Sunday, 23 June 2024

ఆరోజు పార్ట్ 4

 

ఆరోజు....( పార్ట్.. 4)

ఆ రోజు రాత్రి...11 గంటలు అవుతోంది
....భవాని శంకర్ ఇంట్లో ...కోపం గా ఉన్నాడు.
మందు తాగుతున్నాడు....
ఇంతలో మైసమ్మ వచ్చాడు.
నమస్తే సర్...అన్నాడు.
ఏం జరుగుతోంది... మీరంతా ఏమి చేస్తున్నారు....
అమ్మాయి గారు తడిసిపోయింది... జ్వరం... తెలివి లేకుండా హాస్పిటల్ లో పడి ఉంది....అంటూ అరిచాడు....
లేదు సర్...అప్పటి దాకా కనిపెట్టు కునే ఉన్నాను అండీ... కాలేజ్ లోపలే కదా అని బైట దూరం గా ఉన్నాను.
ఇంతలో అంటూ ,
జరిగింది చెప్పాడు...
అమ్మాయి గారి పుట్టిన రోజు వస్తుంది గా జాగ్రత్త గా ఉండండి అని చెపుతూనే ఉన్నాను....
ఒక్కళ్ళకి పని మీద శ్రద్ధ లేదు..
తిని , తాగడం తప్ప...అంటూ తిట్టాడు.... సారు అది ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి పోదామని వచ్చిన ..
ఏమిటి అది...అని అడిగాడు భవాని శంకర్...
అది అమ్మాయి గారి వెనుకే ఆ మాస్టారు కూడా వెళ్లారు కదా అని...
నేను లోపలికి వెళ్ళి అసలు ఏమి జరిగి ఉంటుందో అని చూసా...
అక్కడ ఒకడు పడి ఉన్నాడు...
బహుశా అతనే అమ్మాయిగారి ని ఏడిపించి ఉంటాడు అని వార్నింగ్ ఇద్దామని దగ్గరకి వెళ్లబోయా....
కానీ ఇంతలో.... ఎవరో  ఇద్దరు ముసుగులో
వచ్చారు...
అతని దగ్గరకి  వెళ్లారు ,ఏదో మాట్లాడారు తరువాత తలమీద రాడ్ తో ఒక్కటి కొట్టి... వెళ్లిపోయారు....
తరువాత నేను దగ్గరకి వెళ్ళి చూసా అప్పటికే వాడు పోయాడు....
మళ్ళీ గొడవలో నేను ఇరుక్కుంటానని వచ్చేసా ను అండీ.....
ఎవరై ఉంటారు.....ఏమి మాట్లాడారు .. అసలు వాడిని చంపాల్సిన అవసరం వాళ్ళకి  ఏమిటి...నువ్వు గుర్తు పట్ట గలవా అని ప్రశ్నించాడు.
లేదు అండీ... ముసుగులో ఉన్నారు..దూరంగా ఉన్నాను...పైగా వర్షం...శబ్దం లో మాటలు వినబడలేదు అన్నాడు మైసమ్మ.
మన వాళ్ళని తీసుకుని వెళ్లి వాళ్లేవరో...అసలు ఆ చచ్చిన వాడేవరో... కనుక్కునే ప్రయత్నం చెయ్...
జాగ్రత్త...మన పేరు బైటకి రాకూడదు.. అన్నాడు.
అలాగే అయ్యా...మారి నేను వస్తాను... అన్నాడు.... ఇదిగో ఇది తీసుకుని పో అంటూ పక్కన ఉన్న ఫుల్ బాటిల్  విసిరాడు...
అది అందుకుని వస్తాను సర్ అంటూ మళ్ళీ దండం పెట్టి వెళ్లి పోయాడు...
భవాని శంకర్ ఆలోచనలో పడ్డాడు...
ఎవరు అయి ఉంటారు.... అసలు వాడికి గొడవలు ఏమైనా ఉన్నాయా..
లేక మన అమ్మాయి కోసం వచ్చారా....అర్థం కావట్లేదు....
ఎందుకైనా మంచిది హాస్పిటల్ లో సెక్యురిటి పెంచాలి అనుకుని....ఫోన్ చేసాడు.
నమస్తే అయ్యా...
ఏరా హాస్పిటల్ దగ్గర అంతా బాగానే ఉందా.... అవును సర్ అన్నాడు...ఎందుకైనా మంచిది..
ఇంకో నలుగురిని పెట్టు... మనకి తెలియకుండా ఎవరూ అమ్మాయి గారి గది వైపు వెళ్లకూడదు...
అర్థం అయిందా ...అన్నాడు భవాని శంకర్... అట్లనే సారు...
ఇప్పుడే మందిని పెడతాను... ఉంటాను సార్ అన్నాడు....
జాగ్రత్త...అంటూ ఫోన్ పెట్టేసాడు.
రేవు వాళ్ళు ఎవరు అన్నది కనుక్కోవాలి అనుకుంటూ నిద్రకి ఉపక్రమించాడు.

భవాని శంకర్ వసంత మేనమామ.
వసంత తల్లిదండ్రులు ఆక్సిడెంట్ లో చనిపోతే ,
మేనమామే పెంచి పెద్ద చేసాడు... వాళ్ళ కాంట్రాక్టులు, ఫ్యాక్టరీ లు ఆయనే చూసుకుంటూ ఉంటాడు.
అమ్మాయి హాస్టల్ లో ఉండి చదువుకుంటాను అంటే కాదనలేక పంపించారు...
కానీ తన మనుషులు ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉంటారు.
ఈ విషయం అమ్మాయికి కూడా తెలియదు. వసంత తల్లిదండ్రుల ఆస్థి దగ్గర దగ్గరగా 4 వేల కోట్లు వరకు  ఉంటుంది.
ప్రస్తుతం భవాని శంకర్  గార్డియన్ గానే ఉన్నారు.
అమ్మాయి మేజర్ అయిన తరువాత ఆస్థి అంతా ఆమె పేరు మీదకి మారిపోతుంది.
ఆ తరువాత అమ్మాయి ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ,
ఆస్థి బైటకి వెళ్ళిపోతుంది అని భయం.
వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేస్తే ఆస్థి అంతా తన దగ్గరే ఉంటుంది అని ఆశ.
చిన్నప్పటి నుంచి  కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.
ఆక్సిడెంట్ అయినప్పుడు తను చిన్న పిల్ల , ఎవరినీ నమ్మడానికి లేదు...అని
వీలునామా రాసేశారు ఆమె తల్లి తండ్రులు.
ఎవరు అయితే తనని మేజర్ అయ్యే దాకా బాగా చూసుకుంటారో ...వాళ్ళకి ఆస్థి లో సగం,
మిగతా సగం అమ్మాయికి చెందే లా రాసారు.
ఈ లోగా అమ్మాయికి ఏమైనా అయితే ,
ఆస్థి మొత్తం ఒక చారిటబుల్ ట్రస్ట్ కి చెందే లా వీలునామా రాసేశారు... ఎందుకంటే అప్పుడే  తమ కూతురిని  జాగ్రత్తగా చూసుకుంటారని వాళ్ల నమ్మకం.
అందుకే ఇప్పుడు వచ్చే తన పుట్టినరోజు కి మేజర్ అవుతుంది....
అందుకే భావాని శంకర్ కంగారు పడుతున్నాడు.
అమ్మాయి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా క్షమించడు....
                        ********

సిద్ధార్థ్ ఆఫీస్ లో ఫోన్ మ్రోగింది. సునీల్ తీసాడు. నేను MLA గారి P A ని మాట్లాడుతున్నాను.... సిద్దార్ధ్ గారు లేరా అని అడిగారు...
హలో నమస్తే మూర్తి గారు ఇదిగో ఇప్పుడే ఇస్తున్నా....అంటూ ఫోన్ ఇచ్చాడు ....
నమస్తే సర్ అన్నాడు....MLA  గారు మీకు 25 లక్షలు చెక్ santion చేశారు... వచ్చి తీసుకుని వెళ్ళండి....
ప్రస్తుతం మేము ఇంటిదగ్గరే ఉన్నాము...
చెక్ నా దగ్గరే ఉంది మీరు ఇంటికి వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టాశారు.... ఒరేయ్ మనకి చెక్ వచ్చింది రా....
మొన్న మాట ఇచ్చారుగా ...ఇపుడే వెళ్లి తెచుకుందాం... నడు అంటూ బయలుదేరాడు...సిద్ధార్థ్
MLA. గారింట్లో..
హలొ సిద్ధార్థ్ గారు రండి...
సారు ఇప్పుడే వస్తారు మీరు కూర్చోండి.. చెక్ ఆయన చేతుల మీదుగా ఇస్తారు... అన్నాడు మూర్తి...
అలాగే సర్...అంటూ కూర్చున్నారు... కాఫీ వచ్చింది.. ఇద్దరికి...
తాగుతూ పేపర్ చూస్తున్నాడు సునీల్....
ఒరే ఈ న్యూస్ చూడు....నువ్వు షాక్ అవుతావు...
జయ్ ని అరెస్ట్ చేశారట....
ఏదో అమ్మాయి...
ఎవరో మర్డర్ కేసు....
అంటూ పేపర్ సిద్ధార్థ్ కి ఇచ్చాడు....
తాను అది చదివి...
ఇదేంట్రా ఇలా జరిగింది...
వాడు ఎలాంటి గొడవలు పెట్టుకునే రకం కాదు....
ఇదేదో చూడాల్సిందే...
అంటూ ఉండగా....
ఇంతలో మెట్లు దిగుతూ
ఏమయ్యా సిద్ధార్థ్...
నీ కిచ్చి న మాట ప్రకారం నీకు చెక్ santion చేశా....
ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చెయ్....
మా సహకారం ఎప్పుడూ నీకు ఉంటుంది...
అంటూ P. A,  ఇచ్చిన చెక్  ,
సిద్ధార్థ్ చేతిలో పెట్టాడు....
చాలా చాలా థాంక్స్ ...సర్
దీని వలన ఇంకా చాలా మందికి విద్యాదానం చేయవచ్చు...
చాలా  ఉపయోగకరం గా ఉంటుంది.... అన్నాడు....
మేము చేసే వి మేము చేస్తూనే ఉన్నాం...
అయినా ఇంకా చాలామందికి లబ్ది చేకూరటలేదు....
మీలాంటి వాళ్లు చేసే సర్వీస్ కూడా ఉపయోగ పడుతుంది..
అందుకే ...
మరి నేను వస్తాను మరి..althe best అంటూ ఆయన బయలుదేరి వెళ్లిపోయారు....
ఇద్దరు చెక్ తీసుకుని...
కార్ లో బయలు దేరారు......
సునీల్ డ్రైవ్ చేస్తున్నాడు...
ఏమై ఉంటుంది అబ్బా ,
ఈ జయ్ కి...చాలా మంచి వాడు...
ఏది ఏమైనా అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించి వస్తే మంచిది...
నువ్వు ఒక పని చెయ్...
నన్ను ఇంటిదగ్గరే డ్రాప్ చెయ్...నేను ఒకసారి వైజాగ్ వెళ్లి వస్తాను...
వాడికి ఏమైనా సహాయం కావాలేమో...
.పైగా కేసు కొంచెం పెద్దది గానే అనిపిస్తోంది...
వాడే ఇరుక్కున్నాడా లేక ఎవరైనా ఇరికించారా అన్నదితేలాలి....
నేను ఎయిర్పోర్ట్ కి వెళ్లి నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేస్తాను...
అవసరమనుకుంటే నిన్ను పిలుస్తాను... అప్పుడు వద్దువు గాని....
ఈ లోగా చెక్ బాంక్ లో వేసి...
పనులు అవి మొదలు పెట్టు...
అన్నట్టు చెక్ విషయం....వివరాలు
మన ప్రకాష్ గారికి తెలియజేయి...
ఆయన న్యూస్ అప్డేట్ లో వేసుకుంటారు.... అన్నాడు.
నువ్వు మన కాంటిన్ లో భోజనం చేసేయ్... నేను ఇంటి దగ్గర చేసి బయలుదేరుతాను అన్నాడు.
సరే అంటూ సిద్ధార్థ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్లి పోయాడు సునీల్...
నాన్నగారు నా ఫ్రెండ్ జయ్ మీకు తెలుసు కదా.
ఒక సమస్య లో ఇరుక్కున్నాడు..
ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు...
వివరాలు తెలియవు...
నేను ఒకసారి వైజాగ్ వెళ్లి వస్తాను..
అని అన్నాడు.
అలాగే రా ఫోన్ చెయ్... వెళ్ళగానే అన్నారు.
బట్టలు సర్దుకుని , భోజనం చేసే సరికి క్యాబ్ వచ్చింది.
ఎయిర్పోర్ట్ కి బయలు దేరాడు సిద్ధార్థ్.
దారి లో ఉండగా M D., ప్రకాష్ ఫోన్ చేశారు...
హాయ్ సిద్దార్ధ్....సునీల్ ఫోన్ చేసాడు...
చెక్ గురించి .
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకే ఇచ్చావు....థాంక్స్..
వైజాగ్ వెళుతున్నావు ట కదా...
నీ ఫ్రెండ్ కోసం...
నేను ఒక ఆఫర్ ఇస్తున్నా...
నువ్వు మాములు గా వెళితే ఇన్ఫర్మేషన్ సరిగ్గాఇవ్వరు...
పైగా రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండదు.... అదే ఒక ప్రెస్ రిపోర్టర్ గా వెళితే అంత బాగా చూసుకుంటారు....
కనుక నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వు...
నీ ఇన్వెస్టిగేషన్ చేసుకో...
ఖర్చులు నావి...
బట్ ఆ కేస్ వివరాలు ప్రత్యేకం గా మా ఛానెల్ కేర్ ఇవ్వాలి...
నువ్వు కేసు take up చేస్తే ...
అది సెన్సేషన్ అవుతుంది....
అన్నాడు ప్రకాష్....
ok సర్ మీరు చెప్పినట్లే చేద్దాం...
ఈ కేసు విషయం లో నాకు మీ సహాయం కావాలి... అన్నాడు...
Ok .. Done...
Welcome.back...Mr.Siddhardh..
..అంటూ ఫోన్ పెట్టేసాడు.....
కార్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చి ఆగింది...
సిద్ధార్థ్ తన బాగ్ తీసుకుని టికెట్ కోసం వెళ్ల బోయాడు.
ఇంతలో ఒక అతను పరిగెత్తుకుంటూ
సిద్దార్ధ్ వైపు వచ్చాడు...
నమస్తే సర్....నన్ను
ప్రకాష్ గారు పంపారు.
చెప్పు ఏమిటి సంగతి అని అడిగాడు.
ఇదిగో సర్...
ఈ I D కార్డ్..., టికెట్...
క్రెడిట్  కార్డ్స్
మీకు ఇచ్చి రమ్మన్నారు...
వైజాగ్ లో మీకోసం , కార్ రెడీగా ఉంటుంది.. గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు అయిపోయింది...
డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటాడు..
అని ఆగాడు...
చాలా స్పీడ్ గా ఉన్నారు... అని నవ్వుతూ సరే నేను ఫోన్ చేస్తానని చెప్పు .
మీ సారు కి .. అంటూ
అవి తీసుకుని లోపలకి వెళ్ళిపోయాడు..
విమానం బయలు దేరింది....
ఆలోచనలో పడ్డాడు మళ్ళీ...
లక్ష్మీ ఇప్పుడు ఎక్కడ ఉందో...
వైజాగ్ లొనే ఉన్నట్టు సమాచారం...
జయ్ తో మాట్లాడినట్టు గా ఒకసారి అన్నాడు...
ఆశ్రమం బిజీ లో పట్టించుకోలేదు...
ఈ సారి ఎలాగైనా తన అడ్రెస్ పట్టుకోవాలి... అనుకున్నాడు...

( ఇంకా ఉంది )
continued in part 5


No comments:

Post a Comment