సౌర్య కీర్తి --- జాతి స్ఫూర్తి
మీ బుల్లెట్ల వర్షం తొలకరి జల్లు లా ప్రారంభమై ,
మీ బుల్లెట్ల వర్షం తొలకరి జల్లు లా ప్రారంభమై ,
పెను తుఫాను లా మారి ,
ప్రళయ మారుతము గా
సరిహద్దు శత్రువులను
చుట్టు ముట్టి,
తరిమి కొట్టి,
భారతీయులపై కురిపించాయి
విజయ మల్లెల వర్షం.
పెల్లుబికింది మీ పట్ల అంతటా హర్షం .
వర్షం వెలిసిన తరువాత వీచే
ఈదురు గాలులలో ఎగురుతోంది
ఎగురుతోంది మువన్నెల జెండా,
అనంతమైన ఎత్తులో
అశేష హిమాలయా పర్వతాల మీద
మ్రోగిస్తూ విజయ దుందుభి,
శిఖరాగ్రము ఫై తల ఎత్తి సగర్వం గా,
మిల, మిలా మెరుస్తూ ,
అందరు యోధుల విజయానికి సంకేతము లా ,
మరెందరో యోధుల త్యాగానికి ఫలితం లా ,
దేశ మంతటా విజయోత్సావాలు వెల్లి విరుస్తుంటే ,
తల్లీ భారతి
ఏమిటమ్మా నీ కళ్ళలో నీళ్ళకు అర్థం ,
మన వీర సైనికుల సౌర్యము అనిర్వచనియము. ,
పరాక్రమము అత్యద్భుతం ,
త్యాగం చిర స్మరణియమ్ ,
శత్రువులను తరిమి కొట్టి మన జాతి గౌరవాన్ని ,
మన దేశ ప్రతిష్టను కాపాడిన
ఇలాంటి వీరులను కన్నందుకు
కళ్లలొ కలిగిన ఆనంద భాస్పాలా,
లేక
వీర పరాక్రమము తో యుద్ధము లో
దేశ రక్షణ కై ,
అశువులు బాసిన
వీర యోధుల త్యాగానికి అశ్రు తర్పణమా ......
మన దేశ రక్షణ కై పోరాడే ప్రతీ వీరునికి
వినమ్రము గా వందనము చేస్తూ
ఈ కవితను అంకితమిస్తున్నా
మేరా భారత్ మహాన్
No comments:
Post a Comment