ఫ్రెండ్ కి ఇచ్చిన మాట
రారా సుబ్బారావు చాలా కాలం అయింది నిన్ను చూసి... అంటూ ఆహ్వానించారు వెంకటరావు గారు.
సుబ్బారావు వచ్చాడు కాఫీ పంపించు అంటూ చెప్పారు... వాళ్ళవిడకు.
అన్నయ్య గారూ బాగున్నారా ఇదిగో ఇప్పుడే తీసుకుని వస్తా...అంటూ లోపలికి వెళ్ళింది సుజాత.
వెంకటరావు సుబ్బారావు మంచి స్నేహితులు... వెంకటరావు వ్యాపారం లో స్థిరపడితే ,సుబ్బారావు మాస్టారు గా స్థిర పడ్డారు... ఇద్దరికి ఒక కొడుకు ఒక కూతురు...
రారా ఇలా కూర్చో... ఈ మధ్య వ్యాపార లో కొంచెం బిజీ గా ఉండి మనం కలవలేకపోయాం...ఎలా ఉన్నారు చెల్లెమ్మ పిల్లలు... అంటూ అడిగాడు వెంకటరావు.
అంతా బాగానే ఉంది... అబ్బాయి ఇంజినీరింగ్ లో చదువు తున్నాడు... అమ్మాయి ఇంటర్... అన్నాడు సుబ్బారావు. చాలా సంతోషం.అన్నాడు వెంకట్రావు. ఇదిగో అన్నయ్యా కౌఫీ..అంటూ ఇచ్చింది... తీసుకుని తాగడం మొదలు పెట్టాడు. ఏదో దిగులు గా ఉన్నావ్. ఏమిట్రా సంగతి.. అంటూ అడిగారు.ఆబ్బె అలాంటిది ఏమి లేదు ..ఒకసారి నిన్ను చూసి పోదామని వచ్చాను.. అన్నాడు సుబ్బారావు. ఒరేయ్ నేను బిజినెస్ మాన్ ని ఎంతమంది ని చూసి ఉంటాను... నీ ముఖమే చెపుతోంది... నిజం చెప్పు... అంటూ అడిగాడు.. ఏదైనా డబ్బు సమస్యా అంటూ అడిగాడు... ఆబ్బె అలాంటి ది ఏమి లేదు... మా అబ్బాయి కాలేజ్ లో జేరిన తరువాత మొదట్లో బాగానే చది వే వాడు... ఈమధ్య సావాసాలు...తిరుగుళ్లు ఎక్కువ అయి.. చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు.... ఏమైనా అడిగితే కోపం, పెద్ద లేదు , చిన్న లేదు అరుస్తున్నాడు... వాళ్ళమ్మ గారాబం వాడిని అలా మార్చేసింది.
చెపితే వినదు.దాని అతి ప్రేమ వలన వాడి భవిష్యత్ ఏమి అవుతుందో అని భయం గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
నువ్వే వాడికి ఏదైనా చెప్పి చూడు అంటూ అడిగాడు. సరే లే నేను మీ ఇంటికి వస్తాను ఒకరోజు....చూద్దాం.. ఆ రోజు మీ వాడికి ఉద్యోగం అడుగు
వాడి ఎదురుగా ...సరేనా మరచిపోకు.. మిగతాది నేను చూసుకుంటా అన్నాడు వెంకట్రావు. చెప్పినట్లు గానే
ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.రండి అన్నయ్య గారు అంటూ సాదరంగా ఆహ్వానించింది సుబ్బారావు భార్య. ఏమి చెల్లెమ్మా బాగున్నవా...ఏరి పిల్లలు...ఉన్నారా ఇంట్లో అని అడిగాడు. ఇదిగో ఇప్పుడే పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళింది.ఒరేయ్ నేను చెప్పింది గుర్తు ఉందిగా.. వాడి ఎదురుగా అడుగు... చాలు అన్నాడు వెంకట్రావ్.. ఇంతలో పిల్లలు వచ్చారు. నమస్తే అంకుల్ అంది అమ్మాయి. హాయ్ అంకుల్ అన్నాడు అబ్బాయి... ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగాడు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్...అన్నాడు... ఈ ఏడాది తో అయిపోతుంది... నీ దగ్గర ఏదన్నా ఉద్యోగం ఉంటే ఇప్పించరా అని అడిగాడు సుబ్బారావు... ఎలా వచ్చాయి మార్కులు అనిఅడిగాడు వెంకట్రావ్..కొన్ని బాక్ లాగ్స్ ఉన్నాయి... అన్నాడు..ఇలా అయితే ఎలా ఎప్పుడు అవచేస్తావు... అసలు పాస్ అయితే కదా ఉద్యోగం సంగతి వీడి పరిస్థితి చూస్తే అసలు చదువు అబ్బినట్లు లేదు...ఏమి అనుకోకు రా అన్నాడు వెంకటరావు... అలా అంటా రేమిటి అండి.. అన్ని పూర్తి చేసేస్తాగా...
అన్నాడు...అదే ఎప్పుడు అని అడుగుతున్నాను.... ఈ కాలం ఎంత స్పీడ్ గా ఉందొ తెలుసా... అందరికి వందకి వంద వచ్చేస్తున్నాయి..నువ్వు చూస్తే ఇలా ..నీకు ఎక్కడా ఉద్యోగం దొరకదు.. అసలు పాస్ అవుతావో లేదో అని అనుమానం..మా ఆఫీస్ లో గుమాస్తా ఉద్యోగం ఉంది వచ్చి చేరు... నేను ఫోన్ చేసి చెపుతాను. అన్నాడు .
మీరుఅవమానిస్తున్నారు...అన్నాడు ఉక్రోషం గా..
ఈ కోపం చదువు మీద చూపించు... నమ్ముతాను... అన్నాడు. సరే నేను అన్ని పాస్ అయి... మంచి కంపెనీ లో జాబ్ తెచ్చుకుంటే..ఏమి చేస్తారు... అన్నాడు... అలాగే జరిగితే ఇప్పుడు అన్న మాటలు ఉపసంహరించుకుని, అందరిముందు క్షమాపణ చెపుతా..కానీ అలా చేయలేక పోతే ....గుమాస్తా గా చేరతావా మరి అన్నాడు సరే నండి. చూసుకుందాం..అంటూ విసురు గా బైటకు వెళ్లి పోయాడు... సుబ్బారావు కంగారు పడ్డాడు. అదేమిటి రా అలాగ అనేశావు...ఇప్పుడు ఏమవుతుందో.. అన్నాడు..నువ్వు ఏమి కంగారు పడకు...నా మీద పంతం తో బాగా చదువుతాడు లే ..మరి నేను వస్తాను అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు..ఆ తరువాత శ్రద్ధ గా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూ లో పెద్ద కంపెనీ లో సెలెక్ట్ అయ్యాడు .సంవత్సారానికి 12 లక్షలు జీతం. ఆ అపోయింట్మెంట్ లెటర్ తీసుకుని తండ్రికి చూపించాడు. ఇదిగో నాన్న ,నేను సాధించాను.ఎక్కడ మీ ఫ్రెండ్..ఆయన ఛాలెంజ్ చేశారు గా ...ఇది చూపిస్తాను మీరూ రండి అని తీసుకుని వెళ్ళాడు.రేయ్ వద్దురా ..అయింది ఏదో అయింది. నీకు ఉద్యోగం వచ్చింది గా ఇంక ఈ విషయం వదిలేయ్ అన్నాడు సుబ్బారావు. లేదు నాన్న ఆయన ఎంతలా మాట్లాడారు, నేను పాస్ అవనట, ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వరట...ఎంత అవమానం గా మాట్లాడారో, నువ్వు విన్నావుగా... ఇంకేమి మాట్లాడకు అన్నాడు.
అక్కడ వెంకటరావు ఆఫీస్ లో మీటింగ్ జరుగుతోంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు ఇద్దరు.ఒరేయ్ వద్దు రా ఇంకోసారి కలుద్దాం అని తండ్రి నివారించాడు. కానీ వినలేదు.. నేను సాధిస్తే అందరి ఎదుట నాకు క్షమాపణ చెపుతాను అన్నారు...
అది ఇప్పుడు అడుగుతున్నాను..
అంకుల్ ఇదిగో లెటర్.నేను సాధించాను. మీరు అన్న మాట నిలబెట్టుకుంటారా
..అంటూ దగ్గరకు వెళ్ళాడు..
మొత్తానికి సాధించావ్ ...నేను కూడా మాట నిలబెట్టుకుంటా అన్నాడునవ్వుతూ.అంతలో సుబ్బారావు వెంకటరావు చెయ్యి పట్టుకుని వాడి పిచ్చి వేషాలు కి మీరు పట్టించుకోవద్దు... దయచేసి ఇంతటితో ఆపేయండి అని బ్రతిమాలా డు సుబ్బారావు...కానీ వెంకటరావు దగ్గరికి వెళ్లిన కిరణ్ ...
ఒక్క సారిగా ఆయన కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించండి అంకుల్ చాలా పెద్ద
తప్పు చేశాను... అన్నాడు.
అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు.... మీరు కనక ఆ ఛాలెంజ్ చేసి ఉండక పోతే నేను ఏమై పోయి ఉండేవాడినో... సమయానికి దేముడి లా వచ్చారు...నాలోని పౌరుషం రెచ్చగొట్టి.. నేను సాధించేలా చేశారు... నేను పాస్ ఐయ్యాక కూడా నాకు మీ మీద పంతం ఉండేది...ఒక్కసారి ఆ అపోయింట్మెంట్ లెటర్ చేతికి వచ్చిన తరువాత అర్థం ఐయింది. ఎంజాయ్ చేయాల్సిన వయసు లో ఎంజాయ్ చెయ్యకపోతే తరువాత చేయలేము గా
అనే కాన్సెప్ట్ లో ఉండే వాడిని.
కానీ చదవాల్సిన టైం లో చదవకుండా
తిరిగి తే , జీవితం ఏమైపోయి ఉండేదో అని..
ఇంకా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉండేది అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మంచి ఉద్యోగం, మంచి జీతం ..ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం
,దక్కాయి .ఆరోజు మీరు నాకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఇప్పటికీ నేను అలాగనే ఉండేవాడిని.ఇది అంతా మీ ఆశీర్వాదమే ,అని ఆయన చేతిలో లెటర్ పెట్టాడు. ఆయన ఒక సారి హత్తుకుని నాకు తెలుసు రా నువ్వు సాధించగలవని. నీకు నా అభినందనలు చాలా సంతోషం కిరణ్...
ఏమయ్యా సుబ్బారావు నీ కొడుకు సాధించాడు...నేను నా ఫ్రెండ్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను...అంటూ నవ్వాడు... సుబ్బారావు కళ్ళలో ఆనంద భాస్ఫాలు తిరుగుతుండ గా కృతజ్ఞతా పూర్వకంగా చూసాడు.
శుభం

No comments:
Post a Comment