కమ్మని కావ్యం పలికింది ,
మమతల కోవెలలో
కంటి కి వెలుగు లు నింపినది,
తన జిలిబిలి పలుకులతో.....//
సిరిమల్లె పూవుకు , సింగారం చేసి
మరు మల్లె తీగకు ,ముస్తాబె చేసి
ఆ మేలి మోముని ,
కొంగుతో ముసుగేసి..........
తొలి సిగ్గు దొంతరలే ,
పొంగి పొరలుతుంటుంటే ......
ఎరుపెక్కిన చెక్కిళ్ళు,మనసుని ఎగరేస్తుంటే
కమనీయ కావ్యాలు , మదిలో పాడేస్తుంటే,
కమ్మని కావ్యం పలికింది ,
మమతల కోవెలలో
కంటి కి వెలుగు లు నింపినది,
తన జిలిబిలి పలుకులతో.....//
అడుగులో , అడుగేస్తూ ,
అందాల చందమామ , నడిచొస్తావుంటే,
ఘల్లు ఘల్లు మని , సిరి సిరి మువ్వలు,
చిరు సందడి చేస్తుంటే,
జిలిబిలి పలుకుల పుత్తడి బొమ్మకు
కల్యాణ వైభోగం
జరిగే శుభ తరుణం లో,
మంగళ వాయిద్యాలు మ్రోగుతుంటే,
వేద మంత్రాలే ,వేల దీవెనలై
అక్షింతల చిరు జల్లులు కురుస్తుంటే..
ఆడి ,పాడి అల్లరి చేద్దాం రారండి,
అన్నుల మిన్నల ,కన్నుల పండగ చూడండి
మీ చల్లని చేతుల ,మనసులో నిండుగా దీవించండి.......
కమ్మని కావ్యం పలికింది ,
మమతల కోవెలలో
కంటి కి వెలుగు లు నింపినది,
తన జిలిబిలి పలుకులతో.....//
No comments:
Post a Comment