Thursday, 26 October 2017

ఓం ఓం ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము.

వేటూరి  గారి కలము నుండి జాలు వారిన
అద్భుత రసమయ , దృశ్య కావ్యాలలో 

"శంకరాభరణము  "

తెలుగు సినీ  కళామ  తల్లి కీర్తి కిరీటము లో
కలికితురాయి . ఈ రోజు  ఆయన  రాసిన ఒకపాట ,

    ఓం ఓం ఓంకార నాదాను
    సంధానమౌ గానమే శంకరాభరణము

     శంకర గళ నిగళము , శ్రీహరి పద కమలము
      రాగ రత్న , మాలికా ,తరళము  శంకరాభరణము

      శారద వీణా  రాగ  చంద్రికా  పులకిత  శారద రాత్రము
       నారద నీరద  , మహతీ నినాద  ,గమకిత శ్రావణ గీతము
       రసికుల కనురాగమై , రస గంగలో తానమై
        పల్లవించు , సామ వేద మత్రము  , శంకరాభరణము

     అద్వైత సిద్ధికి,   అమరత్వ లబ్ధికి  ,గానమె సోపానము....
      సత్వ సాధనకు , సత్య శోధనకు , సంగీతమే ప్రాణము

      త్యాగ రాజ హృదయమై , రాగ రాజ నిలయమై
      ముక్తి నొసగు భక్తి యోగ మార్గమ

      మృతియె లేని సుధాలాప స్వర్గము  శంకరాభరణము
      ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము

ఆయన ఉపయోగించిన పదాలు ,సాహిత్య విలువలకు
ఎంతో ప్రాధాన్యము తో పాటూ ,భావి తరాల కవులకు
మార్గదర్శకము గా కుడా ఉంటాయి ....
ఇంతటి అద్భుత పద రచనలు చదివి
పులకించని వారు ఉండరు ..
ఆనుభుతి ని ఆస్వాదించని వారు ఉండరు .
సంగీతము, గానము  గురించి ఆయన వర్ణించిన విధము  .
ఏంతొ  అధ్భుత రానుభుతిని కలిగిస్తుంది .

మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
 అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన  ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...

ఆచంట గోపాలకృష్ణ

తరలి రాద తనే వసంతం

తరలి రాద తనే వసంతం
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద
                         ******
మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన  ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...

Wednesday, 25 October 2017

విధాత తలపున ప్రభవించినది

శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలము నుండి జాలువారిన...పాట

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం......
సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనమ్..
విపంచినై వినిపించితిని ఈ గీతమ్....
ప్రార్దిష వీణీయ పైన దినకర మయూహ తంత్రులపైన..
జాగ్రుత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… 2
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ..
విస్వకావ్యమునకిది భాష్యముగా....
విరించినై…..
జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం...:2:
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే..
విరించినై…..
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం.... 2
సరసస్వరసురఝారీగమనమౌ సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం.

.మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...