వనిత
వనితలు
కానే కాదు ఎన్నటికీ
వంటింటి కుందేళ్లు
తెలుసుకో
బంధనాల ( కట్టుబాట్లు) విహంగాలు
"అవి"
తెంచి చూడు బంధానాలు
ఎగర గలవు
కీర్తి శిఖరాల కిరీటం లో
కలికి తురాయి లై
అంబరాన్ని తాకి ,
గగనాన్ని ఏలే
సామర్ధ్యం వారి సొంతం
నిరర్ధక కట్టుబాట్లతో
వేయద్దు
వారి భవిష్యత్ కి సంకెళ్లు
స్వచ్ఛమైన గాలి,
స్వచ్చమైన నీరు తో
పాటు స్వేచ్చావరణము ఇచ్చి చూడు
అబల లు కాదు సబల లు
సకల కళా సరస్వతులు
మానవాళి మనుగడకు వారసులు.
రచన.: ఆచంట గోపాలకృష్ణ

No comments:
Post a Comment