అమ్మంటే నే..." ..ప్రేమ "
తొలి సారి గా ఈ ప్రపంచం లోకి అడుగు పెట్టి...కళ్ళు తెరవగానే....భయం తో ..." ..అమ్మా ."..అని పిలవడం కూడా
తెలియక ...
ఉంగా ఉంగా అంటూ ఏడుస్తుంటే....
నేను ఉన్నానురా కన్నా అంటూ.
నువ్వు ఎత్తుకున్నప్పుడు.....
నా తలపై నీ చేయి వేసి నిమిరినప్పుడు.... ఆ ...తొలి స్పర్శ ...
నాపై అమృత వర్షం కురిసినంత ఆనందం వేసింది....
నా నుదిటిపైన నువ్వు పెట్టిన తొలి ముద్దు...
ఈ ..ప్రపంచం లో ని ప్రేమ అంతా మూటకట్టి నాకే ఇచ్చినట్లు..... అనిపించింది...... కొండంత....ధైర్యాన్నిచ్చింది .
ఆ క్షణం లో
నా ఏడుపు మాయమై తొలి నవ్వులు విరిసాయి......
అప్పుడు కళ్ళు తెరిచి ..చూసా.....
నీ ముఖం లో ఆ నవ్వు. .....ఆనందం.....ఉద్విగ్నత..
నువ్వు
ఈ ....ప్రపంచాన్ని జయించినంత ఆనందం .
ఆ కళ్ళలో ఆనంద భాష్పాలు
ఆనవ్వు వెనుక అంతర్యం.....
ఆ ఆనందపు రహస్యం....
నీ కలల ప్రపంచం రూపు దిద్దుకుని
నా రూపములో ...నీ ఒడిలో చేరిన
ఆనందం అని.....
నీ ప్రాణాలను పణము గా పెట్టి ....
నాకు ప్రాణము పోసి....
ఈ ప్రపంచము లోకి తీసుకువచ్చి ...
నన్నే నీ ప్రపంచము గా ప్రేమించే ....అమ్మా.....
నీ ప్రేమను " కొలువగలమా" .....
నీతో ఇంకొకరిని " పోల్చగలమా.".....
ఆ భగవంతుడు కూడా...అమ్మ ప్రేమకోసం...భూమి మీద అవతరించి..
ఆ ప్రేమలో తరిస్తున్నాడు....కదా
అమ్మా......
జన్మ జన్మ లకు నీ కడుపునే ,పుట్టాలని....
ఆశీర్వదించమ్మా......
No comments:
Post a Comment