Thursday, 15 March 2018

ఆమని పాడవే హాయిగా


ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో | పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల... | మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా | ఆమని పాడవే హాయిగా

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా యద | స్వరాల సంపద
తరాల నా కథ | క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని

ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలత

శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువి కలా నిజం స్ప్రుసించిన మహోదయం
మరో ప్రపంచమే | మరింత చేరువై
నివాళి కోరిన | ఉగాది వేళలో
గతించిపోని గాధ నేనని

ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో | పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల... | మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా | ఆమని పాడవే హాయిగా

మంచి పాట విన్నా , మంచి సాహిత్యం చదివినా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది...
అలాంటి సాహిత్యాన్ని మనకు అందించిన  ఎందరో మహానుభావులు..
వారు చేసిన పదకవితా సేద్యం....అనిర్వచనీయం ,అమోఘం ,
అద్భుతం....ఆ తెలుగు వెలుగు కిరణాలు మనకు నిరంతరం వెలుగుని ప్రసాదిస్తూనే ఉన్నాయి.తరాలు మారినా ,స్వరాలు మారినా...ఆ సాహిత్యపు విలువలు , ఎప్పటికి ఆణిముత్యాలే..అజరామరమే...

No comments:

Post a Comment