వేటూరి గారి పాట....
శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...
ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గాన విలక్షణ రాగమె యోగమని
నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత ఖందరా
నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది
ఆవధరించ రా విని తరించరా ||శంకరా||
మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టి నే తడవంగ ||శంకరా||
మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...

No comments:
Post a Comment