Tuesday, 18 July 2017

ఎన్నికల "శంఖా రావం "


ఎన్నికల "శంఖా రావం "

భిన్న స్వరాల"  యుగళ  "గీతం
ఎన్నికల "శంఖా రావం
అధికారము "లో"  కొందరు
అధికారం "కోసం " కొందరు
విప్లవం (మార్పు) కోసం మరి  కొందరు,
పూరిస్తున్న శంఖారావం
ఆరోపణ అస్త్రాలతో
వ్యంగ్య బాణాలతో
విమర్శనాస్త్రాల తో సంసిద్ధం.......  ఎన్నికల " రణరంగం...
ఎన్నికలలో ....   ఎన్ని...."కలలో
ఆశయాలతో , ఆశలతో,
కురుపిస్తున్న  "వాగ్దానాస్త్రాలు "
మనీ మురిపించినా ,
మత్తు మైమరపించినా
నిజం మరచి
నిన్ను మరచి,
తాత్కాలిక " సౌఖ్యం " కోసం
ఓటు అమ్ముకుంటే...
చిరిగిన చొక్కా , పగిలిన అద్దం
నోటుకు ఓటు అమ్ముకున్న ప్రతీ సారి
నీకు దక్కే సౌఖ్యం...

---ఆచంట గోపాలకృష్ణ

No comments:

Post a Comment