Monday, 7 August 2017

అడిగా అడిగా నా మది నే అడిగా



అడిగా అడిగా

అడిగా అడిగా
నామది నే అడిగా
వెతికా వెతికా
నా ఎద లోతుల్లో.....
నీ ప్రేమ నీ....

అంతం లేనిది ,
అర్థం కానిది
ప్రేమంటే అంతే ననీ
చెప్పాలని
మనసు విప్పాలని 
నీ మనసు గెలవాలనీ

కడలై పొంగే ప్రేమే నా మదిలో
అలలై సాగే కలలే నా హృదిలో
తెరచాప లేని నావలాగ
నీవు లేని జీవితం
ఎటు పోతుందో ఈ పయనం

నా ప్రాణమా ననుచేరుమా
చిరునవ్వుతో జగమేలనా
నీ రాకతో ఈ అనుబంధం
ఈ జన్మకే మధురానందం
ఏడెడు జన్మలు ఎత్తినా
నితోడు నే , నే కోరుకుంటా
నీ నీడ గా నేనుంటా






No comments:

Post a Comment