Wednesday, 16 January 2019

స్వయంకృతం

" స్వయంకృతం  "

కౌసల్యా ,సుప్రజా , రామా అంటూ చిన్నగా సుప్రభాతము వినిపిస్తోంది...నులి  వెచ్చని,
సూర్య కిరణాలు , కాషాయం రంగు పూసుకుని ప్రాతః కాల సొగసులు రంగరించుకుని , పరుచుకుంటున్నాయి..
వివేక్ ప్రతి రోజు ఉదయం ఆ కిరణాలు తాకేలా , లాను లో కూర్చుని కాఫీ తాగడము అలవాటు.

అద్భుతమైన వాతావరణం, చల్ల ని 
గాలులు వింజామరలు వీస్తుండగా ,పేపర్ చదువుతూ, వేడి వేడి కాఫీ, పరిమళాలు వెదజల్లుతుండగా ఆస్వాదిస్తూ  తాగుతున్నాడు.

ఇంతలో గేట్ చప్పుడు అయ్యింది. ఎవరా అని చూస్తే తన స్నేహితుడు రాము వస్తున్నాడు. 

పేపర్ పక్కన పెట్టి , రారా రాము ఏమిటి విశేషము. ఇంత పొద్దున్నే వచ్చావు.
ఎలా ఉన్నారు అందరూ... అంటూ ,
సుజాతా రాము వచ్చాడు మంచి కాఫీ పట్టుకు రా అన్నాడు. 

రాము వచ్చి కూర్చున్నాడు.
కాఫీ పట్టుకుని వచ్చింది సుజాత. శుభోదయం అన్నయ్య గారు ఈ మధ్య రావడము లేదు, వదినగారు , పిల్లలు ఎలా ఉన్నారు.. అంటూ కాఫీ అందించింది.
బాగానే ఉన్నారు అమ్మా,, 
ఈ మధ్య వీడిని కలవలేదని ఇలా వచ్చా... అన్నాడు.
కాఫీ లు అయ్యాక , 

ఇప్పుడు చెప్పారా ఏమిటి విశేషాలు, భూషణం తో వ్యాపారం పెట్టావుగా, ఎలా జరుగుతోంది.అని అడిగాడు వివేక్.
ఫ్రెండ్ అని నమ్మి అతనికి పార్టనర్ షిప్ ఇచ్చా.బాగానే ఉన్నాడు కదా అని నమ్మకంతో ముఖ్య మైన పనులు కూడా అప్పచెప్పి నేను విదేశాలకి వెళ్లి వచ్చేసరికి, వాడు మోసం చేసాడు. చాలా డబ్బు తినేశాడు. అడిగితే నష్టం వచ్చింది అని చెబుతున్నాడు. వేరే ఆఫీస్ పెట్టి నా కాంట్రాక్టు లన్ని  ఆ సంస్థ తో చేయిస్తున్నాడు. చాలా నష్టం వచ్చింది. 
ఏమి చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు విచారంగా.
అవునా అంత జరిగిందా, అయినా అంత నమ్మకం గా ఏలా వదిలేశావు...

అసలు " వ్యాపారానికి ఉండవలసిన 
ముఖ్య లక్షణము ఎవరిని నమ్మకూడదు". 

 సరేలే ఏదో ఒకటి అలోచిద్దాం, 

నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఆ పైన భగవంతుడు ఉన్నాడు అన్నాడు వివేక్. 
నిజం గా ఆ భగవంతుడు ప్రత్యక్షము అయి నాకు వరం ఇస్తానంటే , నన్ను ఇంత మోసం చేసిన వాడిని సర్వ నాశనం చేయాలని కోరుకుంటాను అన్నాడు ఆవేదనగా.
అలా ఆవేశ పడకు.కోపం లో తప్పుడు నిర్ణయం తీసుకుంటావు.ఒక్క విషయం గుర్తు ఉంచుకో...

"ఆనందం గా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు...
కోపం గా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు".

ఈ రెండు మనిషికి చేటు తీసుకుని వస్తాయి.
అయినా  
ఒక వేళ నిజంగా సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రత్యక్షమైతే , 

"నువ్వు గొప్పవాడివి అవ్వాలని కోరుకోవాలి కాని, నీ శత్రువు నాశనం కోరుకోవడం ఎందుకు." ...

వాడి వినాశనం కోరుకోవడం వలన వాడికి, ఉన్నది పోతుందేమో గాని , ...
నీకు ఇప్పటి స్థితి లో మార్పు అయితే రాదు... గా, 

నీ సమస్య కి పరిష్కారం ఆలోచించాలి గానీ, ఇలా దూషించడము అసమర్ధుల లక్షణము.

ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు.
అన్నాడు వివేక్.

వాడు చేసిన పాపానికి శిక్ష వేయాల్సింది 
ఆ భగవంతుడు... నువ్వు కాదు, 
నువ్వు ఆలోచించాల్సింది 
ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బైట పడడము ఎలా అని  అన్నాడు వివేక్.

నిజమే రా , నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. నా కర్తవ్యం ఏమిటో.
నేను  నన్ను మోసం చేసిన వాడి గురించి ఆలోచించడం మానేసి, 
నా గురించి ఆలోచించడం మొదలు
 పెడితే ప్రస్తుత పరిస్థితి నుంచి బైట పడవచ్చు.
పైగా ఇది " స్వయంకృతం "
ఈ పరిస్థితి నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఏర్పడింది,  కనుక నేనే మార్చుకోవాలి.
వాడికి అందనంత ఎత్తు ఎదిగి చూపిస్తా .

ఇంక నేను ఏ వరాలు కోరుకొనవసరం లేదు. కష్టపడి సాధిస్తా.
సరిఅయిన సమయానికి మంచి సలహా ఇచ్చావు. 
అదే ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా ..అన్నాడు
ఆల్ ది బెస్ట్ రా ...రాము  అంటూ షేక్ హాండ్ ఇచ్చాడు వివేక్
వస్తా రా వివేక్ అంటూ ముందుకు కదిలాడు రాము రెట్టించిన ఉత్సహం తో...

Tuesday, 4 December 2018

మనసులు కలిసిన శుభ వేళ. కధ...

సమయం 9.30  అవుతోంది.విజయ్ తన ఛాంబర్ లో కి వచ్చేసాడు...
గుడ్ మార్నింగ్ విజయ్ అంటూ విష్ చేసాడు వినోద్.
గుడ్ మార్నింగ్ వినోద్ అన్నట్లు ఇవాళ మన ప్రోగ్రామ్స్ ఏమిటి అంటూ అడిగాడు.
వినోద్ ఎంబీఏ చేసాడు.
విజయ్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్  గా చేరాడు.
చేరిన కొంత కాలాని  కే  తన ప్రతిభ తో విజయ్ కి బాగా దగ్గర అయ్యాడు. ఒకే వయసు వాళ్ళు అవడంతో , ఆఫీస్ వరకె బాస్... బైట ఫ్రెండ్స్ లాగా ఉంటారు.
ఇవాళ కొన్ని ఇంటర్వ్యూ లు ఉన్నాయి .మీరు ఒకసారి చూసి ఒకే
చేసేస్తే, ట్రైనింగ్ కి పంపేస్తాను ,
అన్నాడు వినోద్.
సరే ఆ ఫైల్ ఇదేనా అంటూ టేబుల్ మీద ఉన్న దానిని తీసుకుని అప్లికేషన్స్ స్టడీ చేయడం మొదలు పెట్టాడు విజయ్.
మీరు కాఫి తాగండి , ఈ లోగా అభ్యర్థులు వస్తే ఒక్కొకరిని పంపిస్తా...అంటూ బైటకి వెళ్ళాడు వినోద్.
వరుస గా చూస్తూ ఉంటే సుహాసిని అనే అప్లికేషన్ దగ్గర ఆగాడు. విజయ్.ఆ పేరు చదవగానే చిన్నపుడు...మాస్టారు గారి అమ్మాయి గుర్తుకు వచ్చింది... ఇప్పుడు ఎక్కడ ఉందో...మాస్టారు ఎక్కడ ఉన్నారో ఎంక్విరి చేయించాలి.... చదువు కోవడానికి అమెరికా వెళ్లి పోవడం తో తనకి కుదరలేదు. ఇక్కడికి రావడం... ఇండస్ట్రీ ప్రారంభించడము...ఆ పనులలో బిజీ గా అయిపోయాడు. అలా ఆలోచనలతో ఉండగా వినోద్ లోపలికి వచ్చి వాళ్ళందరూ వచ్చేసారు. మీరు సరే అంటే ఒక్కొక్కళ్ళ నీ పంపిస్తా అన్నాడు.
సరే పంపించు... నువ్వు కూడా వచ్చి చెయ్.నేను ఒకే చేస్తాను.... అన్నాడు.వరుసగా అవుతున్నాయి... సుహాసిని వంతు వచ్చింది... లోపలికి రాగానే కూర్చోండి అన్నాడు. వినోద్.
థాంక్స్ అంది . కొంచెం కంగారు గా ఉంది.. ఎలాగైనా ఈ జాబ్ తనకి రావాలని ...వేయి దేవుళ్ళకి మొక్కుకుంది. ఈ ఉద్యోగం వస్తే ఆర్ధిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బైట పడవచ్చు. తల్లికి వైద్యము కూడా చేయించవచ్చు... అని మనసులో నే భగవంతుడు ని ప్రార్ధించి ..కాన్ఫిడెంట్ గా విజయ్ వైపు చూసింది...
విజయ్ పరిశీలన గా చూసాడు... మధ్య తరగతి సంప్రదాయ కుటుంబం నించి వచ్చి నట్లు ఉంది... ముఖం లో వర్ఛస్సు.... చాలా బాగుంది ఈ అమ్మాయి అనుకున్నాడు...
కానీ ఎక్కడో చూసినట్టు...ఏదో భావన....మనసులో, తనకి పరిచయం ఉన్నట్లు హృదయం చెపుతోంది. ఆమె
కళ్ళలో కంగారు , తనకి ఈ ఉద్యోగం అవసరం అనే భావన ... కనిపిస్తోంది.
సర్ మొదలు పెట్టండి అనగానే తన ఆలోచనాలకి తనకే నవ్వు వచ్చింది.... ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు విజయ్.
మధ్య లో వినోద్ ప్రశ్నలు అడుగుతున్నాడు... ఆమె చక చకా సమాధానాలు చెపుతోంది... విజయ్ కి ఆమె మాట్లాడే విధానం అన్ని నచ్చాయి.. అప్పుడు చూసాడు అప్లికేషన్ లో తండ్రి పేరు  రఘురామ్ ...రిటైర్డ్ మాస్టారు  అని.
ఒక్క సారి ఆశ్చర్యం కి లోనయ్యాడు.
తాను ఎవరి కోసం వెదుకుదామని అనుకుంటున్నాడో ఆయనే....రఘురామ్ మాస్టారు. చిన్నప్పుడు తనను చదివించి డబ్బు లేకపోతే ఆయనే చాలాసార్లు ఫీజులు  కూడా కట్టేవారు... ఒక్కో సారి తనకి భోజనం కూడా పెట్టేవారు...నేనంటే ఎంత ప్రేమ గా చూసుకునే వారో..ఒక్కసారి జ్ఞాపకాల లోకి వెళ్ళాడు....విజయ్
అవును నిజం గా తనే....
మీ నాన్నగారు  రఘురామ్  రిటైర్డ్ మాస్టర్ అని ఉంది... ఎక్కడ పని చేశారు.
అని అడిగాడు ఉత్సాహంగా.
చెప్పింది...
అవును ఆయనే ఇన్నాళ్లు తాను వెదుకుతున్నది... ఆయన గురించే.
మీ నాన్న గారు నాకు బాగా తెలుసు.
నేను ఆయన దగ్గర చదువుకున్నాను... ఆయన చెప్పిన మాటలు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి... ఇంతకీ ఆయన ఎలా ఉన్నారు.... అని అడిగాడు విజయ్.. బాగానే ఉన్నారు అండి... వయసు తో వచ్చే ప్రోబ్లెంస్ అంతే.
సరే  రేవు మీ ఇంటికి నేను వస్తా...నాన్నగారికి కలవడానికి....చూసి చాలా కాలం అయింది...అన్నాడు.
సర్ ఈ జాబ్ నాకు చాలా అవసరం...
నాన్న గారు తెలుసు అంటున్నారు... నా క్వాలిఫికేషన్ నచ్చితే ...సహాయం చేయండి. అని రిక్వెస్ట్ చేసింది...
మీరు అర్హత ఉన్నది అని మేము భావిస్తే తప్పకుండా ఈ పోస్ట్  మీకే వస్తుంది... ఒకవేళ ఇది కాకపోతే వేరే పోస్ట్ అయితే ఇవ్వాగలను....చేస్తారా మరి అని నవ్వుతూ అడిగాడు విజయ్...
తప్పకుండా అండీ...ప్రస్తుతం నాకు ఉద్యోగం చాలా అవసరం....మీరు ఏ పొస్ట్ ఇచ్చినా చేస్తాను... థాంక్స్ అండీ అంది...
ఇంతకీ ఏమి పోస్ట్ అండీ అని అడిగింది .
ఎందుకు కంగారు...మీకు ఉద్యోగం గ్యారంటీ ...కానీ అది ఏమిటో ఇప్పుడు చెప్పలేను... రేపు మీ నన్నగారిని కలిసిన తరువాత , ఆయనతో మాట్లాడినతరువాత తెలుస్తుంది....అంతవరకు ఎదురు చూడ వలసిందే...అన్నాడు  నవ్వుతూ.
ఇది కేవలం మీ నన్నగారి గొప్పతనం, మంచితనం వలన ఆయనని దృష్టి లో పెట్టుకుని ఈ సహాయం చేస్తున్నాను. అన్నాడు విజయ్....
ధన్యవాదాలు అండీ అంది. మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మరిచి పోను అన్నది సుహాసిని...
భలే వారండి మీరు ఎప్పటికీ మరిచి పోలేని సహాయాలు మీ నాన్నగారు మాకు ఎప్పుడో చేసేసారు... ఇప్పుడు మా వంతు వచ్చింది అంతే.....
సరే ఆ విషయాలు తరువాత  ఇప్పుడు... మీరు ఇంటికి ఎలా వెళతారు అని
అడిగాడు.
బస్ లొనే...అంది...
వినోద్ ఇంటర్వ్యూ కి వచ్చిన వారందరికీ ఇక్కడే లంచ్ ఏర్పాటు చెయ్యండి...లంచ్ తరువాత సుహాసిని గారిని ,  డ్రైవర్ ని
వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టేసి రమ్మను
వాళ్ల అడ్రస్ తెలిసి నట్లు ఉంటుంది. అన్నాడు విజయ్.
నేను ఈ ఫైల్స్ అన్ని చూసి సంతకాలు పెట్టేసి వస్తా...
నువ్వు నాతో లంచ్ జాయిన్ అవ్వు... అన్నాడు విజయ్...
ఇంకో ఇద్దరు ఉన్నారుగా సర్ అన్నాడు వినోద్... ఏమి పరవాలేదు వీళ్లు అందరూ ఫైనలిస్ట్ లే కదా ....చూడక్కర లేదు, నువ్వు ప్రో సీడ్ అవ్వు అన్నాడు.
సరే  సర్ అంటూ అమ్మాయిని, అందరి ని తీసుకుని వెళ్లి ఏర్పాట్లు చేసి...
సుహాసిని గారు మిమ్మలిని డ్రైవర్ డ్రాప్ చేస్తాడు... అని చెప్పి...
మిగతా వాళ్ళు నలుగురూ రిసెప్షన్ లో ఎదురు చూడండి  రిజల్ట్స్ కోసం అని చెప్పి...
విజయ్ దగ్గరకి వెళ్ళాడు..
వచ్చింది ఐదు మంది.. క్వాలిసింది నలుగురు...
వాళ్ళందరిని ఉండమని చెప్పి నన్ను వెళ్లిపో మన్నారు.ఇంక ఆశలు పెట్టుకోవడం దండగే...మళ్ళీ ఇంకో టి ప్రయత్నించాలి... అనుకుంది...నిరాశగా ....
అయినా వేరే ఎదైనా ఇస్తామన్నారు కదా ,ఎదురు చూస్తే  సరి... రేపు ఇంటికి వస్తానన్నారు కదా నాన్న గారిచేత ఒకసారి ఆడిగిస్తే ....తప్పక సహాయం చేస్తారు  అనుకుంది.
రా వినోద్...వాళ్ళు వెళ్లిపోయారా...అని అడిగాడు... ఏమిటి బాస్ మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు.. అని అడిగాడు...
చెబుతా.. ముందు భోజనం చెయ్....అందరికి  కి అపోయింట్ మెంట్ ఆర్డర్ రెడీ చెయ్.... అన్నాడు.
ఉన్నది 4....పోస్ట్ లు..పైగా సుహాసిని గారు మీ మాస్టారు గారు అమ్మాయి...అన్నారు... ఆవిడని సెలెక్ట్  చేసేస్తే , ఇంకా  మూడే ఉంటాయి కదా మరి... అని అడిగాడు..
అది రేపు చెపుతా... అందరికీ ఆర్డర్స్ రెడీ చేయించు....అని ఆర్డర్ వేసాడు విజయ్...
అలాగే సర్...అంటూ లంచ్ ముగించి ...అందరి ఆర్డర్ పేపర్స్ టేబుల్ మీద పెట్టాడు...
విజయ్ సంతకాలు చేసి... ఆ నలుగురిని ట్రైనింగ్ కి పంపేయ్... అని చెప్పాడు...
లంచ్ అయ్యాక అందరూ ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. తలుపు తీసుకుని కవర్ తో వచ్చాడు ...ఇదిగో అంటూ ఇద్దరి పేర్లు చదివి వాళ్ళకి కవర్ లు ఇచ్చేసాడు...

మిగతా రెండు ఇంటర్వ్యూ లు  క్యాన్సిల్ అయ్యాయి.... అన్నాడు....
మిగతా ఇద్దరూ డీలా పడిపోయారు... ఇందాక వచ్చిన అమ్మాయి వెళ్లి పోయింది కాబట్టి ఖచ్చితంగా తమ నలుగురికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు...
 కానీ ఇప్పుడు ఇలా అయింది.... మిగతా ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి... బయలుదేరబోయారు...

ఆగండి.. ఇంకా.. .నేను  చెప్పడం పూర్తి అవలేదు , మీరే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఎలా...ఇంటర్వ్యూ లు మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి అన్నాను , మీరు అందరూ సెలెక్ట్ అయ్యారు .ఇదిగో మీ  అపోయింట్ మెంట్ లెటర్  అంటూ మిగతా ఇద్దరి చేతులలో పెట్టాడు... ఒక్కసారి ఎగిరి గంతు వేశారు.... ఆనందం లో షేక్ హ్యాండు ఇచ్చి  థాంక్స్ అండీ... చాలా చాలా థాంక్స్ అన్నారు...
మీ అందరికి అభినందనలు.... ట్రైనింగు ఎప్పటి నుంచో మీకు ఫోన్ చేసి చెపుతాము... ప్రస్తుతానికి మీరు వెళ్లొచ్చు అంటూ తిరిగి విజయ్ దగ్గరకు వెళ్ళాడు వినోద్.
మరునాడు మాష్టారింటికి వెళ్లారు... నమస్తే సర్ ఎలా ఉన్నారు... అని  అంటూ కాళ్ళకి నమస్కారం చేస్తూ అడిగాడు విజయ్.
ఎవరు ....గుర్తు పట్టలేక పోతున్నా...కొంచెం చెప్పు బాబు...అన్నారు మాస్టారు.
నేను అండీ చిన్నప్పుడు మీదగ్గ ర చదువు కున్న విజయ్ ని.  అనాధ ఆశ్రమం లో పెరిగినా మీరు.ఫ్రీ గా ట్యూషన్ చెప్పేవారు . పుస్తకాల కి ,ఫీజులకి  సహాయం చేసే వారు. ..ఎప్పుడూ బాగా చదువుతానని నన్ను మీ ప్రియ శిష్యుడు అని పిలిచే వారు గుర్తు పట్టారా అండీ అని అడిగాడు...
ఆ ఇప్పుడు గుర్తుకు వచ్చింది... ఎలా ఉన్నావ్ , ఏం చేస్తున్నావ్ అని అడిగారు... మీదయ వలన ఇంటర్ లో మంచి మార్కులు, తరువాత ఇంజినీరింగ్ లో ఫ్రీ సీట్ వచ్చింది... ఒక మహాను భావుడి దయ వలన అమెరికా లో చదివే అవకాశం దొరికింది... ఈ మధ్యే,  మన దేశానికి వచ్చాను. ఇక్కడ సొంతం గా ఇండస్ట్రీ
రన్ చేస్తున్నా...నా దేశానికి నా చదువు ఉపయోగ పడాలని వచ్చేసా...
అక్కడ ఆదాయం బాగా ఉంటుంది కదా బాబు మరి ఎందుకు వచ్చేసావ్ అని అడిగారు.
ఆదాయం బాగానే ఉంది... కానీ నా ఒక్కడి దగ్గరే అవసరానికి మించి డబ్బు ఉంటుంది.అదే .. ఇక్కడికి వచ్చి ఇండీస్ట్రీ పెడితే చాలా మంది కి ఉద్యోగాలు ఇవ్వొచ్చు...కదా...ఇలా అయితే నాకు డబ్బూ వస్తుంది... పది మందికి జీవనోపాధి కల్పించి నట్లు ఉంటుంది... కదండీ మరి ...
ఆ పది మంది ....కుటుంబాల ఆశీర్వాదమే మనకి బలం... అనాధ గా పెరగడం నా తప్పు కాదు...ఇప్పుడు చాలా కుటుంబాలు నాకు ఆత్మ బంధువులు గా ఉన్నారు
.... వాళ్ల కళ్లలో వెలుగు చూస్తూ ఉంటే సంతృప్తి గా ఉంటుంది... ఎంత సంపాదించాను అన్నది కాదు ఎంత మంది అభిమానాన్ని సంపాదించాను , ఈ సమాజానికి ఎంతవరకూ ఉపయోగ పడ్డాను అన్నదే నాకు నచ్చిన అంశం అండీ.
అందుకే ఇక్కడికి వచ్చేసా....ఇండస్ట్రీ ప్రారంభించాం.భగవంతుడి దయ వల్ల బాగానే నడుస్తోంది... లాభాలతో....
ఇక్కడికి రాగానే మీ గురించి వాకబు చేసా... మీరు రిటైర్ అయ్యారు... తరువాత ఆ ఊరు నుంచి వెళ్లిపోయారు అని తెలిసింది...
దరిమిలా ఇండస్ట్రీ హడావిడి లో ఈమధ్య కొంచెం బిజీ... అయ్యాను... ఖాళీ చేసుకుని మీ అడ్రస్ పట్టుకోవాలి అని మా వినోద్ కి కూడా చెప్పాను...
అన్నట్టు ఇతను వినోద్ నా పర్సనల్ సెక్రటరీ మరియు మంచి స్నేహితుడు... అంటూ పరిచయం చేశాడు.
నమస్కారం అండీ అన్నాడు వినోద్...రెండు చేతులు జోడించి.
చల్లగా ఉండు నాయనా...అంటూ ఆశీర్వదించారు.

నిన్న ఇంటర్వ్యూ లో మీ అమ్మాయి ని చూసా ...మీ అడ్రెస్ పట్టుకుని ఇదిగో ఇలా వచ్చేసా.... నవ్వుతూ అన్నాడు విజయ్... అన్నట్టు మీకు కొడుకు ఉండాలి కదా  ఎక్కడ ఉన్నాడు. అని అడిగాడు విజయ్.
అమెరికా లో నే .ఇల్లు తాకట్టు పెట్టి చదివించా... అక్కడకి వెళ్లి పోయాడు.
పెళ్లి కూడా చేసుకున్నాడుట.
ఫొటోస్ పంపించాడు... నేనా రిటైర్ అయ్యాను. అదేమిటి అండీ మరి అలా వదిలేస్తే ఎలా అడగలేదా మరి అన్నాడు. ఏమని అడగాలి ...ఏవో సాకులు చెపుతాడు.. వాడి చదువుకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా డబ్బు పంపలేదు... ఇల్లు అమ్మేసి తీర్చేసాను... ఇది అద్దెకి తీసుకుని ఉంటున్నాం.
వాడి మీద బెంగ తో ఆవిడ మంచం పట్టింది.... ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటోంది.పాపం ఆడపిల్ల ఇంటి భారం దీని మీద పడింది. పెళ్లి చేసుకుని హాయి గా అత్తారింట్లో గడపాల్సిన పిల్ల....
 ఇప్పుడు ఇదిగో దీని రెక్కల కష్టం మీద ఇల్లు నడుస్తోంది.... ఎమి చేయాలో అర్థం కావట్లేదు.
మిమ్మలిని అలా మాట్లాడవద్దని ఎన్ని సార్లు చెప్పాను అని
సున్నితంగా మందలించింది..సుహాసిని...
నీ దగ్గర ఉద్యోగం ....
వీలుంటే, మాకు సహాయం చెయ్ బాబు.కొంచెము ఆసరాగా ఉంటుంది.అని అడిగారు...
 అయ్యో ఎంత మాట అన్నారు మాస్టారు..
ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష.... మీరు ఆర్డర్ వేయాలి కానీ ప్రాధేయపడవలసిన అవసరం లేదు.మీరు అలా మాట్లాడ కూడదు.
 మీరు నాకు చేసిన సహాయం ఎలా మరిచిపోతాను.నిజానికి నేనె మీ గురించి వెతుకు తున్నాను. ఇంతలో మీ అమ్మాయి వచ్చింది.ఇంటర్వ్యూ కి.
మీ అమ్మాయి అని  తెలియ గానే నేనొక నిర్ణయం తీసుకున్నాను.
వచ్చిన వాళ్లందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేసాను.
ఒక్క మీ అమ్మాయికి తప్ప... ఎందుకంటే మీతో మాట్లాడిన తరువాత ఒకనిర్ణయనికి వద్దామని... అన్నాడు.
ఏమిటి బాబు అది... అని అడిగారు...
నిజానికి నాకు మీ అమ్మాయి ని చూడగానే నచ్చేసింది... ఆ తరువాత మీ అమ్మాయి అని తెలియగానే ఇంకా గౌరవం పెరిగింది... నేను పెళ్లంటూ చేసుకుంటే తననే చేసు కుందామని అనుకుంటున్నా....అదీ మీకు మీ అమ్మాయి కి అభ్యంతరం లేక పోతేనే..ఇది కృతజ్ఞతతో కాదు ..తన పద్దతి అది బాగా నచ్చి...మీరు సరే నంటే
నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు....
ఒకవేళ  తనకి ఇష్టం లేదు అంటే ...
ఇదిగో నండి తన అపాయింట్ మెంట్ లెటర్ .వెంటనే జాబ్ లో జాయిన్ కావచ్చు... ,
వేరే ఊరిలో ఉన్న మా బ్రాంచ్ కి , మేనేజర్ గా పంపిస్తాను...
మీకు ఏ సమస్య లేకుండా చూసుకుంటా...
ఇదిగో నండి ఈ టేబులు మీద పెడుతున్నాను.
సుహాసిని గారు మీకు ఇష్టమైతే నే సుమండీ...
ఈ లెటర్ చింపేసి... నా లైఫ్ మేనేజర్ గా వచ్చేయండి... ఉంటాను మరి..
పదరా వినోద్ ఇంక బయలుదేరదాం
అంటూ లేచాడు విజయ్. వెళ్ళొస్తామండి మాస్టారు మరి అంటూ కాళ్ళకి నమస్కారం పెట్టాడు....
ఒక్క నిమిషం బాబు , ఇలా కూర్చో ...అమ్మాయితో ఒకసారి మాట్లాడతాను అంటూ....
అమ్మా బాగా ఆలోచించుకు ని ఒక నిర్ణయం తీసుకో...మాగురించి ఆలోచించకు.. ఎలాగో సర్దుకు పోవాలి మరి. మాగురించి నీ జీవితం ఆగి పోకూడదు....ముందుకు సాగాల్సిందే....విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి కుర్రాడు...అతని మాటలలో చూస్తున్నావుగా మంచి ఆదర్శ భావాలు ఉన్నాయి . ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు...ఆ అబ్బాయి నిన్ను బాగా ఇష్ట పడుతున్నాడు....నా ప్రియ శిష్యుడు .
నేను కాదనలేను కానీ నీకు ఇష్టం లేకుండా నేను ఏమి నిర్ణయం తీసుకో లేను అన్నారు మాస్టారు..
నేను పెళ్లి చేసుకు వెళ్ళి పోతే మరి, మీరో... మిమ్మలిని ఎలా వదిలేస్తాను....అనుకున్నారు...
పెళ్ళి వొద్దు ఏమి వద్దు....
నేను జాబ్  కే వెళతాను నాన్నగారు...
ఇంక  ఏమి మాట్లాడ వద్దు...అంటూ ఆ లెటర్ చేతిలోకి తీసుకుంది సుహాసిని...
భలే వారండి మీరు... మా మాష్టారిని అలాగే  వదిలేస్తానా..ఏమిటి..ఆయన మీకు ఎంతో నాకు అంతకన్నా ఎక్కువ...
మీ అమ్మగారు,నాన్నగారు కూడా మనతో నే ఉంటారు... నాకు మాత్రం ఎవరు ఉన్నారు... ఒకవేళ మీరు ఉద్యోగానికి వెళ్లినా , వాళ్ళు నాతోనే ఉంటారు... మీ పెళ్లి బాధ్యత కూడా నాదే...ఎందుకంటే మీ నాన్నగారు నాపై చూపించిన ప్రేమకి ఈ విధం గా కృతజ్ఞత తెలుపుకునే అవకాశం గా భావిస్తా ,...అన్నాడు నవ్వుతూ....
ఇంకా అలోచిస్తా వెందుకు ఒప్పుకో
తల్లి... నీ లాంటి మంచి దానికి అంతా మంచే జరుగుతుంది.  అన్నారు మాస్టారు.
లోపల మంచం మీద ఉన్న అమ్మ వైపు కి చూసింది. కళ్ళతోనే అడిగింది ,ఏమి చెయ్యమంటావు అని... ఆవిడ కళ్ళ నిండా సంతోషం తో చేసుకో మని తల ఆడించారు.
మీ  ఇష్టం నాన్నా. అంటూ తన చేతిలో ఉన్న అపోయింట్ మెంట్ లెటర్ చింపేసింది.సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా తల వంచుకుని చిరు నవ్వుతో , నిలబడింది. లోపల మంచం మీద వాళ్ళమ్మ గారు ఇది అంతా వింటూ ,మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
కళ్ళు లో వెలుగులు నిండగా... విజయ్ వైపు కి  ఓరగా చూసి తన అంగీకారాన్ని  తెలుపుతూ తల ఆడించింది.
ఇద్దరూ ఆయన కాళ్ళకి నమస్కరించారు  , ఇద్దరిని తన రెండు చేతులతో లేపి,
శుభం అంటూ వాళ్ళిద్దరి చేతులు కలిపి,  ఆశీర్వదించారు మాస్టారు... కంటి నిండా ఆనంద బాష్పాలతో...మనసులో నిండుగా....
శుభం....

Wednesday, 24 October 2018

తొలి అడుగు...

తొలి అడుగు...

లీలా మహల్ ముందు అభిమానుల సందోహం తో కళ కళ లాడుతోంది... ఎటు చూసినా జనం తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని అందరి తపన.ఒక ప్రక్క
టికెట్ క్యూ..మరో ప్రక్క అభిమాన సంఘాల హడావుడి.. కటౌట్ లు కట్టారు.. దండలు వేస్తున్నారు... కొందరు పాలతో అభిషేకం చేస్తున్నారు... విజయ్ కూడా పెద్ద దండ తీసుకుని వచ్చి తన అభిమాన హీరో కటౌట్ కి వేసాడు... ఈ లోగా ఫ్రెండ్స్ టికెట్స్ తీసుకుని వచ్చారు... ఫాన్స్ కోసం మేనేజర్ కొన్ని   టిక్కెట్లు కేటాయించారు... అందరూ లోపలికి వెళ్లారు.. సినిమా మొదలు అయింది.. ఈలలు కేకలు తో హాలు దద్దరిల్లుపోతోంది.. ఒక్క డైలాగ్ కూడా వినిపించటలేదు... సినిమా పూర్తి అయింది.. అంతా కబురులు చెప్పుకుని ఇంటికి బయలుదేరాడు విజయ్. ఏరా ఇవాళ
ఇంత ఆలస్యం అయింది.. భోజనం కూడా చేయలేదు... రా కాళ్ళు కడుక్కో వడ్డించేస్తా...అంటూ తల్లి అడిగింది ఆప్యాయం గా...ఇవాళ కాలేజ్ లో ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి... అందుకే అని అబద్ధం చెప్పాడు... భోజనం కానిచ్చి...
సాయంత్ర ము కూడా హాలు దగ్గరకు చేరారు... మళ్ళీ రాత్రి ఫస్ట్ షో చూసి... ఇల్లు చేరాడు విజయ్.. తండ్రి ఇంకా రాలేదు.. అమ్మా  , నాన్న ఇంకా రాలేదా...అని అడిగాడు.. అవును రా బస్ లో రావాలి కదా. బహుశా ఇవాళ బస్ దొరకడం లేటు అయి ఉంటుంది లే ,నువ్వు తినేసి పడుకో మళ్ళీ పొద్దున్నే కాలేజ్ కి వెళ్ళాలి గా...అంది .నాకు కొన్ని పుస్తకాలు కొనాలి. కొంచెం డబ్బు కావాలి. నాన్నని అడుగు అన్నాడు. నిజానికి మరునాడు దండలకు.. ఇంకా సినిమా హిట్ అయినందుకు , పార్టీ లకి , ఫ్రెండ్స్ కి టిక్కెట్లకి... కావాల్సి వచ్చి...
సరే లే అడుగుతాలే అంది ఆవిడ.
రాత్రి లేటు గా వచ్చాడు సుబ్బారావు. ఏమండీ ఇంత ఆలస్యం అయింది...
ఇవాళ కూడా బస్ దొరకలేదా అంది.
అవును ఆఫీసులో ఆలస్యం అయింది.
ఈ లోగా డైరెక్ట్ బస్ వెళ్ళిపోయింది...
సగం దూరం వచ్చి.. మిగతాది నడిచి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది...
సరేలే భోజనం వడ్డించు... నువ్వు అబ్బాయి తినేసారా.. అని అడిగాడు.
వాడు తిని పడుకున్నాడు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను...అంది... సరేలే వడ్డించు...కాళ్ళు కడుక్కుని వస్తాను.అంటూ లోపలికి వెళ్ళాడు...భోజనం చేస్తుంటే విజయ్ కి మెలుకువ వచ్చింది...కానీ అలాగే పడుకొని సెల్ ఫోన్ లోమెసేజ్ లు చూస్తున్నాడు. భోజనాలు అనంతరం
గదిలో కి వెళ్లారు సుబ్బారావు, భార్య.
అమ్మ డబ్బులు గురించి చెపుతుందో లేదో అని ఓ చెవి పారేశాడు విజయ్.
సరోజా ఇవాళ కాళ్ళు లాగుతున్నాయి కాస్త కొబ్బరినూనె రాయి అని అడిగాడు సుబ్బారావు.రోజూ ఇలా కిలోమీటర్ల దూరం నడుస్తూ ఉంటే లాగవు మరి.బండి అబ్బాయికి ఇచ్చేసి మీరు ఇలా కష్టపడితే ఎలా.వాడు చిన్నవాడు కాలేజ్ కూడా దగ్గిరే.మీరు మోటార్ సైకిల్ మీద వెళ్లొచ్చు కదా అని అడిగింది.మనం మధ్య తరగతి వాళ్ళం.రెండు బళ్ళు ఎక్కడ కొనగలను.వాడు కాలేజ్ కి వెళ్ళేఅప్పుడు సరదాలు ఉంటాయి.నాన్న గా వాడి ముచ్చట్లు తీర్చే బాధ్యత నాదే కదా.కొన్నాళ్ళు కష్ట పడితే వాడి కి మంచి ఉద్యోగం వస్తుంది.నాకు కొంచెం ఆసరాగా ఉంటాడు అన్నాడు.
ఇదిగో ఇప్పుడు మళ్లీ ఏవో పరీక్షలు అంట, పుస్తకాలు  కొనాలి,  డబ్బులు కావాలి అంటున్నాడు అంది. అమ్మో మళ్ళీ డబ్బులా,మొన్ననే ఓవర్ టైం చేసి తీసుకుని వచ్చాను. అస్తమాను నేనే చేస్తాను అని అడిగితే ఇవ్వరుకదా. మిగతా వాళ్ళు కుడా చెయ్యాలి కదా అన్నాడు మా మేనేజర్. ఇంకో నాలుగు రోజులు ఆగితే జీతాలు వస్తాయి.అప్పుడు ఏర్పాటు చేస్తాలే.
మరీ అర్జెంట్ అయితే పక్కింటి విశ్వనాధం గారి దగ్గర అప్పు చేయాలి చూద్దాం. ఇక చాలులే , పడుకో మళ్ళీ పొద్దున్నే బయలు దేరాలి అని నిద్రకి ఉపక్రమించారు.
అపుడు అర్థం అయింది , విజయ్ కి
 తల్లి తండ్రులు అంటే ఏమిటో,
వాళ్ళ ప్రేమకి అంతే లేదని. ఈ ప్రపంచం లో వాళ్ళు చూపించే ప్రేమ కన్నా ఏది గొప్ప కాదని.
మా నాన్న నాకోసం ఇంత కష్ట పడుతున్నాడు.నా ఫీజులు కోసం ఓవర్ టైం చేసున్నాడు. నాకు బైక్ ఇచ్చేసి తాను
రోజూ ఎంతో దూరం నడుస్తున్నాడు.
ఇన్నాళ్లు నాకు తెలియలేదు.
కాదు కాదు వాళ్ళు నాకు తెలియనివ్వలేదు.అది వాళ్ళ గొప్పదనం. నేను మాత్రం సినిమా లు, అభిమానం పేరుతో కటౌట్ లకి దండలకి..పార్టీలకి... డబ్బులు వృధా చేస్తున్నా.
అప్పుడు గుర్తుకు వచ్చింది
తన అభిమాన హీరో అన్న మాటలు.
" మీరు చూపించే అభిమానానికి ధన్యవాదాలు. కానీ అభిమానానికి ఒక హద్దు ఉంటుంది. మా మీద ప్రేమ చూపించండి. సినిమా చూడండి. అంతవరకే. అనవసర ఖర్చులు పెట్టొద్దు. టికెట్ దొరకలేదని,ఏదేదో చేసేసు కోవడం, ఎంత ఖరీదైనా పెట్టి టికెట్ కొనడం లాంటివి చేయొద్దు. మీరు మమ్మల్ని ఎంత గా అభిమానిస్తారో అంతకు వెయ్యి రెట్లు మీ తల్లిదండ్రులు మీ మీద ప్రేమని పంచుతున్నారు.అది అందరూ గుర్తించాలి. మేము సినిమాలు చేస్తున్నాము అంటే ఒకపక్క అవంటే ఇష్టం,  మరియు మా తల్లితండ్రులని ఇంకా బాగా చూసుకోవాలి అన్న తపన.అది మీరు కూడా గ్రహించాలి, అలవర్చుకోవాలి "
అని ఎంత బాగా చెప్పాడు.
ఇప్పుడు అర్థం అవుతోంది ఆయన అన్న మాటలు. అనుకున్నాడు.
పొద్దున్నే తండ్రి ఆఫీస్ కి బయలుదేరే సమయంలో నాన్నా మీరు బండి మీద వెళ్ళండి నా ఫ్రెండ్ వస్తానన్నాడు. వాడితో వెళతాను అన్నాడు. సరే అంటూ ఆయన బయలు దేరారు.
నాన్న ఇంక మీకు కాళ్ళు లాగవు. ఆ అవసరం రానీయకుండా చూసుకుంటా
అని మనసులో అనుకున్నాడు.
అమ్మా నేను కాలేజ్ కి వెడుతున్నా. అని చెప్పాడు. అదేమి రా ఫ్రెండ్ వస్తాడు అన్నావు అని అడిగింది. లేదమ్మా
ఎవరు లేరు. నాన్న నా కోసం అంత దూరం నడుస్తున్నారు అని రాత్రి తెలిసింది. ఇంకా ఆయనని కష్టపెట్టను. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తాను. అంటుంటే ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసాడు.
ఫ్రెండ్ అని చెప్పక పోతే నాన్న బండి తీసుకుని వెళ్ళరు. అందుకని అలా చెప్పా. సరే నేను బయలు దేరతాను. అంటూ గేటు తీసుకుని బైటకి వచ్చాడు. పక్కింటి అంకుల్ ఇదిగో అబ్బాయి విజయ్ మీ నాన్న ఏదో బుక్స్ కొనాలి డబ్బులు కావాలని ఆడిగావుట .ఇదిగో నీకు ఇమ్మన్నాడు. నాకు జీతాలు వచ్చిన తరువాత  తిరిగి ఇస్తానన్నాడు అంటూ అతని కి ఇచ్చాడు. ఒక్కసారి గా విజయ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.నాన్నంటే నే ప్రేమ ప్రేమంటే నే నాన్న, ఇన్నాళ్లు నేను నీడలో ఉన్నానని అనుకుంటున్నాను. కానీ నువ్వు ఎండలో నిలబడి నాకు నీడ నిస్తున్నావాని తెలుసుకోలేక పోయాను.నన్ను క్షమించండి నాన్నా అని మనసులో నే అనుకుంటూ వెంటనే కళ్ళు తుడుచుకుని,
వద్దండి. నేను ఈ వాల్టి నుంచి లైబ్రరీలో చదువు కుంటాను. ఈ డబ్బు లు ఇప్పుడు అవసరం లేదు. సహాయం చేసినందుకు థాంక్స్ అండీ.అంటూ బయలు దేరాడు.
కాలేజ్ గేట్ దగ్గర ఒరేయ్ విజయ్  ఇదిగో రా నువ్వు అడిగిన టికెట్స్ .నాకు కొంచెం పని ఉంది రా , మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు విశాల్.
ఇప్పుడు నాకు కావాల్సింది టికెట్స్ కాదు, పుస్తకాలు అనుకుంటూ... ఆ టికెట్ చింపేసి,  లైబ్రరీ వైపు కి అడుగులు వేసాడు విజయ్.

ఈ తొలి అడుగు ఎన్ని విజయాలకి దారితీస్తుందో...

Wednesday, 10 October 2018

సిరి సిరి సిరిమువ్వల చిరు సవ్వడులే

సిరి సిరి సిరిమువ్వల  చిరు సవ్వడులే
పలికే ను నా హృదయపు  ప్రియ సందడులై
మనసున పలికిన  ప్రియ రాగములే
మధురిమ లొలికించెను ప్రియ భావనలై...

నును సిగ్గులు ..నీ బుగ్గ చేరి ,
అర మోడ్పుల... కళ్ళు చేసి..
నా మదిని .....నీ హృదయం
పలకరించి నాదే..
కర్పూర పరిమళాలు చల్లినాదే...

సిరి సిరి సిరిమువ్వల  చిరు సవ్వడులే
పలికే ను నా హృదయపు  ప్రియ సందడులై
మనసున పలికిన  ప్రియ రాగములే
మధురిమ లొలికించెను ప్రియ భావనలై...

ఏమని వర్ణించను నా
అంతరంగమున ఉన్న ప్రేమ ...
నా హృదయం నీ కోవెలగా
మార్చి కొలిచి నానే...మైమరచి పోయినానే

సిరి సిరి సిరిమువ్వల  చిరు సవ్వడులే
పలికే ను నా హృదయపు  ప్రియ సందడులై
మనసున పలికిన  ప్రియ రాగములే
మధురిమ లొలికించెను ప్రియ భావనలై...



Friday, 5 October 2018

ఎన్నెన్నో ....కలలు కన్నా ,

ఎన్నెన్నో ....కలలు కన్నా ,
ఏవేవో ......కవితలల్లా
ఎదలో నీ రూపం ,
నామనసే నీకోసం
నన్నే ఊరిస్తూ ,
నీ కై తపియిస్తూ...
నీ కోసం .....వేచుంటానులే...

ఇంతలో ...ఈ మాయ ఏమిటో
కొత్తగా ....ఈ వింత ఏమిటో...
నిన్ను చూసినంతనే,
నన్ను నేను మరిచానే..
చెప్పలేని ...వింత ..భావనేదో నన్ను
చేరేనే....

ఎన్నెన్నో ....కలలు కన్నా ,
ఏవేవో ......కవితలల్లా
ఎదలో నీ రూపం ,
నా మనసే నీకోసం
నన్నే ఊరిస్తూ ,
నీ కై తపియిస్తూ...
నీ కోసం .....వేచుంటానులే...

మదిలో ఏదో అలజడి..
ప్రేమై వానై కురిసే ఓజడి...
ఆశలే వో గమ్మత్తుగా.....
నన్ను చుట్టి సాగేనే...
ఆ ఊహలేవో  గాలిలో
ఓల లాడించేనే....

ఎన్నెన్నో ....కలలు కన్నా ,
ఏవేవో ......కవితలల్లా
ఎదలో నీ రూపం ,
నా మనసే నీకోసం
నన్నే ఊరిస్తూ ,
నీ కై తపియిస్తూ...
నీ కోసం .....వేచుంటానులే...

Tuesday, 25 September 2018

అందాల చందమామ


అందాల చందమామ
నా మనసు తెలుసుకో వా
అభిమానమంటూ ఉంటే
నా మనసు తెలుపలేవా...

అలరారు .. నీలి కురులు ,
నగుమోముపైన  ఆడే...
ఆ సొగ చిలిపి కళ్ళు ,
నా మదికి బంధమేసి,
జత కూడి ......ఊసులాడే

అందాల చందమామ
నా మనసు తెలుసుకో వా
అభిమానమంటూ ఉంటే
నా మనసు తెలుపలేవా......

నెలవంక రూపు దాల్చి
నను చూసి నవ్వకోయి ...
ఆ మేఘమాల నంపి
నా  మదిని తెలుపలేవా.... 

అందాల చందమామ
నా మనసు తెలుసుకో వా
అభిమానమంటూ ఉంటే
నా మనసు తెలుపలేవా...







ఫ్రెండ్ కి ఇచ్చిన మాట

ఫ్రెండ్ కి ఇచ్చిన మాట

రారా సుబ్బారావు చాలా కాలం అయింది నిన్ను చూసి... అంటూ ఆహ్వానించారు వెంకటరావు గారు.
సుబ్బారావు వచ్చాడు కాఫీ పంపించు అంటూ చెప్పారు... వాళ్ళవిడకు.
అన్నయ్య గారూ బాగున్నారా ఇదిగో ఇప్పుడే తీసుకుని వస్తా...అంటూ లోపలికి వెళ్ళింది సుజాత.
వెంకటరావు సుబ్బారావు మంచి స్నేహితులు... వెంకటరావు వ్యాపారం లో స్థిరపడితే ,సుబ్బారావు మాస్టారు గా స్థిర పడ్డారు... ఇద్దరికి ఒక కొడుకు ఒక కూతురు...
రారా ఇలా కూర్చో... ఈ మధ్య వ్యాపార లో కొంచెం బిజీ గా ఉండి మనం కలవలేకపోయాం...ఎలా ఉన్నారు చెల్లెమ్మ పిల్లలు... అంటూ అడిగాడు వెంకటరావు.
అంతా బాగానే ఉంది... అబ్బాయి ఇంజినీరింగ్ లో చదువు తున్నాడు... అమ్మాయి ఇంటర్... అన్నాడు సుబ్బారావు.  చాలా సంతోషం.అన్నాడు వెంకట్రావు. ఇదిగో అన్నయ్యా కౌఫీ..అంటూ ఇచ్చింది... తీసుకుని తాగడం మొదలు పెట్టాడు. ఏదో దిగులు గా ఉన్నావ్. ఏమిట్రా సంగతి.. అంటూ అడిగారు.ఆబ్బె అలాంటిది ఏమి లేదు ..ఒకసారి నిన్ను చూసి పోదామని వచ్చాను.. అన్నాడు సుబ్బారావు. ఒరేయ్ నేను బిజినెస్ మాన్ ని ఎంతమంది ని చూసి ఉంటాను... నీ ముఖమే చెపుతోంది... నిజం చెప్పు... అంటూ అడిగాడు.. ఏదైనా డబ్బు సమస్యా అంటూ అడిగాడు... ఆబ్బె అలాంటి ది ఏమి లేదు... మా అబ్బాయి కాలేజ్ లో జేరిన తరువాత మొదట్లో బాగానే చది వే వాడు... ఈమధ్య సావాసాలు...తిరుగుళ్లు ఎక్కువ అయి.. చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు.... ఏమైనా అడిగితే కోపం, పెద్ద లేదు , చిన్న లేదు అరుస్తున్నాడు... వాళ్ళమ్మ గారాబం వాడిని అలా మార్చేసింది.
చెపితే వినదు.దాని అతి ప్రేమ వలన వాడి భవిష్యత్ ఏమి అవుతుందో అని భయం గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
నువ్వే వాడికి ఏదైనా చెప్పి చూడు అంటూ అడిగాడు. సరే లే నేను మీ ఇంటికి వస్తాను ఒకరోజు....చూద్దాం.. ఆ రోజు మీ వాడికి ఉద్యోగం అడుగు
   వాడి ఎదురుగా ...సరేనా మరచిపోకు.. మిగతాది నేను చూసుకుంటా అన్నాడు వెంకట్రావు. చెప్పినట్లు గానే
ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.రండి అన్నయ్య గారు అంటూ సాదరంగా ఆహ్వానించింది సుబ్బారావు భార్య. ఏమి చెల్లెమ్మా బాగున్నవా...ఏరి పిల్లలు...ఉన్నారా ఇంట్లో అని అడిగాడు. ఇదిగో ఇప్పుడే పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళింది.ఒరేయ్ నేను చెప్పింది గుర్తు ఉందిగా.. వాడి ఎదురుగా అడుగు... చాలు అన్నాడు వెంకట్రావ్.. ఇంతలో పిల్లలు వచ్చారు. నమస్తే  అంకుల్ అంది అమ్మాయి. హాయ్ అంకుల్ అన్నాడు అబ్బాయి... ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగాడు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్...అన్నాడు... ఈ ఏడాది తో అయిపోతుంది... నీ దగ్గర ఏదన్నా ఉద్యోగం ఉంటే ఇప్పించరా అని అడిగాడు సుబ్బారావు... ఎలా వచ్చాయి మార్కులు అనిఅడిగాడు వెంకట్రావ్..కొన్ని బాక్ లాగ్స్ ఉన్నాయి... అన్నాడు..ఇలా అయితే ఎలా ఎప్పుడు అవచేస్తావు... అసలు పాస్ అయితే కదా ఉద్యోగం సంగతి వీడి పరిస్థితి చూస్తే అసలు చదువు అబ్బినట్లు లేదు...ఏమి అనుకోకు రా అన్నాడు వెంకటరావు... అలా  అంటా రేమిటి అండి.. అన్ని పూర్తి చేసేస్తాగా...
 అన్నాడు...అదే ఎప్పుడు అని అడుగుతున్నాను.... ఈ కాలం ఎంత స్పీడ్ గా ఉందొ తెలుసా... అందరికి వందకి వంద వచ్చేస్తున్నాయి..నువ్వు చూస్తే ఇలా ..నీకు ఎక్కడా  ఉద్యోగం దొరకదు.. అసలు పాస్ అవుతావో లేదో అని అనుమానం..మా ఆఫీస్ లో గుమాస్తా ఉద్యోగం ఉంది వచ్చి చేరు... నేను ఫోన్ చేసి చెపుతాను. అన్నాడు .
మీరుఅవమానిస్తున్నారు...అన్నాడు ఉక్రోషం గా..
ఈ కోపం చదువు మీద చూపించు... నమ్ముతాను... అన్నాడు. సరే నేను అన్ని పాస్ అయి... మంచి కంపెనీ లో జాబ్ తెచ్చుకుంటే..ఏమి చేస్తారు... అన్నాడు... అలాగే జరిగితే ఇప్పుడు అన్న మాటలు ఉపసంహరించుకుని, అందరిముందు క్షమాపణ చెపుతా..కానీ అలా చేయలేక పోతే ....గుమాస్తా గా చేరతావా మరి అన్నాడు  సరే నండి. చూసుకుందాం..అంటూ విసురు గా బైటకు వెళ్లి పోయాడు... సుబ్బారావు కంగారు పడ్డాడు. అదేమిటి రా అలాగ అనేశావు...ఇప్పుడు ఏమవుతుందో.. అన్నాడు..నువ్వు ఏమి కంగారు పడకు...నా మీద పంతం తో బాగా చదువుతాడు లే ..మరి నేను వస్తాను అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు..ఆ తరువాత శ్రద్ధ గా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూ లో పెద్ద కంపెనీ లో సెలెక్ట్ అయ్యాడు .సంవత్సారానికి 12 లక్షలు జీతం. ఆ అపోయింట్మెంట్ లెటర్ తీసుకుని తండ్రికి చూపించాడు. ఇదిగో నాన్న ,నేను సాధించాను.ఎక్కడ మీ ఫ్రెండ్..ఆయన ఛాలెంజ్ చేశారు గా ...ఇది చూపిస్తాను మీరూ రండి అని తీసుకుని వెళ్ళాడు.రేయ్ వద్దురా ..అయింది ఏదో అయింది. నీకు ఉద్యోగం వచ్చింది గా ఇంక ఈ విషయం వదిలేయ్ అన్నాడు సుబ్బారావు. లేదు నాన్న ఆయన ఎంతలా మాట్లాడారు, నేను పాస్ అవనట, ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వరట...ఎంత అవమానం గా మాట్లాడారో, నువ్వు విన్నావుగా... ఇంకేమి మాట్లాడకు అన్నాడు.
అక్కడ వెంకటరావు ఆఫీస్ లో మీటింగ్ జరుగుతోంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు ఇద్దరు.ఒరేయ్ వద్దు రా ఇంకోసారి కలుద్దాం అని తండ్రి నివారించాడు. కానీ వినలేదు.. నేను సాధిస్తే అందరి ఎదుట నాకు క్షమాపణ చెపుతాను అన్నారు...
అది ఇప్పుడు అడుగుతున్నాను..
అంకుల్ ఇదిగో లెటర్.నేను సాధించాను. మీరు  అన్న మాట నిలబెట్టుకుంటారా
..అంటూ దగ్గరకు వెళ్ళాడు..
మొత్తానికి సాధించావ్ ...నేను కూడా మాట నిలబెట్టుకుంటా అన్నాడునవ్వుతూ.అంతలో సుబ్బారావు వెంకటరావు చెయ్యి పట్టుకుని వాడి పిచ్చి వేషాలు కి మీరు పట్టించుకోవద్దు... దయచేసి ఇంతటితో ఆపేయండి అని బ్రతిమాలా డు సుబ్బారావు...కానీ వెంకటరావు దగ్గరికి వెళ్లిన కిరణ్ ...
ఒక్క సారిగా ఆయన కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించండి అంకుల్ చాలా పెద్ద
తప్పు చేశాను... అన్నాడు.
అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు.... మీరు కనక ఆ ఛాలెంజ్ చేసి ఉండక పోతే నేను ఏమై పోయి ఉండేవాడినో... సమయానికి దేముడి లా వచ్చారు...నాలోని పౌరుషం రెచ్చగొట్టి.. నేను సాధించేలా చేశారు... నేను పాస్ ఐయ్యాక కూడా నాకు మీ మీద పంతం ఉండేది...ఒక్కసారి ఆ అపోయింట్మెంట్  లెటర్ చేతికి వచ్చిన తరువాత అర్థం ఐయింది. ఎంజాయ్ చేయాల్సిన వయసు లో ఎంజాయ్ చెయ్యకపోతే తరువాత చేయలేము గా
 అనే కాన్సెప్ట్ లో ఉండే వాడిని.
కానీ చదవాల్సిన టైం లో చదవకుండా
తిరిగి తే , జీవితం ఏమైపోయి ఉండేదో అని..
ఇంకా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉండేది అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మంచి ఉద్యోగం, మంచి జీతం ..ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం
,దక్కాయి .ఆరోజు మీరు నాకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఇప్పటికీ నేను అలాగనే ఉండేవాడిని.ఇది అంతా మీ ఆశీర్వాదమే ,అని ఆయన చేతిలో లెటర్ పెట్టాడు. ఆయన ఒక సారి హత్తుకుని నాకు తెలుసు రా  నువ్వు సాధించగలవని. నీకు నా అభినందనలు చాలా సంతోషం కిరణ్...
ఏమయ్యా సుబ్బారావు నీ  కొడుకు సాధించాడు...నేను నా ఫ్రెండ్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను...అంటూ నవ్వాడు... సుబ్బారావు కళ్ళలో ఆనంద భాస్ఫాలు తిరుగుతుండ గా కృతజ్ఞతా పూర్వకంగా చూసాడు.
శుభం