Monday, 25 September 2017

నా ప్రేమా ......


నా ప్రేమా ......

ఎదలో ఎపుడూ,
రగిలే వ్యధలో
మదిలో కదిలే నీరూపం
కనులే కరిగి
ఎదనే తడిపి
మరుపే రాదు
ప్రతి నిముషం.....
ఆసే .అలలై ,...
దొలిచే మనసే
మరుపే కరువై కలచే
..నా.. హృదయం
నిశీధి లో నా ఆశల
చరమ గీతం...
పిలుస్తోంది నిన్ను చేరాలని...
అయినా.....
జీవించే ఉంటా తుది శ్వాస వరకు....
నీ జ్ఞాపకాలతో....
జీవిస్తూ ఉంటా,
ఆ మధుర స్మృతులు
అనుక్షణం తలుచుకుంటూ.....
బ్రతికేస్తా....
నీ తలపుల తో
నిను బ్రతికించుకుంటూ...
నా హృదయం లో.....

రచన : ఆచంట గోపాలకృష్ణ

Friday, 8 September 2017

నాన్నంటే నే ప్రేమ .... కధ


నాన్నంటే నే ప్రేమ .... కధ 

రచన : ఆచంట గోపాలకృష్ణ 

ఆరోజు  సంజయ్  ఆలస్యం గా  ఇంటికి  వచ్చాడు. జీతం  తక్కువ , పని  ఎక్కువ . 
సారీ  నాన్న  ఇవాళ  కొంచెం  ఆలస్యం అయ్యింది. నీకు  ఆకలేస్తోందా ఒక పావుగంటలో  అన్నం వండేస్తాను .డబ్బాలో  నువ్వు తినడానికి  పెట్టాను  ,కాఫీ ప్లాస్క్ లో  పోసాను గా  , తీసుకున్నావ అంటూ ప్రేమగా  అడిగాడు . ఆ  తిన్నాను గానీ  ,నువ్వు  కనీసం  కాఫీ  అయినా తాగావు రా  ,ఆ పని  తిరుగుడు  ఉద్యోగం .నేను  అన్నం కుక్కరు  పెట్టేస్తానులే . మీ అమ్మే  బతికుంటే  మనకు  ఇన్ని కష్టాలుఉండేవి కాదు.దానికి  తొందరెక్కువ  ముందే  గోడెక్కేసింది . నిన్ను  వదల లేక  దాని కూడా పోలేక  ఇలా గడుపుకు  వస్తున్నాను . నువ్వు  పెళ్లి  చేసుకోరా . ఇంట్లో  దీపం  పెట్టే దిక్కు లేదు అని  అన్నాడు .కాళ్ళు ,చేతులు  కడుక్కుని  వచ్చి  కూర  స్టవ్ మీద  పెట్టి ఆ  విషయమే  నీతో మాట్లాడదామనుకుంటున్నాను  నాన్న . సుధ అని  మా  ఆఫీస్  లో  పని  చేస్తుంది . తనకు నేనంటే  ఇష్టమే . ఇద్దరం  ఉద్యోగాలు  చేస్తేగాని గడవడం  కష్టం  ఈ రోజుల్లో , అందుకే  నువ్వు ఒప్పుకుంటే  ఆ అమ్మాయిని  పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను  అని  అన్నాడు .నువ్వు  ఒక  ఇంటివాడివి  అయితే నాకు  మాత్రంసంతోషంగా  ఉండదా .అయితే  ఆ అమ్మాయిని  ఒకసారి  తీసుకురా నేను  చూస్తాను  అని  అన్నారు . అన్నట్టు   చెప్పడం  మరిచాను  ఆ అమ్మాయి గురించి  ఒక  ముఖ్యమైన  విషయం  చెప్పాలి తను   అనాధ . చిన్నప్పటినుండి  ఆశ్రమం  లోనే  పెరిగింది  .చదువుకుని  ఉద్యోగం సంపాదించింది .తనకు మనం  తప్ప  ఎవరు  లేరు మరి  అన్నాడు.తండ్రి   చిరునవ్వు  నవ్వాడు . ఏం నాన్న   ఆలా నవ్వారు  అని   అడిగాడు . ఏంలేదులే  మనమే  అనాథలం  మనకు   ఇంకో అనాధ . సరేలే  మనం  ముగ్గురు  కలిస్తే  ఒక  కుటుంబం.ఆ పిల్లనే చేసుకో. ఒకరికి ఒకరు సాయం గాఉంటారు అన్నాడు.తండ్రి.ఇద్దరికి పెళ్లి చేసేసాడు.కొన్నాళ్ళు బాగానేగడిచింది. ఇద్దరు కేరెజి సర్దుకుని మామయ్యగారికి టేబుల్ మీద పెట్టేసి ఆఫీస్ కి వెళ్లిపోతారు.కాఫి కలుపుని తాగుతారు తనకి కావలిసినఅప్పుడు. సాయంత్రం మళ్ళీ వంట...పెద్ద వాడుఅవడము చేత కాఫీ కలుపు కునేటప్పుడు స్టోమీద వలికేది.మళ్ళీ అవి అన్ని కడుక్కుని వంటచేయాల్సి వచ్చేది.తరువాత ఫలాస్క్ లోపెట్టేది...ఆ రోజు స్టో మీద మళ్లీ ఒలికింది...మామయ్య గారూ మీకు ఫలాస్క్ లో పెట్టానుకదామళ్ళీ ఏమైంది ఇదంతా పాడుచేశారు....అంటూవిసుక్కుంది.ఇవాళ న స్నేహితుడు ఒకరువచ్చాడు..అతనికి కలిపే ప్రయత్నం లోఒలికింది.అమ్మా అన్నాడు...ఇలా రోజు ఏదో ఒక కారణం తో విసుగు కోవడంమొదలు పెట్టింది.
కొడుకు మనసు బాధ పడకూడదని ఈవిషయాలు చెప్పేవాడు కాదు.ఈ ముసలి ఆయన చాదస్తం ఎక్కువగా ఉందిఅంటూ తన సహచరి కి చెప్పింది. అసలే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు.. ఆయన్నిఆశ్రమం లో చేర్పిస్తే... 
వెళ్లి చూసి రావచ్చు.పైగా అన్ని వాళ్ళేచూసుకుంటారు.రేపు పిల్లా జల్లా పుడితే పని భారం పెరిగేదే కానీతరగదు... బాగా ఆలోచించు కో అంటూ నూరిపోసింది.ఆ విషయం అమ్మాయి తలకి ఎక్కేసింది. ఇంటికి వెళ్ళగానే ఆయన్ని ఒప్పించాలి అనినిర్ణయం తీసుకుంది. ఆరాత్రి ఏమండీ అటు ఆఫీస్ లోను ఇటుఇంట్లోనూ చాకిరి ఎక్కువగా ఉంటోంది. 
రేపు పిల్లలు పుడితే ఇంకా ఎక్కువ అవుతుంది.అందుకే మామయ్య గారిని ఆశ్రమంలో చేర్పిస్తేపని భారం కొంచెం తగ్గుతుంది.
వారం వారం వెళ్ళి చూసి రావచ్చు .
మీరు ఈ విషయంలో కాస్త ఆలోచించండి అంటూతినడం మొదలు పెట్టింది. 
మొదట్లో వద్దన్నా రాను రాను నస ఎక్కువఅవడం తో ,సరే మాట్లాడతా లే ఇంకా పడుకో అనివిసుక్కున్నాడు.ఆ రాత్రి పెద్దాయన వాళ్ళ మాటలు విన్నాడు.తన భార్య ఫోటో దగ్గర కు వెళ్లి చూసావా, ఎలాతయారయ్యారో, పిల్లలు.ముసలితనం బరువైపోయింది.
వాళ్ళు కన్న పిల్లల కోసం ఎన్ని కష్టాలు అయినాపడతారు... వాళ్ళు పెరగడానికి కష్టాలు పడిన వాళ్ళనుమాత్రం  పట్టించుకోరు...
ఇదేమి పోకడో అర్థం కాదు...వాడు నాకు చెప్పలేడు.పెళ్ళాం మాట కాదనలేడు...
మధ్యలో నలిగి పోతున్నాడు... 
నేనె వెళ్లిపోతాను..అంటూ కళ్ళ నీళ్లుతుడుచుకున్నారు. మారునాటి ఉదయం తండ్రి దగ్గరకు వచ్చాడు ..నాన్న అది అది...అంటూ నసిగాడు...ఏంటిరా నువ్వు చెప్పదల్చుకున్నది నాకు అర్థంఅయ్యిందిలే... నేను వెళ్లిపోదామని నిర్ణయము తీసుకున్నాను...అంటే అది.. అన్నాడు నేను అంతా విన్నాను రా..
ని సుఖం కన్నా నాకు కావలసినదిఏముంటుంది...నా సంచి సర్దేశాను... నువ్వు ఆశ్రమం లోదిగబెట్టెయ్...
అంటూ తన భార్య ఫోటో కూడా సంచిలోపెట్టుకుంటూ, "నేను ఎక్కడ ఉంటే అది అక్కడే...పాపం నన్నువిడిచి ఉండలేదు "అన్నాడు.
నన్ను క్షమించు నాన్నా అన్నాడు.ఏమి పరవాలేదు...బయలు దేరు..మళ్ళీ నిఆఫీసు కి లేట్ అవుతుంది.అలాగే టిఫిన్ చేసి బయలుదేరదాము అన్నాడు.ఇద్దరు ఆశ్రమం చేరుకున్నారు..నాన్నా మీరు ఇక్కడ కూర్చోండి... 
నేను ఇప్పుడే ఫోరం ఫీల్ చేసి వస్తాను...అంటూలోపలికి వెళ్ళాడు.పెద్దాయన అక్కడే ఉన్న అరుగు మీదకుర్చున్నాడు.
అక్కడే కూర్చుని ఉన్న ఒక ఆయన పెద్దాయన కేసిపరిశీలనగా చూసి...గుర్తుపట్టి...అయ్యా నమస్కారం..నన్ను గుర్తుపట్టారా... విశ్వనాధాన్ని..ఎలా ఉన్నారు...చూసి చాలా ఏళ్ళు ఐయింది.ఆ నమస్తే...వృద్ధాప్యం కదా వెంటనే గుర్తు పట్టలేకపోయాను...ఎలా ఉన్నారు...ఏదో ఇలా...పిల్లలు అమెరికాలో, నేను ఆశ్రమంలో...ఏదో కాలక్షేపం.. 
బ్రతికి ఉన్నంత కాలం బ్రతుకు ఈడవాలికదా..అంటూ నిట్టూర్చారు... ఆరోజుల్లో మీ ఆదర్శాలు చూసి చాలాచెప్పుకునేవాళ్ళం.
అన్నట్టు మీరు ఈ ఆశ్రమం నుండి ఒక అబ్బాయినిదత్తత  తీసుకున్నారు గా ,
పెద్ద వాడు అయి ఉంటాడు ...ఏంచేస్తున్నాడు..అని అడిగారు.
అదిగో ఆ వెళ్లిన వాడే .ఇప్పుడు నన్ను చేర్చడానికివచ్చాడు ,అంటూ నవ్వారు...
కలికాలం అండి.... అన్నారు. ఇంతలో కొడుకు బైటకు వచ్చాడు. నాన్నా అన్ని మాట్లాడేసాను..నువ్వు నిశ్చింతగాఉండొచ్చు....
నేను నెలకొక సారి వచ్చి చూసి వెళుతూఉంటాను...మందులు అవి టైంకి వేసుకో...జాగ్రత్త...అన్నాడు...అలాగే చూసుకుంటాను లేరా నువ్వు వేళ్ళు....నేనే లోపలికి వెళతాలే...అంటూ లోపలికి వెళ్లారు, కన్నీటి  పొరలు తుడుచుకుంటు...బైట విశ్వనాధం గారితో మాట్లాడడం చూసాడు, ఆయన దగ్గరకు వెళ్లి నమస్తే అంకుల్.. మీరు నాన్నగారు మాట్లాడుకోవడం చూసా..కొంచెం ఆయనను చూస్తూ ఉండండి...నేను వారం వారం వస్తూ ఉంటాను..అన్నాడు...అలాగే బాబు... నాన్న చాలా గొప్ప వ్యక్తి...మాఅందరికి బాగా తెలుసు.చూస్తూ ఉంటాలే...నువ్వు వెళ్ళిరా...అన్నాడు....ధన్యవాదాలు అంటూ బండి స్టార్ట్ చేస్తున్నాడు....ఒక్కసారి ఇలా వస్తావా బాబు అన్నారు.బండి సైడ్ స్టాండ్ వేసి దగ్గరకు వచ్చాడు...ఏమిటి అండి పిలిచారు అన్నాడు.లాగి పెట్టి ఒక్క లెంపకాయ కొట్టాడు...
దిమ్మ తిరిగి పోయింది...ఆశ్చర్యం తో ఏమిచేస్తున్నారు అని అడిగే లోపే రెండో చెంప వాయించేశాడు...ఇంక నువ్వు వెళ్లొచ్చు అన్నాడు...నెమ్మదిగా....కళ్లనీళ్లు తిరుగుతూ...అసలుఏమైంది మీకు ఎందుకు కొట్టారు...
అని అడిగాడు కోపంగా...నువ్వు చేసిన పనికి ఇంతటితో సరిపెట్టాను... అసలు నువ్వు ఎవరో తెలుసా... అనిఅడిగాడు... 
నేను ఆయన కన్న కొడుకుని....ఆయనచెప్పారుగా.. అన్నాడు....అదే ఆయన గొప్పదనం...నువ్వు ఆయన కన్నకొడుకువి కాదు....
ఇదే ఆశ్రమం లో అనాధవి... ఆయన నిన్ను దత్తత తీసుకుని పెంచి పెద్దచేసాడు..
నువ్వేమో ఆయన్నే ఈ ఆశ్రమానికి దత్తతఇచ్చేసావ్...నువ్వు మనిషి వేనా....
కనీసం ఇప్పుడు కుడా ఆ విషయం నీకుచెప్పలేదు..అది ఆయన గొప్పదనం... అన్నాడు.
ఒక్కసారి భూమి లోకి కృంగి పోయినట్లుంది....తల తిరిగి పోయింది...నాకు ఈ క్షణం వరకు తెలియదు..కాదు తెలియకుండా పెంచాడు...అంతటి మహనీయుని పట్టుకుని ఆశ్రమమ్ లోచేర్పించా...ఎంత పెద్ద తప్పు జరిగి పోయింది...అయ్యో...నా పాపానికి నిష్కృతి లేదు....వెంటనే సరిదిద్దుకోవాలి.....ఇప్పుడే ఆపనిచేస్తాను...అంకుల్ ఇప్పుడే వస్తాను.నా తప్పుసరిదిద్దుకొంటాను...మీరు చెప్పబట్టి సరిపోయింది....లేకపోతే జీవితం లో సరిదిద్దుకోలేని తప్పు చేసిఉండేవాడిని... అంటూ ఇంటికి బయలు దేరాడు.ఇంట్లో ...
ఏమండీ దిగబెట్టేసారా..ఏదైనా గొడవ చేశారా...అంటూ అడిగింది..ఆ కళ్ళలో నీళ్ళు ఏమిటి ఏమైంది అనిఅడిగింది... లాగి లెంపకాయ కొట్టాడు...మనం ఎంత పెద్ద తప్పు చేశామో తెలుసా....అంటూ జరిగింది చెప్పుకు వచ్చాడు...నిజమే మమమే అనాధలము అయివుండి, ఆ విషయం మార్చి పోయి ,ఆయనను అనాధ గావదిలేసాము,  మనం వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోవాలి....పదండి ఆఫీసు తరువాత ముందు మామయ్య గారిని తీసుకుని వచ్చేద్దాము....అంటూ బయలు దేరింది.... ఆశ్రమం లో ఇద్దరు ఆయన కాళ్ళ మీద పడ్డారు..క్షమించండి మామయ్య గారు..మా వలన పొరపాటు జరిగిపోయింది....
ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించం... దయచేసి ఇంటికి వచ్చేయండి....అనిబ్రతిమాలారు...
పిల్లలు తెలియక తప్పు చేశారు...
వాళ్ళని క్షమించి... ఇంటికి వెళ్ళండి...అన్నాడువిశ్వనాధం...వాళ్లే నా ప్రాణం అయినప్పుడు ,వాళ్ళు మీద కోపంఎందుకుంటుంది....
తప్పకుండా వెళతాను....అంటూ ఇద్దరి తల మీదా చేయి వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు...ఆయన కళ్లలోంచి ఆనంద భాస్ఫాలు వాళ్లతలమీద అక్షింతలు గా పడ్డాయి... 
అంతే కాదు నాన్నగారు ఈ రోజు నేనుముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను.
మేము ఇద్దరమూ కూడా పిల్లలని కనము..
ఇదే ఆశ్రమంలో దత్తత తీసుకుంటాం...
మీ ఆదర్శాలకి వారసులు గా నిలుస్తాము...అన్నాడు.ఆయన పిల్లల ఇద్దరి భుజాల మీద ,చెరో చేయివేసి ,
అందరూ ఆనందం గాబైటకీ నడిచారు.

శుభం

బృందావని లో ...... నంద కిశోరా


బృందావని లో ......  నంద కిశోరా
నీ రాకకై  వేచెను రా. ..
చల్లని గాలి  వీచినా
నీ  ధ్యాసే,
చిగురాకు కదిలినా
 నీ ధ్యాసే
నా మది చేసే వేణు గానము
నీ హృదయము తో
నువు వినలేదా...
విరహముతో తపించు
నా మనసు బాధ
నువు కనలేవా
కృష్ణా..
.......కానగ రావా...
చిరుగాలి కి ఊసులాడు
చిగురాకుల సవ్వడి చిరు
సందడి చేస్తుంటే
ఘాము గడిచినా
నీ జాడ లేక
వెన్నెలంతా వేలవెల పోతుంటే
అదురు, బెదురుల
లేడి కన్నుల లా
నీ రాక కై ఎదురు చూస్తున్న
కన్నుల నిండుగా
వెలుగులు నింపగ
కాన రావేల... కృష్ణా..
ఇంత జాగేలా...
రచన..ఆచంట గోపాలకృష్ణ

మన తెలుగు



మన తెలుగు

వెండి వెన్నెల వెలుగు
మంచు పూల తళుకు
విరి తేనెల చినుకు
అమ్మ మనసు లాంటి పలుకు
పదహారణాల పల్లె పడుచు...
మన తెలుగు
ఆదికవి అమ్ముల పొది మన తెలుగు
కృష్ణ శాస్త్రి కవితల పొంగు మన తెలుగు
విశ్వనాధుని వేయి పడగల వెలుగు మన తెలుగు
శ్రీశ్రీ అక్షరాయుధమ్ మన తెలుగు
శ్రీకృష్ణ దేవరాయలు మనసు దోచిన  మన తెలుగు
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్  మన తెలుగు...
దేశ భాషలందు తెలుగు లెస్స....

రచన.. ఆచంట గోపాలకృష్ణ

నిశీధి లో


నిశీధి లో నా ఆశల
చరమ గీతం...
పిలుస్తోంది నిన్ను చేరాలని...
అయినా.....
జీవించే ఉంటా తుది శ్వాస వరకు...
నీ జ్ఞాపకాలతో....
జీవిస్తూ ఉంటా,
ఆ మధుర స్మృతులు
అనుక్షణం తలుచుకుంటూ.....
బ్రతికేస్తా....
నీ తలపుల తో
నిను బ్రతికించుకుంటూ...
నా హృదయం లో.....

రచన : ఆచంట గోపాలకృష్ణ

వనిత


వనిత

వనితలు
కానే కాదు ఎన్నటికీ
వంటింటి కుందేళ్లు
తెలుసుకో
బంధనాల  ( కట్టుబాట్లు) విహంగాలు
 "అవి"
తెంచి చూడు  బంధానాలు
ఎగర గలవు
కీర్తి శిఖరాల కిరీటం లో
కలికి తురాయి లై
అంబరాన్ని తాకి ,
గగనాన్ని ఏలే
సామర్ధ్యం వారి సొంతం
నిరర్ధక కట్టుబాట్లతో
వేయద్దు
వారి భవిష్యత్ కి  సంకెళ్లు
స్వచ్ఛమైన గాలి,
స్వచ్చమైన నీరు తో
పాటు స్వేచ్చావరణము ఇచ్చి చూడు
అబల లు కాదు సబల లు
సకల  కళా సరస్వతులు
మానవాళి మనుగడకు వారసులు.

రచన.: ఆచంట గోపాలకృష్ణ

నామది నిన్నే వలచినది


నామది నిన్నే వలచినది
నీతో నే అది నడిచినది
ఎన్నో ఊహలు విరిసినవి
అవి నిన్నే తలచి మురిసినవి.....
ఎదలో రాగాలే
ప్రేమ గీతాలై
కమ్మని కావ్యం లా..
నా ముందే నిలిచిందే....
మురిపించే ఆ రూపం
ముగ్ధ మనోహర మందారం
చాలవులే మాటలు
నిను వర్ణించాలంటే.....
నా ఆశలు నీ తోనే
నా ఊహలు నీ తోనే
నా ఊసులు నీ తోనే
నా ప్రాణాలన్ని నీ తోనే
జీవితమంటే ఇంతానందం
నిను చూసే దాక తెలియదులే........

రచన ..ఆచంట గోపాలకృష్ణ

నవ్య గీతం..........కధ

నవ్య గీతం...... కధ 
రచన : ఆచంట గోపాలకృష్ణ

శుభోదయం అంటూ  లోపలికి వచ్చాడు. రమేష్.. 
ఆ రారా.. రమేష్... ఇవాళ మన ప్రోగ్రామ్స్ ఏమిటిఅని అడిగాడు విజయ్. 
విజయ్ పెద్ద బిజినెస్ మాగ్నెట్. తన పట్టుదల కృషితో ఎన్నో విజయాలు సాధిస్తూ...ముందుకుసాగిపోతున్న యంగ్ డైనమిక్  కుర్రాడు.. 
రమేష్ అతని ఫ్రెండ్...తన కార్యదర్శి గాపెట్టుకున్నాడు... 
కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టడం వలన చాలా మందికిఉపాధి అవకాశాలు ఉంటాయి 
అని ఎప్పుడు అంటాడు... 
ఇంతలో రమేష్ ఫోన్ మోగింది....... హలొ...ఆ...ఆ....లోపలికి పంపించు అని 
చెప్పిపెట్టేసాడు ఫోన్. 
అన్నట్టు విజయ్ మనం కొన్ని పొలాలుకొందామనుకుంటున్నాముగా..ఆ విషయం పై మాట్లాడడానికి రామయ్యా గారువచ్చారు. లోపలికి రమ్మన్నాను....అన్నాడు రమేష్అలాగా ...సరే..అన్నాడు విజయ్... రామయ్యా గారులోపలికి వచ్చారు...నమస్తే బాబు అని పలకరించారు.. నమస్తే అంకుల్.. రండి కూర్చోండి ,అంటూ కుర్చీచూపించాడు. చెప్పండి అంకుల్ 
అన్నాడు... రమేష్ నువ్వు కూర్చో....మాట్లాడాలి... కాసేపుఫోన్ లు ఏవి నాకు ఇవ్వద్దు అని చెప్పు... అలాగేకాఫీ .....కూడా చెప్పు న్నాడు విజయ్.చెప్పండి అంకుల్ ఆన్నాడు. 
బాబూ... ఈ రోజులలో వ్యవసాయం చాలాకష్టమైపోతూ ఉంది. 
విత్తనాలు ,ఎరువులు ఒక్కో సారి బాగుంటే,ఒకసారి కల్తీ...అప్పులు చేసి చేస్తున్నాము..వ్యవసాయం ............. నీళ్లసమస్య....రోజు పేపర్ లో చూస్తూనే 
ఉండిఉంటావు...ఏదో సంఘటన.. జరుగుతూనేఉంది...వ్యవసాయం మా ప్రాణం
...కానీ అదేప్రాణాలు హరిస్తుంటే....దిక్కు తోచని పరిస్థితి లోమా పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది...
 మీరేఏదన్నా..మంచి రేటు చూసి ఏర్పాటు చెయ్యాలి బాబూ అన్నారు రామయ్య గారు  ఇదిగో ఈ రమేష్... మన ఊరి వాడే కదా...ఏదైనాసహాయం చేయగలడేమో అని తనతో అంటే...నీకు చెప్పి మాట్లాడతాను
అన్నాడు...అందుకే వచ్చాను బాబు అన్నాడు. అవును విజయ్ ..అప్పుల 
బాధచూడలేక...నమ్ముకున్న భూమి ని వదులుకోలేక...రోజు గడిచే దిక్కు లేక 


,పాపం చాలాబాధ పడుతున్నారు . దేశానికి రైతే వెన్నెముక అన్నారు...
ఆలాంటి రైతులుఈ రోజుల్లో అగచాట్లు  పడుతున్నారు.... ఉన్నదిఅంతా అమ్మేసుకుని పట్నం వెళ్లిపోదామనుకుంటున్నారు .అన్నాడు. 
మనకి కొత్త ప్రాజెక్ట్ కి భూమి కావాలి గా..అందుకేరెండు విధాలా బాగుంటుంది 
పిలిపించాను...అన్నాడు... సరే అంకుల్... నేను రమేష్ మీ ఊరు
వస్తాము.అక్కడే అన్ని మాట్లాడుకుని ఒకనిర్ణయానికి వద్దాం ....ఎప్పుడు వచ్చేది 
రమేష్ మీకు ఫోన్ చేస్తాడు.మీరు ఏమి అందోళనపడకండి...నాదగ్గరకువచ్చారుగా ..నేనుచూసుకుంటాను... అన్నాడు విజయ్. The చాలా సంతోషం బాబు... అన్నాడు ఆత్మీయం గా. 
అయితే నేను రామయ్య గారిని బస్ స్టాండ్ దగ్గర ,డ్రాప్ చెసి వస్తాఅన్నాడు రమేష్.... ముందు ఇంటికి వెళదాం. భోజనాలు ఐయ్యాక అప్పుడు డ్రాప్ చేద్దువు లే....చిన్నప్పుడు మీ ఇంట్లో ఆడుకున్న ఆటలు అన్నిఇంకా గుర్తున్నాయి.... మిమ్మల్ని చూస్తే నాన్నగారు కూడా చాలా  సంతోషిస్తారు అన్నాడు..విజయ్ .. 
మళ్ళీ ఎందుకు బాబు శ్రమ ...నే వెళతా లే అన్నాడు... అదేం కుదరదు ,ఇప్పటికి 
మీరు నా మాట   వినాల్సిందే అంటూ ....బయలు దేరాడు....ఒరేయ్ రమేష్ కార్ 
తీయరా...ఇంటికీ పోదాం...అన్నాడు...అలాగే అంటూ ముందు బయలు 
దేరాడు..  ఇంట్లోకి రాగానే ,నాన్నగారూ  గ్రామం నుంచి రామయ్య గారు వచ్చారు... 
ఏవో పొలాల పనిమీద. తిరిగి వెళ్లి  పోతానంటే,భోజనం చేసి వెళతారని 
తీసుకుని వచ్చా...అన్నాడు.  రండి రండి రామయ్య గారు... ఊరిలో 
అంతాకులాసాయేనా...చాలా సంవత్సరాలు ఐయింది.. మిమ్మల్నిచూసి... చాలా సంతోషం... అయినా.. మావురు వచ్చి మాఇంట్లో భోజనంచెయ్యకుండా ఎలా వెళ్లనిస్తా మనుకున్నారు... మీ ఊరు వస్తే...ఎన్ని మర్యాదలు....చేస్తారు...అందులో సగమైనా చేయాలిగా మరి మేము... అంటూ సాదరంగా ఆహ్వానించారు. అంతా 
మీమంచితనం అండి... కృష్ణమూర్తి గారు...ఎంత సంపాదించినా ..ఎక్కడా ఆ దర్పంకనిపించదు... అందరిని ప్రేమగా చూస్తారు... అదిమీ గొప్పతనం అండి అన్నారు... నమస్తే అన్నయ్య గారు బాగున్నారా...రండిభోజనాలు వడ్డించేశా... తింటూమాట్లాడుకుందురు గాని అంటూ పలకరించింది...కృష్ణమూర్తి భార్య..
బాగానే ఉన్నాం తల్లీ... మా ఊరిలో ఉండే టప్పటికృష్ణమూర్తి వేరు, పట్నం వచ్చేసాక కృష్ణమూర్తివేరు..బాగా సంపాదించాడుగా....చూడాలనిమనసులో ఉన్నా ....పలకరించడానికి ధైర్యంచాలలేదు.... అందుకే ...



అలా వెళ్లిపోతానన్నాను... అదే మంచితనం , అదేప్రేమ ఏ మార్పూ లేదు.. చాలా
 ఆనందంగా ఉందిమిమ్మల్ని చూసి అన్నాడు. ఆ రోజులు ఎలా మర్చిపోతాము 
అన్నయ్యగారు...మీరు అందరికి సహాయ పడుతూ...మీపేరు ప్రఖ్యాతులు... ఊరు అంతా మీ మాటకిఎంతో గౌరవం ఇచ్చేవారు...ఇప్పటికి అంతే పిన్ని ...చుట్టు పక్కలగ్రామాల్లో.. రామయ్య గారంటే చాలా గౌరవం...అందుకే వాళ్ళందరి తరపున ఈయనవచ్చారు..అన్నాడు రమేష్. 
ఒరేయ్ విజయ్ మనం కష్టాలలో ఉన్నప్పుడురామయ్య గారు ఎంతో సహాయం చేసారు... అదినేను ఎప్పటికి మర్చిపోలేను...వారు ఇన్నాళ్ల కిఏదో కావాలని వచ్చారు....అది ఎలాంటిదైనా సరే నీవు చేసిపెట్టు 
అన్నారు కృష్ణమూర్తి గారు.సరే నాన్నా... ఒకసారి వాళ్ళ ఊరు వెళ్తాను..అక్కడే ఉండి వారికి ఏమి కావాలో చేస్తాను..అన్నాడు..
అన్నట్టు రామయ్య గారూ మీకు  ఒక అమ్మాయి కదా..
ఎప్పుడో చిన్నప్పుడు చూసాం...అన్నాడు. 
అవునండీ  అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది...

భగవంతుడు అనుగ్రహిస్తే ఈ ఏడు పెళ్లి చేద్దాముఅనుకుంటున్నాము..
డబ్బు అన్ని సర్దుబాటు కావాలిగా...

అలాగా మేము  కూడా మా విజయ్ కి  సంబంధాలు చూస్తున్నాం...
మా వాడిని మీరు చూశారుగా...అన్నారు...
ఎంత మాట...మీ తాహతు కి మేముతూగ గలమా...అన్నారు రామయ్య. 
నిజానికి మీ ఇంటినుంచి పిల్లని 
తెచ్చుకోవడం మాఅదృష్టం...
కానీ విజయ్ కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే... 
ఇద్దరు ఒకరి కి ఒకరు నచ్చితే నే మనముముందుకు వెళదాము...ఏమంటారు.. .
ఒరేయ్ విజయ్ పనిలో పని అమ్మాయి ని కూడాచూసేయ్... ఎలాగూ వెళుతున్నారు గా...
మేము చూడాల్సిన అవసరం లేదు.. 
ఎందుకంటే.. రామయ్య గారి లాంటిగౌరవనీయులు తో సంభందంకలుపుకోవడము.

..గొప్ప విషయం...
సరే నాన్నగారు...నేను ఆఫీస్ కి వెడతాను.. 
ఒరేయ్ రమేష్ ఆయనని దిగబెట్టి నువ్వు 

ఆఫీస్ కిరా..ఉంటాను అంకుల్... నమస్తే... అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. 
మరి నాకు కూడా సెలవిప్పించండి కృష్ణమూర్తిగారు...అన్నారు రామయ్య. 
శుభం అంతా మంచే జరగాలి అంటూ ,  ఒరేయ్ రమేష్ వాడు ఏదో వంకలు 
పెడతాడు..
వెధవ వేషాలు వేయకుండా...ఈ పెళ్లికి 
ఒప్పించేబాధ్యత నీది... అర్థం అయిందా..
అన్నాడు...
సరే ,అవన్నీ నేనుచూసుకుంటాను...
బయలుదేరదామా రామయ్యగారు...
అంటూ బైటకు నడిచాడు.
రామయ్య గారు  రాత్రికి ఇల్లు చేరుకున్నారు .సుజాతమ్మన్నీళ్ళు అందిస్తూ ఏమండీ 
వెళ్లిన పనిఏమైంది..అంతా బాగానే ఉంది కదా అంటూపలకరించింది.
ఆ రమేష్ ఉన్నాడుగా...వాడే అన్ని దగ్గరుండి చేసిపెట్టాడు...కృష్ణ మూర్తి గారి అబ్బాయి ఇపుడుచాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు.అతనితో మనసమస్య
 ల గురించిచర్చించాను...అన్నాడు. 
ఇదిగోనండీ తువ్వాలు.... భోజనంవడ్డించేస్తాను..ఎప్పుడనగా తిన్నారో.ఏమో..అంది... కంగారు ఏమి లేదులే...విజయ్ వాళ్ళ
 ఇంటికి వస్తేగానీ వీలుకాదు అని తీసుకు వెళ్ళాడు...సుష్టు గాభోజనం చేసే వస్తున్నా....
ఎంత మర్యాద...అణుకువ... డబ్బున్నదన్న దర్పంఎక్కడా లేదు...
కృష్ణమూర్తి గారు, భార్య నిన్ను అడిగాననిచెప్పామన్నారు...వాళ్ళు మనలని ఇంకామర్చిపోలేదు... అన్నాడు.. 
అవునండి....నాకు ఇంకా గుర్తుంది 
వాళ్ళుఇక్కడున్న ప్పటి రోజులు....చాలా 
కష్టాలుపడ్డారు... పట్నం వెళ్లిన తర్వాత 
బాగా కలిసివచ్చినట్టు ఉంది...
అన్నట్టు అమ్మాయి ఏది కనిపించలేదుఅన్నాడు... 

ఏదో చదువుకుంటుంది...లోపల ఉంది...
అమ్మాయి లక్ష్మీ నాన్నగారు వచ్చేసారు..
. నువ్వురా భోజనం చేద్దువు గాని... అంటూపిలిచింది...అలాగే అమ్మా అంటూ వచ్చింది...హాయ్ నాన్న ఎంతసేపు అయింది వచ్చి అంటూకుర్చీ చేతిమీద కూర్చుంది....
ఇప్పుడే రా... రా భోజనాలు చేస్తూమాట్లాడుకుందాం. అంటూ లేచారు...
ఇంతలో నారాయణ వచ్చాడు...
అన్నయ్యా ,వచ్చావా ఊరిలో అందరూ అడిగారు ఎప్పుడు వస్తావని... 
నీ మాటకై ఎదురు చూస్తున్నారు... అన్నాడు...అన్ని చెపుతా గాని నువ్వు రా భోజనం చేద్దువుఅని పిలిచాడు... 
లేదన్నయ్యా నేను ఇపుడే చేశా... మీ 
మరదలునీకు ఇష్టమైన కూర చేసిందని 
తీసుకు వచ్చా...వదినా ఇదిగో అన్నయ్య కు వడ్డించండి అంటూబాక్స్ ఇచ్చాడు... 
ఏమయ్యా మరిది , కూర మీ అన్నయ్య కేనామాకు ఏమైనా ఉందా..
అని నవ్వుతూ అడిగింది...

ఉరుకోండి  వదినా అందరకీ తెచ్చాను...
మీరుమరీనూ అన్నాడు...నారాయణ.  
రామయ్య గారి తమ్ముడు ఈ నారాయణ,
రామయ్య గారి ఎదురింట్లో నే ఉంటాడు...తండ్రిఇచ్చిన రెండు ఇళ్ళు ఇద్దరు చెరి ఒకటితీసుకున్నారు...మీ ఆవిడని కూడా ఒకసారితీసుకు రా నారాయణ ...మాట్లాడాలి 

ఈ లోపు భోజనాలు ముగించేస్తాము...
.సుజాతానువ్వు  భోజనం చేసేయ్... అందరం కూర్చునిమాట్లాడుకోవాలి....అన్నారు రామయ్య...అంతముఖ్యమైన పని ఏంటబ్బా అనుకుంటూ...తానుకూడా భోజనానికి కూర్చుంది...సరే అన్నయ్యానేను వెళ్లి తనని తీసుకు వస్తాను... అంటూవెళ్ళాడు.. భోజనాలు పూర్తి ఐయ్యాయి 
రామయ్య గారు పడక కుర్చీ లో  విశ్రాంతి గా కూర్చున్నారు.  నారాయణ కోసం ఎదురు చోస్తూ..సుజాత వంట ఇల్లు సరసుకుంటోంది..లక్ష్మీ తండ్రి దగ్గరకు వచ్చింది ...కుర్చీ చేతి మీద కూర్చుని  .నాన్నా నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి...

అంది 
..ఏంటమ్మా అది .అదే.....బాబాయ్ 
కూతురురాణి , ఆ పట్నం లో ఉంటాడు గా రమేష్ అనిఅతని ని ఇష్టపడుతోంది ..
కానీ బాబాయ్ కి చెప్పే ధైర్యం లేదు...ఇద్దరు ఒకేకాలేజ్ లో చదివారు..
చిన్నప్పటినుంచి తెలుసు...మీరే ఎలాగైనాబాబాయ్ ని ఒప్పించాలి ...
ఏమిటి  ప్రేమా అని అడిగారు...అలాంటిది ఏమిలేదు...అది తన అభిప్రాయం అంతే... అతనికితెలియదు ఈ విషయం..అన్నది..
సరే అయితే చూద్దాం ....అన్నారు.
అదే రోజు సాయంత్రం ....ఆఫీస్ లో
ఒరేయ్ విజయ్ గ్రామం వెళదామన్నావు..ఆదివారం ఫిక్స్చేసాను.
సరేనా...అలాగే గానీ 
నేను నీకు కొన్నిపనులు చెపుతాను ,వాటితో పాటు నేచెప్పినవిధం గా .డాకుమెంట్స్ రెడీ చేయించు... మనంఎలాగూ పొలాలు 
కొందాంనుకుంటున్నాముగా...ఎస్టిమేషన్ తో సహా అన్ని వివరాలు నాకుకావాలి 
సరేనా... అలాగే అన్నీ రెడి చేయిస్తా ...
నువ్వు చెప్పినట్టు.... 
నువ్వు నాకొక సహాయం చేసి పెట్టాలి...అనిఅడిగాడు. 
ఏంటిరోయ్ సహాయం అంటూ పెద్ద మాటలుమాట్లాడుతున్నావ్.
ఏదో విశేేషం ఉన్నట్లు ఉంది.
అది ...అది...అంటూ నసిగాడు...
హబ్బా చెప్పరా బాబు నస పెట్టక అన్నాడువిజయ్. 
నేను మరి ఆ రామయ్య గారి తమ్ముడు 
కూతురినిఇష్టపడుతున్నా...
ఎలాగూ వెళుతున్నాం గా ని పని తో పాటునాగురించి కూడా కొంచెం మాట్లాడరా...
ఒరేయ్ రాస్కెల్..నాక్కూడాతెలియకుండా...ఎన్నాళ్లు నుంచి ఈ వ్యవహారం...అంటూ అడిగాడు.
ఆబ్బె అదేం లేదు చిన్నప్పటి నుంచి కలిసిచదువుకున్నాం....
ఇష్టం అంతే.... ఇంకా ఆమెకి కూడా తెలియదు....
మొదటగా నా మనసులో మాట నీకె చెప్పాను...
ఫ్రెండ్ విగా నీతో కాక ఇంకెవరి తో చెపుతాను...నువ్వే ఎలాగైనా.

..సరే సరే.  ..ఇంక నాకు వదిలేయ్....
నువ్వు ముందు బయలు దేరు...ఏర్పాట్లుచేసేయ్...మిగతా విషయాలు నేనుచూసుకుంటా...నీ  పెళ్లి బాధ్యత నాది....అన్నాడు... 
రమేష్  హుషారు గా బయలుదేరి వెళ్ళాడు...
ఆరోజు రాత్రి రామయ్య గారింట్లో ఫోన్ మోగింది.లక్ష్మీ ఫోన్ తీసి ..హలొ ఎవరుకావాలి అని అడిగింది .
నాపేరు విజయ్ రామయ్య గారుకావాలి...అన్నాడు.... ఒక్కనిమిషం ..అంటూ....
నాన్నా నీకు ఫోను
అంటూ అరిచింది....రామయ్య గారు ఎవరు తల్లీఅని 
..హలొ అన్నారు....అంకుల్ నేను విజయ్ ని ,భోజనాలు ఐయ్యాయా.... మేము  ఈ ఆదివారం వస్తున్నాం...మీ ఏర్పాట్లుచేసు
కోండి....రైతులకు కూడాతెలియచేయండి....వాళ్ళతో మాట్లాడండి...నేనుడాకుమెంట్స్ తో వస్తాను..అన్నాడు 
.అలాగేబాబు...ముందు పెళ్లిచూపులు
కానిచ్చేేద్దాం...మధ్యాన్నం భోజనాలు అయ్యాక....రైతుల కార్యక్రమం 
చేసేద్దాం...అన్నారు... మీఇష్టం మరి ఉంటాను.. 
అన్నట్టు...మీ తమ్ముడి గారి కి కూడా 
అమ్మాయి ఉందట..మావాడి తో కలిసి చదువుకుందిట...వాడు ఇష్టపడుతున్నా డు... మీకుఅభ్యంతరం లేకపోతే...ఆ విషయం కూడా అక్కడమాట్లాడదామనుకుంటున్నాను. వాడికి 
అన్నినేనే.. వాడి విషయం లో మీరు 
ఆలోచించవలిసినఅవసరం లేదు.... అన్నాడు. 
సరే ఇక్కడికి వస్తారు గామాట్లాడుకుందాం....అంటూ పెట్టేసారు.
అమ్మాయి ఒకసారి ఇలా రా అంటూ కూతురినిపిలిచారు.ఏంటి నాన్న అంటూ వచ్చింది. ఇలాకూర్చో నీతో కొంచెం మాట్లాడాలి. అన్నారు.విజయ్ ఫోన్ చేసాడు.. రేపు 
ఆదివారంవస్తున్నారుట.మన రైతులకు 
తగిన ధర ఇచ్చికొనడానికి....
అది పక్కనపెట్టు. వాళ్ళ నాన్నగారు
కృష్ణమూర్తి గారు  నన్ను ఒకటి అడిగారు
.నిన్నువాళ్ళ ఇంటికి కోడలిగా చేసుకోవాలని...మనఇంటినుండి పిల్లను 
తెచ్చుకుంటే 
వాళ్ళకి గౌరవం ..
మాకు డబ్బు ముంఖ్యం కాదు...అన్నారు.
 నేనుమా అమ్మాయి ఒప్పుకుంటే నాకు 
అభ్యంతరంలేదు....అన్నాను. నీ అభిప్రాయం చెప్పుతల్లి.ఇందులో 
బలవంతంఏమీలేదు....అన్నారు...మీ ఇష్టమే నా ఇష్టంనాన్నా..ఏది మంచి అనుకుంటే అదిచేయండి...అన్నది లక్ష్మీ.  సంతోషం తల్లి నీ ఇష్టంలేకుండా నేను ఈ
 నిర్ణయం తీసుకోలేను.అందుకేనిన్ను ఒంటరిగా అడిగి ఇంట్లో వాళ్ళకిచెపుదామని ఆగాను.
రేపు వాళ్ళు వచ్చినప్పుడు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేయమన్నారు...
అయితే మరీ ఆ యేర్పాట్లు చేస్తాను మరి
ఆన్నారు రామయ్య.
 మీ ఇస్టము నాన్న..అంది. 
ఇంకో విషయం రాణి విషయం నాకు చెప్పావు కదా.ఇందులోవిశేషం ఏమిటినుంటే రమేష్ కూడా 

విజయ్ చేతఆడిగించాడు....
అలాగా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది..అవును. 
ఒకరి తో ఒకరు చెప్పుకోకుండా మనసులు ఎలాకలిసాయో చూడు...
నారాయణ తో మాట్లాడతానని మాటిచాను...నీ పెళ్లి విషయం మాట్లాడదామని మీ బాబాయ్ ని పిన్ని ని రమ్మని అన్నాను...పనిలో పని ఈ విషయం కూడా మాట్లాడేస్తాను....
అన్ని బాగుంటే మీ ఇద్దరి పెళ్లిళ్లు ఒకే సారిచేసేయవచ్చు... అన్నారు..
మంచి విషయం చెప్పారు....

..
మీరు అందరూ మాట్లాడు కొండి.  అంటూ 
ఎదురింటి వైపుపరుగెత్తింది.
అందరూ హాల్లో కూర్చున్నారు.రామయ్య గారు మొదలుపెట్టారు.
రేపు పొలాలు కొనడానికి... పట్నం నుంచి వాళ్ళువస్తున్నారు....
ఇంకా అంటూ జరిగినది చెప్పారు...మీ అభిప్రాయం కూడాచెపితే రెండు పెళ్లిళ్లు 
ఒకేసారి చేసేస్తాను..ఏమంటారుఅన్నారు.
నారాయణ తన భార్య వైపు చూసాడు..
సమ్మతమే అంటూతల ఊపింది.
నాకు ఏమి అభ్యంతరం లేదు అన్నయ్యా... మీకు ఏదిమంచి అనిపిస్తే ఆది చేయండి... అన్నాడు శుభం...
మరి ని మాట ఏమిటోయ్ అంటూ భార్యని అడిగాడు...
మీ మాటే నామాట....ఉరి మంచే ఆలోచించే మీరుకుటుంబము గురించి ఆలోచించరా..
అలాగే...అంది...రేపటి ఏర్పాట్లు గురించి 
నేను చూసుకుంటా అన్నయ్యా.... 
మరి బయలు దేరుతాము...అంటూ ఇంటికి వెళ్లారు.
ఊరి లోకి కారు వచ్చింది..రమేష్ కి ఇల్లు
తెలుసు కనుక డైరెక్ట్ గా రామయ్య గారి ఇంటి ముందు 
ఆగింది.
కారు లోంచి ఇద్దరు దిగారు. రామయ్య ,
నారాయణ అందరూ ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించారు. 
లోపలికి వచ్చిన తర్వాత కుర్చీ లో కూర్చున్నారు. 
పరిచయాలు ఐయ్యాక, ఫలహారం తీసుకుని వచ్చింది రాణి. 
విజయ్ ని చూసి నమస్తే విజయ్ గారు 
అంటూ పలకరించి ,రమేష్ ని చూసి 
హాయ్ రమేష్ అంటూ పలకరించింది. 
నాన్న గారు వాళ్ళు కూడా వస్తే బాగుండేది.అన్నారు రామయ్య ..
అవుననుకోండి. కానీ ఆయనకు మీ 
కుటుంబం మీద ఉండేగౌరవము అలాంటి ది... అన్ని ఒకే చేసుకుని మంచి రోజు అనుకుంటే ,ఆరోజు వస్తానని చెప్పారు. అన్నాడు విజయ్. 
మళ్ళీ వర్జం వచ్చేస్తుంది అమ్మాయిని తీసుకు రండి..అని పురమాయించారు...
కుందనపు బొమ్మలా ఉంది...ఒరేయ్ నేను
 చెప్పానా...ఎలాఉంది..అంటూ గుస గుస లాడాడు.
తొలి చూపులోనే బాగా నచ్చింది....
రాణి ఒకసారి ఇలారా అని పిలిచాడు విజయ్. చెప్పండి అంటూ
వచ్చింది....చెవిలో మెల్లగా అమ్మాయి కి 
మనస్ఫూర్తిగాఇష్టమైతే నే చేసుకోమను..
 నాన్న చెప్పారని.,నేనేదో ఉరికిసాయం చేస్తున్నానని గాని వద్దు....
నాకు అయితే తనని తప్ప వేరే వారిని చెలుకోవాలనిలేదు...కానీ తన అభిప్రాయాన్ని కూడా గౌరవించాలిగా...మీరు ఇద్దరు ఒక ఈడు వారు...నువ్వుకనుక్కో....అని..
.ఇంక అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి... అంటీ అన్నాడు....
ప్రశ్నలు ఏమైనా అడుగుతావా బాబు 
అన్నారు...
ఆబ్బె అలాంటిది ఏమి లేదండి...అంటూ నవ్వాడు....
లోపల రాణి చెప్పింది... అతని సంస్కారానికి  సంతోషపడింది. తనకు ఏమి అభ్యంతరం లేదు అనిచేసుకోవడానికి ఇష్టమే అని చెప్పింది....ఎరుపెక్కిన బుగ్గలమీద గట్టి గా ముద్దు పెట్టుకుని....నువ్వు సూపర్ అక్కా 
నిన్ను ప్రేమించేవాడు వచ్చాడు...ఇంకా నా సంగతేఅంది....
అన్నట్టు నీకో సర్ప్రైజ్... చెప్పనా...అంది..
లక్ష్మీ
ఏమిటీ.....నిన్న నాన్న బాబాయ్ తో మాట్లాడారు...నీకు రమేష్ కి పెళ్లి చెయ్యడానికి వప్పుకున్నా రు...ఇద్దరి పెళ్లిళ్లుఒకేసారి చేసేద్దామని నిర్ణయం తీసుకున్నారు....అంది....అక్కా నాకు 
తెలియకుండా ఇంత దాచావా... అంతే కాదు ఆ రమేష్ కూడా విజయ్ చేత ఆడిగించాడుట ...మీ ఇద్దరి మనసులో ఒకే మాట ఉంది...అంది లక్ష్మీ
నిజమా అంటూ గట్టిగా వాటేసుకుని... థాంక్స్అక్కా....అంది.ఇద్దరు నవ్వుకున్నారు.
భోజనాలయ్యాక...రైతు లని పిలుచుకు 
వచ్చాడు నారాయణ...
 విజయ్, తోఅందరూ సమావేశమయ్యారు. 
నేను మొదట కొందామనుకున్నా మీ పొలాలని , కానీ 
తరువాత ఆలోచన వచ్చి మార్చుకున్నా,
నేను చెప్పేది జాగ్రత్త గా వినండి....మీకు నచ్చితే అలాగేచేద్దాము... లేదంటే కొనేస్తాను..
రైతే రాజు అనే దేశము...మనది . అతను బాగుంటే నే దేశంబాగుంటుంది...
అలాంటిది ఈ రోజుల్లో కష్టాలు పాలయ్యారు...
వ్యవసాయం అనే మాట ఎక్కడా లేదు... పంటలుపండించడం మానేస్తే.... కొన్నాళ్లకు ..నిజం గానే కరవువచ్చేస్తుంది.... 
నేను చెప్పే ఈ విషయం ఎంతవరకూ కరెక్టు నాకుతెలియదు...
కానీ ప్రయత్నించాలిగా....అందుకే...మీరుఅందరూవ్యవసాయం చెయ్యండి...
దానికి కావలిసిన సదుపాయాలు అన్ని మా సంస్థ ..అందిస్తుంది....
కానీ ఇవి శాశ్వతం గా వ్యవసాయ భూములు గా ఉండాలి అని మీరు అందరూ వీలునామా రాయాలి....
అప్పుడే ఇవి ఎప్పటికి వ్యవసాయ భూములు గాఉండిపోతాయి... 

విత్తనాలు,ఎరువులు, నీళ్లు,కూలి అన్నిసమకూరుస్తాము....
పంట పండిన తరువాత...మాకు 75% మీకు 25%వస్తాయి....
ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వలన పంట పండకపోతే....
ఆ నష్టం కంపెనీ భరిస్తుంది... అన్నాడు....
.ఒక్క నిముషంఅంతా నిశ్శబ్దం ఆవరించింది......ఆ తరువాత అంతటా హర్షధ్వానాలు పెల్లుబికాయి... చప్పట్లు తోమారుమోగింది.... 
ఆగిన తరువాత ఇంకా చెప్పడం మొదలు పెట్టాడు....విజయ్
దేశానికి రైతే వెన్నెముక అని చెప్పడమే మిగిలింది....
కానీ అతని స్థితి చూస్తే....కనీస సౌకర్యాలు కూడా లేవు....ఇలాంటి స్థితి మీకు ఇంక 
ఎప్పటికి రాకూడదు...
అందరి లాగే..మీరు మంచి సౌకర్యాలతో...మంచిబట్టలతో....అప్పులు లేకుండా...
సంతోషం గా తలఎత్తుకుని తిరగాలి... 
అందుకే మీ పొలాలు గల రైతులందరికీ , 
నెలకు 20000 రూపాయల జీతం ఇస్తాను...
మీరు మీ పొలాల లో ఊరికే పని చెయ్యక్కరలేదు....
ఇది కూడా ఉద్యోగం అనుకోండి....
కష్టపడి పని చెయ్యండి... 
ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటారా...
ఈ ఊరు నాది..ఇక్కడే పుట్టి పెరిగాను..
పట్నం వెళ్ళి....ఆ భగవంతుడు దయ వల్ల చాలాసంపాదించాము....
మా ఊరికి ఏదో ఒకటి చేయాలిగా.....
అందుకే అలా అలోచించా..మీకు
 సమ్మతమైతే ,అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టండి....
మీ పొలాల మీద మాకు ఎప్పటికి అధికారం ఉండదు..
అవి మీ పేరు మీదనే ఉంటాయి..
కానీ వ్యవసాయానికి తప్ప ఇంక దేనికీ
వాడ కూడదు ధన్యవాదాలు
అంటూ ముగించాడు... 

అందరి కళ్ళ లో వెలుగు లు....ఆనంద భాస్ఫాలు....తమకు ఇక అప్పుల భయం ఉండదన్న ...సంతోషం...
చాలా సంతోషం బాబు....మాకు అంగీకారమే..పొలాలుఅమ్మేశాక.. ఎలా బ్రతకాలోతెలియక..సతమతమవుతున్నాము...
నిజానికి ఉన్న ఊరు కన్న తల్లి అంటారు..
మేము నేలతల్లి అనికూడా అంటాము... 
నేలతల్లి ని అమ్ముకు ని బ్రతకడం ఎలా అనే సమస్య...వేధిస్తునే ఉంది.... అన్నారు...

రామయ్య గారు 
ఇంకో విషయం ....విజయ్ కి మా అమ్మాయికి....అలాగే రమేష్ కి ,మాతమ్ముడి కూతురు రాణి కి 
త్వరలోనే వివాహం జరిపించాలని నిర్ణయంతీసుకున్నాము...
మీ అందరి ఆశీస్సులతో ఈ శుభకార్యం జరిపించాలనికోరుకుంటున్నాను...అన్నారు...
ఈ ఊరి కష్టాలు తీర్చారు....ఇంక అన్ని సంబరాలే
వాళ్ళ పెళ్లి  ఈ ఊరి వాళ్ళ పెళ్లి... 
అందరం పెద్ద పండగల  చేసేద్దాం అన్నారు.... జంటలు రెండు ఇలావచ్చి నమస్కరించండిఅన్నారు...వారు నమస్కరించగానే..
.అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు...
" ఈ ఊరు ,ఈ గాలి,ఈనే ల,  సెలయేరు..
నను గన్న నావాళ్లు....... అంటూ. .శ్రీ.. సీతారామ శాస్త్రి గారిపాట ఎక్కడో వినిపిస్తోంది.........
" సర్వే జనా సుఖినో భవంతు"




...