాలి..అన్నారు.అది కాదు గురువు గారూ....నాకు తెలుసు అని అన్నాడు...నీ ఇష్టం.... అని నవ్వి ఉరుకున్నారు. మరి నేను బయలుదేరి వెళతా... అంటూ వెళ్ళిపోయాడు. నాన్నగారు మీరు ఎందుకు అలా నవ్వి ఉరుకున్నారు అని అడిగాడు... వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది ...లే కొన్నాళ్లకు వాడే తెలుసుకుంటాడులే...ఇంతకి నీ ఇంటర్వ్యూ ఏమైంది అని అడిగారు...అంతాబాగానే చేసాను ...రెండు మూడు రోజుల్లో చెపుతాము అన్నారు... సరే మరి అంటూ లోపలకి వెళ్లారు. రాముకి ఉద్యోగం వచ్చింది...బాగా పని ఉండడంతో బాగా బిజీ అయిపోయాడు.. కొన్నాళ్ల తరువాత శ్యామ్ రాము ని చూడడానికి వచ్చాడు.. హాల్ లో ఉన్న మాష్టారిని చూసి నమస్తే మాస్టారు అంటూ పలకరించాడు... ఏమయ్యా శ్యామ్ బొత్తిగా కనబడడము మానేశావ్..ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం అని అడిగారు...మీరు చెప్పినది నిజమే అండి..దేముడు అవ్వాలంటే చాల కష్టమైన పద్ధతి... అనవసరం గా చాలా సమయం వృధా చేసాను...అంటూ ప్రక్కన కూర్చున్నాడు...ఆయన ఏమోయ్ మన శ్యాం కి కాఫీ పట్టుకుని రా ...అని చెప్పారు.
ఆవిడ కాఫీ కప్ తో వస్తూ... ఏమయ్యా శ్యాం... ఈ మధ్య బొత్తిగా నల్లపూస ఐపోయావ్ ,మమ్మలిని మరిచిపోయావా ...అంటూ పలకరించారు... చిరునవ్వుతో...
..ఆ ఈమధ్య కొంచెం బిజీ గా ఉన్నాడు...ఏవేవో ప్రయోగాలు చేస్తున్నాడు... అన్నారు.... ఉరుకోండి గురువుగారు... మీరు మరీనూ....ఏదో చిన్నతనం ....తెలిసి తెలియని చేష్టలు....ఇంక ఆ విషయం మరచిపోండి.... సుబ్బరంగా వ్యాపారం మీద శ్రద్ధ పెట్టదలిచాను , కాఫీ చాలా బాగుంది  ఆంటి... థాంక్స్ ....అండి.. అన్నాడు....
నువ్వు దేముడు అవ్వాలంటే నేను చెప్పినట్టు చెయ్...అప్పుడు నువ్వు
నిజం గా భగవంతుడివి అవుతావు అన్నారు.చెప్పండి ఏదైనా చేయడానికి నేను సిద్ధం . అన్నాడు. అది కష్టమైన పని కాదులే...ఎలాగూ సంపాదిస్తున్నావు, కొంత డబ్బు  కష్టాలలో ఉన్నవారికి చేతనైన సహాయము చెయ్....అప్పుడు చూడు.అందరూ నీలో దేముడిని చూస్తారు ....అన్నారు..
సరే మీరు చెప్పినట్టే చెస్తా..ఇంక నేను బయలుదేరతా అండి..అంటూ ..ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టి..అన్నట్టు గురువు గారు మిమ్మలిని ఒకటి అడగాలి అని వచ్చాను . అడుగు బాబు ఏమిటి అది అన్నారు... నేను వ్యాపారము చూసుకొంటున్నాను ..నాకు నమ్మకమైన సహాయకుడు కావాలి....చిన్నప్పటి నుంచి వాడు నేను కలిసి చదువుకున్నాము...వాడికి అక్కడ జీతం కన్నా ఎక్కువ వస్తుంది మా కంపెనీ లో....నాకు తోడుగా ఉంటాడు...వాడిని అడిగి తే మిమ్మలని అడగమన్నాడు... మీరు సరే నంటే ...వాడు సరే అంటాడు...అన్నాడు.... దానికేముంది నాకు ఏమి అభ్యంతరం లేదు వాడికి ఏది నచ్చితే అది చేయమంటూ ఉంటాను... వాడికి ఇష్టమైతే నాకు ఏమి అభ్యంతరం లేదు... ఎక్కడ అయినా కష్టపడి పని చేయాలి ...మంచి పేరు  సంపాదించుకోవాలి...అదే నేను కోరుకునేది.... థాంక్స్ అండి నేను వస్తాను మరి అంటూ ...బయలుదేరి వెళ్ళాడు..ఇంటి దగ్గర గుమాస్తా నాన్న గారిని...తన కూతురి పెళ్ళి...విషయంలో కొంత డబ్బు తగ్గింది అని ...సహాయం చెయ్యమని అడుగుతున్నాడు...నాన్న లేదని చెప్పేసారు...ఆయన విచారం గావెనుతిరిగారు...శ్యామ్ ఆయన దగ్గరకి వెళ్ళి ఏమైంది అండి...అని అడిగాడు...డబ్బు సర్దుబాటు కాలేదు బాబు... ఇప్పుడు తన కూతురి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది..
..నా న్నగారిని  అడిగితే ఇప్పటికే లొను తీసుకున్నావుగా ఇంకా లోను అంటే జీతం కట్టింగ్ కె సరిపోతుంది ఇంకా ఏమి తింటావ్ ...కుదరదు అని ...చెప్పారు..ఆయన చెప్పినది సబబే.. కానీ నా పరిస్థితి.. మంచి సంభందం.. బాధ్యత తీరితే... అమ్మాయి గట్టు ఎక్కేస్తుంది...ఆతర్వాత....ఏదో..
ఉన్నదాంట్లో తినవచ్చు...అనుకుంటున్నాను అన్నాడు...శ్యాం కి .అప్పుడు మాష్టారి మాటలు గుర్తుకు వచ్చాయి...సరే నేను మీకు డబ్బు ఏర్పాటు చేస్తాను మీరు బాధపడకండి..రేవు వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అది మరి నాన్నగారు...అంటూ ఆగాడు..అవి అన్ని నేను చూసుకుంటాను... మీరు వచ్చి డబ్బు తీసుకోండి అన్నాడు శ్యాం....చాలా ధన్యవాదాలు బాబు అన్నారు... మీరు మా కంపెనీ లో ఇన్నాళ్లుగా పనిచేస్తున్నారు... మీకు ఈ సహాయం అప్పుగా కాదు మా బాధ్యత గా ఇస్తున్నాను....పెళ్లి బాగా జరిపించండి అన్నాడు శ్యాం..మరునాడు ఆ డబ్బు తీసుకుని వెళ్లారు...శుభలేఖల తో కలిశారు...శ్యామ్ ని ...నమస్తే బాబు సమయానికి దేముడు లా సాయము చేశారు..మీ దయ వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు జరుగు తున్నాయి.. మొదటి శుభలేఖ మీకు ఇవ్వడానికి వచ్చాను...మీరు తప్పకుండా పెళ్లికి వచ్చి బిడ్డల్ని ఆశీర్వదించాలి .అని అడిగారు...అప్పుడు ఆయన కళ్ళలో వెలుగు...ఆద్రత ....కృతజ్ఞతా భావం ...అతనికి కనిపించాయి...మనసంతా ఏదో తెలియని ఆనందం తో నిండిపోయింది...అప్పుడే అర్ధమైంది....తనకి.మాష్టారి మాటల్లో అర్థం..అది అనుభవిస్తే గానీ తెలియదు...సరే అండి.. మీరు వెళ్లి రండి అన్నాడు.ఆయన నమస్కారము పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి  నుండి ఆ ఊరిలో ఎవరికి కష్టము వచ్చినా తనకి తోచిన విధము గా చేయడం మొదలు. పెట్టాడు.ఒకరోజు శ్యాం దగ్గరకి ఒక ఆయన వచ్చి తన పరిస్థితి వివరించి, తన బిడ్డ చదువుకు సహాయం చేయమని అర్ధించాడు. అలాగే చేస్తా ఎంత అవుతుంది అని అడిగాడు శ్యాం..ప్రైవేట్ స్కూలు, ఫీజులు వివరాలు చెప్పాడు. రామ్ ని పిలిచి ఒరేయ్ ఈ విషయం లో ఆయనకు కావలిసింది చెయ్.....కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాస్టర్స్ అందరూ క్వాలిఫైడ్ కదా మరి ఎందుకు,పిల్లలు అందులో చదువట్లేదు అని అడిగాడు.శ్యాం.. ప్రస్తుత పరిస్థితి వివరించాడు రామ్..అంత ఫీజులు స్పాన్సర్ చేసి కొంతమందిని మాత్రమే చదివించే కన్నా ,ప్రభుత్వ పాఠశాల దత్తతకు తీసుకుని బాగు చేస్తే, అందరికి మంచి చదువు అందించవచ్చు కదా అని రామ్ అన్నాడు.ఈ ఆలోచన నచ్చింది...రామ్, మనం  ఇలాగే , ప్రొసీడ్ అవుదాం...మనము చేసే మంచి కొంత మందికే కాకుండా అంతమందికి చేరాలి. అన్నాడు. ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి , వాటిని ప్రైవేట్ స్కూల్స్ తో సమానం గా తీర్చి దిద్ది, ఉన్నత మైన విద్యా ప్రామాణాలు అందించేలా ఏర్పాటు చేసేడు...దానితో ఫీజు లు కట్టలేని ప్రజలు తమపిల్లని కార్పొరేట్ స్కూల్ లెవెల్ లో చదివించే అవకాశం దొరికింది అని కొనియాడారు. అనతి కాలం లొనే ఊర్లో మంచి పేరు సంపాదించాడు....శ్యామ్ గారు దేముడు లాంటి మనిషి అంటూ అందరూ గౌరవించడం మోదలుపెట్టారు.వయసు తో పాటు మానసిక పరిపూర్ణత రావడం తో శ్యామ్ అది తన గొప్పతనం కాదని తనకి తాను పడిన కష్టానికి ఫలితము  భగవంతుడు ఇచ్చాడు...దానితో,ఉన్నదాంట్లో కొంచెం ఇలా పదిమందికి సాయము చేసే అవాకాశం దొరికిందని వినమ్రంగా  చెపుతూఉంటాడు....శక్తులు సంపాదించి అందరి తో దేముడు అనిపించుకునే కన్నా ,అందరి లో ఒకడు గా అందరికి సాయం చేస్తూ దేముడు అనిపించుకోవడమే బెస్ట్ అని తన ఆలోచలని మార్చుకున్నాడు. అలా మార్చిన తన మాష్టారుకి మనసులొనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనలో దేముడు అనిపించుకోవాలని తపన పోయినా ,  ఆ ఊరి ప్రజలు మాత్రం అతనిని కనిపించే దేముడు గానే కొలుస్తున్నారు.... మాస్టారు తన శిష్యుడు ఇంత గొప్పవాడు అయ్యాడని మనసులోనే పొంగిపోయారు.....

Saturday, 17 February 2018

మన్యం లో " పులి " కథ


మన్యం లో " పులి " కథ 
ఈ దారి లో వెడితే తొందరగా అడవి దాటొచ్చు అనుకున్నాను కానీ తప్పు చేశా నెమో అనిపిస్తోంది...ఇప్పుడు ముందుకి వెళ్లాడమే ,తప్పదు ,అనుకుంటూ,
అతడు నెమ్మది గా అడుగు లో అడుగు వేసుకుని నడుస్తున్నాడు.వీరబాబు ..చిమ్మ చీకటి... అసలే అడవి వెన్నెల వెలుగు కూడా పడట్లేదు ....చేతిలో 
లాంతరు వెలుగు తప్ప ఇంకేమి కనిపించట్లేదు. భయం భయం గా  అడుగులు వేస్తున్నాడు. అడుగుల శబ్దం అతనికే వినిపిస్తోంది.కీచు రాళ్లు చప్పుడు భయాంకరం గా ఉంది..ఊ అంటూ...
.నక్క ల ఊళలు , మరింత భయాన్ని పెంచుతున్నాయి ...అతని అడుగుల కుఆకులు నలిగి కిర్ కిర్ మని చప్పుడు చేస్తున్నాయి. ఒక రకమైన  భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం....అడుగుల చప్పుడు తప్ప ఇంకేమి విన్పించట్లేదు .అంతలో ఏదో పరుగెత్తి మీదకి వస్తున్నట్లు నట్లు శబ్దం వినిపించింది..ఒళ్ళంతా ఝల్లుమంది.  అంతే ఆగి పోయాడు.... వచ్చేసింది పులి అని ఇంక అయిపోయింది అంతా అనుకున్నాడు. నెమ్మది గా అడుగుల శబ్దం  తన వైపు కె వస్తోంది....వచ్చేసింది... వచ్చేసింది ...మీద పడిపోతోంది అనుకుని ...భయం భయం గా చూస్తున్నాడు.... లాంతర్ వెలుగు లో కనిపించింది ...ముళ్ల పంది..... పరిగేట్టుకుంటూ..ప్రక్కనించి ..వెళ్లి పోయింది...దాని వెనకే నక్క ...పరిగెత్తింది... హమ్మయ్య ...అనుకుంటూ... ముందుకు వడి వడి. గా నడువసాగాడు....కొంత దూరం ప్రయాణించిన తరువాత....ఇంకో ఐదు నిమిషాలలో అడవి దాటేస్తా ను ఇంక ఏ భయం ఉండదు....ఇంకెప్పుడు ఈ దారిలో రాకూడదు అనుకున్నాడు.....వీరబాబు..
ఇంతలో హఠాత్తుగా , చెట్ల మీద పక్షులు అరుస్తూ ఎగిరాయి... రెక్కల రెపరెపల 
శబ్దం ,కీచు కీచు మని భయంకరంగా 
అరుస్తున్నాయి ...,ఏదో ప్రమాదం రాబోతోంది అని..సంకేతం .....అతనికి తల లోనించి  చెంప మీదుగా ...చెమట చుక్క కారడం మొదలు పెట్టింది...అతనికి తెలిసి పోయింది  ... అక్కడే పులి ఉందని, అడుగుల వేగం పెంచాడు .....హటాత్తుగా , చెట్టు చాటు నుండి మెరిసే కళ్ళని చూసాడు స్థాణువు లా నిలబడి పోయాడు.భారీగా అడుగు వేసుకుంటూ ఠీవీగా అతని ముందుకి వచ్చేసింది....గాండ్రిస్తూ...గుర్రు గుర్రు మని శబ్దం వస్తోంది దాని నొట్లొనించి...
అతని ముందు కూర్చుంది... స్థాణువు లా నిలబడిపోయాడు... అతనిని 
చూస్తోంది. రెప్ప పాటు కాలం లో  పరిగెత్తి చెట్టు ఎక్కాలనుకున్నాడు. 
కదాలగానే... ఒక్క ఉదుటున ఎగిరి ....ఒడిసి పట్టేస్తుంది. 
ఏమి  చేయాలో అర్థం కావట్లేదు....వళ్ళంతా చెమటలు పట్టేశాయి...పులి.... అక్కడే.....అలాగే  కూర్చుంది...తీక్షణంగా చూస్తోంది... చేతిలో లాంతరు ఉంది అని గుర్తుకు వచ్చింది.. కింద ఎండి పోయిన పుల్లలు పడి ఉన్నాయి..అవి వెలిగిస్తే ఆ మంట కి బెదరవచ్చు అనుకుంటూ... ఉండగా ..అంతలో...పులి... లేచింది ..అడుగు వెనక్కి  వేసింది..అంటే ఇంక దూకేస్తుంది అన్నమాట....ఈ లోపు మంట ..వెలిగించాలి.. అనుకుని.. నెమ్మది గా పుల్లలని కాలితో తోసాడు... 
లాంతరు మూత తీసి పుల్లల మీద పడేసాడు..పులి ముందుకి అడుగు ముందుకి వేసింది... మీదకి ఉరకడానికి ఎగిరింది.... కానీ లాంతరు , కిరోసిన్ ఆయిల్ ,వల్ల మంటలు రేగి..ఒక్కసారిగా పైకి ....ఎగిసాయి.త ల మీద రెండు చేతులు అడ్డుగా పెట్టుకుని కింద కూర్చుండి పోయాడు.. పులి  ఆ మంటలను తప్పించుకుని ,అతన్ని దాటుకుని మీదనుంచి వెనకే వస్తున్న దుప్పి మీదకు దూకి,  దాన్ని ఒడిసి 
పట్టుకుని ...అడవి లోకి  లాక్కుని వెళ్ళిపోయింది....ఒక్క క్షణం ఏమి జరిగిందో 
అర్థం కాలేదు.... మళ్ళీ వస్తుంది ఏమో నని
మంట పెద్దది చేసి ...సంచి లో నీళ్లు తీసుకుని గడగడా తాగేసాడు.... అప్పుడు తేరుకున్నాడు.... వెనకాల దుప్పి వచ్చింది కాబట్టి బతికి పోయాను.... లేదంటే... 
ఇంతే సంగతులు అనుకుంటూ... మంటని...ఆర్పేసి.... వేగం గా అడవి దాటేసాడు....    ఇల్లు చేరుకుని....హమ్మయ్య...అనుకున్నాడు.... ఊరి వాళ్ళకి ఈ విషయం  చెప్పాలి....అనుకున్నాడు.... ఇంతలో అతని భార్య వచ్చింది ..ఏమయ్యా ఇంత ఆలస్యం అయింది.... అంటూ పలకరించింది... సంత లో ఆలస్యం ఐయ్యింది లే...అంటూ లోపలికి నడిచాడు....రాజు
‌ పులిని వేటాడడము లో బాగా ప్రావీణ్యము కలిగినవాడు... అందుకే రాజు కు ఈ విషయం చెప్పాలి
అనుకు న్నాడు .మరునాడు పొద్దున్నే రాజు ఇంటికి వెళ్ళాడు. రా రా  వీరబాబు పొద్దున్నే ఇలా వచ్చావు , ఏమిటి సంగతి అని అడిగాడు.రాజు భార్య ఇద్దరే ఉంటారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తల్లి తండ్రులు దగ్గరకి రానివ్వలేదు... 
అందుకే దూరం గా వచ్చి ఆ గ్రామం లో వ్యవసాయం చేస్తూ జీవనం 
సాగిస్తున్నాడు. అది అసలు ఏమి జరిగిందంటే అంటూ ముందు రోజు జరిగినది అంతా చెప్పాడు...వీరబాబు అయితే మళ్ళీ కొత్త పులి మన ఏరియా లోకి వచ్చింది అన్నమాట...మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి... ఊళ్ళో చెప్పాలి... జాగ్రత్తగా 
ఉండాలి అని...చీకటి వేళలో...ఎవరూ అడవి లోకి వెళ్లద్దు అని చెప్పాలి  
అన్నాడు..రాజు... అలాగే ..నేను ఊరి వాళ్ళను తీసుకుని వస్తాను ఈ లోగా నువ్వు రచ్చ బండ దగ్గరకి వచ్చేయి... అంటూ బయలుదేరాడు వీరబాబు... రాజు ఆరోజు ఊరి వాళ్ళందరిని సమావేశ పరిచి...జాగ్రత్తలు చెప్పాడు... భయపడాల్సిన అవసరం లేదని నేను చూసుకుంటాను అని చెప్పాడు... పులి ని తరమడానికి డప్పులు, కాగడాలు... బరిసే  లు సిద్ధం చేసుకున్నారు....రాజు ఇంటికి చేరుకోగానే...ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తే ...లోపల ఏమిటా అని చూసాడు...అక్కడ చిన్న పులి పిల్ల గోడవారగా ఉంది..భయం భయం గా చూస్తోంది... ఆకలి మీద ఉన్నట్టుంది... కొంచెం చిన్నగా మూలుగు తోంది... రాజు కి చాలా ముచ్చట వేసింది... ఇదన్న మాట ..సంగతి... .ఈ పిల్లకోసం అది ఊళ్ళోకి వచ్చినా వచ్చేస్తుంది...ఇది దారి తప్పి ఇలా వచ్చేసింది....ముందు దీనికి పాలు పోసి 
చూస్తా...అనుకుని..పళ్లెంలో పాలు పోసి దాని ముందుకు తోసాడు.....అది 
భయంగా చూసి...ఆకలి తో ఉండడం తో పాలు దగ్గరకు వచ్చి తాగడం మొదలు పెట్టింది...తాగేసి ములకి వెళ్లి పడుకుంది. నవ్వుకుని దానిని అలాగే వదిలేసి...వంట కార్యక్రమం మొదలు పెట్టాడు...భార్య నెల తప్పడం తో  పురి టికీ పుట్టింటికి వెళ్ళింది... మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు...ఇంక నీ తోనే 
కాలక్షేపం...మా బాబు వచ్చే సరికి...నిన్ను బహుమతి గా 
ఇస్తాను..అనుకున్నాడు......రాత్రి కూడా కొంచెం అన్నం పాలలో వేసి పళ్లెం దాని ముందు పెట్టి దా తిను అంటూ పిలిచాడు...అది నెమ్మదిగా వచ్చి తినడం మొదలు పెట్టింది.రాజుకుడా వడ్డించుకుని తినడమ్ మొదలు పెట్టాడు.తినేసి మళ్ళీ మళ్ళీ రాజు ని చూడడం మొదలుపెట్టింది.కొంచెం కొంచెం అన్నం వేసాడు పళ్ళెంలో. అదికూడా తింది..., ములకి వెళ్లికూర్చుంది.. ఒక గిన్నె లో నీళ్లు పోసి ఆ ప్రక్కనే ఉంచి... .రాజు చాప వేసుకుని పక్క  సర్దుకుని....నిద్రకి ఉపక్రమించాడు... ఓ రాత్రి వేళ కాళ్ళకి మెత్తగా తగిలింది ఏమిటని చూస్తే కాళ్ళ దగ్గర ముడుచుకొని పడుకొంది... దానిని పక్కలో పడుకోపెట్టుకున్నాడు దుప్పటి కప్పి .....అలా రోజూ అలవాటు అయిపోయింది....ఎక్కడ ఉన్నా రాజు పక్కలో కి వచ్చేస్తుంది....

...చూసి నవ్వుకుని వదిలేసాడు... మరునాడూ పాలుపోసి బైటకు 
వెళ్ళాడు...అతను వచ్చే సరికి ...తోక ఊపుకుంటూ వచ్చి కాళ్ళ లో కి దూరిి..ఆడడము మొదలు పెట్టింది..అలా అలవాటు అయ్యింది....ఒకరోజు తల్లి తన పిల్ల కోసం ఉరిలోకి వచ్చేసింది... ముందే చెప్పి ఉంచడం వలన ...ఊరి వాళ్ళు దాన్ని తరిమేసారు... రెండు సార్లు ప్రయత్నించి అది అడవిలోకి వెళ్ళిపోయింది....కొన్నాళ్లకు పులి  పిల్ల పెద్దది అవుతుంది.  పెంపుడు జంతువు 
లాగా పెరుగుతుంది...చాలా ప్రేమగా చూసుకుంటాడు రాజు...ఒకరోజు

రాజు స్నేహితుడు అతని ఇంటికి వచ్చాడు .చూడడానికి....బాబు పుట్టాడు అని తెలిసి.....ఎరా రాజు  చెల్లెమ్మ ఇంకా రాలేదా...అని  అడిగాడు...ఈమధ్యనే బాబు పుట్టాడుగా మూడునెలల తరువాత పంపిస్తానన్నారు...మా మావగారు...ఇన్నాళ్లకు కోపాలు పోయి అందరూ కలిశారు ...సరే మీ ఇష్టము అలాగే  మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపండి...మధ్యలో నేను వచ్చి చూసి వెళుతూ ఉంటాను....అన్నాను ...పొలం పనులు కూడా ఉన్నాయి గా..పైగా ఇది కూడా బాగా అలవాటు అయింది.... నేను పెట్టక పోతే తిండి కూడా 
తినదు.....ఒకవేళ వెళ్లినా పొద్దున్నే వెళ్లి రాత్రికి వచేస్తున్న....నువ్వు ఒకపని  చెయ్ ఈ రాత్రి కి ఇక్కడే ఉండు...పొద్దునే వెళ్లుదువు గానిలే.. అసలే అడవి.....చీకటి పడుతోంది , నువ్వు కూరలు...తరుగు తూ ఉండు....నేను ఇప్పుడే వస్తాను....బిరియాని సరుకులు తెస్తాను, బిర్యానీ చేసుకుందాం  అన్నాడు.... సరే... నేను తరుగుతూ ఉంటా నువ్వు త్వరగా వచేయరా బాబు ...అన్నాడు..ఇంకేమి దొరకలేదా దీనిని పెంచుతున్నావు నాకు భయము గా ఉంది అన్నాడు. ఏమి ఫరవాలేదు లే అది నిన్ను ఏమి చేయదు కంగారు పడకు..వెంటనే 
వచేస్తాలే అంటూ పులికేసి తిరిగి ఇక్కడే పడుకో, ఎక్కడికి వెళ్లకు అని దాని 
తలమీద నిమిరి బైటకు వెళ్ళాడు. పులి అక్కడే పడుకుని వుంది.... కూరలు తరుగుతూ ఉండగా, అది అవులిస్తూ ఒకసారి గాండ్రించింది...భయం తో ఉలిక్కి పడ్డాడు...కంగారులో,పొరపాటున చెయ్యి కోసుకు పోఇంది.. ఒక్కసారి అబ్బా అంటూ బాధగా చెయ్యి విదిల్చాడు... ఆ చేతికి కారుతూ ఉన్న రక్తం పులి మొఖం మీద పడింది..గబగబా .. చేతికి తుండు కట్టుకున్నాడు..... పులి ముఖం మీద పడ్డ దానిని నాలిక తో నాకి తుడుచు కుంది.. ఒక్కసారి దానికి రుచి మెదడుకి ఎక్కేసింది. మెల్లగా ..లేచి వచ్చి కిందపడ్డ చుక్క లని నాకింది..... రుచి మరిగింది...
 అతని దగ్గరకి వచ్చి చేతిని వాసన చూసి నోటితో పెట్టేసింది ...అది మాన్ ఈటర్ గా మారిపోయింది.... వాడు అరుస్తూ...కర్రతో ఒక్కటి కొట్టాడు అయినా 
.వదలలేదు....పంజా తో ఒక్కటి వేసింది.. అప్పుడే వస్తున్న రాజు  అతడి అరుపులు విని పరిగెత్తుకు లోపలికి వచ్చాడు..అప్పటికే ... అతని చేతిని సగం తినేసింది. రాజు గన్ తీసి షూట్ చేసాడు.... చేతిని వదిలేసి అడవి లోకి పారిపోయింది..దానిని ఎంతో ప్రేమతో పెంచుకున్నాను... కానీ అది ఇప్పుడు ఇలా మారిపోయింది... అంటూ నిట్టూర్చాడు రాజు... తప్పదు రాజు అది ఇప్పుడు ప్రమాదకరం గా మారిపోయింది... అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం... ఎంతమందిని చంపుతుందో తెలియదు... నువ్వు తక్షణం నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నాను... అన్నాడు గ్రామ పెద్ద.... అతడికి వైద్యం చేయించి ,ఊరి ప్రజలు అందరూసమావేశమై ...అది ప్రమాదకరం గా మారిపోయింది... కనుక చంపేయాలి.. అని నిర్ణయానికి వచ్చారు.దానిని ఎంత ప్రేమ తో పెంచుకున్నా దానివలన సమాజానికి హానికరమని 
..రాజు కి ఇష్టం లేకపోయినా... తప్పనిసరి పరిస్థితులలో మాటు వేసి 
చంపేసాడు..అచేతనము గా పడి  ఉన్న దానిని ,ప్రేమగా దానిని తల మీద ఒకసారి నిమిరి నీళ్లు నిండిన కళ్ళను తుడుచుకుంటూ ఊరి వైపు నడిచాడు.....

Thursday, 15 February 2018

డబ్బు సంపాదించడము ఎలా ? కొన్ని సూచనలు

 డబ్బు సంపాదించడము ఎలా  ? కొన్ని సూచనలు .....

1. అవకాశము ఎందుకు లేదు ?
2. ఉన్న పరిస్థితులను అవకాశము గా మార్చు కోవడానికి ఏమి చేయాలి ?
3. ఒక అవకాశమును సృష్టించు కోవాలి అంటే యెంత ఖర్చు అవుతుంది ?
4. అర్ధిముకము గా , కాలము ,మానసికముగా  అంటే  సరి ఐన మనుష్యు ల సహాయము తీసుకుంటే నో 
    ఆర్ధిక వనరులు సమీకరించుకుంటే నో , ఒక కాలాన్ని మరియు గమ్యాన్ని నిర్దేశించుకుంటేనో 
    ఈ అవకాశము సృష్టించ బడుతుందా  ?
5. కొంతమంది బీద స్థితి నుంచి , అత్యున్నస్థితి  కి వచ్చి ,ధనవంతులు అవగలిగితే , నేను 
   వాళ్లలో ఒకడిగా ఉండడానికి  నన్ను వెనక్కి లాగుతున్న పరిస్థితులు ఏమిటి ?
6. వాళ్లలో ఉన్నది నాలో లేనిది ఏమిటి ?
7. నా జీవితము ఈ క్షణము నుండి , పునః నిర్మించుకోవాలంటే ,
    దానికి నాకు ఎదురు ఐయ్యే అడ్డంకులు  ఏమిటి?
8. ఏమి చేయకుండా  ఉండేకన్నా , ఏదో ఒకటి ప్రారంభిస్తే ఇప్పటినస్థితి కన్నా కొంచెం బాగుపడే 
    అవకాశం    లేదా ?
9. నిర్మాణాత్మకమైన కుతూహలము అంటే ఇదే 
10. ఆ కుతూహలము తో ఇవాళే పని ప్రారంభిస్తే సంవత్సరము తిరిగే సరికల్లా డబ్బుని ఎలా 
     మేనేజ్ చేయాలో తెలియని స్థితి వచ్చేస్తుంది . 

Sunday, 4 February 2018

స్నేహితులని గెలవడము ఎలా...కొన్ని సూచనలు

స్నేహితులని గెలవడము ఎలా...కొన్ని సూచనలు
1 ముఖాముఖి :
ఎదుటివారి వైపు కేవలం ముఖమే కాకుండా మొత్తం శరీరం తిప్పడము వలన
నేను శ్రద్ధగా వింటున్నాను అనే భావన కలుగుతుంది.
2. కుతూహలం :
ముందుకు కూర్చుని వినడము వలన,
శ్రద్ధగా వినడమే కాదు నేను అర్థము చేసుకుంటున్నాను అనే భావనను కలుగ చేస్తుంది.
3. కళ్ళు:
అవతలి వ్యక్తి ముఖ్యమైన విషయం చెపుతున్నప్పుడు కళ్ళలోకి చూస్తూ చెపితే ,అలాగే మనము చెపుతున్నప్పుడు కూడా అలా కళ్ళలోకి చూస్తూ చెపితే విషయం అతని మనసులోకి వెళుతుంది.... దీనినే
" Eye to Eye Contact " అంటారు.
4.ముఖ భంగిమ:
అవతలి వారు మాట్లాడే విషయం లో ఉన్న భావాన్ని బట్టి భంగిమ లను మారుస్తూ ఉండాలి.ముఖము లో ఏ భావము ప్రకటించకుండా ఉంటే అతనితో సంభాషణ ఆసక్తికరం గా ఉండదు.
5. మాట్లాడడము:
మాట్లాడవలిసి నప్పుడు మాట్లాడలేక పోవడం Introversion అంటారు
ఎక్కువగా మాట్లాడే వారిని  Extravert అంటారు
అవసరం అయిన అప్పుడు మాత్రమే మాట్లాడే వారిని Reserved  అంటారు.
అవతలి వారు స్వభావాన్ని బట్టి మన స్వభావాము మార్చుకోవాలి.ఇద్దరి దీ ఒకే టైప్ అయితే సంభాషణ ఆసక్తికరం గా ఉండదు...
6.తల ఊపడము :
అవసరమైనప్పుడు తల ఊపుతూ ఔనా
మీరు చెప్పేది కరెక్ట్ , నాకు అర్థం కావట్లేదు అనే మాటలు ...అవతలి వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి.
7.ప్రతిస్పందన:
ఎప్పటివరకు మౌనం గా ఉండాలి ,ఎప్పుడు మాట్లాడాలి ,ఎంత మాట్లాడాలి అన్నావిషయాల మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి.
8. అవతలి వారి కి ఇష్టమైన విషయం మీద మాట్లాడితే అవగాహన బాగుంటుంది
అలాగే స్వరం ఎప్పుడు పెంచాలి..ఎప్పుడు తగ్గించాలి అన్న విషయం స్పష్టము గా ఉండాలి.
9. అవతలి వారిని ఎంతసేపు మాట్లాడనిచ్చి మనం ప్రారంభించాలి అనేది మనకు తెలియాలి.
10.మీరు సరిగ్గా చెప్పట్లేదు అనే మాటకన్నా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అన్న ప్రయోగం బాగుంటుంది.
11.గొప్పవాళ్ళు వ్యూహాలు గురించి మధ్యములు సంఘటన ల గురించి అధములు వ్యక్తుల గురించి       మాట్లాడతారు. గొప్ప వాళ్ళు సంభాషణ ల వలన వాళ్ళు...నేర్చుకుంటారు... లేదా నేర్పుతారు...
12. దురాశ పరుడైన   వ్యక్తిని... ...  .ధనముతోనూ
మొండి ఘటాలను ... అభినందనాలతోను
అవివేకి ని .......  హాస్యము తోనూ
పండితుని ని..... నిజము తోనూ
జయించవచ్చు...

Thursday, 1 February 2018

విజయం లభిం చాలంటే



విజయం లభిం చాలంటే
                                                       
 విజయం లభిం చాలంటే
గమ్యం తెలియక, నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.
అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో, లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు
విముక్తిని ప్రసాదించి,
విజయ శిఖరాలను అధిరోహింపచేస్తుంది.
మనిషికి విజయం లభిం చాలంటే అనుమానాన్ని దూరం చేసుకోవాలి.
ఒక పనిని ఎలా చేయాలా అని రకరకాలుగా ఆలోచించడం వేరు ,
రకరకాల అనుమానాలతో బాధ పాడడం వేరు .
అనుమానం వలన భయమ కలుగుతుంది .
అనుమానం వలన సందిగ్దత ఏర్పడుతుంది .
విసుగు వేస్తుంది .
ఆందోళన ఏర్పడుతుంది.
తర్ఖం ,ధైర్యము  అనేవిరెండు భయాన్ని ఎదుర్కొనగలిగే ఆయుధాలు.
టెన్షన్ అనే పురుగు ని ,చంపడానికి మందు exposer.
వివిధ వ్యక్తులను , కలుసుకోవడము
రకరకాల ప్రదేశాలు తిరగడం ,
వేదికలు ఎక్కి  మాట్లాడడము మొదలైనవి ....