Sunday, 2 July 2017

శుభోదయం

శుభోదయం
కళాభ్యుదయ  వాదులకు  అరుణోదయం,
ప్రభవించిన  చాతుర్యానికి  ప్రభోదయమ్ ,
కలాలు పట్టి,
పదాలు దున్ని ,
చేస్తున్న పదకవితా సేద్యం  ,
కరాలు కలిపి  ,
కలాలు కదిపి
గళాలు  నిండా  పదాలు నింపి  ,
సుశబ్ద   , సుస్వర  , పదాల  నూర్చి  , చేసే
మేధ సాగర మధనం ,
మరులు కొలిపే కావ్య జననం ,
సుస్వర  గీతికలై  వీనుల తాకగా,
ఉప్పొంగిన  తరంగమై
ఎగిసే  మనసే

No comments:

Post a Comment