Tuesday, 28 March 2017

ప్రకృతి రమణీయం.


ప్రకృతి రమణీయం

శుభోదయం 
ప్రభాత భానుడి  అరుణోదయం.
నవ జీవన  వేదానికి  ప్రభోదయం,
కోయిల  కుహు కుహు లు  ,
పక్షుల  కిలకిలలు,
హిమ బిందువుల తళ తళలు ,
నయనాలంకృత    దృశ్య పధ కేళికి 
 ప్రకృతి 
 పురి విప్పిన మయూరమై నర్తించగా ,
సుస్వర గీతికలై  , 
నీలాల  గగనాల    మేఘమాల  ,
కురిపించిన   చిరు  జల్లులు  
హరివిల్లై  గగనాన , 
ఇల చేరుతూ   
ఘల్లు  ఘల్లు మని 
పుడమిని తాకగ ,
విస్ఫులించిన  పుడమి  పరాగ  పరిమళాలు
మైమరపించగా , 
చిటపట  చినుకు   తొలకరి లో  ,
చిరు  చిరు చిగురులు చిగురించగా  ,
చిరు చిరు నగవుల  సొగసులతో  ,
అరకొర  విరిసిన  నవ్వులతో ,  
విరబూసిన  కుసుమాలు
సుమధుర  సుగంధ
పరిమళాలు వెదజల్లగ 
చల్లగా వీచే పవనాల మృదు  మధుర  స్పర్స  ,
సుస్వర  గీతికలై  
వీనుల తాకగా,  
ఉప్పొంగిన  తరంగమై 
ఎగసిన మనసే  
జన పదాలు ఆల పించగా  
కరాలు కలిపి  ,  
హలాలు  పట్టి  
పొలాలు దున్ని , 
చిందిస్తూ  స్వేదం ,  
చేస్తున్న సేద్యం  , 
మన  దేశపు సౌభాగ్యం,
పవనాల జోరుకు  తల లూపుతూ
పచ్చని  పసిడి కంకు 
పైరుల మిలమిలలు ,
ఈదురు  గాలుల మురళి రవాలు,
మైమరపిస్తుంటే ,
మలి  సంధ్య వేళ     
గోవుల  ' పధ '  ధూళి 
నింగి  కెగసిన తరుణం  లో ,
గగనపు వీధులన్నీ  
సింధూరము  దిద్దు కుంటున్న  వేళ
సిగ్గుతో  ఎరుపెక్కిన , 
నిచ్చెలి చెక్కిలి లా,
అరుణ వర్ణము 
దాల్చిన దిఙ్మండలము,
చక్కని  రిక్క '  మల్లెలు  
సిగలో  ధరించి న    
గగనము 
కాటుక నింపిన  భరిణై,
నల్లని కురులు విరబోసినట్లు , 
చీకట్లు  పరుచుకుంటున్న  వేళ
 వెన్నెల వెండి  వెలుగులు 
పరుచుకుంటున్న  వేళ,
మిలమిల మెరుపుల , 
చిలిబిలి తళుకుల , 
చిరు చిరు   నగవుల కెరటాలతో ,
వయ్యారి గోదారి ,
  కిన్నెరసాని
సొగసుల హోయలు,
కనువిందు  చేస్తుంటే  యేమని  వర్ణించాలి
ప్రకృతి రమణీయం

No comments:

Post a Comment