( మాయా ద్వీపం...) పార్ట్ 1
జోరున వర్షం పడుతోంది...
ఆకాశం లో మెరుపులు
మెరుస్తున్నాయి...
పిడుగుల శబ్దానికి ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోతోంది....
కటిక చీకటి...
నలుగురు యోధులు సైనిక దుస్తుల్లో ఉన్నారు... గుర్రాల మీద వచ్చారు...
కోట గుమ్మం దగ్గర ఆగారు...
కిర్రుమంటూ శబ్దం చేసుకుంటూ కోట తలుపు లు తెరుచుకున్నాయి ..
అందరూ లోపలికి వచ్చి ఆగారు...
ఇంతలో ఇద్దరు పరిగెత్తు కుంటూ వచ్చి వాళ్ళు దిగిన గుర్రాలని అశ్వసాల కి తీసుకుని వెళ్లారు... అక్కడ అక్కడ కాగడాల వెలుగు మిణుకు మంటోంది...
కోట లోపల దీపాలు ..గోడకి రెండు పక్కలా కాగడాలు వెలుగుతున్నాయి...
రాణి గారి సింహాసనం గదిలోకి వచ్చారు... కొవ్వొత్తి దీపపు కాంతులు అంతా ఉన్నాయి... అందరూ లోపలికి...నడుచుకుంటూ వచ్చారు... అక్కడ వృద్ధ రాణి కూర్చుని ఉంది...
పొడుగాటి తెల్లని జుట్టు...
భయంకరమైన రూపం...
చేతిలో మేజిక్ స్టిక్...
పెరిగిన గోర్లు.....
అక్కడ అంతా నిశబ్దం గాఉంది ...
అక్కడి వాతావరణం నిశ్శబ్దం తో మరింత భయాన్ని కలిగిస్తోంది...
అందరూ వంగి వందనం చేశారు...
పిలిపించారు మమ్మలిని తమ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాం అన్నాడు...
మీకొక ముఖ్యమైన పని అప్పచెపుతున్నా... అష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఆ తరువాత వచ్చే పౌర్ణమి కి నేను ప్రపంచానికి రాణి కావాలి ...
ఈ భూ మండలం అంతా నా అధీనం లోకి రావాలి...
మళ్ళీ నేను యవ్వనం లోకి రావాలి ఇవి అన్ని జరగాలంటే ఆ నక్షత్రం లో రాశిలో...
సమయం లో పుట్టిన బాలుడి ని నేను బలి ఇవ్వాలి...
నా మంత్ర శక్తులు , యవ్వనం అన్ని మళ్ళీ ఇంకో 100 సంవత్సరాల దాకా వచ్చేస్తాయి...
కనుక మీరు ఆ బాలుడిని కనిపెట్టి నాకు అప్పగించాలి...
ఇది నా ఆజ్ఞ అంది రాణి...
తమ ఆజ్ఞ మహారాణి...
మేము తప్పక సాధిస్తాం...
కానీ ఆ బాలుడు వివరాలు ఏమైనా తెలుపగలరు..
అంటూ వంగి నోటికి చేయి అడ్డం పెట్టుకుని వినయం గా అడిగాడు.
వెంటనే తన మంత్రదండం తో గాలిలో తిప్పింది...
ఒక మెరుపు లా వచ్చి తన పక్కన ఉన్న అద్దం లో ఒక బాబు చక్కగా పడుకుని ఆడుకుంటూ కనిపించాడు...
ఎంతో తేజస్సు కలిగి ఉన్నాడు...
వెంటనే రాణి తన చేతితో...
అద్దం లో చేయి పెట్టి ఆ బాలుడి చిత్రపటాన్ని తీసింది...
నలుగురు ఆశ్చర్య పోయారు...
అది వాళ్ళ కి అందించింది...
ఈ బాలుడు ఇంకా పుట్టలేదు...
తూరుపు దిశగా వెళ్ళండి...
అక్కడ విచారించి చూడండి...
మీకు ఎక్కడ పుట్టాడో తెలుస్తుంది...
అంది రాణి...
తమ ఆజ్ఞ మహారాణి...
త్వరలోనే బాలుడి తో మీ ముందు ఉంటాము అని వంగి మరొకసారి వందనం చేసి వెళ్లి పోయారు...
అద్దం లో చూస్తూ ఒరేయ్ బాలకా ఎప్పుడు వస్తున్నావురా...
నా శక్తులు, యవ్వనాన్ని ఎప్పడు ఇస్తున్నావు రా అంటూ వికట అట్టహాసం చేస్తూ పెద్దగా నవ్వింది....
నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా....
అంటూ తన మ్యాజిక్ స్టిక్ తో అడ్డంగా ఊపింది... అంతే ...
ఆ బొమ్మ అంతర్ధానం అయిపోయింది... పుట్టబోయే వాడు మహా జాతకుడు...
నిన్ను నాశనం చేయగల శక్తి ఉంది...
జాగ్రత్త... అంటూ హెచ్చరిక వినిపించింది...
నన్ను మించిన వాడా...
రానీ ..చూస్తాను... అంటూ గట్టిగా అరిచింది... నిన్ను ఈ అద్దం లో బంధించినా బుద్ధి రాలేదు... అంటూ అరిచింది...
అద్దం లో ఉన్నది ఒక ప్పుడు ఆ కోటకు రాణి.. దానిని బంధించి ఈ మంత్రగత్తె తన అధీనం లోకి తీసేసుకుంది..
తనని అలా అద్దం లో బంధించింది...
ఆ మంత్రగత్తె ని ఓడించాలంటే తన శక్తి చాలదు ...
పైగా తాను సాధించిన మంత్ర శక్తులన్ని తన అధీనం లోకి వెళ్ళిపోయాయి...
ఇప్పడు ఆ మ్యాజిక్ స్టిక్ తన చేతికి వస్తే గానీ మళ్ళీ తన శక్తులు తనకి రావు...
అందుకే కదలడానికి లేకుండా తనని అద్దం లో బంధించింది...
నువ్వు చూస్తూ ఉండు నేను ఎలా సాధిస్తానో...
అంటూ గట్టిగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది....
మిగతా 2 వ భాగం లో
No comments:
Post a Comment