Thursday, 14 December 2017

ప్రభాత భానుని తొలికిరణం

ప్రభాత భానుని తొలికిరణం
ప్రభావించిన ప్రోత్సాహం
ఉత్సాహం ,ఉత్తేజం ,
జాగృతమయ్యే ,
శుభ తరుణం ,
ప్రాభాత  భానుని
తొలి కిరణ స్పర్శకు
వికసించెను పుష్పాలు
చిగురించెను వృక్షాలు
ఇది ప్రకృతి రాసిన వేదం...
ప్రపంచ పురోగమన మార్గం....
ఆనందం ...ఆరోగ్యం...
 విజయ పధానికి...సోపానం...
--ఆచంట గోపాలకృష్ణ

No comments:

Post a Comment