Monday, 6 November 2017

అమ్మంటే నే..." ..ప్రేమ "

అమ్మంటే నే..." ..ప్రేమ "

తొలి సారి  గా ఈ ప్రపంచం లోకి అడుగు పెట్టి...కళ్ళు తెరవగానే....భయం తో ..." ..అమ్మా ."..అని పిలవడం కూడా
తెలియక ...
ఉంగా ఉంగా అంటూ ఏడుస్తుంటే....
నేను ఉన్నానురా కన్నా అంటూ.
నువ్వు ఎత్తుకున్నప్పుడు.....
నా తలపై నీ చేయి వేసి నిమిరినప్పుడు.... ఆ ...తొలి స్పర్శ ...
నాపై అమృత వర్షం కురిసినంత ఆనందం వేసింది....
నా నుదిటిపైన నువ్వు పెట్టిన తొలి  ముద్దు...
ఈ ..ప్రపంచం లో ని ప్రేమ అంతా మూటకట్టి నాకే ఇచ్చినట్లు..... అనిపించింది...... కొండంత....ధైర్యాన్నిచ్చింది .
ఆ క్షణం లో
నా ఏడుపు మాయమై తొలి నవ్వులు విరిసాయి......
అప్పుడు  కళ్ళు తెరిచి ..చూసా.....
నీ ముఖం లో  ఆ నవ్వు. .....ఆనందం.....ఉద్విగ్నత..
నువ్వు
ఈ ....ప్రపంచాన్ని జయించినంత ఆనందం .
ఆ కళ్ళలో ఆనంద భాష్పాలు
ఆనవ్వు     వెనుక    అంతర్యం.....
ఆ           ఆనందపు   రహస్యం....
నీ  కలల ప్రపంచం రూపు దిద్దుకుని
నా రూపములో ...నీ ఒడిలో చేరిన
ఆనందం అని.....
నీ ప్రాణాలను పణము గా పెట్టి ....
నాకు ప్రాణము పోసి....
ఈ ప్రపంచము లోకి తీసుకువచ్చి ...
నన్నే నీ ప్రపంచము గా ప్రేమించే ....అమ్మా.....
నీ ప్రేమను  "  కొలువగలమా" .....
నీతో ఇంకొకరిని  " పోల్చగలమా.".....
ఆ భగవంతుడు కూడా...అమ్మ ప్రేమకోసం...భూమి మీద అవతరించి..
ఆ ప్రేమలో తరిస్తున్నాడు....కదా
అమ్మా......
జన్మ జన్మ లకు నీ కడుపునే ,పుట్టాలని....
ఆశీర్వదించమ్మా......

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

వేటూరి వారి పాట

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్ 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి
శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి
 సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
 సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని
కుంకుమరాగ శోభిని కుసుమబాణ సంశోభిని
మౌనసుహాసిని గానవినోదిని భగవతీ పార్వతీ దేవీ 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
 శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని  శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
 ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్య లక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ
 అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 
ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే
ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే
సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే
వరదే అక్షరరూపిణే శారదే దేవీ
 అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 

వింధ్యాతటీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే
సింహాసనస్థాయినే దుష్టహరరంహక్రియాశాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే హే విలంబితకేశపాశినే
మహిషమర్ధనశీల మహితగర్జనలోల భయజనర్తనకేళికే
కాళికే దుర్గమాగమ దుర్గ పాహినే.. దుర్గే దేవి 

మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
 అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన  ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...

Friday, 3 November 2017

శంకరా నాద శరీరా పరా

వేటూరి గారి పాట....
శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...
ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గాన విలక్షణ రాగమె యోగమని
నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత ఖందరా
నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది
ఆవధరించ రా విని తరించరా            ||శంకరా||
మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టి నే తడవంగ            ||శంకరా||