Monday, 16 January 2017

కమ్మని కలలే సాకారం "

" కమ్మని కలలే సాకారం "

ఆదర్శ్ రాఘవ రావు కు ఒక్క గా నొక్క కొడుకు . చిన్నతనము లోనేతల్లి పొతే , 
మళ్లీ "  పెళ్లి చేసుకోకుండా కొడుకుని గారాబముగా పెంచాడు . 
ఇంజీనిరింగ్ చదువుతాను అంటే అప్పు చేసి మరీ చదివించాడు . 
అది పూర్తి ఐన తరువాత , తనకు సినిమా  మీద ఇష్టము ఉంది  
"దర్సకత్వము " చేస్తాను అంటూ తిరగడము మొదలు పెట్టాడు . 
అది చూసి రాఘవ ఉద్యోగము చేస్తే " జీవితానికి భద్రత " ఉంటుంది 
అందులో చేర మంటాడు . 
కానీ ఆదర్శ్ వినిపించు కోడు . ఇద్దరి మధ్య రోజు వాగ్వివాదముజరుగుతూ 
ఉంటుంది రాఘవ కు విసుగు ఎక్కువ ఐతే గిన్నెలు విసిరేసి తనఅసహనాన్ని చూపిస్తుంటాడు . 
 రాత్రి కొడుకు ఇంటికి ఆలస్యము  వచ్చాడని 
ఆరోజు ఉదయము కూడా గొడవ జరుగుతోంది . 
"తను చేసిన సినిమా పూర్తి ఐయీన్దని " అందుకే ఆలస్యముఐయిన్దని చెప్పాడు 
ఐనా కోపముతో చేతిలో ఉన్న గిన్ని వేసిరేసాడు నేల మీద . అదిదొర్లుకుంటూ వెళ్లి గుమ్మము లో పడిం ది . అప్పుడే లోపలి కిఅడుగుపెడుతున్న చారి  గిన్ని తీసి పట్టుకుని 
"ఏమిటయ్య రాఘవయ్యా" , గిన్నెలు అలా విసిరేస్తున్నావ్ " 
అంటూ లోపలి కి వచ్చారు చారి .
" రండి అంకుల్ వచ్చి కూర్చోండి " అంటూ చూస్తున్న టీవీ ని అఫ్చేసాడు ఆదర్శ్
" ఏరా అబ్బాయి బాగున్నావా "  మధ్య కనిపించుట లేదు "
అంటూ కూర్చున్నాడు చారి .
రాఘవయ్య బయటకు వస్తూ
ఏంచేస్తాం " చెట్టంత  ఎదిగిన కొడుకు  చేతికి  అంది వస్తాడుఅనుకుంటే "
చలన చిత్రాల " మోజు లో " జీవితము చేజర్చుకుంటుంటే " చూస్తూ కుర్చోవడము
తప్ప  " చేయి " చేసుకోలేముగా "అందుకే  అసహనాన్ని ఇలా......... 
అంటూ వచ్చి కూర్చున్నాడు రాఘవయ్య.
ఇంతకూ ఏం జరిగింది " అని అడిగాడు చారి .
అప్పు చేసి ఇంజనీరింగ్ " చదివించాను . 
దానికి లక్షలు ఖర్చు అయ్యాయి " ఇప్పుడు
సినిమాలంటే ఇష్టము , దర్సకత్వము చేస్తాను  అంటూతిరుగుతున్నాడు . " 
ఏదో ఒక ఉద్యోగమచేసి  అప్పు తీరుస్తాడు అనుకుంటే , 
దమ్మిడి  సంపాదన లేదు " 
" అప్పు తీర్చే మార్గముకనిపించుట లేదుఏం చెయ్యాలో అర్థముకాక 
 ఇలా ప్రవర్తిస్తున్నాను " అన్నాడు రాఘవయ్య
ఇంత జరుగుతున్నా ఏం పట్టనట్టు ఎలా ఉన్నడో చూడు " అన్నాడు రాఘవయ్య .
" తల్లి లేని బిడ్డ  , ప్రాణాలన్ని  వాడి మీదే పెట్టుకు బ్రతుకుతున్నాను" , 
తండ్రి మాట మిద గౌరవములేదుభవిష్యత్ మిద భయము లేదు
అంటూ తన ఆవేదనను వ్యక్తము చేసాడు 
 అప్పుడు  చారి గారు
 " మీ నాన్న బాధ అర్థము చేసుకోవచ్చు కదా ఆదర్శ్ " అన్నాడు
అది ఏమి లేదు అంకల్ " నా చిన్నప్పుడే మా అమ్మ పొతే , 
నాన్నే నాకు " అన్నీ"  అయి పెంచాడు "
నన్ను  పెంచాదానికి  నాన్న పడిన   కష్టములు నాకు  తెలుసు . " 
నా కోసము మల్లి పెళ్లి చేసుకోలేదు "
"నన్ను ఇంత వాడిని చేసాడు"
" అలాంటి నాన్నను ఇబ్బంది పెడతానా " ,
"కాని నాకు కుడా కొన్ని  ఇష్టాలు ఉంటాయి .
" నా కలలు నెరవేర్చు కొనేది ఎప్పుడు ,"
నాకేమో  " సినిమా "   అంటే ఇష్టము .
 "అలాగ అని సినిమా అంటూ తిరిగితే ,
అందులో అవకాశాలు రాకపోతే ," 
అప్పుడు కుర్చుని చదవలేనుగా ,
అందుకే " ఇంజనీరింగ్  " పూర్తి చేసాను 
ఒక సారి  ఇంజనీరింగ్ పూర్తీ అవుతే , జాబు ఎప్పుడైనా వస్తుంది ,
రెండు ఏళ్ళ పాటు నా కలలని నెరవేర్చుకునే ప్రయత్నమూచేస్తున్నాను . 
ఇంకో రెండు ఏళ్ళు చదువు కుంటున్నాను అనుకోమనండి  
విజయము వస్తే సరే , లేదంటే అప్పుడే 
ఆయన చెప్పునట్టు జాబు లో చేరతాను "
" ఒక రెండేళ్ళు   నా కోసము ఆగలేరా " అని అడిగితె " కోపము , 
ఏం మాట్లాడ మంటారు " 
మిరే చెప్పండి అంకుల్  " అన్నాడు ఆదర్శ్ 
అబ్బాయి చెప్పింది సబబు గానే ఉంది కదా రాఘవా  ."అన్నాడు చారి 
"చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దాను " 
"ఇప్పుడు తప్పుటడుగులు " వేస్తూ ఉంటె 
చూస్తూ ఎలా ఉరుకోమంటావు రా వాడిని " అన్నాడు రాఘవ 
నేను వేసేవి తప్పుటడుగులు 
అని ఎందుకు అనుకుంటున్నారు " 
నాకు ఇష్టమైన రంగములో రాణించి 
నా కలలను నేర వేర్చుకొనే ప్రయత్నము చేస్తున్నాను 
అనుకోవచ్చు కదా " 
చెప్పండి అంకుల్ అన్నాడు ఆదర్శ్ 
" సినిమా అన్నది కలల  ప్రపంచము . "
"అక్కడ విజయము సాధించాడానికి చాల కష్ట పడాలి 
"దానికి అదృష్టము కలిసి రావాలి , "
అందు లో "సక్సెస్ "ఐన వాళ్ళ కన్నా , "ఫెయిల్ "ఐన వాళ్ళే ఎక్కువ 
"సక్సెస్ కాక పొతే  దిగులు తో " 
"భవిష్యత్  నాశనము చేసుకుంటా డెమోనని " నా భయము 
ఒక తండ్రి గా నా ఆవేదన అర్థము చేసుకుని 
"బుధి గా జాబు లో చేరరా అంటే విని పించుకోడు "
అన్నాడు రాఘవ  
"విజయము , అపజయము మన చేతులలో ఉండక పోవ చ్చు , " 
"కానీ సహనము అసహనము " మన చేతులలో నే ఉంటాయి కదా ,
ఐనా "ప్రయత్నించి ఫెయిల్ ఐతే ఓటమిని అంగీకరిస్తాను గాని , "
"అసలు ప్రయత్నించ కుండానే" "  ,  
ఓటమిని అంగికరించమంటే ఎలా "  
చెప్పండి అంకుల్ అన్నాడు ఆదర్శ్ 
"పిల్లలు పుట్టగానే వాళ్ళు "అది అవ్వాలి
ఇది "  అవ్వాలి అని చిన్నప్పుడే నిర్ణయము చేస్తారు "
కాని పెద్ద ఇయ్యాక వాళ్ళకి కొన్ని
 "ఇష్టాలు ఏర్పడతాయి 
,"కోరికలు ఉంటాయి ,
"జీవితము లో ఎలా ఉండాలో " కొన్ని కలలు " ఉంటాయి "
అందుకు మీ "ప్రోత్సాహము "మాకు చాల అవసరము 
పుట్టినప్పటి నుంచి మీ మాటలు వింటూ పెరిగాము , 
మీరు అస్తమాను "నేగ్గలేరు, "నేగ్గలేరు  "అంటూ ఉంటె 
"మా మిద మాకే " నమ్మకము " పోతుతుంది 
"అప్పుడు నిజముగానే " విజయము " సాధించ లేము . 
"ముందు మా కలలను నెరవేర్చుకొనేటందుకు " ప్రోత్సాహమునుఇవ్వండి  "
"విజయము సాధిస్తే సరే , "లేదంటే మీ అండ ఎలాగు ఉంది కదా ,
"మీరు ప్రక్కన ఉన్నారు అన్న ధైర్యము తో " 
"ఓటమిని ప్రక్కకు పెట్టి , 
"మీరు చూపించిన మార్గములో "
""కొత్త జీవితము " ప్రారంభిస్తాము  " అన్నాడు ఆదర్శ్ 
వాడు చెప్పింది ఒకసారి ఆలోచించరా రాఘవ 
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు " , 
"ఇంట్లో మనమే ప్రోత్సాహించక పొతే "
"పాపము పిల్లలు బయటకి వెళ్లి ఎలా సాధిస్తారు " 
"మనము వాళ్ళ కలలను సాకరకారము  చేసుకునెటందుకు 
" ప్రోత్సాహము " ఇద్దాము 
"ఫెయిల్ ఐతే " 
"మనము ఎలాగు ఉన్నాము కదా , 
"ఏదో ఒక దారి చూపిద్దాము "
"పిల్లల సంతోషము కన్నా మనకి " ఏది ఎక్కువ కాదు కదా " అన్నాడు చారి 
నీ ఇష్టము రా ఆదర్శ్ , 
"నీకు ఎలా కావలేంటే అలా చెయ్ " 
"నీవు కోరుకున్న"  రంగము " లో విజము సాధించు, "
" నీ " వెనుక నేను ఉంటాను " 
"కానీ ఫెయిల్ ఐతే మటుకు ' 
నేను ఉన్నానని "మర్చిపోకు , 
అంటూ ఆప్యాయముగా గుండెలకి హత్తుకున్నాడు రాఘవ . 

No comments:

Post a Comment