Tuesday, 16 April 2019

ఆరోజు " పార్ట్ 3"

ఆరోజు " పార్ట్ 3"
ఉదయం కాలేజి దగ్గర అంతా గుమిగూడారు.పోలీసులు formalities పూర్తి చేస్తున్నారు.
సిఐ ప్రిన్సిపాల్  దగ్గరికి మాట్లాడడానికి  వెళ్లారు. ప్రిన్సిపాల్ ,జయ్,రామయ్య  ఇంకా ఇద్దరు స్టాఫ్ తో ఆఫీసురూంలో enquiry చేస్తున్నాడు అసలు ఏం జరిగింది  ప్రిన్సిపాల్ గారు అంటూ అడిగాడు సిఐ.
నాకూ  తెలియదు అండి. ప్రతి రోజు లాగే  మేము అందరం 5.30 కు బయలుదేరి పోయాం.
ఆఖరున రామయ్య తాళాలు వేసి జయ్ గారికి ఇస్తాడు.అప్పుడు  వాళ్లిద్దరూబయలుదేరుతారు అన్నాడు.
రామయ్యా నువ్వు చెప్పు అసలు  ఏం జరిగింది.
సార్ అది...అది...అంటూ ఆగాడు రామయ్య.
ఏమి ఫరవాలేదు లే ,జరిగింది జరిగినట్లు చెప్పు.భయపడకు... నిన్ను ఇబ్బంది పెట్టను లే...అన్నాడు సి ఐ...
రామయ్య జయ్ వైపు చూసాడు.
జయ్ తలా ఊపాడు .
జరిగింది, నువ్వు చూసింది చెప్పమని...
రామయ్య చెప్పడం ప్రారంభించాడు.
సార్ అది సాయంత్రం 5 గంటల తరువాత వర్షం చినుకులు ప్రారంభం అయ్యాయి.
ఆరోజు జయ్ గారు కూడా పని ఉండడం వలన అక్కడే ఉండిపోయారు.
ఆయన కోసం నేను కూడా ఉండీ ,
తాళాలు వేసి ఆయనకి ఇస్తాను.
వర్షం వచ్చేలా ఉంది.మీరు ఈ లోపు బండి తీయండి .నేను తాళాలు వేసి వస్తాను...అని ఆయనని పంపించాను. తాళాలు వేసుకుని వచ్చే ఆప్పటికి ...ఆయన కనబడ లేదు.ఎక్కడికి పోయి ఉంటాడా అని చెట్టు కింద నిలబడి చూస్తున్నాను. ఎందుకంటే ఆయన బండి అక్కడే ఉంది. కాసేపు అయ్యాక అమ్మాయి గారితో బైటకి వచ్చారు.ఆ అమ్మాయి బాగా ఏడుస్తోంది...భయంతో వణికి పోతోంది. ఏమై ఉంటుంది అబ్బా అని అనుకుంటున్నాను. ఇంతలో ఈ సారు ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పకు.ఈ విషయం మన మధ్య నే ఉండనీ... నేను చూసుకుంటాను అంటూ అమ్మాయి తో అనడం విన్నాను.
తరువాత ఆ అమ్మాయి రూమ్ కి  వెళ్ళిపోయింది.
మొదట సార్ మీద అనుమానం వేసింది.కానీ అంతలోనే ఆయన మొదటి నుంచి తెలుసు కదా...ఆయన గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను...ఏమిటి... ఇంకేదో జరిగి ఉండి ఉంటుంది....ఆయనే చెబుతారులే....అనుకున్నా...తొందర పడి ఒక నిర్ణయానికి రాకూడదు అనుకుని ,చెయ్యి ఊపాను...సారు ఇక్కడే ఉన్నాను అంటూ...
ఆయన వచ్చి జరిగింది చెప్పారు. ఆ అమ్మాయి రూమ్ కి వెళ్లిందో లేదో చూసి నేను రూమ్ కి వెళతాను. నువ్వు ఈ లోగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ...నేను చెప్పినట్లు చెయ్ అంటూ నన్ను మీ దగ్గరికి పంపించారు సర్...ఆ తరువాత జరిగింది మీకు తెలుసు...
అని అభిమానం గా జయ్ వైపు చూసి ఊరుకున్నాడు.
మీరే కంప్లెయింట్ కోసం మనిషి ని పంపించారు... అది plus point అవుతుంది... అంతా రికార్డ్ చేసావు గా అని కానిస్టేబుల్ ని అడిగాడు.
యెస్ సర్... అతని చేత సంతకం తీసుకో... అంటూ జయ్ వైపు తిరిగాడు.
ప్రిన్సిపాల్ సి ఐ గారితో,  సర్ ఇది కాలేజ్ పరువు కి  సంబంధించిన సమస్య...కొంచెం జాగ్రత్త గా డీల్ చేయాలి...అని రిక్వెస్ట్ చేస్తున్నాను.అన్నాడు.
తప్పకుండా సర్...అని అన్నట్టు రామయ్య
నువ్వు చూసేసరికి అతను స్పృహ తప్పి పడి ఉన్నాడా లేక మరణించాడా... అని అడిగాడు.
అది నేను చూడలేదు సర్...నేను చూసే సరికి అక్కడే పడి ఉన్నాడు.బాగా తాగి ఉన్నాడు.పడి ఉన్నాడు కదా , మీరే చూసుకుంటారు కదా , అని అతనిని అలాగే వదిలేసి మీదగ్గరకి వచ్చాను. అన్నాడు రామయ్య.
కానీ ఇప్పుడు అతను మరణించాడు, కదా ఇది ఎలా జరిగి ఉంటుంది అన్నది ప్రశ్న?
ఇంకెవరైనా ఆ చుట్టు పక్కల చూసావా....లేదు సారు...అక్కడ ఎవరూ కనబడలేదు.....పైగా వర్షం పడుతోంది....
జయ్ గారు మీరు ఏమంటారు అని అడిగాడు. నాకూ అదే ఆశ్చర్యం గా ఉంది...
లేదు సర్ అతను బ్రతికే ఉన్నాడు.నేను చెక్ చేసాను.పైగా అతనిని ఎవరూ కొట్టలేదు కదా....తనంతట తానే తన్నుకుని పడిపోయాడు...తలకి బలం గా తగలడంతో స్పృహ తప్పాడు....ఆ అమ్మాయి కి ఇలా హఠాత్తుగా ఇలా జరిగేసరికి కంగారు పడిపోయింది...
అందుకే ముందు తనని ఇంటికి
పంపేద్దా మని అనుకున్నాను.
అంతే జరిగింది అన్నాడు జయ్.
ప్రస్తుతానికి మేము అదే నమ్ముతున్నాము. కానీ మీరు కూడా స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మలిని కస్టడీ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సహకరించగలరు. అన్నాడు సీ ఐ...
తప్పకుండా సర్....కానీ ఇది కాలేజ్...సంకెళ్లు లాంటివి వద్దు...నేను వస్తాను... మీతో పదండి...అన్నాడు జయ్...
Circumastancial అవిడెన్స్ మీకు వ్యతిరేకం గా ఉన్నాయి .
ప్రస్తుతానికి. అందు కె మిమ్మలిని అదుపులోకి తీసుకుంటున్నాము. మీరు నిర్దోషి అని తేలితే పంపించేస్తాము. ఆ అమ్మాయి ని కూడా ప్రశ్నించాలి. అమ్మాయి కాబట్టి కానిస్టేబుల్ ని పంపి స్టేట్మెంట్ తీసుకుంటాము.... అమ్మాయి చెప్పింది ..మీరు చెప్పింది ఒకటే అయితే మిమ్మలిని వదిలేస్తాను.
రామయ్య ఈ కేసు తేలే వరకు నవ్వు ఊరు దాటి వెళ్లకూడదు... ఎప్పుడు పిలిచినా స్టేషన్ కి రావాల్సి ఉంటుంది...
తప్పకుండా సార్.... ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి...బాగా చదువుతుంది... అందరి కి సాయం చేసే మనసు....ఈ సారు కూడా చాలా మంచోడు...ఆ అమ్మాయి కి సాయం చేయబోయి ఇరుక్కున్నాడు..మీరే ఎలాగైనా కాపాడాలి అన్నాడు రామయ్య.
జయ్  మనం బయలుదేరదామా అని అన్నాడు.సరే సర్ , నేను మీతో వస్తే అరెస్ట్ య్యాననుకుంటారు.మీరు ముందు పదండి. నేను మిమ్మల్ని  స్టేషను లో కలుస్తాను అన్నాడు జయ్.
మీ గురించి నాకు కూడా తెలుసు సార్
ఒకే  నేను బయలుదేరుతాను. మిమ్మల్ని స్టేషన్ లో కలుస్తాను అంటూబయలుదేరి వెళ్లి పోయాడు.
జయ్ బయటకు వచ్చాడు. స్టూడెంట్స్ అంతాగుమికూడారు. ఏమిటి సార్ మిమ్మల్ని enqyiry అంటున్నారు. అందరూ అడిగారు ఆతృతగా, అదేం లేదు.
నిన్న  సంఘటన ,కొంచెం సీరియస్  అయ్యింది కదా , statement ఇవ్వాలి. ఆ అమ్మాయి కూడా  స్టేట్మెంట్  ఇస్తుంది కదా ఏం పరవాలేదు. నేను ఒకసారి స్టేషన్  దాకా వెళ్లి వస్తాను,అన్నాడు. మేము మీతో  వస్తాం  సార్ అన్నారు. అరె వద్దు  మీరు  విద్యార్థులు స్టేషన్ కి ఎందుకు  నేను వెళతాను. మీరు  classes కు  వెళ్ళండి. సమస్య  ఏమి  లేదని  చెపుతున్నానుగా అంటూ  నచ్చచెప్పి , తాను స్టేషన్ కి  బయలుదేరాడు.
స్టేషన్ లో చేరుకున్నారు. వెనుకే జయ్ కూడా వచ్చాడు. రండి జయ్ ఇలా కూర్చోండి అన్నాడు. కానిస్టేబుల్ ని పంపించాను. ఏ విషయం కాసేపట్లో తెలుస్తుంది... మీరు ఈ లోగా టీ తాగండి అంటూ ఆఫర్ చేసాడు... థాంక్స్ సర్ అన్నాడు జయ్.
ఇంతలో కానిస్టేబుల్ వచ్చాడు. సెల్యూట్ చేసి నుంచున్నాడు.
ఏమి జరిగింది ఆ అమ్మాయి ఏమంటోంది .అన్ని వివరాలు సేకరించావా అని అడిగాడు సి ఐ.... వెళ్ళాను సర్ కానీ ఆ అమ్మాయి కి ఆరోగ్య ము సరిగా లేదని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం స్పృహ లో లేదట. రెండు రోజులు అయితే గాని తెలివి రాదు అంటున్నారు. అన్నాడు
అదేమిటి అలా ఎలా అని అడిగాడు.
బాగా భయపడినట్లుంది... పైగా వర్షం... బాగా తడిసింది కదా...హై ఫీవర్ వచ్చి ఉంటుంది... చూద్దాం సర్...అన్నాడు జయ్.
కానీ మిమ్మలిని కస్టడీ లోకి తీసుకోవాలి... కదా కానీ ఇప్పుడు ..తన స్టేట్మెంట్ వస్తే గాని నేను ఏమి చేయలేను....
సారి సర్ FIR రాసేస్తున్నాను....అంటూ...
మీరు బెయిల్ కి అప్లై చేయండి ఈ లోగా... అన్నాడు.
అలాగే సర్ తప్పదు గా,  మీ డ్యూటీ మీరు చేయండి... అన్నాడు జయ్...
కేసు రోజు రోజు కి కొత్త మలుపులు తిరుగుతోంది.... ఏమిటో...అనుకుంటూ ఫ్రెండ్ కి ఫోన్ చేసాడు... బెయిల్ పనులు చూడడానికి...
ఇంకా ఉంది ..... Continued in part 4

Monday, 15 April 2019

ఆరోజు పార్ట్ 2

ఆరోజు పార్ట్  2
సిద్దార్ధ్  invistigative juronalist .
ప్రముఖ టీవీ లో చాలా కాలం పని చేసాడు. మంచి పేరు తో పాటు డబ్బు సంపాదించాడు. అతని తాత గారు చాలా కాలం క్రితం ఒక చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి మంచి సోషల్ వర్కర్ గా పేరు సంపాదించుకున్నారు.ఆయన తరువాత
సిద్దార్ధ్ నాన్న గారు ఉద్యోగ రీత్యా విదేశాలలో స్థిర పడడం వలన ఆ సంస్థ ...చాలాకాలం మరుగున పడిపోయింది. అందుకే మనవడిగా ఆ బాధ్యత ని తీసుకుని సంస్థ కి పూర్వ వైభవాన్ని తీసుకు రావడానికి ,తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను సంపాదించిన దానితో ను మరియు తండ్రి ఇచ్చిన దానితో ను సంస్థ ని నడిపిస్తున్నారు.
సిద్దార్ధ్ ఫోన్ మ్రోగింది...
హలొ నాన్నా ఎలా ఉన్నారు. ఇండియా ఎప్పుడు వస్తున్నారు. అన్నాడు .
అది చెపుదామనే ఫోన్ చేసాను.
మా నాన్న గారి  ఆశయాల్ని  నువ్వు నిలబెడుతున్నావు....
నీకోసం ఏదైనా చేయాలి గా.
అందుకే ఇక్కడ ఇంకా NR I ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి తెస్తున్నా. వార్షికోత్సవం సమయానికి చేరుకుంటాను. ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి. అని అడిగారు.
అంతా బాగానే ఉంది M L A గారి ని కూడా ఆహ్వానిస్తున్నా.
ఆయన కూడా సహాయం అందిస్తే ఇంకొంత మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపయోగ పడుతుంది అన్నాడు.
సరే ఉంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసాడు.
ఈ సునీల్ గాడు ఇంకా రాలేదు.
ఎక్కడికి పోయాడో... అనుకుంటూ ఉండగానే వచ్చేసాడు.
ఇదిగో రా కార్డ్స్.
మనం MLA..గారింటి కి వెళదాం...ఇంక.
అన్నట్టు ఒరేయ్ మనం airpirt కి వెళ్ళాలి నాన్నగారు వస్తున్నారు. అన్నాడు.
సరేలే.....ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కానిచ్చి వచేస్తా....నువ్వు ఆఫీస్ దగ్గరకి వచ్చేయి ...అంటూ బయలుదేరాడు.
సునీల్ చిన్నప్పటి ఫ్రెండ్..ఇప్పుడు తనతో పాటు సంస్థ ని చూసుకుంటూ ఉంటాడు manager గా.
ఆ మరునాడు  ఎయిర్పోర్ట్ నుంచి
తల్లిని ,తండ్రి ని తీసుకుని ఇంటికి వచ్చేసారు... అంకుల్ మీరు రెస్ట్ తీసుకోండి... నేను మళ్ళీ వస్తాను ఒక గంటలో అంటూ సునీల్ వెళ్ళిపోయాడు.
స్నానం చేసి వచ్చారు, ఒరేయ్ సిద్ధార్థ్ టిఫిన్ రెడి రా వచ్చి తినండి అంటూ వాళ్ళ అమ్మగారు పిలిచారు... మీరు మొదలు పెట్టండి ,సునీల్.వస్తాడు ఇద్దరం చేస్తా ము...అన్నాడు....
ఏడీ నీ తోక ఇంకా రాలేదు... అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు.వచ్చేస్తాడు నాన్నా....ఫంక్షన్ పని మీద వెళ్ళాడు.. అన్నాడు సిద్దార్ధ్.
అదిగో అంతలోనే వచ్చాడు... రారా టిఫిన్ చేసి బైటకి వెళ్ళాలి..బోలెడు పనులు ఉన్నాయి....అన్నాడు ...
అమ్మ చేతి వంట తిని చాలాకాలం అయింది .ఇవాళ కుమ్మేయాల్సిందే ..అంటూ టిఫిన్ వడ్డించు
కున్నాడు సునీల్.
ఆశ్రమం బైట చాలా హడావిడి గా ఉంది.మరి కొద్ది సేపట్లో MLA గారు వస్తున్నట్లు PA ఫోన్ చేసి చెప్పాడు. అన్నాడు సునీల్.
ఆ కొత్త గదికి రిబ్బను , పూలు కట్టావా....
ఆ యన వచ్చే సరికి అంతా రెడి గా ఉండాలి. అన్నాడు.ఇంతలోనే  MLA గారి convoy వచ్చేసింది.
అందరూ హడావిడి గా బైటకి పరిగెత్తారు... స్వాగతించడానికి. పూల గుచ్ఛం చేతికి ఇచ్చి స్వాగతం సర్...అన్నాడు
సిద్దార్ధ్.
నువ్వు చేసే సేవా కార్యక్రమాలు గురించి విన్నాను.
ఆశయం కోసం ఉద్యోగం కూడా మనేశావుట కదా...అన్నారు  , బొకే pa కి ఇచ్చి...
ఈ యన మా నాన్నగారు..సర్ . అమెరికా లో డాక్టర్...
ఈయన ప్రకాష్ టీవీ MD  ప్రకాష్ గారు.అంటూ పరిచయం చేశాడు.
ప్రకాష్ ఎందుకు తెలియదు... రహస్యాలు ని బైటకి తీసి నిజాల్ని నిర్భయంగా చెప్పే టీవీ అతనిది. ఏమండీ  ప్రకాష్ గారు...ఎలా ఉన్నారు అంటూ కరచాలనం చేశారు... కొత్త  ఆఫీస్ రిబ్బన్ కట్టింగ్ పూర్తి అయింది. మరి నేను వస్తాను...సిద్దార్ధ్...ఇంకా చాలా పనులు ఉన్నాయి.
తాను అడాప్ట్ చేసుకున్న విద్యార్థులు, వాళ్ళు సాధించిన మార్కులు అన్ని తెలియ చేసాడు. ఇంకా ముందు ముందు చేయ బోయే కార్యక్రమాలు గురించి చెప్పాడు.
చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తే...నేను కూడా నాకు చేతనైన సహాయం చేస్తాను.... నీ సమాజ సేవా కార్యక్రమాలు ఇలా గే కొనసాగించు... అంటూ బయలు దేరి వెళ్లిపోయారు.
ప్రకాష్ గారు చాలా థాంక్స్ అండి. పిలవగానే వచ్చారు...ఆన్నాడు సిద్దార్ధ్....
నువ్వు మా కంపెనీ లో బెస్ట్ ఎంప్లొయ్ వి...నువ్వు అంటే నాకు ప్రత్యేకంగా అభిమానం.... నీలాంటి వాడి ని వదులు కోవడం నాకు అసలు ఇష్టం లేదు....కానీ ని ఆశయం ముందు తల వంచాల్సి వచ్చింది.
ఈ 5 లక్షలు చెక్ తీసుకో నావంతు విరాళం గా..
ఎప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకో ...నీకు నేనున్నాను.... ఎప్పుడు కావాలన్నా వెనక్కి వచ్చేయి... నీ పోస్ట్ నీకోసం ఎప్పుడు రెడీ గా నే ఉంటుంది.... అంటూ...బయలు దేరి వెళ్లిపోయారు..
ఒరేయ్ సునీల్ నువ్వు మిగతా పనులు పూర్తి చేసుకుని వచ్చేయి. నేను నాన్నగారు ముందు వెళతాము అన్నాడు. సరే అయితే నువ్వు నాన్న గారి కార్ లో  వెళ్ళు, నేను నీ కార్ లో వస్తాను అన్నాడు సునీల్. సరే , డ్రైవర్ నువ్వు సునీల్ తో వేళ్ళు నేను నాన్నగారు వెళతాం అంటూ, తొందరగా వచ్చేయి రా...అంటూ డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు. దారిలో ఒరేయ్ అబ్బాయి ఈ కార్యక్రమాలు బాగున్నాయి కానీ ఆ పెళ్లి ఏదో చేసేసు కుంటే.. నేను ఇక్కడికి శాశ్వతం గా వచేస్తా...నా మనవలతో ఆడుకుంటూ, ఆశ్రమాన్ని చూసుకుంటూ గడిపేస్తాను... అన్నాడు. నాన్న గారు మీకు ఎప్పుడు ఆ గోడవేనా...టాపిక్ మార్చండి... నువ్వు ఏమైనా చిన్న పిల్లాడి వి అనుకుంటున్నవా ...ఇప్పటికే ఆలస్యం అయింది... కొంప తీసి ఎవరైనా ఉంటే చెప్పు వెంటనే చేసేస్తాను... నాకు సగం భారం తగ్గుతుంది... అన్నారు.మీరు టాపిక్ మార్చండి బాబు... అన్నాడు.
అన్నాడే గాని...తన ఆలోచనలు గతం లోకి పరిగెత్తాయి...కాలేజ్ రోజులు గుర్తుకు వచ్చాయి.
లక్ష్మీ అని తెలివైన అమ్మాయి.చదువు లో తనకి ఎప్పుడు పోటీ గా ఉండేది. తాను పెద్ద ప్రొఫెసర్ అవుతాను అంటూ ఉండేది.స్నేహితులు అందరూ ఆట పట్టిస్తు ఉండే వారు లవర్స్ అని...అలాంటిది ఏమి లేదు బాగా చదువుతుంది అని ఒక ప్రత్యేకమైన అభిమానం అంతే ,.మేము మంచి స్నేహితులము అంటూ ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో ఒకసారి enquire చేయించాలి... చాలాకాలం అయింది... మాట్లాడి. ఇంతలో ఇల్లు వచ్చేసింది. కాస్త ఫ్రెష్ అయి వస్తా ...అందరు కలిసి భోజనం చేసేద్దాం. మీ అమ్మ  ఏమి వండిందో ఈ వేళ...
కొడుకు మీద ప్రేమ కదా....అన్ని నీకు ఇష్ట మైనవి వండి ఉంటుంది లే...అన్నారు రావు గారు.
ఇంత వయసు వచ్చినా ,చిన్నతనం పోలేదు మీ ఇద్దయికి నచ్చినవి వండి పెట్టాను లెండి ముందు తయారు అయి రండి అంది...
మా అమ్మ నాకు నచ్చినవి వండడము కాదు...మా అమ్మ చేతితో ఏమి చేసినా నాకు నచ్చుతుంది... అంటూ ఆప్యాయం గా అమ్మ భుజంపై చేతులు వేసి నవ్వాడు సిద్దార్ధ్...
నీ తోక ఏడి రా ఇంకా రాలేదు.... అని అడిగింది ఆవిడ...
అదిగో వస్తున్నాడు నువ్వు వడ్డించేయ్ అమ్మా... అన్నాడు.
లోపలికి వస్తూనే దుర్మార్గుడా...నేను రాకుండా అంతా మెక్కేద్దామనే...నీ సంగతి ఇప్పుడు కాదు...భోజనము అయ్యాక...తేలుస్తా..
అమ్మా నాకు కూడా వడ్డించండి...అంటూ ప్లేటు తిరగేసేడు. చాలా ఐటమ్స్ చేశారు... అన్నాడు..
నెమ్మదిగా కూర్చుని తినరా...అవి అన్ని ఎక్కడికి పోవు...
కనీసం
తినేడప్పుడైనా కుదురు గా ఉండు...అంటూ నవ్వుతూ వడ్డించింది.
ఇప్పటికే అలస్య అయింది నువ్వుకుడా కూర్చో అందరికి ఒకే సారి ఐపోతుంది అంటూ భార్యకి కూడా ప్లేట్ తిరగేసేడు.
ఆహా అంకుల్ చూడడానికి రెండు కళ్లు చాలట్లేదు.... అన్నాడు సునీల్..
పెళ్లి చేసుకుంటే పెళ్ళాం విలువ తెలిసేది... ఇద్దరికి ఇద్దరు దొరికారు అన్నాడు.
వాడు చేసుకోక పోతే నాదా తప్పు..... అయినా వాడు చేసుకోకుండా నేను ఎలా చేసుకోను... అన్నాడు సునీల్.
దీనికేమి తక్కువలేదు ..useless fellows..అంటూ చేయి కడుక్కోవడానికి వెళ్లారు శర్మ గారు.

End of part 2....ఇంకా ఉంది...)

Sunday, 14 April 2019

ఆరోజు పార్ట్ 1

ఆరోజు

ఆకాశం మేఘావృతమై ఉంది.
చిన్నగా గాలి  మొదలయింది.సాయంత్రం నాలుగున్నర కావస్తోంది.
కాలేజీలో ప్రాక్టికల్ exams ఆఖరి రోజు.
జయ్ కాలేజి లెక్చరర్.
మాట మంచితనం ,సహాయం చేసే స్వభావం ఉండడంతో అందరికి అతని మీద అభిమానం .విద్యార్థులందరితోను కలుపుగోలుగా వుంటూ ,వారికి సబ్జెక్ట్స్ విషయంలో డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆటలు ఆడేటప్పుడు physical డైరెక్టర్ గా , కాక  తాను కూడాఒక  స్టూడెంట్  లా మారి  అల్లరి చేస్తాడు. అతనంటే  విద్యార్థులకు  భయం తో కూడిన  భక్తి కన్నా వల్లమాలిన  అభిమానం చూపిస్తారు. మిగతా లెక్చరర్లు కు ఇది నచ్చదు. విద్యార్థులను  విద్యార్థుల లాగే  చూడాలి  మనకు భయపడాలి అంటారు. కానీ అవన్నీకొట్టిపారేస్తాడు.   వాళ్ళకి  ఫ్రీడమ్ దొరికిదే ఇక్కడ  ,రెసిడెన్షియల్ స్కూల్ లోనో  లేక కాన్వెంట్స్ లో  చదివి  చదివి రోజుకు 14 గంటలు వేరే
ప్రపంచ ము  తెలియదు  పాపం  వాళ్లకి. ఇప్పుడు కూడా మనం భయపెడుతూ చదువు చెపితే వాళ్లకు ఎలా ? ఈ వయసులో  సరదాలుంటాయి. హుషారుగా ఇష్టపడి చదివితే  ఇంతకన్నా ఎక్కువ మార్కులు వస్తాయి  , అని  నా అభిప్రాయం  అంటా డు. చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయిన విద్యార్థులు కూడా అప్పుడప్పుడు  వచ్చి  గురువుగారు  బాగున్నారా అని  పలకరించి  వెలుతూ వుంటారు. ఇది  పడని కొంతమంది లెక్చరర్లు పైకి నవ్వుతూ మాట్లాడినా  లోపల  కొంత అసూయ ఉంటూనే ఉంటుంది.

       ఈరోజు వర్షం పడేలా ఉంది .చిన్న చిన్న చినుకు లు ప్రారంభం అయ్యాయి.చల్లని గాలులు వీస్తున్నాయి. తుఫాను హెచ్చరిక చేశారు... గాలి విసురు కొంచెం ఎక్కువగానే ఉంది.
తొందరగా రూంకి  వెళ్ళాలి, అని తన పని తొందరగాముగించుకుని  ఆఫీస్ బోయ్ కోసం చూసాడు. అతను అప్పుడే  బయట నుండి లోపలికి  వస్తున్నాడు. రామయ్యా ,అందరూ వెళ్లిపోయారా, వర్షం వచ్చేలా ఉంది. నువ్వు కూడా తాళాలు వేస్తే,  వెళ్లిపోవచ్చు. అని పిలిచాడు. అలాగే సర్  అన్నీ సర్దేసి తాళాలు వేస్తాను ,మీరు  బయలుదేరండి సర్ అన్నాడు . సరే అయితే నేను కూడా బయలుదేరు తున్నాను  అంటూ  బయటకు వచ్చి  బండి  తీసుకుంటుండగా  పక్కన  ప్రసాద్   బండి   కూడా ఉండడం చూసి,  ఇతను ఇన్విజిలేటరు కదా  పరీక్ష  అయిపోయింది. ఇంకా  ఏం చేస్తున్నాడు లాబ్ లో  ఒకసారి చూసి వస్తే  సరిపోతుంది కదా అని అనుకుంటూ  మళ్లీ బండి స్టాండ్ వేసి  వెనుక వైపుకి వెళ్ళాడు .
అక్కడ కిటికీలోంచి  చూస్తే  ప్రసాద్ ఎదురుగా  ఒక అమ్మాయి  ఉంది. తన పేపర్ ఆయన  చేతిలో  ఉంది . ఏమిటా అని తొంగి చూస్తే  తనని  కావాలని ఆలస్యం  చేసి  తనతో  కొంచెం  తప్పుగా  మాట్లాడుతున్నాడు. కోపం వచ్చింది. ఒక్కసారిగా తలుపు తోసుకుని  లోపలికి వెళ్ళాడు . అక్కడ ఆ అమ్మాయి  ఏడుస్తోంది. జయ్ ని  చూడగానే  ఒక్కసారిగా  ఆయన దగ్గరికి  పరిగెత్తింది. చూడండి సార్  ఎలా అసభ్యంగా  మాట్లాడుతున్నారో , ఆయన చెప్పినట్లు  వినకపోతే  పరిక్ష  fail చేస్తారుట, బెదిరిస్తున్నారు అంటూ జయ్  వెనుక చేరింది. నువ్వు కంగారు పడకమ్మా, నేనున్నాను కదా, భయపడకు , నీ పరీక్ష ఏమి కాదులే , నేను చూసుకుంటాను అంటూ దేర్యం చెప్పి , ప్రసాద్ వైపుకి  తిరిగాడు. ఏమయ్యా ప్రసాదూ, ఏమిటి నువ్వు చేస్తున్న పని . ఒక లెక్చరర్ వి  అయ్యి ఉండి స్టూడెంట్ తో  ప్రవర్తించే విధం  ఇదేనా , సభ్యత ,సంస్కారం  మరచిపోయి  ఇలా  ప్రవర్తిస్తున్నావు, మర్యాదగా  ఆ  పేపర్లు  ఇలా ఇచ్చేసి వెళ్ళు .  రేపు నీ మీద ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేస్తాను, ఏవనుకుంటున్నావో  నువ్వు  అన్నాడు. ప్రసాదుకి  ఒక్కసారిగా కోపం  వచ్చేసింది . ఊగి పోతున్నాడు. బాగా తాగి ఉన్నాడు.
జయ్ నువ్వు  అనవసర విషయాల్లో జోక్యం  చేసుకోకు , నా ఇష్టం వచ్చినట్టు  నేనుంటాను , నువ్వు  ఎవరివి నన్ను అడగడానికి  అంటూ  అరిచాడు.
నీ ఇష్టం వచ్చినట్లు  నీ ఇంట్లో వుండు , అంతేగాని  కనబడ్డ ప్రతివాళ్ళ  మీద  నీ ఇష్టం వచ్చినట్లు  ప్రవర్తిస్తే  తగిన శాస్తి  అనుభవించాల్సి ఉంటుంది అని అన్నాడు.  నువ్వు పదమ్మా, నేను నీ కూడా వస్తాను , నువ్వు భయపడవలసిన  అవసరం లేదు.
అతను ఇప్పుడు తాగి ఉన్నాడు. ఎమి చెప్పినా అర్ధం కాదు. ఇతని  సంగతి రేపు చూసుకుందాము. అంటూ తనని  బయటకు  తీసుకెళ్లబోయాడు. ఆగు  ఎక్కడికి  వెళుతున్నావు, నీ అంతు తేలుస్తా, రేపు  కంప్లైంట్ ఇచ్చి  నా పరువు  తీస్తావా, ఇప్పుడే నీ సంగతి  తేలుస్తాను అంటూ  అక్కడ  పడి ఉన్న రాడ్ తీసుకుని  అతన్ని కొట్టడానికి  ఉన్మాదం తో  బయలుదేరాడు. ఆ కోపంలో ఒళ్ళు మరచిపోయి  క్రింద ఏమున్నదో చూసుకోకుండా  పైపులైన్ తన్నుకుని  తూలుకుంటూ వెళ్లి పడిపోయాడు. తలకు  బలంగా  దెబ్బ తగలడంతో అక్కడికక్కడే స్పృహ  తప్పాడు.
ఈ హఠాత్ పరిణామానికి  ఒక్కసారిగా  అదిరిపోయారు ఇద్దరూ. జయ్  పరిగెత్తుకుంటూ వెనక్కు వచ్చి శ్వాస చూసాడు . బానే ఉంది  బాగా తాగి ఉండటంతో స్పృహ  తప్పాడు. అయ్యో ఇప్పుడెలా ఎంత పని జరిగింది  ఒక పని  చెయ్యి  నిన్ను ముందు బయట దాక దిగబెడతాను. తరువాత  ఏం చెయ్యాలో  చూస్తా  ముందు ఇక్కడ నుండి పదమ్మా అంటూ తనను  బయటకు తీసుకువచ్చాడు. అప్పటికే వర్షం ప్రారంభం అయ్యింది ,ఉరుములు , మెరుపులు ప్రారంభం అయ్యాయి.చినుకులు పెద్దవి అవుతున్నాయి. గాలి విసిరేస్తోంది...
ఈ సార్ ఎక్కడికి పోయాడో, తాళాలు ఇచ్చి వెళ్ళాలి  అంటూచెట్టు కింద ఎదురుచూస్తున్నాడు రామయ్య.
అమ్మా  వసంతా  నువ్వు ముందు 
ఏడుపు ఆపేసెయ్యి, ఇక్కడ జరిగింది అంతా మర్చిపో,ఎవరితో ఏమి చెప్పకు . నీ భవిష్యత్తు అల్లరి పాలవుతుంది. సరేనా వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది  వెళ్లగలవా ఇంటిదాకా రానా  అని  అడిగాడు.
వద్దు సార్  నేను వెళ్లగలను  ఇవాళ  మీరు  రాకపోతే నేను ఏమయ్యే దాన్నో , చాలాథాంక్స్ సార్  అంటూ నమస్కరించి తడుచు కుంటూ ఇంటికి  బయలుదేరింది.  ఈ రామయ్య  ఎక్కడ ఉన్నాడో  అంటూ  చూస్తే  చెట్టుకింద వున్నాడు,  సారూ ఇక్కడే వున్నా  మీగురించే ఎదురు చూస్తున్నా ను , తాళాలు ఇచ్చే సి  వెళదామని. అవును ఏమిటి ఆ అమ్మాయి  ఇప్పటిదాకా  ఉంది అంటూ అడిగాడు. జరిగింది చెప్పాడు. ముందు నువ్వు నాకో సాయం చేసి  పెట్టాలి అంటూ, నువ్వు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు చూసుకుంటారు.జాగ్రత్త వాళ్లకి కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్పు.కాలేజ్ పేరు పాడవకుండా చూసుకోమని ఆ ఇన్స్పెక్టర్ గారికి చెప్పు.
అలాగే సారు ,  గట్లనే చేస్తాను .
కలికాలం, పిదప బుద్ధులు... ఎవరి బుద్ధి ఎలా పెడ దారి పడతాయో కదా.
సరే లెండి ముందు మీరు ఇంటికి వెళ్ళండి.నేను స్టేషన్ కి వెళ్లి వస్తాను.
ఏదైనా అవసరం అనుకుంటే మీ ఇంటికి వస్తాను సర్ అని వర్షంలో తడుసుకుంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి బయలు దేరాడు.
ఆ దిక్కుమాలిన వాడికి ఇదేమి పోయేకాలం చిన్న పిల్ల అనికూడా చూడకుండా అలా ప్రవర్తించాడు. అందుకే తగిన శాస్తి అనుభవించాడు... అనుకుంటూ వేగం గా సైకిల్ తొక్క సాగాడు.
                                 -----(ఇంకా ఉంది)

Saturday, 16 February 2019

అభిమానం

అభిమానం 

ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్...
అంటూ మరికొద్ది సేపటిలో 2 వ నెంబర్ ప్లాట్ ఫారం మీదకి వచ్చును... అంటున్న ప్రకటన వినగానే ఒక్క సారిగా జనం సర్దుకోవడం మొదలు పెట్టారు...
 ఆ రోజు ఫ్లాట్ ఫారం అంతా సందడి గా, కోలాహలం గా  ఉంది.
ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో ఆరోజు అదే ట్రైన్ లో వస్తున్నారు. షూటింగ్ కోసం. అభినవ్ ఈమధ్యే రెండు హిట్స్ తో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
విజయ్ కి కూడా చాలా ఇష్టం ..
తనకి చూడాలని ఉంది ...
అంతమంది జనం , తోపులాట ఎందుకు అనిపించినా...
మనసు ఆగలేక బయకుదేరాడు
రైల్వే స్టేషన్ కి...
అప్పటికే జనాల అరుపులతో, అంతా హడావుడి గా ఉంది. కనీసం దూరం నుంచి అయినా చూద్దామని అలా దూరం గా ఒక బెంచ్ మీద కూర్చుని చూస్తున్నాడు. ఇంతలో రైలు వచ్చి ఆగింది... అందరూ ఉత్సాహం గా ఎగబడి పోయారు.. కంపార్ట్మెంట్ దగ్గరకి....
గేట్ తీయగానే...ఎవరో దిగారు... అతనికి దారి ఇచ్చేసారు...
తరువాత ఒక ముసలి ఆమె దిగారు.... మళ్ళీ ఫాన్స్ లో నిరుత్సాహాం...
ఈసారి ఒక ముసలి ఆయన సంచీ పట్టుకుని దిగాడు....
ఆయనకి దారి ఇచ్చేసారు....ఆయన మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న బెంచి మీద కూర్చున్నారు.
ఇంతలో ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి..
ఆయన లొకేషన్ కి వెళ్లి పోయారు మీరు అందరూ అక్కడి కి వచ్చేయండిి...
లంచ్ తరువాత కలిసే ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు...
అందరూ కొంత నిరుత్సాహ పడినా , అక్కడికి రమ్మన్నారు కదా అని రెండు గంటలకు అందరూ అక్కడికి చేరుకోవాలి అని ప్లాన్ చేసుకుని ఒక్కో క్కరూ బయలు దేరసాగారు.
బాబు కొంచెం మంచినీళ్లు ఇస్తావా అడిగారు. చెమట తుడుచుకుంటూ... అయ్యయ్యో ఇవి నేను తాగాను అండి...ఉండండి ఒక్క నిమిషం అంటూ ఒక మినరల్  వాటర్ బాటిల్ కొని ఆయనకి ఇచ్చాడు...
అదేమిటి బాబు కొత్తది కొని ఇచ్చావు... అంటూ అడిగాడు...
ఏమీ పరవాలేదు తాతగారు...
మీరు పెద్దవారు...మీకు దాహం తీర్చడం లో  వాడిన నీళ్లు ఎందుకని... ఇచ్చాను... ఇంతలో నా ఆస్తులు ఏమీ కరిగి పోవులెండి అన్నాడు నవ్వుతూ...
సంతోషం బాబు...ఇంతకీ అంతా అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు
అని ఆడిగాడు... నీళ్లు తాగుతూ..
నేను బాగా అభిమానించే హీరో
వస్తున్నారని చెప్పారు...అందరితో పాటు నేను చూద్దామని వచ్చాను ...
కానీ జన సందోహం చూసి ఇక్కడే ఆగిపోయాను.  ఆయన ముందు స్టేషన్ లో దిగి లొకేషన్ కి వెళ్లి పోయారుట...
రెండు గంటలకి అక్కడికి రమ్మని చెప్పారట...అన్నాడు విజయ్ .
మరి వెళుతున్నావా అని అడిగారు పెద్దాయన.
నాకూ వెళ్లాలనే ఉంది కానీ , అక్కడ కి చాలామంది వస్తారు...
పైగా షూటింగ్ హడావిడి స్ట్రిక్ట్ గా ఉంటుంది... కలిసే అవకాశం ఉండదు... ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉంది...అన్నాడు...
సరే అబ్బాయి 
ఇంతకీ  నీ పేరు ఏమిటన్నావ్ అన్నాడు.
విజయ్ సర్... అని చెప్పాడు.
మీ హీరో గారు నాకు ట్రైన్ లో పరిచయం అయ్యారు.
తన విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు. షూటింగ్ కి  ఖాళీగా ఉంటే  నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించారు. ఇదిగో
ఈ కార్డ్ చూపిస్తే ,లోపలికి రానిస్తారు
అని చెప్పాడు.
ఈ వయసులో అలాంటి సరదాలు మాకేముంటాయి .
నీకు కావాలంటే ఈ కార్డ్ ఇస్తా... తీసుకుని వెళతావా అన్నాడు పెద్దాయన .
విజయ్ ఎగిరి గంతేసినంత   పని చేసాడు.
మొహం లో ఒక్కసారి గా ఆనందం.
కానీ అంతలో నే  మాయమైంది.
కానీ  సర్ ఆయన కార్డ్ వలన అక్కడి వరకు వాళ్ళు వెళ్ళనిస్తారు.
కానీ ఆయన కి నేను తెలియదు కదా,
బైటకి పంపేస్తారు... ఇప్పుడు ఎలా మరి అని అడిగాడు.
ఓరి నీ దుంప తెగ... సర్లే నీకోసం నేనూ వస్తా...పద బండి తీయి...
నీకు సంతకం పెట్టించి... నేను వెళతాను సరేనా అన్నాడు పెద్దాయన.
అలా అన్నారు బాగుంది... ఇప్పుడు చూడండి అంటూ హుషారుగా బండి తీసుకుని రావడానికి వెళ్ళాడు.
దూరం గా నుంచుని ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచి... నేను ఇతనితో వస్తా...మీరు ఫాలో అవ్వండి... మేకప్ బాగా వేసాడు...ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు....నా క్యారెక్టర్ బాగా పండుతుంది అనడం లో సందేహం లేదు అన్నాడు నవ్వుతూ...
ఇవాళ లంచ్ కూడా నాతోనే ఏర్పాటు చేయండి... అభిమాని థ్రిల్ ఫీల్ అవుతాడు... వాళ్ళని సంతోష పెట్టడమేగా మన పని...అంటూ నవ్వాడు...
అలాగే సర్..అంటూ లగేజీ,  కార్ వ్యాన్ లో పెట్టించి...వెనుకే ఫాలో అవసాగాడు.
ఇద్దరు బయలు దేరారు..
భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు ..
ఆ చేయి వేయగానే ఏదో ఆనందం... తెలియదు...ఎందుకో..తన అభిమాన హీరో ని ,చూడడానికి వెళుతున్నాను కదా అందుకే నేమో...అనుకున్నాడు... విజయ్..
ఇద్దరు షూటింగ్ లొకేషన్ కి చేరుకున్నారు... ...తన అభిమాన హీరో ని కలవ బోతున్నా అన్న ఆనందం చెప్పలేనిది గా ఉంది...సర్ చాలా థాంక్స్ అండీ...
మీ దయ వలన నేను మా అభిమాన హీరో ని కలవ బోతున్నా... అన్నాడు..
అప్పుడే ఏమైంది... ఇంకా చాలా ఉంది. ముందు ముందు నీ కే తెలుస్తుంది లే అన్నారు .అర్థం కాలేదు విజయ్ కి
 ఏమిటో మరి అనుకుంటూ అక్కడ ఆగాడు...ఆయన బండి దిగుతుంటే...
అందరూ  పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చేసారు...
నమస్తే సర్..మీ గురించే ఎదురు  చూస్తున్నాము....అంటూ గబగబా దండలు అవి వేయ బోయారు...
వద్దు వద్దు మేకప్  పోతుంది....
ముందు సీన్ చేసేద్దాం... తరువాత మాట్లాడుకుందాం... అన్నాడు.
విజయ్ కి ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు... ఇంత సేపు తన బైక్ మీద వచ్చింది తన అభిమాన హీరోనా..
ఆయన తోనే నేను ఇక్కడి కి వచ్చానా.
ఆయనే నన్ను ఇక్కడి కి తీసుకుని వచ్చారా..సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయాడు.
.. ప్రొడక్షన్  మేనేజర్ ని పిలిచి ఇవాళ ఇతను నా గెస్ట్ ...లంచ్ కూడా నాతోనే...జాగ్రత్తగా చూసుకోండి... అన్నాడు.సరే సర్ అంటుంటే...
దర్శకుడు వచ్చారు... సర్ షాట్ రెడీ...
మీరు ఒక రిహార్సల్స్ చేసేస్తే...
టేక్ చేస్తాను... అంటూ చెప్పాడు... పదండి...అంటూ...
మిస్టర్ విజయ్ ఇవాళ నాతోనే ఉంటున్నావ్....సరేనా అంటూ భుజం మీద ఆప్యాయంగా తట్టి , నవ్వుతూ  లోపలికి వెళ్ళిపోయాడు అభినవ్.
ఇవాళ షూటింగ్ అంత సేపు నువ్వు ఇక్కడే ఉండొచ్చు....హీరో గారితో లంచ్... కూడా ఏర్పాటు చేసాను. తరువాత నీకు కావలిసిన ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్లొచ్చు ..సరేనా అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్.. చాలా థాంక్స్ అండీ....ఇవాళ చాలా సంతోషంగా ఉంది.. ముందు లోపలికి వెళ్ళు.... నేను మళ్ళీ కలుస్తాను.ఇదిగో ఈ పాస్ నీ దగ్గర ఉంచు... ఎవరు ఆడిగినా చూపించు... ఎవరూ ఆపరు... అని అతనికి పాస్ ఇచ్చి వెళ్ళిపోయాడు.ఆ రోజంతా గడిపి ఆటోగ్రాఫ్ తీసుకుని...బండి మీద బయలు దేరాడు...
ఆ రోజు నిజంగా జీవితం లో మరచి పోలేని రోజు.... అనుకుంటూ..గాల్లో తేలి నట్టుంది అంటూ పాడుకుంటూ ...నడువుతున్నాడు...బండి...ఆ థ్రిల్ నించి ఇంకా బైటకి రాలేక పోతున్నాడు... ఇంతలో బండికి అడ్డం గా ఎవరో వచ్చేసారు... చూసుకోలేదు.
సడెన్ బ్రేక్ వేసాడు... కంట్రోల్ తప్పి...దబ్ మని పడిపోయాడు.... ఎవరో తనని లేపుతున్నారు....
కళ్ళు తెరిచి చూసేటప్పటికి... మంచం కింద ఉన్నాడు...
ఏరా... మళ్ళీ కల వచ్చిందా....
మంచం మీదనించి పడ్డావ్...
అసలు ఈ కలలు కనే మాయ రోగం ఎక్కడి నుంచి వచ్చింది రా.
అర్ధరాత్రి దాకా తిరగటం , బారెడు పొద్దెక్కే దాకా లేవక పోవడం...
అన్ని దిక్కుమాలిన అలవాట్లే వీడికి....
కాలేజీ కి టైం అవుతోంది, తొందరగా  లేచి తయారవుదాం...అన్న జ్ఞానం లేదు
ఇంతకీ ఇవాళ కాలేజ్ కి వెళుతున్నారా  లేదా దొరగారు, అంటూ తిట్ల దండకం మొదలు పెట్టాడు విజయ్ వాళ్ల నాన్న.
ఆ  ఆ వెళుతున్నాను నాన్నా...ఆంటూ లేచాడు .
ఇదంతా కలా... ఎంత రియల్ గా అనిపించింది...అభిమానం ఉండొచ్చు కానీ ఇంత ఎక్కువ గా ఉండకూడదు... ఇంకా నయం మంచం మీదనించి పడ్డాను గాబట్టి సరిపోయింది లేకపోతే అదే బండి మీద నుంచి అయితే...ఎంత ప్రమాదం..తప్పింది.. అనుకుని...తనలో తాను నవ్వుకుంటూ తయారవడానికి బయలు దేరాడు...విజయ్ టిఫిన్ చేస్తుండగా ఫ్రెండ్ వచ్చాడు బండి మీద...ఒరేయ్ విజయ్ అని అరిచాడు..
అదిగో వచ్చాడు
కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడగొట్టిందట...
సుబ్బరంగా మెక్కడం....ఊరి మీద పడి బలాదూర్ తిరగడం...
ఇంక చదువుకోవడాలు ఏవి లేవుట్రా....అంటూ వాడి మీదకుడా అరిచాడు ...
ఆబ్బె అలాంటిదేమి లేదు అంకుల్ ...
కాలేజ్ కే  వెళుతున్నాం...
మేము చాలా బాగా చదువుకుంటున్నాం అంకుల్... అన్నాడు..
ఆహా అలాగా మరి ఎన్ని బాక్ లాగ్స్ ఉన్నాయో చెప్పు మరి...అన్నాడు...
అంకుల్ అవి మరి అవి , ఏమిటి అలా నీళ్లు నములుతున్నావ్ చెప్పు మరి అని అన్నాడు,
అవి ఒకటి రెండు మూడు లెక్కపెడుతున్నాడు... చేతి వేళ్ళు సరిపోతాయా , కాలి వేళ్ళు కూడా కలపాలా ..
మీ సంగతి నాకు చెపుతున్నారురా....ఇక్కడ ఫీజులు లు కట్టేది నేనే నని మర్చిపోయి నట్టున్నారు... ఒక్కొక్కళ్ళు ఎలా తయారయ్యారో...
ఎప్పుడు మారతారు రా,
జీవితం విలువ ఎప్పుడు తెలుసు కుంటారు రా ...
అని క్లాస్ మొదలు పెట్టాడు.
నాన్నా బాయ్ అంటూ విజయ్ వచ్చి బండి ఎక్కాడు...
తొందరగా ఎక్కరా బాబు....
ఇంకొంచెం సేపు ఉంటే మీ నాన్న
 నన్ను  చంపే సేలా ఉన్నారు... అంటూ
బండి స్టార్ట్ చేసి.. బై అంకుల్ అంటూ చెప్పాడు...
దీనికేమి తక్కువ లేదు...బాయ్ బాయ్...లు టా టా లు...వేధవల్లారా...
ఆ వెధవ స్పీడ్ తగ్గించి , కాస్త స్లోగా అఘోరించండి....
జాగ్రత్తగా వెళ్లి రండి...అన్నారు.
ఎందుకండి వాడ్ని అలా తిడతారు.
అసలే కాలేజ్ కి వెళ్లే కుర్రాడు...అంటూ అడిగింది భార్య...
తమరి  దిక్కుమాలిన సలహా ఇక్కడ ఎవరికి అక్కరలేదు..
ముందు నాకు టిఫిన్ పెట్టు.
ఆఫీస్ కి టైం అవుతోంది.
అసలు నీ గారాబం వల్ల నే కదూ వాడు అలా తయారు అయ్యింది అన్నాడు...
అయ్యో రామా మధ్య లో నా మీద పడతారేమిటి,
ఇదిగో టిఫిన్ తినండి అంటూ ప్లేట్ టేబుల్ మీద  పెట్టింది.
వాడిని ఒక్క ముక్క కూడా అననీయవు, మధ్య లో దూరిపోతావ్...మనం కాక పోతే ఎవరు చెపుతారు..
" ఇప్పుడు కష్టపడి చదవక పోతే
జీవితాంతం కష్టపడి పని చేయాల్సి వస్తుంది"
అది నీకు సంతోషమేనా....
నేను కోప్పడేది వాడి భవిష్యత్ కోసమేగా...
కనీసం నువ్వైనా అర్థం చేసుకో
నాన్న మనసుని
అంటూ చేయి కడుక్కోవడానికి లేచాడు..
ఇటు ఎక్కడికి రా ,
కాలేజ్ అటు కదా అని అడిగాడు విజయ్.
ఏరా మరచి పోయావా
ఇవాళ మన అభిమాన హీరో
అభినవ్ షూటింగ్ ఉందని తెలుసుగా....
మనం  అక్కడి కే వెడుతున్నాం.
కాలేజ్ కి  వెళ్లటం లేదు... అన్నాడు... వేణు.
వద్దు రా , అభిమానం సినిమా చూసే వరకు ఉంచుకుందాం... కాలేజ్ మానేసి...అక్కడికి వెళ్లడం ...ఉహూ...
వద్దు లే...
ఇవాళ క్లాస్ మిస్ అయితే మళ్ళీ చెప్పే వాళ్ళు ఉండరు.ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం...
ఎప్పుడైనా సెలవులో ఉంటే వెళదాం....
ముందు  బండి కాలేజీ కి పోనీ అన్నాడు... విజయ్..
ఇంత జ్ఞానోదయం ఎప్పుడు అయింది బాబూ అని ...వెటకారం గా అడిగాడు వేణు.
రాత్రే గానీ,
నువ్వు మూసుకుని పద బే...అన్నాడు విజయ్.
సరే ..అలాగే కానీ
ఇలా మర్యాద గా చెపితే ఎవరు కాదంటారు, అలాగే కానీ,
అయినా,
నువ్వు చెప్పింది పాయింటే గా...
చలో కాలేజ్ ...అంటూ
బండి కాలేజ్ వైపు తిప్పేసాడు....

Wednesday, 16 January 2019

స్వయంకృతం

" స్వయంకృతం  "

కౌసల్యా ,సుప్రజా , రామా అంటూ చిన్నగా సుప్రభాతము వినిపిస్తోంది...నులి  వెచ్చని,
సూర్య కిరణాలు , కాషాయం రంగు పూసుకుని ప్రాతః కాల సొగసులు రంగరించుకుని , పరుచుకుంటున్నాయి..
వివేక్ ప్రతి రోజు ఉదయం ఆ కిరణాలు తాకేలా , లాను లో కూర్చుని కాఫీ తాగడము అలవాటు.

అద్భుతమైన వాతావరణం, చల్ల ని 
గాలులు వింజామరలు వీస్తుండగా ,పేపర్ చదువుతూ, వేడి వేడి కాఫీ, పరిమళాలు వెదజల్లుతుండగా ఆస్వాదిస్తూ  తాగుతున్నాడు.

ఇంతలో గేట్ చప్పుడు అయ్యింది. ఎవరా అని చూస్తే తన స్నేహితుడు రాము వస్తున్నాడు. 

పేపర్ పక్కన పెట్టి , రారా రాము ఏమిటి విశేషము. ఇంత పొద్దున్నే వచ్చావు.
ఎలా ఉన్నారు అందరూ... అంటూ ,
సుజాతా రాము వచ్చాడు మంచి కాఫీ పట్టుకు రా అన్నాడు. 

రాము వచ్చి కూర్చున్నాడు.
కాఫీ పట్టుకుని వచ్చింది సుజాత. శుభోదయం అన్నయ్య గారు ఈ మధ్య రావడము లేదు, వదినగారు , పిల్లలు ఎలా ఉన్నారు.. అంటూ కాఫీ అందించింది.
బాగానే ఉన్నారు అమ్మా,, 
ఈ మధ్య వీడిని కలవలేదని ఇలా వచ్చా... అన్నాడు.
కాఫీ లు అయ్యాక , 

ఇప్పుడు చెప్పారా ఏమిటి విశేషాలు, భూషణం తో వ్యాపారం పెట్టావుగా, ఎలా జరుగుతోంది.అని అడిగాడు వివేక్.
ఫ్రెండ్ అని నమ్మి అతనికి పార్టనర్ షిప్ ఇచ్చా.బాగానే ఉన్నాడు కదా అని నమ్మకంతో ముఖ్య మైన పనులు కూడా అప్పచెప్పి నేను విదేశాలకి వెళ్లి వచ్చేసరికి, వాడు మోసం చేసాడు. చాలా డబ్బు తినేశాడు. అడిగితే నష్టం వచ్చింది అని చెబుతున్నాడు. వేరే ఆఫీస్ పెట్టి నా కాంట్రాక్టు లన్ని  ఆ సంస్థ తో చేయిస్తున్నాడు. చాలా నష్టం వచ్చింది. 
ఏమి చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు విచారంగా.
అవునా అంత జరిగిందా, అయినా అంత నమ్మకం గా ఏలా వదిలేశావు...

అసలు " వ్యాపారానికి ఉండవలసిన 
ముఖ్య లక్షణము ఎవరిని నమ్మకూడదు". 

 సరేలే ఏదో ఒకటి అలోచిద్దాం, 

నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఆ పైన భగవంతుడు ఉన్నాడు అన్నాడు వివేక్. 
నిజం గా ఆ భగవంతుడు ప్రత్యక్షము అయి నాకు వరం ఇస్తానంటే , నన్ను ఇంత మోసం చేసిన వాడిని సర్వ నాశనం చేయాలని కోరుకుంటాను అన్నాడు ఆవేదనగా.
అలా ఆవేశ పడకు.కోపం లో తప్పుడు నిర్ణయం తీసుకుంటావు.ఒక్క విషయం గుర్తు ఉంచుకో...

"ఆనందం గా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు...
కోపం గా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు".

ఈ రెండు మనిషికి చేటు తీసుకుని వస్తాయి.
అయినా  
ఒక వేళ నిజంగా సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రత్యక్షమైతే , 

"నువ్వు గొప్పవాడివి అవ్వాలని కోరుకోవాలి కాని, నీ శత్రువు నాశనం కోరుకోవడం ఎందుకు." ...

వాడి వినాశనం కోరుకోవడం వలన వాడికి, ఉన్నది పోతుందేమో గాని , ...
నీకు ఇప్పటి స్థితి లో మార్పు అయితే రాదు... గా, 

నీ సమస్య కి పరిష్కారం ఆలోచించాలి గానీ, ఇలా దూషించడము అసమర్ధుల లక్షణము.

ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు.
అన్నాడు వివేక్.

వాడు చేసిన పాపానికి శిక్ష వేయాల్సింది 
ఆ భగవంతుడు... నువ్వు కాదు, 
నువ్వు ఆలోచించాల్సింది 
ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బైట పడడము ఎలా అని  అన్నాడు వివేక్.

నిజమే రా , నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. నా కర్తవ్యం ఏమిటో.
నేను  నన్ను మోసం చేసిన వాడి గురించి ఆలోచించడం మానేసి, 
నా గురించి ఆలోచించడం మొదలు
 పెడితే ప్రస్తుత పరిస్థితి నుంచి బైట పడవచ్చు.
పైగా ఇది " స్వయంకృతం "
ఈ పరిస్థితి నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఏర్పడింది,  కనుక నేనే మార్చుకోవాలి.
వాడికి అందనంత ఎత్తు ఎదిగి చూపిస్తా .

ఇంక నేను ఏ వరాలు కోరుకొనవసరం లేదు. కష్టపడి సాధిస్తా.
సరిఅయిన సమయానికి మంచి సలహా ఇచ్చావు. 
అదే ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా ..అన్నాడు
ఆల్ ది బెస్ట్ రా ...రాము  అంటూ షేక్ హాండ్ ఇచ్చాడు వివేక్
వస్తా రా వివేక్ అంటూ ముందుకు కదిలాడు రాము రెట్టించిన ఉత్సహం తో...