Sunday, 23 June 2024

మాయా ద్వీపం పార్ట్ 2

 మాయా ద్వీపం పార్ట్ 2

భాగం 2
ముందు రెండు గుర్రాల మీద ఇద్దరు సైనికులు వచ్చారు...
గ్రామం లో అంతా పరిశీలించారు.
ఆ తరువాత ఇంకో ఆరు గుర్రాలు వచ్చాయి...
ఆ ప్రదేశం అంత ఖాళీ చేసి ..
ఒక కుర్చీ తీసుకుని చెట్టు కింద వేశారు.
మల్లన్న ఏం జరుగుతుందో అని తన గుడిసె లోనించి బైటకి వచ్చాడు...
మళ్ళీ సైనికులు...
పంట రావడం పాపం వచ్చేస్తారు... అనుకున్నాడు...
రంగయ్య కూడా చేరాడు...
ఏం మల్లన్న వీళ్ళు మళ్ళీ వచ్చేసారు... అన్నాడు...
ఒక్కొక్కళ్ళు బైటకి రావడం మొదలు పెట్టారు.... ఇంతలో ఒక సైనికుడు మహారాజు గారు వస్తున్నారు ...
అందరూ నిశబ్దం గా ఉండండి అంటూ అరిచాడు...
అంతా నిశబ్దం గా అయిపోయింది...
అందరూ భయం భయం గా చూస్తున్నారు... ఇంతలో వీరయ్య వచ్చాడు...
కంగారు పడకండి రాజు గారు ఎవరు అనుకుంటున్నారు...
మన అర్జున్ బాబు...
వెళ్ళండి హారతులు పట్టుకురండి...
అంటూ ఆడవాళ్ళని పురమాయించాడు... ఇంతలో రాజుగారి సైన్యం వచ్చేసింది...
ముందు మల్లిక ...
వెనుకే అర్జున్ వచ్చారు...
ఒరేయ్ మన మల్లిక రా ...
ఏం తల్లి బాగున్నవా అంటూ పలక రించాడు మల్లన్న...
బాగున్నా మామా...
అందరూ ఎలా ఉన్నారు...
అర్జున్ బాబు వచ్చారు నేను తరువాత మాట్లాడటానికి వస్తా..
అంటూ గుర్రం దిగి అర్జున్ తో కుర్చీ దగ్గర కి వెళ్లి పక్కన నిలబడింది...
అందరూ ఎలా ఉన్నారు అంటూ అడిగాడు అర్జున్...
ఇంత కాలం ఆ దుర్మార్గుడి పరిపాలనలో ఉన్నాం...
మీరే మాకు అండగా ఉన్నారు...
ఇప్పడు మీరే మా రాజు గా వచ్చారు..
చాలా సంతోషం గా ఉంది అన్నారు...
ఇంతలో ఆడవాళ్లు హారతులు పట్టుకుని వచ్చారు...
ఇవి అన్ని ఎందుకు..
నేను ఎప్పటికీ మీ అర్జున్ అన్న నే...అన్నాడు... కొత్తగా రాజు వయ్యావు...
మీకు స్వాగతం పలకడం మాకు ఎంతో సంతోషం గా వుంది...బాబు...అన్నాడు మల్లన్న...
అప్పట్లో మీరు పడుతున్న కష్టాలు నాకు తెలుసు కాబట్టే అవి అన్ని పరిష్కరించడానికి వచ్చాను... అన్నాడు...
ఇంతలో బళ్ల లో పండించిన పంట అక్కడికి వచ్చి దిగాయి...
ఇది ఏమిటి అన్నాడు...అర్జున్...
అదే బాబు రాజు గారి బావమరిది వచ్చి నపుడు...
అవి అన్ని ఇలాగే తీసుకుని వెళ్ళేవాడు...
ఇవ్వక పోతే కొరడాలతో కొట్టేవారు...
అందుకే ముందే తీసుకుని వచ్చేసాం అన్నారు.... మరి మీకోసం అన్నాడు...
ఇక మిగిలినది తినడం లేదా ..
ఆకలి తో ఉండడం...
ఏమి చేయగలం... అన్నాడు మల్లన్న...
పైగా పంట పండించి నదుకు సిస్తూ... అమ్ముకున్నందుకు సిస్తూ...
ఇలా డబ్బు కట్టాలి.... దొర అన్నాడు...
సరే ఈ బళ్లు అన్నీ కోటకి తరలించండి అన్నాడు...అర్జున్
నేను చెప్పలే ...
ఒక సారి రాజు అయితే అంతే అలాగే మారిపోతారు అన్నాడు...ఎల్లయ్య...
నోరు ముసుకో వింటే మళ్ళీ కొరడా దెబ్బలు తప్పవు.... అన్నాడు నెమ్మదిగా... ఇదిగో ...మల్లిక ఈ బండల్లో ఎవరు ఎంత సరుకు పంపారో వాళ్లకి రెట్టింపు ధర కట్టి ధనాన్ని పంపించండి...
ఇక మీదట మా పరిపాలనలో ఆకలి అన్న మాట వినపడకూడదు....
ఆ ఏర్పాట్లు చూడు...
ప్రతి ఊరిలో ధర్మ సత్రాలు కట్టించండి...
వృద్దులు పని చేయలేని వికలాంగులకు అక్కడ ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయండి ...
కష్ట పడి పని చేసే వాళ్ళకి మన భూములు కౌలుకు ఇచ్చి అందులో వ్యవసాయం చేయడానికి ఏర్పాటు చేయండి...
తగిన సహకారాలు అందించండి...
ఇంక మీదట పంట పండించి నదుకు పన్ను ఉండదు.....
అమ్మిన పంటకు మాత్రమే కట్టాలి అందరికి అర్థం అవుతోందా... అన్నాడు...
అందరి ముఖాల్లో ఆశ్చర్యం..
ఆనందం విరిసాయి...
విపణి లో అమ్మడం చేతకాక పోతే కోటకు పంపేయండి ..
తగిన ధర చెల్లించి కొంటాము...
ఇది నేను తీసుకున్న నిర్ణయం... అన్నాడు.. అంతటా హర్ష ధ్వానాలు వ్యక్తం చేశారు....
అలా ఇంకా ప్రజల వద్దకు పాలన అంటూ అర్జున్ చాలా మార్పులు చేసాడు..
ఆ రాజ్యం లో..
అందులో భాగం గా గ్రామాల్లో విడిది చేసి అక్కడి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ అక్కడే పరిష్కారాలని సూచిస్తూ పరిపాలన సాగిస్తున్నారు...
చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు...
ఇలా ఒక గ్రామం లో.. మాట్లాడుతూ ఉన్నాడు పక్కనే సైన్యం.....వరుసగా నుంచుని ఉన్నారు... గుర్రాలని పట్టుకుని మరికొందరు దూరం గా నించుని ఉన్నారు..
చెట్టు కింద పెద్ద కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు అర్జున్...
ఆపక్కనే సైన్య అధ్యక్షురాలు ...
మల్లిక నుంచుని ఉంది.
ఇంతలో .. ఒక పెద్ద సింహం వచ్చేసింది.. భయాంకరం గా గర్జిస్తూ. ...
భయం తో పరుగులు తీశారు ప్రజలు..
అర్జున్ చూసాడు...
గుర్తు పట్టాడు అది తన సింహమే అని...
మీరు అందరూ కంగారు పడవద్దు..
ఇది నా సింహమే మిమ్మలిని ఏమి చేయదు అంటూ అరిచాడు...
ఇంతలో అది దగ్గరకి వచ్చేసింది...
మల్లిక కి అది ఆయన సింహమో కాదో అని అనుమానం తో తన విల్లుని ఎక్కుపెట్టి తయారు గా ఉంది...
ఒకవేళ తేడా జరిగితే బాణం తో కొట్టేద్దామని... సైనికులు కరవాలాలు దూసారు..
ఒక్క సారిగా అర్జున్ ముందుకి వచ్చి ఆగిపోయింది...
అక్కడే కూర్చుంది...
ఇంతలో రెండో సింహం వచ్చి పక్కనే కూర్చుంది ...
అందరూ విస్తుపోయి చూస్తున్నారు...
అర్జున్ సింహాన్ని చూసి నవ్వాడు ఏం కోపం వచ్చిందా....
తప్పు నాదేలే ...
కోట హడావిడి లొపడి మిమ్మలిని మార్చి పోయాను... రా...
అంటూ ప్రేమగా పిలిచాడు...
మళ్ళీ గట్టిగా గర్జించింది....
తల తిప్పుకుంది కానీ రాలేదు...
అబ్బా ...అంత కోపమా...నామీద అంటూ దగ్గరికి వెళ్ళ సాగాడు...
వద్దు అన్నా అంది మల్లిక...
ఏమి పరవాలేదు లే మల్లి...
అంటూ సింహాన్ని ప్రేమగా నిమిరాడు..
గట్టిగా కౌగలించికున్నాడు....
ఒక ముద్దు పెట్టాడు...
అంతే మీదపడి నాక సాగింది...
ఇంతలో మిగతా వి కూడా వచ్చాయి...
అన్నిటిని కాసేపు నిమిరాడు...
ఇంక మర్చిపోను లే వస్తూ ఉంటా మీరు వెళ్ళండి అంటూ అడవి వైపు దారి చూపించాడు... ఇంతలో ఒక సింహం తన పిల్లని నోటితో కరుచుకుని తీసుకుని వచ్చి అర్జున్ చేతిలో పెట్టింది....
మల్లిక ముచ్చట పడిపోయింది...
ఇవి అర్జున్ తో ఎలా ప్రేమ గా ఉన్నాయో... ఊరిలో అందరూ ఆశ్చర్య పోయి చూస్తున్నారు... ఆ పిల్లను ముద్దాడి ...మళ్ళీ ఇచ్చేసాడు..
ఇంక మీరు వెళ్ళండి అన్నాడు ..
అవి వెళ్ళిపోయాయి....
వీటిని నేనె పెంచేవాడిని...
పిల్లని చూపించడానికి వచ్చాయి..
మీరు కంగారు పడకండి అంటూ చెప్పాడు... సైనికులు తమ కరవాలాలని లోపల పెట్టేసారు.. ఇంకోసారి ఊరి ప్రయోజనాల కోసం తాను చేసే పనులు వివరించి...
మల్లిక వైపు చూసాడు ఇంక బయలుదేరి వెడదామా అన్నట్టు...
వెంటనే ఒక గుర్రం ని తీసుకుని వచ్చి అర్జున్ పక్కనే నిలబెట్టారు...
అది ఎక్కి బయలుదేరి వెళ్లారు...
ఈ అర్జున్ బాబు వచ్చాక మన కష్టాలు అన్నీ తిరిపోయాయి....
చక్కగా వ్యవసాయం చేసుకుంటాము.....
ఆ బాబు బాగుండాలి అంటూ ఆశీర్వదించారు ప్రజలు...
మిగతా 3 వ భాగం లో...


ఆరోజు పార్ట్ 4

 

ఆరోజు....( పార్ట్.. 4)

ఆ రోజు రాత్రి...11 గంటలు అవుతోంది
....భవాని శంకర్ ఇంట్లో ...కోపం గా ఉన్నాడు.
మందు తాగుతున్నాడు....
ఇంతలో మైసమ్మ వచ్చాడు.
నమస్తే సర్...అన్నాడు.
ఏం జరుగుతోంది... మీరంతా ఏమి చేస్తున్నారు....
అమ్మాయి గారు తడిసిపోయింది... జ్వరం... తెలివి లేకుండా హాస్పిటల్ లో పడి ఉంది....అంటూ అరిచాడు....
లేదు సర్...అప్పటి దాకా కనిపెట్టు కునే ఉన్నాను అండీ... కాలేజ్ లోపలే కదా అని బైట దూరం గా ఉన్నాను.
ఇంతలో అంటూ ,
జరిగింది చెప్పాడు...
అమ్మాయి గారి పుట్టిన రోజు వస్తుంది గా జాగ్రత్త గా ఉండండి అని చెపుతూనే ఉన్నాను....
ఒక్కళ్ళకి పని మీద శ్రద్ధ లేదు..
తిని , తాగడం తప్ప...అంటూ తిట్టాడు.... సారు అది ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి పోదామని వచ్చిన ..
ఏమిటి అది...అని అడిగాడు భవాని శంకర్...
అది అమ్మాయి గారి వెనుకే ఆ మాస్టారు కూడా వెళ్లారు కదా అని...
నేను లోపలికి వెళ్ళి అసలు ఏమి జరిగి ఉంటుందో అని చూసా...
అక్కడ ఒకడు పడి ఉన్నాడు...
బహుశా అతనే అమ్మాయిగారి ని ఏడిపించి ఉంటాడు అని వార్నింగ్ ఇద్దామని దగ్గరకి వెళ్లబోయా....
కానీ ఇంతలో.... ఎవరో  ఇద్దరు ముసుగులో
వచ్చారు...
అతని దగ్గరకి  వెళ్లారు ,ఏదో మాట్లాడారు తరువాత తలమీద రాడ్ తో ఒక్కటి కొట్టి... వెళ్లిపోయారు....
తరువాత నేను దగ్గరకి వెళ్ళి చూసా అప్పటికే వాడు పోయాడు....
మళ్ళీ గొడవలో నేను ఇరుక్కుంటానని వచ్చేసా ను అండీ.....
ఎవరై ఉంటారు.....ఏమి మాట్లాడారు .. అసలు వాడిని చంపాల్సిన అవసరం వాళ్ళకి  ఏమిటి...నువ్వు గుర్తు పట్ట గలవా అని ప్రశ్నించాడు.
లేదు అండీ... ముసుగులో ఉన్నారు..దూరంగా ఉన్నాను...పైగా వర్షం...శబ్దం లో మాటలు వినబడలేదు అన్నాడు మైసమ్మ.
మన వాళ్ళని తీసుకుని వెళ్లి వాళ్లేవరో...అసలు ఆ చచ్చిన వాడేవరో... కనుక్కునే ప్రయత్నం చెయ్...
జాగ్రత్త...మన పేరు బైటకి రాకూడదు.. అన్నాడు.
అలాగే అయ్యా...మారి నేను వస్తాను... అన్నాడు.... ఇదిగో ఇది తీసుకుని పో అంటూ పక్కన ఉన్న ఫుల్ బాటిల్  విసిరాడు...
అది అందుకుని వస్తాను సర్ అంటూ మళ్ళీ దండం పెట్టి వెళ్లి పోయాడు...
భవాని శంకర్ ఆలోచనలో పడ్డాడు...
ఎవరు అయి ఉంటారు.... అసలు వాడికి గొడవలు ఏమైనా ఉన్నాయా..
లేక మన అమ్మాయి కోసం వచ్చారా....అర్థం కావట్లేదు....
ఎందుకైనా మంచిది హాస్పిటల్ లో సెక్యురిటి పెంచాలి అనుకుని....ఫోన్ చేసాడు.
నమస్తే అయ్యా...
ఏరా హాస్పిటల్ దగ్గర అంతా బాగానే ఉందా.... అవును సర్ అన్నాడు...ఎందుకైనా మంచిది..
ఇంకో నలుగురిని పెట్టు... మనకి తెలియకుండా ఎవరూ అమ్మాయి గారి గది వైపు వెళ్లకూడదు...
అర్థం అయిందా ...అన్నాడు భవాని శంకర్... అట్లనే సారు...
ఇప్పుడే మందిని పెడతాను... ఉంటాను సార్ అన్నాడు....
జాగ్రత్త...అంటూ ఫోన్ పెట్టేసాడు.
రేవు వాళ్ళు ఎవరు అన్నది కనుక్కోవాలి అనుకుంటూ నిద్రకి ఉపక్రమించాడు.

భవాని శంకర్ వసంత మేనమామ.
వసంత తల్లిదండ్రులు ఆక్సిడెంట్ లో చనిపోతే ,
మేనమామే పెంచి పెద్ద చేసాడు... వాళ్ళ కాంట్రాక్టులు, ఫ్యాక్టరీ లు ఆయనే చూసుకుంటూ ఉంటాడు.
అమ్మాయి హాస్టల్ లో ఉండి చదువుకుంటాను అంటే కాదనలేక పంపించారు...
కానీ తన మనుషులు ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉంటారు.
ఈ విషయం అమ్మాయికి కూడా తెలియదు. వసంత తల్లిదండ్రుల ఆస్థి దగ్గర దగ్గరగా 4 వేల కోట్లు వరకు  ఉంటుంది.
ప్రస్తుతం భవాని శంకర్  గార్డియన్ గానే ఉన్నారు.
అమ్మాయి మేజర్ అయిన తరువాత ఆస్థి అంతా ఆమె పేరు మీదకి మారిపోతుంది.
ఆ తరువాత అమ్మాయి ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ,
ఆస్థి బైటకి వెళ్ళిపోతుంది అని భయం.
వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేస్తే ఆస్థి అంతా తన దగ్గరే ఉంటుంది అని ఆశ.
చిన్నప్పటి నుంచి  కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.
ఆక్సిడెంట్ అయినప్పుడు తను చిన్న పిల్ల , ఎవరినీ నమ్మడానికి లేదు...అని
వీలునామా రాసేశారు ఆమె తల్లి తండ్రులు.
ఎవరు అయితే తనని మేజర్ అయ్యే దాకా బాగా చూసుకుంటారో ...వాళ్ళకి ఆస్థి లో సగం,
మిగతా సగం అమ్మాయికి చెందే లా రాసారు.
ఈ లోగా అమ్మాయికి ఏమైనా అయితే ,
ఆస్థి మొత్తం ఒక చారిటబుల్ ట్రస్ట్ కి చెందే లా వీలునామా రాసేశారు... ఎందుకంటే అప్పుడే  తమ కూతురిని  జాగ్రత్తగా చూసుకుంటారని వాళ్ల నమ్మకం.
అందుకే ఇప్పుడు వచ్చే తన పుట్టినరోజు కి మేజర్ అవుతుంది....
అందుకే భావాని శంకర్ కంగారు పడుతున్నాడు.
అమ్మాయి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా క్షమించడు....
                        ********

సిద్ధార్థ్ ఆఫీస్ లో ఫోన్ మ్రోగింది. సునీల్ తీసాడు. నేను MLA గారి P A ని మాట్లాడుతున్నాను.... సిద్దార్ధ్ గారు లేరా అని అడిగారు...
హలో నమస్తే మూర్తి గారు ఇదిగో ఇప్పుడే ఇస్తున్నా....అంటూ ఫోన్ ఇచ్చాడు ....
నమస్తే సర్ అన్నాడు....MLA  గారు మీకు 25 లక్షలు చెక్ santion చేశారు... వచ్చి తీసుకుని వెళ్ళండి....
ప్రస్తుతం మేము ఇంటిదగ్గరే ఉన్నాము...
చెక్ నా దగ్గరే ఉంది మీరు ఇంటికి వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టాశారు.... ఒరేయ్ మనకి చెక్ వచ్చింది రా....
మొన్న మాట ఇచ్చారుగా ...ఇపుడే వెళ్లి తెచుకుందాం... నడు అంటూ బయలుదేరాడు...సిద్ధార్థ్
MLA. గారింట్లో..
హలొ సిద్ధార్థ్ గారు రండి...
సారు ఇప్పుడే వస్తారు మీరు కూర్చోండి.. చెక్ ఆయన చేతుల మీదుగా ఇస్తారు... అన్నాడు మూర్తి...
అలాగే సర్...అంటూ కూర్చున్నారు... కాఫీ వచ్చింది.. ఇద్దరికి...
తాగుతూ పేపర్ చూస్తున్నాడు సునీల్....
ఒరే ఈ న్యూస్ చూడు....నువ్వు షాక్ అవుతావు...
జయ్ ని అరెస్ట్ చేశారట....
ఏదో అమ్మాయి...
ఎవరో మర్డర్ కేసు....
అంటూ పేపర్ సిద్ధార్థ్ కి ఇచ్చాడు....
తాను అది చదివి...
ఇదేంట్రా ఇలా జరిగింది...
వాడు ఎలాంటి గొడవలు పెట్టుకునే రకం కాదు....
ఇదేదో చూడాల్సిందే...
అంటూ ఉండగా....
ఇంతలో మెట్లు దిగుతూ
ఏమయ్యా సిద్ధార్థ్...
నీ కిచ్చి న మాట ప్రకారం నీకు చెక్ santion చేశా....
ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చెయ్....
మా సహకారం ఎప్పుడూ నీకు ఉంటుంది...
అంటూ P. A,  ఇచ్చిన చెక్  ,
సిద్ధార్థ్ చేతిలో పెట్టాడు....
చాలా చాలా థాంక్స్ ...సర్
దీని వలన ఇంకా చాలా మందికి విద్యాదానం చేయవచ్చు...
చాలా  ఉపయోగకరం గా ఉంటుంది.... అన్నాడు....
మేము చేసే వి మేము చేస్తూనే ఉన్నాం...
అయినా ఇంకా చాలామందికి లబ్ది చేకూరటలేదు....
మీలాంటి వాళ్లు చేసే సర్వీస్ కూడా ఉపయోగ పడుతుంది..
అందుకే ...
మరి నేను వస్తాను మరి..althe best అంటూ ఆయన బయలుదేరి వెళ్లిపోయారు....
ఇద్దరు చెక్ తీసుకుని...
కార్ లో బయలు దేరారు......
సునీల్ డ్రైవ్ చేస్తున్నాడు...
ఏమై ఉంటుంది అబ్బా ,
ఈ జయ్ కి...చాలా మంచి వాడు...
ఏది ఏమైనా అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించి వస్తే మంచిది...
నువ్వు ఒక పని చెయ్...
నన్ను ఇంటిదగ్గరే డ్రాప్ చెయ్...నేను ఒకసారి వైజాగ్ వెళ్లి వస్తాను...
వాడికి ఏమైనా సహాయం కావాలేమో...
.పైగా కేసు కొంచెం పెద్దది గానే అనిపిస్తోంది...
వాడే ఇరుక్కున్నాడా లేక ఎవరైనా ఇరికించారా అన్నదితేలాలి....
నేను ఎయిర్పోర్ట్ కి వెళ్లి నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేస్తాను...
అవసరమనుకుంటే నిన్ను పిలుస్తాను... అప్పుడు వద్దువు గాని....
ఈ లోగా చెక్ బాంక్ లో వేసి...
పనులు అవి మొదలు పెట్టు...
అన్నట్టు చెక్ విషయం....వివరాలు
మన ప్రకాష్ గారికి తెలియజేయి...
ఆయన న్యూస్ అప్డేట్ లో వేసుకుంటారు.... అన్నాడు.
నువ్వు మన కాంటిన్ లో భోజనం చేసేయ్... నేను ఇంటి దగ్గర చేసి బయలుదేరుతాను అన్నాడు.
సరే అంటూ సిద్ధార్థ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్లి పోయాడు సునీల్...
నాన్నగారు నా ఫ్రెండ్ జయ్ మీకు తెలుసు కదా.
ఒక సమస్య లో ఇరుక్కున్నాడు..
ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు...
వివరాలు తెలియవు...
నేను ఒకసారి వైజాగ్ వెళ్లి వస్తాను..
అని అన్నాడు.
అలాగే రా ఫోన్ చెయ్... వెళ్ళగానే అన్నారు.
బట్టలు సర్దుకుని , భోజనం చేసే సరికి క్యాబ్ వచ్చింది.
ఎయిర్పోర్ట్ కి బయలు దేరాడు సిద్ధార్థ్.
దారి లో ఉండగా M D., ప్రకాష్ ఫోన్ చేశారు...
హాయ్ సిద్దార్ధ్....సునీల్ ఫోన్ చేసాడు...
చెక్ గురించి .
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకే ఇచ్చావు....థాంక్స్..
వైజాగ్ వెళుతున్నావు ట కదా...
నీ ఫ్రెండ్ కోసం...
నేను ఒక ఆఫర్ ఇస్తున్నా...
నువ్వు మాములు గా వెళితే ఇన్ఫర్మేషన్ సరిగ్గాఇవ్వరు...
పైగా రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండదు.... అదే ఒక ప్రెస్ రిపోర్టర్ గా వెళితే అంత బాగా చూసుకుంటారు....
కనుక నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వు...
నీ ఇన్వెస్టిగేషన్ చేసుకో...
ఖర్చులు నావి...
బట్ ఆ కేస్ వివరాలు ప్రత్యేకం గా మా ఛానెల్ కేర్ ఇవ్వాలి...
నువ్వు కేసు take up చేస్తే ...
అది సెన్సేషన్ అవుతుంది....
అన్నాడు ప్రకాష్....
ok సర్ మీరు చెప్పినట్లే చేద్దాం...
ఈ కేసు విషయం లో నాకు మీ సహాయం కావాలి... అన్నాడు...
Ok .. Done...
Welcome.back...Mr.Siddhardh..
..అంటూ ఫోన్ పెట్టేసాడు.....
కార్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చి ఆగింది...
సిద్ధార్థ్ తన బాగ్ తీసుకుని టికెట్ కోసం వెళ్ల బోయాడు.
ఇంతలో ఒక అతను పరిగెత్తుకుంటూ
సిద్దార్ధ్ వైపు వచ్చాడు...
నమస్తే సర్....నన్ను
ప్రకాష్ గారు పంపారు.
చెప్పు ఏమిటి సంగతి అని అడిగాడు.
ఇదిగో సర్...
ఈ I D కార్డ్..., టికెట్...
క్రెడిట్  కార్డ్స్
మీకు ఇచ్చి రమ్మన్నారు...
వైజాగ్ లో మీకోసం , కార్ రెడీగా ఉంటుంది.. గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు అయిపోయింది...
డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటాడు..
అని ఆగాడు...
చాలా స్పీడ్ గా ఉన్నారు... అని నవ్వుతూ సరే నేను ఫోన్ చేస్తానని చెప్పు .
మీ సారు కి .. అంటూ
అవి తీసుకుని లోపలకి వెళ్ళిపోయాడు..
విమానం బయలు దేరింది....
ఆలోచనలో పడ్డాడు మళ్ళీ...
లక్ష్మీ ఇప్పుడు ఎక్కడ ఉందో...
వైజాగ్ లొనే ఉన్నట్టు సమాచారం...
జయ్ తో మాట్లాడినట్టు గా ఒకసారి అన్నాడు...
ఆశ్రమం బిజీ లో పట్టించుకోలేదు...
ఈ సారి ఎలాగైనా తన అడ్రెస్ పట్టుకోవాలి... అనుకున్నాడు...

( ఇంకా ఉంది )
continued in part 5


Saturday, 15 June 2024

మాయా ద్వీపం పార్ట్ 1


( మాయా ద్వీపం...) పార్ట్ 1
జోరున వర్షం పడుతోంది...
ఆకాశం లో మెరుపులు 

మెరుస్తున్నాయి... 

పిడుగుల శబ్దానికి ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోతోంది....

కటిక చీకటి...
నలుగురు యోధులు సైనిక దుస్తుల్లో ఉన్నారు... గుర్రాల మీద వచ్చారు...
కోట గుమ్మం దగ్గర ఆగారు...
కిర్రుమంటూ శబ్దం చేసుకుంటూ కోట తలుపు లు తెరుచుకున్నాయి ..
అందరూ లోపలికి వచ్చి ఆగారు...
ఇంతలో ఇద్దరు పరిగెత్తు కుంటూ వచ్చి వాళ్ళు దిగిన గుర్రాలని అశ్వసాల కి తీసుకుని వెళ్లారు... అక్కడ అక్కడ కాగడాల వెలుగు మిణుకు మంటోంది...
కోట లోపల దీపాలు ..గోడకి రెండు పక్కలా కాగడాలు వెలుగుతున్నాయి...
రాణి గారి సింహాసనం గదిలోకి వచ్చారు... కొవ్వొత్తి దీపపు కాంతులు అంతా ఉన్నాయి... అందరూ లోపలికి...నడుచుకుంటూ వచ్చారు... అక్కడ వృద్ధ రాణి కూర్చుని ఉంది...
పొడుగాటి తెల్లని జుట్టు...
భయంకరమైన రూపం...
చేతిలో మేజిక్ స్టిక్...
పెరిగిన గోర్లు.....
అక్కడ అంతా నిశబ్దం గాఉంది ...
అక్కడి వాతావరణం నిశ్శబ్దం తో మరింత భయాన్ని కలిగిస్తోంది...
అందరూ వంగి వందనం చేశారు...
పిలిపించారు మమ్మలిని తమ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాం అన్నాడు...
మీకొక ముఖ్యమైన పని అప్పచెపుతున్నా... అష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఆ తరువాత వచ్చే పౌర్ణమి కి నేను ప్రపంచానికి రాణి కావాలి ...
ఈ భూ మండలం అంతా నా అధీనం లోకి రావాలి...
మళ్ళీ నేను యవ్వనం లోకి రావాలి ఇవి అన్ని జరగాలంటే ఆ నక్షత్రం లో రాశిలో...
సమయం లో పుట్టిన బాలుడి ని నేను బలి ఇవ్వాలి...
నా మంత్ర శక్తులు , యవ్వనం అన్ని మళ్ళీ ఇంకో 100 సంవత్సరాల దాకా వచ్చేస్తాయి...
కనుక మీరు ఆ బాలుడిని కనిపెట్టి నాకు అప్పగించాలి...
ఇది నా ఆజ్ఞ అంది రాణి...
తమ ఆజ్ఞ మహారాణి...
మేము తప్పక సాధిస్తాం...
కానీ ఆ బాలుడు వివరాలు ఏమైనా తెలుపగలరు..
అంటూ వంగి నోటికి చేయి అడ్డం పెట్టుకుని వినయం గా అడిగాడు.
వెంటనే తన మంత్రదండం తో గాలిలో తిప్పింది...
ఒక మెరుపు లా వచ్చి తన పక్కన ఉన్న అద్దం లో ఒక బాబు చక్కగా పడుకుని ఆడుకుంటూ కనిపించాడు...
ఎంతో తేజస్సు కలిగి ఉన్నాడు...
వెంటనే రాణి తన చేతితో...
అద్దం లో చేయి పెట్టి ఆ బాలుడి చిత్రపటాన్ని తీసింది...
నలుగురు ఆశ్చర్య పోయారు...
అది వాళ్ళ కి అందించింది...
ఈ బాలుడు ఇంకా పుట్టలేదు...
తూరుపు దిశగా వెళ్ళండి...
అక్కడ విచారించి చూడండి...
మీకు ఎక్కడ పుట్టాడో తెలుస్తుంది...
అంది రాణి...
తమ ఆజ్ఞ మహారాణి...
త్వరలోనే బాలుడి తో మీ ముందు ఉంటాము అని వంగి మరొకసారి వందనం చేసి వెళ్లి పోయారు...
అద్దం లో చూస్తూ ఒరేయ్ బాలకా ఎప్పుడు వస్తున్నావురా...
నా శక్తులు, యవ్వనాన్ని ఎప్పడు ఇస్తున్నావు రా అంటూ వికట అట్టహాసం చేస్తూ పెద్దగా నవ్వింది....
నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా....
అంటూ తన మ్యాజిక్ స్టిక్ తో అడ్డంగా ఊపింది... అంతే ...
ఆ బొమ్మ అంతర్ధానం అయిపోయింది... పుట్టబోయే వాడు మహా జాతకుడు...
నిన్ను నాశనం చేయగల శక్తి ఉంది...
జాగ్రత్త... అంటూ హెచ్చరిక వినిపించింది...
నన్ను మించిన వాడా...
రానీ ..చూస్తాను... అంటూ గట్టిగా అరిచింది... నిన్ను ఈ అద్దం లో బంధించినా బుద్ధి రాలేదు... అంటూ అరిచింది...
అద్దం లో ఉన్నది ఒక ప్పుడు ఆ కోటకు రాణి.. దానిని బంధించి ఈ మంత్రగత్తె తన అధీనం లోకి తీసేసుకుంది..
తనని అలా అద్దం లో బంధించింది...
ఆ మంత్రగత్తె ని ఓడించాలంటే తన శక్తి చాలదు ...
పైగా తాను సాధించిన మంత్ర శక్తులన్ని తన అధీనం లోకి వెళ్ళిపోయాయి...
ఇప్పడు ఆ మ్యాజిక్ స్టిక్ తన చేతికి వస్తే గానీ మళ్ళీ తన శక్తులు తనకి రావు...
అందుకే కదలడానికి లేకుండా తనని అద్దం లో బంధించింది...
నువ్వు చూస్తూ ఉండు నేను ఎలా సాధిస్తానో...
అంటూ గట్టిగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది....

మిగతా 2 వ భాగం లో