నాన్నంటే నే ప్రేమ .... కధ
రచన : ఆచంట గోపాలకృష్ణ
ఆరోజు సంజయ్ ఆలస్యం గా ఇంటికి వచ్చాడు. జీతం తక్కువ , పని ఎక్కువ .
సారీ నాన్న ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. నీకు ఆకలేస్తోందా ఒక పావుగంటలో అన్నం వండేస్తాను .డబ్బాలో నువ్వు తినడానికి పెట్టాను ,కాఫీ ప్లాస్క్ లో పోసాను గా , తీసుకున్నావ అంటూ ప్రేమగా అడిగాడు . ఆ తిన్నాను గానీ ,నువ్వు కనీసం కాఫీ అయినా తాగావు రా ,ఆ పని తిరుగుడు ఉద్యోగం .నేను అన్నం కుక్కరు పెట్టేస్తానులే . మీ అమ్మే బతికుంటే మనకు ఇన్ని కష్టాలుఉండేవి కాదు.దానికి తొందరెక్కువ ముందే గోడెక్కేసింది . నిన్ను వదల లేక దాని కూడా పోలేక ఇలా గడుపుకు వస్తున్నాను . నువ్వు పెళ్లి చేసుకోరా . ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు అని అన్నాడు .కాళ్ళు ,చేతులు కడుక్కుని వచ్చి కూర స్టవ్ మీద పెట్టి ఆ విషయమే నీతో మాట్లాడదామనుకుంటున్నాను నాన్న . సుధ అని మా ఆఫీస్ లో పని చేస్తుంది . తనకు నేనంటే ఇష్టమే . ఇద్దరం ఉద్యోగాలు చేస్తేగాని గడవడం కష్టం ఈ రోజుల్లో , అందుకే నువ్వు ఒప్పుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అని అన్నాడు .నువ్వు ఒక ఇంటివాడివి అయితే నాకు మాత్రంసంతోషంగా ఉండదా .అయితే ఆ అమ్మాయిని ఒకసారి తీసుకురా నేను చూస్తాను అని అన్నారు . అన్నట్టు చెప్పడం మరిచాను ఆ అమ్మాయి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తను అనాధ . చిన్నప్పటినుండి ఆశ్రమం లోనే పెరిగింది .చదువుకుని ఉద్యోగం సంపాదించింది .తనకు మనం తప్ప ఎవరు లేరు మరి అన్నాడు.తండ్రి చిరునవ్వు నవ్వాడు . ఏం నాన్న ఆలా నవ్వారు అని అడిగాడు . ఏంలేదులే మనమే అనాథలం మనకు ఇంకో అనాధ . సరేలే మనం ముగ్గురు కలిస్తే ఒక కుటుంబం.ఆ పిల్లనే చేసుకో. ఒకరికి ఒకరు సాయం గాఉంటారు అన్నాడు.తండ్రి.ఇద్దరికి పెళ్లి చేసేసాడు.కొన్నాళ్ళు బాగానేగడిచింది. ఇద్దరు కేరెజి సర్దుకుని మామయ్యగారికి టేబుల్ మీద పెట్టేసి ఆఫీస్ కి వెళ్లిపోతారు.కాఫి కలుపుని తాగుతారు తనకి కావలిసినఅప్పుడు. సాయంత్రం మళ్ళీ వంట...పెద్ద వాడుఅవడము చేత కాఫీ కలుపు కునేటప్పుడు స్టోమీద వలికేది.మళ్ళీ అవి అన్ని కడుక్కుని వంటచేయాల్సి వచ్చేది.తరువాత ఫలాస్క్ లోపెట్టేది...ఆ రోజు స్టో మీద మళ్లీ ఒలికింది...మామయ్య గారూ మీకు ఫలాస్క్ లో పెట్టానుకదామళ్ళీ ఏమైంది ఇదంతా పాడుచేశారు....అంటూవిసుక్కుంది.ఇవాళ న స్నేహితుడు ఒకరువచ్చాడు..అతనికి కలిపే ప్రయత్నం లోఒలికింది.అమ్మా అన్నాడు...ఇలా రోజు ఏదో ఒక కారణం తో విసుగు కోవడంమొదలు పెట్టింది.
కొడుకు మనసు బాధ పడకూడదని ఈవిషయాలు చెప్పేవాడు కాదు.ఈ ముసలి ఆయన చాదస్తం ఎక్కువగా ఉందిఅంటూ తన సహచరి కి చెప్పింది. అసలే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు.. ఆయన్నిఆశ్రమం లో చేర్పిస్తే...
వెళ్లి చూసి రావచ్చు.పైగా అన్ని వాళ్ళేచూసుకుంటారు.రేపు పిల్లా జల్లా పుడితే పని భారం పెరిగేదే కానీతరగదు... బాగా ఆలోచించు కో అంటూ నూరిపోసింది.ఆ విషయం అమ్మాయి తలకి ఎక్కేసింది. ఇంటికి వెళ్ళగానే ఆయన్ని ఒప్పించాలి అనినిర్ణయం తీసుకుంది. ఆరాత్రి ఏమండీ అటు ఆఫీస్ లోను ఇటుఇంట్లోనూ చాకిరి ఎక్కువగా ఉంటోంది.
రేపు పిల్లలు పుడితే ఇంకా ఎక్కువ అవుతుంది.అందుకే మామయ్య గారిని ఆశ్రమంలో చేర్పిస్తేపని భారం కొంచెం తగ్గుతుంది.
వారం వారం వెళ్ళి చూసి రావచ్చు .
మీరు ఈ విషయంలో కాస్త ఆలోచించండి అంటూతినడం మొదలు పెట్టింది.
మొదట్లో వద్దన్నా రాను రాను నస ఎక్కువఅవడం తో ,సరే మాట్లాడతా లే ఇంకా పడుకో అనివిసుక్కున్నాడు.ఆ రాత్రి పెద్దాయన వాళ్ళ మాటలు విన్నాడు.తన భార్య ఫోటో దగ్గర కు వెళ్లి చూసావా, ఎలాతయారయ్యారో, పిల్లలు.ముసలితనం బరువైపోయింది.
వాళ్ళు కన్న పిల్లల కోసం ఎన్ని కష్టాలు అయినాపడతారు... వాళ్ళు పెరగడానికి కష్టాలు పడిన వాళ్ళనుమాత్రం పట్టించుకోరు...
ఇదేమి పోకడో అర్థం కాదు...వాడు నాకు చెప్పలేడు.పెళ్ళాం మాట కాదనలేడు...
మధ్యలో నలిగి పోతున్నాడు...
నేనె వెళ్లిపోతాను..అంటూ కళ్ళ నీళ్లుతుడుచుకున్నారు. మారునాటి ఉదయం తండ్రి దగ్గరకు వచ్చాడు ..నాన్న అది అది...అంటూ నసిగాడు...ఏంటిరా నువ్వు చెప్పదల్చుకున్నది నాకు అర్థంఅయ్యిందిలే... నేను వెళ్లిపోదామని నిర్ణయము తీసుకున్నాను...అంటే అది.. అన్నాడు నేను అంతా విన్నాను రా..
ని సుఖం కన్నా నాకు కావలసినదిఏముంటుంది...నా సంచి సర్దేశాను... నువ్వు ఆశ్రమం లోదిగబెట్టెయ్...
అంటూ తన భార్య ఫోటో కూడా సంచిలోపెట్టుకుంటూ, "నేను ఎక్కడ ఉంటే అది అక్కడే...పాపం నన్నువిడిచి ఉండలేదు "అన్నాడు.
నన్ను క్షమించు నాన్నా అన్నాడు.ఏమి పరవాలేదు...బయలు దేరు..మళ్ళీ నిఆఫీసు కి లేట్ అవుతుంది.అలాగే టిఫిన్ చేసి బయలుదేరదాము అన్నాడు.ఇద్దరు ఆశ్రమం చేరుకున్నారు..నాన్నా మీరు ఇక్కడ కూర్చోండి...
నేను ఇప్పుడే ఫోరం ఫీల్ చేసి వస్తాను...అంటూలోపలికి వెళ్ళాడు.పెద్దాయన అక్కడే ఉన్న అరుగు మీదకుర్చున్నాడు.
అక్కడే కూర్చుని ఉన్న ఒక ఆయన పెద్దాయన కేసిపరిశీలనగా చూసి...గుర్తుపట్టి...అయ్యా నమస్కారం..నన్ను గుర్తుపట్టారా... విశ్వనాధాన్ని..ఎలా ఉన్నారు...చూసి చాలా ఏళ్ళు ఐయింది.ఆ నమస్తే...వృద్ధాప్యం కదా వెంటనే గుర్తు పట్టలేకపోయాను...ఎలా ఉన్నారు...ఏదో ఇలా...పిల్లలు అమెరికాలో, నేను ఆశ్రమంలో...ఏదో కాలక్షేపం..
బ్రతికి ఉన్నంత కాలం బ్రతుకు ఈడవాలికదా..అంటూ నిట్టూర్చారు... ఆరోజుల్లో మీ ఆదర్శాలు చూసి చాలాచెప్పుకునేవాళ్ళం.
అన్నట్టు మీరు ఈ ఆశ్రమం నుండి ఒక అబ్బాయినిదత్తత తీసుకున్నారు గా ,
పెద్ద వాడు అయి ఉంటాడు ...ఏంచేస్తున్నాడు..అని అడిగారు.
అదిగో ఆ వెళ్లిన వాడే .ఇప్పుడు నన్ను చేర్చడానికివచ్చాడు ,అంటూ నవ్వారు...
కలికాలం అండి.... అన్నారు. ఇంతలో కొడుకు బైటకు వచ్చాడు. నాన్నా అన్ని మాట్లాడేసాను..నువ్వు నిశ్చింతగాఉండొచ్చు....
నేను నెలకొక సారి వచ్చి చూసి వెళుతూఉంటాను...మందులు అవి టైంకి వేసుకో...జాగ్రత్త...అన్నాడు...అలాగే చూసుకుంటాను లేరా నువ్వు వేళ్ళు....నేనే లోపలికి వెళతాలే...అంటూ లోపలికి వెళ్లారు, కన్నీటి పొరలు తుడుచుకుంటు...బైట విశ్వనాధం గారితో మాట్లాడడం చూసాడు, ఆయన దగ్గరకు వెళ్లి నమస్తే అంకుల్.. మీరు నాన్నగారు మాట్లాడుకోవడం చూసా..కొంచెం ఆయనను చూస్తూ ఉండండి...నేను వారం వారం వస్తూ ఉంటాను..అన్నాడు...అలాగే బాబు... నాన్న చాలా గొప్ప వ్యక్తి...మాఅందరికి బాగా తెలుసు.చూస్తూ ఉంటాలే...నువ్వు వెళ్ళిరా...అన్నాడు....ధన్యవాదాలు అంటూ బండి స్టార్ట్ చేస్తున్నాడు....ఒక్కసారి ఇలా వస్తావా బాబు అన్నారు.బండి సైడ్ స్టాండ్ వేసి దగ్గరకు వచ్చాడు...ఏమిటి అండి పిలిచారు అన్నాడు.లాగి పెట్టి ఒక్క లెంపకాయ కొట్టాడు...
దిమ్మ తిరిగి పోయింది...ఆశ్చర్యం తో ఏమిచేస్తున్నారు అని అడిగే లోపే రెండో చెంప వాయించేశాడు...ఇంక నువ్వు వెళ్లొచ్చు అన్నాడు...నెమ్మదిగా....కళ్లనీళ్లు తిరుగుతూ...అసలుఏమైంది మీకు ఎందుకు కొట్టారు...
అని అడిగాడు కోపంగా...నువ్వు చేసిన పనికి ఇంతటితో సరిపెట్టాను... అసలు నువ్వు ఎవరో తెలుసా... అనిఅడిగాడు...
నేను ఆయన కన్న కొడుకుని....ఆయనచెప్పారుగా.. అన్నాడు....అదే ఆయన గొప్పదనం...నువ్వు ఆయన కన్నకొడుకువి కాదు....
ఇదే ఆశ్రమం లో అనాధవి... ఆయన నిన్ను దత్తత తీసుకుని పెంచి పెద్దచేసాడు..
నువ్వేమో ఆయన్నే ఈ ఆశ్రమానికి దత్తతఇచ్చేసావ్...నువ్వు మనిషి వేనా....
కనీసం ఇప్పుడు కుడా ఆ విషయం నీకుచెప్పలేదు..అది ఆయన గొప్పదనం... అన్నాడు.
ఒక్కసారి భూమి లోకి కృంగి పోయినట్లుంది....తల తిరిగి పోయింది...నాకు ఈ క్షణం వరకు తెలియదు..కాదు తెలియకుండా పెంచాడు...అంతటి మహనీయుని పట్టుకుని ఆశ్రమమ్ లోచేర్పించా...ఎంత పెద్ద తప్పు జరిగి పోయింది...అయ్యో...నా పాపానికి నిష్కృతి లేదు....వెంటనే సరిదిద్దుకోవాలి.....ఇప్పుడే ఆపనిచేస్తాను...అంకుల్ ఇప్పుడే వస్తాను.నా తప్పుసరిదిద్దుకొంటాను...మీరు చెప్పబట్టి సరిపోయింది....లేకపోతే జీవితం లో సరిదిద్దుకోలేని తప్పు చేసిఉండేవాడిని... అంటూ ఇంటికి బయలు దేరాడు.ఇంట్లో ...
ఏమండీ దిగబెట్టేసారా..ఏదైనా గొడవ చేశారా...అంటూ అడిగింది..ఆ కళ్ళలో నీళ్ళు ఏమిటి ఏమైంది అనిఅడిగింది... లాగి లెంపకాయ కొట్టాడు...మనం ఎంత పెద్ద తప్పు చేశామో తెలుసా....అంటూ జరిగింది చెప్పుకు వచ్చాడు...నిజమే మమమే అనాధలము అయివుండి, ఆ విషయం మార్చి పోయి ,ఆయనను అనాధ గావదిలేసాము, మనం వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోవాలి....పదండి ఆఫీసు తరువాత ముందు మామయ్య గారిని తీసుకుని వచ్చేద్దాము....అంటూ బయలు దేరింది.... ఆశ్రమం లో ఇద్దరు ఆయన కాళ్ళ మీద పడ్డారు..క్షమించండి మామయ్య గారు..మా వలన పొరపాటు జరిగిపోయింది....
ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించం... దయచేసి ఇంటికి వచ్చేయండి....అనిబ్రతిమాలారు...
పిల్లలు తెలియక తప్పు చేశారు...
వాళ్ళని క్షమించి... ఇంటికి వెళ్ళండి...అన్నాడువిశ్వనాధం...వాళ్లే నా ప్రాణం అయినప్పుడు ,వాళ్ళు మీద కోపంఎందుకుంటుంది....
తప్పకుండా వెళతాను....అంటూ ఇద్దరి తల మీదా చేయి వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు...ఆయన కళ్లలోంచి ఆనంద భాస్ఫాలు వాళ్లతలమీద అక్షింతలు గా పడ్డాయి...
అంతే కాదు నాన్నగారు ఈ రోజు నేనుముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను.
మేము ఇద్దరమూ కూడా పిల్లలని కనము..
ఇదే ఆశ్రమంలో దత్తత తీసుకుంటాం...
మీ ఆదర్శాలకి వారసులు గా నిలుస్తాము...అన్నాడు.ఆయన పిల్లల ఇద్దరి భుజాల మీద ,చెరో చేయివేసి ,
అందరూ ఆనందం గాబైటకీ నడిచారు.
శుభం

No comments:
Post a Comment