ఆరోజు
ఆకాశం మేఘావృతమై ఉంది.
చిన్నగా గాలి మొదలయింది.సాయంత్రం నాలుగున్నర కావస్తోంది.
కాలేజీలో ప్రాక్టికల్ exams ఆఖరి రోజు.
జయ్ కాలేజి లెక్చరర్.
మాట మంచితనం ,సహాయం చేసే స్వభావం ఉండడంతో అందరికి అతని మీద అభిమానం .విద్యార్థులందరితోను కలుపుగోలుగా వుంటూ ,వారికి సబ్జెక్ట్స్ విషయంలో డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆటలు ఆడేటప్పుడు physical డైరెక్టర్ గా , కాక తాను కూడాఒక స్టూడెంట్ లా మారి అల్లరి చేస్తాడు. అతనంటే విద్యార్థులకు భయం తో కూడిన భక్తి కన్నా వల్లమాలిన అభిమానం చూపిస్తారు. మిగతా లెక్చరర్లు కు ఇది నచ్చదు. విద్యార్థులను విద్యార్థుల లాగే చూడాలి మనకు భయపడాలి అంటారు. కానీ అవన్నీకొట్టిపారేస్తాడు. వాళ్ళకి ఫ్రీడమ్ దొరికిదే ఇక్కడ ,రెసిడెన్షియల్ స్కూల్ లోనో లేక కాన్వెంట్స్ లో చదివి చదివి రోజుకు 14 గంటలు వేరే
ప్రపంచ ము తెలియదు పాపం వాళ్లకి. ఇప్పుడు కూడా మనం భయపెడుతూ చదువు చెపితే వాళ్లకు ఎలా ? ఈ వయసులో సరదాలుంటాయి. హుషారుగా ఇష్టపడి చదివితే ఇంతకన్నా ఎక్కువ మార్కులు వస్తాయి , అని నా అభిప్రాయం అంటా డు. చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయిన విద్యార్థులు కూడా అప్పుడప్పుడు వచ్చి గురువుగారు బాగున్నారా అని పలకరించి వెలుతూ వుంటారు. ఇది పడని కొంతమంది లెక్చరర్లు పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల కొంత అసూయ ఉంటూనే ఉంటుంది.
ఈరోజు వర్షం పడేలా ఉంది .చిన్న చిన్న చినుకు లు ప్రారంభం అయ్యాయి.చల్లని గాలులు వీస్తున్నాయి. తుఫాను హెచ్చరిక చేశారు... గాలి విసురు కొంచెం ఎక్కువగానే ఉంది.
తొందరగా రూంకి వెళ్ళాలి, అని తన పని తొందరగాముగించుకుని ఆఫీస్ బోయ్ కోసం చూసాడు. అతను అప్పుడే బయట నుండి లోపలికి వస్తున్నాడు. రామయ్యా ,అందరూ వెళ్లిపోయారా, వర్షం వచ్చేలా ఉంది. నువ్వు కూడా తాళాలు వేస్తే, వెళ్లిపోవచ్చు. అని పిలిచాడు. అలాగే సర్ అన్నీ సర్దేసి తాళాలు వేస్తాను ,మీరు బయలుదేరండి సర్ అన్నాడు . సరే అయితే నేను కూడా బయలుదేరు తున్నాను అంటూ బయటకు వచ్చి బండి తీసుకుంటుండగా పక్కన ప్రసాద్ బండి కూడా ఉండడం చూసి, ఇతను ఇన్విజిలేటరు కదా పరీక్ష అయిపోయింది. ఇంకా ఏం చేస్తున్నాడు లాబ్ లో ఒకసారి చూసి వస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ మళ్లీ బండి స్టాండ్ వేసి వెనుక వైపుకి వెళ్ళాడు .
అక్కడ కిటికీలోంచి చూస్తే ప్రసాద్ ఎదురుగా ఒక అమ్మాయి ఉంది. తన పేపర్ ఆయన చేతిలో ఉంది . ఏమిటా అని తొంగి చూస్తే తనని కావాలని ఆలస్యం చేసి తనతో కొంచెం తప్పుగా మాట్లాడుతున్నాడు. కోపం వచ్చింది. ఒక్కసారిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు . అక్కడ ఆ అమ్మాయి ఏడుస్తోంది. జయ్ ని చూడగానే ఒక్కసారిగా ఆయన దగ్గరికి పరిగెత్తింది. చూడండి సార్ ఎలా అసభ్యంగా మాట్లాడుతున్నారో , ఆయన చెప్పినట్లు వినకపోతే పరిక్ష fail చేస్తారుట, బెదిరిస్తున్నారు అంటూ జయ్ వెనుక చేరింది. నువ్వు కంగారు పడకమ్మా, నేనున్నాను కదా, భయపడకు , నీ పరీక్ష ఏమి కాదులే , నేను చూసుకుంటాను అంటూ దేర్యం చెప్పి , ప్రసాద్ వైపుకి తిరిగాడు. ఏమయ్యా ప్రసాదూ, ఏమిటి నువ్వు చేస్తున్న పని . ఒక లెక్చరర్ వి అయ్యి ఉండి స్టూడెంట్ తో ప్రవర్తించే విధం ఇదేనా , సభ్యత ,సంస్కారం మరచిపోయి ఇలా ప్రవర్తిస్తున్నావు, మర్యాదగా ఆ పేపర్లు ఇలా ఇచ్చేసి వెళ్ళు . రేపు నీ మీద ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేస్తాను, ఏవనుకుంటున్నావో నువ్వు అన్నాడు. ప్రసాదుకి ఒక్కసారిగా కోపం వచ్చేసింది . ఊగి పోతున్నాడు. బాగా తాగి ఉన్నాడు.
జయ్ నువ్వు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు , నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను , నువ్వు ఎవరివి నన్ను అడగడానికి అంటూ అరిచాడు.
నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇంట్లో వుండు , అంతేగాని కనబడ్డ ప్రతివాళ్ళ మీద నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే తగిన శాస్తి అనుభవించాల్సి ఉంటుంది అని అన్నాడు. నువ్వు పదమ్మా, నేను నీ కూడా వస్తాను , నువ్వు భయపడవలసిన అవసరం లేదు.
అతను ఇప్పుడు తాగి ఉన్నాడు. ఎమి చెప్పినా అర్ధం కాదు. ఇతని సంగతి రేపు చూసుకుందాము. అంటూ తనని బయటకు తీసుకెళ్లబోయాడు. ఆగు ఎక్కడికి వెళుతున్నావు, నీ అంతు తేలుస్తా, రేపు కంప్లైంట్ ఇచ్చి నా పరువు తీస్తావా, ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను అంటూ అక్కడ పడి ఉన్న రాడ్ తీసుకుని అతన్ని కొట్టడానికి ఉన్మాదం తో బయలుదేరాడు. ఆ కోపంలో ఒళ్ళు మరచిపోయి క్రింద ఏమున్నదో చూసుకోకుండా పైపులైన్ తన్నుకుని తూలుకుంటూ వెళ్లి పడిపోయాడు. తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే స్పృహ తప్పాడు.
ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా అదిరిపోయారు ఇద్దరూ. జయ్ పరిగెత్తుకుంటూ వెనక్కు వచ్చి శ్వాస చూసాడు . బానే ఉంది బాగా తాగి ఉండటంతో స్పృహ తప్పాడు. అయ్యో ఇప్పుడెలా ఎంత పని జరిగింది ఒక పని చెయ్యి నిన్ను ముందు బయట దాక దిగబెడతాను. తరువాత ఏం చెయ్యాలో చూస్తా ముందు ఇక్కడ నుండి పదమ్మా అంటూ తనను బయటకు తీసుకువచ్చాడు. అప్పటికే వర్షం ప్రారంభం అయ్యింది ,ఉరుములు , మెరుపులు ప్రారంభం అయ్యాయి.చినుకులు పెద్దవి అవుతున్నాయి. గాలి విసిరేస్తోంది...
ఈ సార్ ఎక్కడికి పోయాడో, తాళాలు ఇచ్చి వెళ్ళాలి అంటూచెట్టు కింద ఎదురుచూస్తున్నాడు రామయ్య.
అమ్మా వసంతా నువ్వు ముందు
ఏడుపు ఆపేసెయ్యి, ఇక్కడ జరిగింది అంతా మర్చిపో,ఎవరితో ఏమి చెప్పకు . నీ భవిష్యత్తు అల్లరి పాలవుతుంది. సరేనా వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది వెళ్లగలవా ఇంటిదాకా రానా అని అడిగాడు.
వద్దు సార్ నేను వెళ్లగలను ఇవాళ మీరు రాకపోతే నేను ఏమయ్యే దాన్నో , చాలాథాంక్స్ సార్ అంటూ నమస్కరించి తడుచు కుంటూ ఇంటికి బయలుదేరింది. ఈ రామయ్య ఎక్కడ ఉన్నాడో అంటూ చూస్తే చెట్టుకింద వున్నాడు, సారూ ఇక్కడే వున్నా మీగురించే ఎదురు చూస్తున్నా ను , తాళాలు ఇచ్చే సి వెళదామని. అవును ఏమిటి ఆ అమ్మాయి ఇప్పటిదాకా ఉంది అంటూ అడిగాడు. జరిగింది చెప్పాడు. ముందు నువ్వు నాకో సాయం చేసి పెట్టాలి అంటూ, నువ్వు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు చూసుకుంటారు.జాగ్రత్త వాళ్లకి కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్పు.కాలేజ్ పేరు పాడవకుండా చూసుకోమని ఆ ఇన్స్పెక్టర్ గారికి చెప్పు.
అలాగే సారు , గట్లనే చేస్తాను .
కలికాలం, పిదప బుద్ధులు... ఎవరి బుద్ధి ఎలా పెడ దారి పడతాయో కదా.
సరే లెండి ముందు మీరు ఇంటికి వెళ్ళండి.నేను స్టేషన్ కి వెళ్లి వస్తాను.
ఏదైనా అవసరం అనుకుంటే మీ ఇంటికి వస్తాను సర్ అని వర్షంలో తడుసుకుంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి బయలు దేరాడు.
ఆ దిక్కుమాలిన వాడికి ఇదేమి పోయేకాలం చిన్న పిల్ల అనికూడా చూడకుండా అలా ప్రవర్తించాడు. అందుకే తగిన శాస్తి అనుభవించాడు... అనుకుంటూ వేగం గా సైకిల్ తొక్క సాగాడు.
-----(ఇంకా ఉంది)

No comments:
Post a Comment